Indian Ancient History & Culture | మహాజనపదాలు ఏ నదీతీరంలో అధికంగా స్థాపించారు?
భారత చరిత్ర-సంస్కృతి
1. ఆదిమ మానవుడు బొమ్మలకు రంగులు వేయడానికి ఉపయోగించినవి?
1) జంతువుల కొవ్వు
2) రాళ్లపొడి
3) చెట్ల నుంచి తీసిన రసం
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 1, 3 డి) 2, 3
2. మానవుడి స్థిర జీవనానికి దారితీసిన సంఘటన?
ఎ) నిప్పును కనుగొనడం
బి) చక్రాన్ని కనుగొనడం
సి) వ్యవసాయం ప్రారంభించడం
డి) ఆయుధాల తయారీ
3. కింది వాటిలో మొదటిసారి వ్యవసాయం చేసిన ప్రాచీన స్థావరం?
ఎ) నాగార్జున కొండ బి) బీహార్
సి) బెలూచిస్థాన్ డి) కశ్మీర్
4. శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు దేనికి చిహ్నాలు?
ఎ) పశుపోషణ బి) వ్యవసాయం
సి) ఆహార ధాన్యాల నిల్వ
డి) వేట
5. కింది వాటిలో అత్యంత పురాతన వ్యవసాయక్షేత్రం ఎక్కడ కనుగొన్నారు?
ఎ) బెలూచిస్థాన్ బి) కశ్మీర్
సి) బీహార్ డి) కేరళ
6. తెలంగాణలో శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు ఎక్కడ బయటపడ్డాయి?
ఎ) నల్లగొండ బి) కరీంనగర్
సి) నాగర్కర్నూల్ డి) ఆదిలాబాద్
7. మానవుడు పంటలు పండించడం సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు?
ఎ) 8000 బి) 9000
సి) 10,000 డి) 12,000
8. చెక్కకు బిగించిన రాతిగొడ్డలి లభించిన ప్రదేశం?
ఎ) సేరుపల్లి బి) అమ్రాబాద్
సి) కొండాపూర్ డి) కోటిలింగాల
9. దేశంలో మొదటిసారి వ్యవసాయం చేసిన ప్రదేశం ఎక్కడ ఉంది?
ఎ) కశ్మీర్ బి) బెలూచిస్థాన్
సి) బీహార్ డి) తెలంగాణ
10. బూడిద కుప్పలు ఆది మానవుడి ఏ కార్యకలాపాలకు చిహ్నం?
ఎ) పోడు వ్యవసాయం
బి) పశుపోషణ
సి) ఆహారధాన్యాల నిల్వ
డి) వేట
11. మౌర్య రాజ్య స్థాపకుడు?
ఎ) చంద్రగుప్తుడు బి) అశోకుడు
సి) బింబిసారుడు డి) బిందుసారుడు
12. ఉస్మాన్సాగర్ను 1920లో ఏ నదిపై నిర్మించారు?
ఎ) మూసీ బి) ఎర్రవాగు
సి) మంజీరా డి) పెద్దవాగు
13. నవరత్నాలు అనే కవి పండితులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
ఎ) చంద్రగుప్త విక్రమాదిత్యుడు
బి) శ్రీగుప్తుడు
సి) సముద్రగుప్తుడు
డి) కుమారగుప్తుడు
14. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికింది?
ఎ) అల్లసాని పెద్దన
బి) శ్రీకృష్ణదేవరాయలు
సి) గణపతి దేవుడు
డి) శ్రీనాథుడు
15. రుద్రమదేవి తండ్రి?
ఎ) గణపతి దేవుడు
బి) ప్రతాపరుద్రుడు
సి) మహాదేవుడు
డి) రుద్రదేవుడు
16. చత్రపతి శివాజీ గురువు?
ఎ) సమర్థ రామదాసు
బి) ఏక్నాథ్ సి) తుకారాం
డి) వామన్ పండిత్
17. అలీసాగర్ అనే రిజర్వాయర్ నిర్మించింది?
ఎ) మీర్ మహబూబ్ అలీఖాన్
బి) నిజాం ఉల్ ముల్క్
సి) మీర్ ఉస్మాన్ అలీఖాన్
డి) సాలార్జంగ్
18. ఎల్లోరా గుహాలయాలు ప్రధానంగా ఎవరి కాలానికి చెందినవి?
ఎ) మౌర్యులు బి) శుంగులు
సి) గుప్తులు డి) చౌహాన్లు
19. కింది వారిలో శ్రీకృష్ణదేవరాయుల రచన?
ఎ) మనుచరిత్ర బి) ఆముక్తమాల్యద
సి) కాళహస్తీశ్వర మహత్మ్యం
డి) శివరాత్రి మహత్మ్యం
20. 1922లో సింధూ నాగరిక తవ్వకాలు జరిపింది?
ఎ) సర్ జాన్ మార్షల్
బి) వీఏ స్మిత్
సి) డీడీ కోశాంబి
డి) మార్టిమర్ వీలర్
21. సింధూలోయ నాగరికతకు సంబంధించి బయటపడ్డ మొదటి నగరం?
ఎ) హరప్పా బి) మొహంజొదారో
సి) లోథాల్ డి) చన్హూదారో
22. సింధూ ప్రజల ప్రధాన రేవు పట్టణం?
ఎ) హరప్పా బి) మొహంజొదారో
సి) లోథాల్ డి) చన్హూదారో
23. కింది వాటిలో సింధూ నాగరికత లక్షణం కానిది?
ఎ) బొమ్మల లిపి బి) పట్టణ నివాసం
సి) క్రమరహిత రహదారులు
డి) విదేశీ వర్తకం
24. 11.8 x 7 మీ. కొలతలతో నిర్మించిన స్నాన ఘట్టం ఏ నగరంలో కనుగొన్నారు?
ఎ) హరప్పా బి) మొహంజొదారో
సి) దయామాబాద్ డి) ఆలంగీర్
25. సింధూ ప్రజలు పవిత్రంగా ఆరాధించిన చెట్టు?
ఎ) రావిచెట్టు బి) వేపచెట్టు
సి) మర్రిచెట్టు డి) పాలవృక్షం
26. కింది వాటిలో సింధూ నాగరికతకు సంబంధించి సరికానిది గుర్తించండి.
ఎ) వీరు దేవాలయాలు నిర్మించారు
బి) పశుపతిని ఆరాధించారు
సి) జంతువులు, చెట్లను పూజించారు
డి) అమ్మతల్లి విగ్రహాలు లభించాయి
27. వేదాల్లో ప్రాచీనమైనది?
ఎ) రుగ్వేదం బి) సామవేదం
సి) అధర్వణ వేదం డి) యజుర్వేదం
28. ఆర్యుల్లో వ్యవసాయం చేస్తూ పశుపోషణ చేయడం ఎవరి విధి?
ఎ) బ్రాహ్మణులు బి) క్షత్రీయులు
సి) వైశ్యులు డి) శూద్రులు
29. రుగ్వేదంలో ఆర్యులు వేటికోసం దేవతలను ప్రార్థించే శ్లోకాలున్నాయి?
1. మగ సంతానం 2. అశ్వాలు
3. పశువులు
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1, 3 డి) 3, 2
30. ఆర్యులు యజుర్వేదం, అధర్వణవేదం ఎక్కడ సంకలనం చేశారు?
ఎ) బ్రహ్మపుత్ర మైదానం
బి) గోదావరి తీరం
సి) గంగా – యమునా తీరం
డి) సింధూనదీ పరీవాహక ప్రాంతం
31. జన అంటే?
ఎ) ప్రజలు బి) రాజ్యం
సి) గ్రామం డి) వ్యవసాయ భూమి
32. మహాజనపదాల్లో తెలంగాణలో ఉన్న జనపదం?
ఎ) మగధ బి) అస్మక
సి) అంగ డి) గాంధార
33. మహాజనపదాలు ఏ కాలానికి చెందినవి?
ఎ) 2500 సంవత్సరాల క్రితం
బి) 1500 సంవత్సరాల క్రితం
సి) 1000 సంవత్సరాల క్రితం
డి) 800 సంవత్సరాలు క్రితం
34. కింది వాటిలో మహాజనపద కాలానికి చెందిన పురాతత్వ ప్రదేశం?
ఎ) ఢిల్లీ బి) అత్రంజిఖేర
సి) అయోధ్య డి) విజయపురి
35. మహాజనపదకాలం నాటి భర్తుకా అంటే?
ఎ) గ్రామాధికారి
బి) వ్యవసాయదారుడు
సి) కూలీ పనివాళ్లు
డి) సైనికులు
36. మహాజనపద కాలంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వర్గం?
ఎ) రైతులు బి) సైనికులు
సి) వ్యాపారులు
డి) చేతివృత్తిదారులు
37. రైతులు రాజుకు చెల్లించే ‘భాగ’ పంటలో ఎన్నో భాగం?
ఎ) మూడో భాగం బి) నాలుగో భాగం
సి) ఐదో భాగం డి) ఆరో భాగం
38. మగధను పాలించిన మొదటి పాలకుడు?
ఎ) అజాతశత్రువు
బి) మహాపద్మనందుడు
సి) బింబిసారుడు డి) అశోకుడు
39. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వం?
ఎ) వజ్జి బి) కురు
సి) ఛేది డి) పాంచాల
40. గణరాజ్యాలకు చెందిన బోధకుడు?
ఎ) వాల్మీకి బి) బుద్ధుడు
సి) శ్రీకృష్ణుడు డి) శంకరాచార్యుడు
జవాబులు
1.బి 2.సి 3.సి 4.ఎ
5.ఎ 6.సి 7.డి 8.బి
9.బి 10.బి 11.ఎ 12.ఎ
13.ఎ 14.బి 15.ఎ 16.ఎ
17.సి 18.సి 19.బి 20.ఎ
21. ఎ 22.సి 23.సి 24.బి
25. ఎ 26.ఎ 27.ఎ 28.సి
29.బి 30.సి 31.ఎ 32.బి
33.ఎ 34.డి 35.సి 36.సి
37.డి 38.సి 39.ఎ 40.బి
41. 2500 సంవత్సరాల క్రితం ఏర్పడిన మహాజనపదాల సంఖ్య?
ఎ) 10 బి) 12
సి) 14 డి) 16
42. మహాజనపదాలు ఏ నదీతీరంలో అధికంగా స్థాపించారు?
ఎ) సింధూ బి) గంగా
సి) బ్రహ్మపుత్ర డి) గోదావరి
43. మహాజనపదాల కాలంలో గహపతి అంటే?
ఎ) యజమాని బి) బానిస
సి) కూలీ డి) సైనికాధిపతి
44. మగధరాజ్యం శక్తిమంతమైన రాజ్యంగా మార్చడానికి గల కారణం?
ఎ) అక్కడి నదులు రవాణాకు అనుకూలం
బి) ఇనుప నిక్షేపాలు లభించడం
సి) వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు
డి) పైవన్నీ
45. మగధ రాజ్యాన్ని వాయువ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించిన మగధ పాలకుడు?
ఎ) అజాతశత్రువు బి) బింబిసారుడు
సి) ధననందుడు
డి) మహాపద్మనందుడు
46. వజ్జి మహాజనపదాన్ని పరిపాలించింది?
ఎ) రాజు బి) సైన్యాధిపతి
సి) పూజారి
డి) పరిపాలకుల బృందం
47. గోండ్లు గ్రామ పెద్దను ఏమని వ్యవహరిస్తారు?
ఎ) గహవతి బి) భర్తుకా
సి) పట్లా డి) గ్రామణి
48. కింది మగధ రాజులను వారి పాలనాకాలం ఆధారంగా సరైన వరుసక్రమాన్ని గుర్తించండి.
1. అజాతశత్రువు
2. మహాపద్మనందుడు
3. బింబిసారుడు
ఎ) 1, 2, 3 బి) 2, 1, 3
సి) 3, 1, 2 డి) 3, 2, 1
49. కింది వాటిలో మగధ రాజు అజాతశత్రువు తండ్రి?
ఎ) బిందుసారుడు బి) బింబిసారుడు
సి) రిపుంజయుడు డి) చంద్రగుప్తుడు
50. గహపతులు పండిన పంటలో రాజులకు చెల్లించే భాగం ?
ఎ) 1/3వ భాగం బి) 1/4వ భాగం
సి) 1/5వ భాగం డి) 1/6వ భాగం
51. కింది వారిలో మగధను పరిపాలించిన వారిలో మొదటివాడు?
ఎ) అశోకుడు
బి) చంద్రగుప్త మౌర్యుడు
సి) నందుడు
డి) బిందుసారుడు
52. చక్రవర్తి సందేశాలను అధికారులకు చేరవేసేవారిని ఏమంటారు?
ఎ) వేగులు బి) సైనికులు
సి) దూతలు డి) గూఢచారులు
53. ఇండికా గ్రంథ రచయిత?
ఎ) కౌటిల్యుడు బి) మెగస్తనీసు
సి) స్ట్రాబో డి) హెరిడోటస్
54. కౌటిల్యుడు రచించిన ‘అర్థశాస్త్రం’లో చేర్చిన అంశం?
ఎ) రాజ్యపాలన బి) ఆర్థిక విషయాలు
సి) సాహిత్యం డి) శిల్పాలు
55. అశోకుడి శాసనాలు ఏ బాషలో ఉన్నాయి?
ఎ) పాళీ బి) సంస్కృతం
సి) ప్రాకృత డి) పర్షియన్
56. కళింగ అంటే?
ఎ) బెంగాల్ బి) మధ్యప్రదేశ్
సి) ఒడిశా డి) ఆంధ్రాప్రాంతం
57. ప్రజల్లో ధర్మప్రచారం చేయడానికి అశోకుడు నియమించిన అధికారులు?
ఎ) ధర్మమహామాత్రులు
బి) రాజామాత్యులు
సి) ధర్మ రాయబారులు
డి) పైఎవరూ కాదు
58. ధాన్యకటకం ఎవరి రాజధాని?
ఎ) ఇక్షాకులు బి) మౌర్యులు
సి) శాతవాహనులు డి) పల్లవులు
59. కర్ణాటకలోని బళ్లారిలో లభించిన మ్యకదోని శాసనం ఏ రాజు కాలానికి చెందింది?
ఎ) యజ్ఞశ్రీ శాతకర్ణి
బి) గౌతమీపుత్ర శాతకర్ణి
సి) శ్రీపులోమావి
డి) వశిష్టపుత్ర పులోమావి
60. చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు?
ఎ) బిందుసారుడు బి) అశోకుడు
సి) బింబిసారుడు
డి) సంప్రీత
61. మౌర్యుల సామ్రాజ్యంలో సారవంతమైన అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం?
ఎ) తమిళనాడు తీరం బి) మాళ్వా
సి) హిందూకుష్ ప్రాంతం
డి) మధ్య భారతదేశం
62. కింది వాటిలో మౌర్యుల ప్రాదేశిక రాజధాని?
ఎ) కౌశంబి బి) ఢిల్లీ
సి) సువర్ణగిరి డి) రాజ్గిరి
63. కళింగను అశోకుడు చక్రవర్తి అయిన ఎన్ని సంవత్సరాలకు జయించాడు?
ఎ) 7 బి) 8
సి) 10 డి) 11
64. వశిష్టపుత్ర పులోమావి ఏ వంశానికి చెందినవాడు?
ఎ) ఇక్షాకులు బి) మౌర్య
సి) పల్లవ డి) శాతవాహన
65. శాతవాహనుల కాలంలో ఏ విదేశీ రాజ్యంలో వ్యాపారం వృద్ధి చెందింది?
ఎ) పర్షియన్ బి) చైనా
సి) రోమ్ డి) తూర్పు ఇండియా
66. రామాయణంలో రాముని వంశానికి చెందినవారు?
ఎ) మౌర్యులు బి) ఇక్షాకులు
సి) శాతవాహనులు డి) నందులు
జవాబులు
41.డి 42.బి 43.ఎ 44.డి
45.డి 46.డి 47.సి 48.సి
49.బి 50.డి 51.సి 52.బి
53.సి 54.బి 55.ఎ 56.సి
57.సి 58.సి 59.ఎ 60.సి
61.సి 62.ఎ 63.బి 64.సి
65.బి 66.డి
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు