Human Nervous System | మానవ దేహంలో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం?
నాడీ వ్యవస్థ
1. శ్వాస కండరాల కదలికను నియంత్రించి తద్వారా ఉచ్ఛాస క్రియలో ఒక వ్యక్తి పీల్చే వాయువుల ఘనపరిమాణాన్ని నియంత్రించే కేంద్రం, ఆ కేంద్రాన్ని కలిగి ఉన్న అవయవం ఏది?
1) పాన్స్వెరోలి, న్యూమోటాక్సిక్ కేంద్రం
2) న్యూమోటాక్సిక్ కేంద్రం, పాన్స్వెరోలి
3) కార్పోరా క్వాట్రిజెమైనా, మధ్య మెదడు
4) వర్మిస్, అనుమస్తిష్కం
2. సరికాని దాన్ని గుర్తించండి.
1) మొదటి పార్శ కోష్టకం- పారాసీల్- మస్తిష్కార్ధ గోళంలో
2) మూడో కోష్టకం- డయాసీల్- ద్వార గోర్థంలో
3) నాలుగో కోష్టకం- మోటాసీల్- అనుమస్తిష్కంలో
4) రెండో కోష్టకం- పారాసీల్- ద్వారగోర్థంలో
3. ప్రవచనం ఎ : పీయూష గ్రంథి మానవుడి మెదడు అడుగు భాగాన ఉంటుంది
ప్రవచనం ఆర్ : పీయూష గ్రంథి సొమాటోట్రోఫిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది
1) ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ సరైనది
3) ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
4) ఆర్ సరైనది
4. కింది వాటిని జతపరచండి.
మెదడు భాగాలు
ఎ. ముందు మెదడు 1. మస్తిష్కం
బి. మధ్య మెదడు 2. దృక్ గోళాలు
సి. వెనుక మెదడు 3. అనుమస్తిష్కం
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-2, బి-3, సి-1
4) ఎ-3, బి-1, సి-2
5. జ్ఞాపకశక్తి, నియంత్రిత కదలికలను నియంత్రించే మానవ మెదడు భాగం?
1) మస్తిష్కం 2) అనుమస్తిష్కం
3) మజ్జాముఖం 4) పాన్స్వెరోలి
6. కింది వాటిని జతపరచండి.
1. మస్తిష్కం ఎ. శరీర సమతాస్థితి
2. ద్వారగోర్థం బి. దృష్టికి, వినడానికి ప్రతిక్రియ చర్యలు
3. మధ్య మెదడు సి. భావావేశాలు, శరీర ఉష్ణోగ్రత
4. అనుమస్తిష్కం డి. శ్వాసక్రియ, నాడీ స్పందన చర్యలను నియంత్రించే కేంద్రకం
5. మజ్జాముఖం ఇ. మానసిక సామర్థ్యాలకు స్థావరం
సరిగా జతపర్చిన క్రమాన్ని గుర్తించండి.
1) 1-ఇ, 2-సి, 3-డి, 4-బి, 5-ఎ
2) 1-ఇ, 2-బి, 3-సి, 4-డి, 5-ఎ
3) 1-ఇ, 2-సి, 3-బి, 4-ఎ, 5-డి
4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి, 5-ఎ
7. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. అనుమస్తిష్కం, మజ్జాముఖం ముందు మెదడులో భాగంగా ఉంటాయి
బి. అనుమస్తిష్కం, మజ్జాముఖం వెనుక మెదడులో భాగంగా ఉంటాయి
సి. హైపోథలామస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది
1) ఎ, సి 2) బి, సి
3) సి 4) బి
8. ఎ: మానవుడిలో ఆలోచనలకు, ఊహాశక్తికి, ఉద్వేగాల నియంత్రణకు ప్రధాన కారణం
బి : మస్తిష్కంలోని రెండు అర్ధ గోళాలు
సి : అనుమస్తిష్కంలోని గైరీ, సల్సీలు
1) ఎ కు బి, సి రెండూ సరైనవి
2) ఎ కు బి మాత్రమే సరైనది
3) ఎ కు సి మాత్రమే సరైనది
4) ఎ కు బి, సి లు రెండూ సరికావు
9. రాన్వియర్ కణుపులు, నిస్సల్ రేణువులు ఏ కణాల ప్రత్యేకత?
1) కాలేయ కణాలు
2) కండర కణాలు
3) మూత్రపిండ కణాలు
4) నాడీ కణాలు
10. కింది వాటిని జతపరచండి.
1. 8 జతలు ఎ. త్రిక కశేరు నాడులు
2. 12 జతలు బి. అనుత్రిక కశేరు నాడి
3. 5 జతలు సి. గ్రీవ కశేరు నాడులు
4. 1 జత డి. ఉరఃకశేరు నాడులు
1) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
11. వెన్నుపాము గురించి కింది వ్యాఖ్యానాల్లో ఏది సరైనది?
1) వెన్నుపాము చాలా వేగంగా వెంటనే ప్రతిస్పందనలు చూపుతుంది
2) ఈ నాడీ ప్రచోదనాలు నిమిషానికి 100మీ వేగంతో ప్రయాణిస్తాయి
3) వెన్నుపాములో ఉండే కుల్యని, నాడీ కుల్య అంటారు
4) వెన్నుపాము ఎటువంటి అసంకల్పిత ప్రతీకార చర్యలో పాల్గొనదు
12. మెనింజైటిస్ అనేది దేనికి సంబంధించిన వ్యాధి?
1) కాలేయం 2) క్లోమం
3) ఊపిరితిత్తులు 4) మెదడు
13. మానవ శరీరంలో ఉండే అతిపొడవైన కణం?
1) రాడ్స్, కోన్స్ 2) ఎర్ర రక్తకణం
3) నాడీ కణం 4) తెల్ల రక్తకణం
14. కింది వాటిని జతపరచండి.
ఎ. ఘ్రాణ లంబికలు 1. సమతాస్థితి
బి. ద్వార గోర్థం 2. హృదయ స్పందన
సి. అనుమస్తిష్కం 3. దృష్టి
డి. మజ్జాముఖం 4. ద్రవాభిసరణ క్రమత
5. వాసన
1) ఎ-5, బి-4, సి-1, డి-2
2) ఎ-5, బి-1, సి-4, డి-2
3) ఎ-5, బి-4, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
15. మానవుడి కపాల నాడుల్లో జ్ఞాననాడులు?
1) I, II, VIII 2) V, VII, IX
3) III, IV, VI 4) I, III, V
16. అంత్య తంతువు అంటే?
1) మెదడు చివరి భాగం
2) మెదడు కాండం
3) వెన్నుపాము చివరి భాగం
4) వెన్నెముక చివరి భాగం
17. సరికాని దాన్ని గుర్తించండి.
1) త్రిధారనాడి (V) – పాన్స్వెరోలిపై ఉండే గాస్పీరియన్ నాడీ సంధి వద్ద ఏర్పడుతుంది
2) ఆస్యనాడి (VII)- పాన్స్వెరోలి వద్ద ఉద్భవిస్తుంది
3) జిహ్వగ్రసని నాడి (IX)- అనుమస్తిష్కం వద్ద ప్రారంభమవుతాయి
4) జిహ్వ అధోనాడి (XII)- మజ్జాముఖం నుంచి ఏర్పడదు
18. దృష్టి, వినికిడి ప్రక్రియలను మెదడులోని ఏ భాగం నియంత్రిస్తుంది?
1) మస్తిష్కం 2) ద్వార గోర్థం
3) మధ్య మెదడు 4) అనుమస్తిష్కం
19. శేషా అనే విద్యార్థిని మెదడు గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) మెదడు 2 శాతం బరువు నుంచి
20 శాతం శక్తిని వాడుకొంటుంది
2) మెదడు శక్తి కోసం గ్లూకోజ్ మీద మాత్రమే ఆధారపడుతుంది
3) మెదడు చుట్టూ మూడు సంయోజక కణజాల పొరలతో కప్పి ఉంటుంది
4) మెదడు 20 శాతం బరువు ఉండి 2 శాతం శక్తిని వాడుకుంటుంది
20. కశేరు నాడులు, కపాలనాడులను కలిపి ఏ వ్యవస్థగా పేర్కొంటారు?
1) కేంద్ర నాడీ వ్యవస్థ
2) పరధీయ నాడీ వ్యవస్థ
3) సహానుభూత నాడీ వ్యవస్థ
4) సహసహానుభూత నాడీ వ్యవస్థ
21. మెదడు సంకేతాలను ఏ రూపంలో స్వీకరించి తిరిగి పంపుతూ ఉంటుంది?
1) విద్యుత్ 2) యాంత్రిక
3) రసాయనిక 4) అయస్కాంత
22. ఎ: నాడీ కణంలో 3 ముఖ్యమైన భాగాలుంటాయి
ఆర్: డెండ్రైట్లు నాడీ కణాల నుంచి సమాచారాన్ని గ్రహించి కణదేహానికి అందిస్తాయి
1) ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ మాత్రమే సరిపోతుంది
4) ఎ, ఆర్లు రెండూ సరికాదు
23. నాడీ వ్యవస్థకు అవసరమైన మూలకం?
1) భాస్వరం 2) ఇనుము
3) సోడియం 4) మెగ్నీషియం
24. ఆక్సాన్కు సంబంధించి సరికానిది ఏది?
1) ఇది నాడీ కణదేహం నుంచి ఏర్పడుతుంది
2) ప్రతి నాడీ కణానికి అనేక ఆక్సాన్లు ఉంటాయి
3) ప్రచోదనాలు ఆక్సాన్ల ద్వారా వేగంగా ప్రయాణిస్తాయి
4) ఆక్సాన్ నాడీ పోగులు, డెండ్రైట్లతో సంబంధం కలిగి ఉంటాయి
25. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి.
1) మస్తిష్క మేరు వర్ణరహిత క్షారయుత ద్రవం
2) రక్త కేశనాళికా ప్లక్ష్మం నుంచి గాలనం ద్వారా కోష్టకాలలోకి చేరుతుంది
3) రోజూ నాలుగుసార్లు పునఃచక్రీయం కావడం ద్వారా వ్యర్థ పదార్థాలను మెదడు నుంచి తొలగిస్తుంది
4) మస్తిష్క మేరుద్రవం ఎటువంటి రక్షణను మెదడుకు కల్పించదు
26. కండరాల సంకోచాలను సమన్వయపరిచి సమతాస్థితిని సాధించే మెదడు భాగం?
1) అనుమస్తిష్కం 2) మస్తిష్కం
3) మజ్జాముఖం 4) క్రూరా సెరిబ్రై
27. ఒక విద్యార్థి కింది వ్యాఖ్యానాలు చేశాడు. అయితే అందులో సరైన వాటిని గుర్తించండి.
ఎ. మెదడులో రెండో అతిపెద్ద భాగం అనుమస్తిష్కం
బి. అనుమస్తిష్కార్ధ గోళంలో పూర్వాంత లంబిక, పరాంత లంబిక షాక్యులర్ లంబిక అనే మూడు లంబికలు ఉంటాయి
సి. అనుమస్తిష్కంలో అనేక శాఖలు కలిగిన చెట్టు ఆకారంలో ఉండే తెలుపు పదార్థాన్ని ఆర్బోర్ విటే అంటారు
డి. అనుమస్తిష్కాన్ని గైరోస్కోప్ ఆఫ్ ది బాడీ అని అనరు
1) ఎ, డి 2) బి, డి
3) ఎ, బి, సి 4) డి, బి
28. కపాల నాడుల సంఖ్య ఎంత?
1) 43 జతలు 2) 13 జతలు
3) 12 జతలు 4) 31 జతలు
29. ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకోవడం వల్ల అతడు రోడ్డు మీద సరిగ్గా నడవలేకపోతున్నాడు. అయితే అతడిలో తాత్కాలికంగా క్రియారహితంగా ఉన్న అవయవం?
1) వెస్టిబ్యూలార్ పేటిక
2) మస్తిష్కం
3) హిప్పోకాంపస్
4) అనుమస్తిష్కం
30. సమాచారాన్ని చేరవేసే విధానాన్ని బట్టి నాడుల్లోని రకాల సంఖ్య?
1) 1 2) 4 3) 3 4) 5
31. కింది వాటిలో జ్ఞాననాడులను గుర్తించండి.
1) దృక్ నాడి, ఘ్రాణ నాడి, శ్రవణ నాడి
2) దృక్ నాడి, త్రిధార నాడి, ఆస్య నాడి
3) ఘ్రాణ నాడి, అనుభూత నాడి, అబ్డోసెన్స్ నాడి
4) ఆస్య నాడి, వాగస్ నాడి, అనుభూత నాడి
32. మానవ దేహంలో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం?
1) పీనియల్ దేహం 2) హైపోథలామస్
3) అవటు గ్రంథి 4) పీయూష గ్రంథి
33. సహానుభూత నాడీ తంతువుల అంత్య భాగాలు స్రవించేది?
1) సింపథిన్ 2) కోలిన్ ఎస్టరేజ్
3) కార్టిసోన్ 4) ఎడ్రినలిన్
34. కింది వాటిని జతపరచండి.
1. ఘ్రాణ ఎ. తెలుపు లంబికలు వర్ణ పదార్థం శాఖలు కలిగిన చెట్టు
2. ద్వార గోర్థం బి. గదాకృతి
3. మధ్య మెదడు సి. రాంబాయిడల్ ఆకారం
4. మజ్జాముఖం డి. మందంగా దృఢంగా ఉన్న చిన్న కాడ
5. ఆర్బోర్ విటే ఇ. త్రిభుజాకారం
1) 1-ఇ, 2-సి, 3-బి, 4-డి, 5-ఎ
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి, 5-ఇ
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ, 5-ఎ
4) 1-డి, 2-ఇ, 3-సి, 4-బి, 5-ఎ
35. కండరాల చలనాన్ని నియంత్రిస్తున్న వెన్నుపాములోని మూలం ఏది?
1) ఉదర మూలం
2) పృష్ట మూలం
3) ఉదర మూలం, పృష్టమూలం
4) ఏదీ కాదు
36. చలి, వేడి, బాధ, ఒత్తిడి మొదలైన వాటికి ప్రతిస్పందించడం.
1) సెరిబెల్లమ్ 2) ద్వారగోర్థం
3) సెరిబ్రమ్ 4) మధ్యమెదడు
37. కటి విస్తరణ కింద భాగంలో వెన్నుపాము శంఖువు ఆకారంలో సన్నబడిన ఆ భాగాన్ని ఏమంటారు?
1) కోరస్ వెండులారిస్
2) వెన్నునాడీ కుహరం
3) మధ్యసల్కస్ గాడి
4) మధ్య విదరం
38. ఊర్ధ్య పర్యంకంలోని నాడీ రహిత భాగం పరాశికలో కలిసి దేన్ని ఏర్పాటు చేస్తుంది?
1) పూర్వ రక్తప్లక్ష్మం
2) పీనియల్ వృంతం
3) కాలాంచిక
4) పూర్వ రక్త ప్లక్ష్మం, పీనియల్ వృంతం
39. మానవ మెదడు పరిమాణం సుమారుగా ఎంత?
1) 2000 గ్రాములు
2) 1350 గ్రాములు
3) 1800 గ్రాములు
4) 2500 గ్రాములు
40. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. ముందు మెదడులోని ఘ్రాణ లంబికలు వాసన సంబంధించిన జ్ఞానాన్ని కలిగించడానికి తోడ్పడతాయి
బి. వెనుక మెదడులోని అనుమస్తిష్కం, వాసన సంబంధించిన జ్ఞానాన్ని గ్రహించడానికి తోడ్పడుతుంది
సి. ద్వార గోర్థం వాసన సంబంధించిన జ్ఞానానికి తోడ్పడుతుంది
1) ఎ 2) బి మాత్రమే
3) సి 4) పైవేవీ కాదు
సమాధానాలు
1.2 2.4 3.1 4.1
5.2 6.3 7.2 8.2
9.4 10.3 11.4 12.4
13.3 14.1 15.1 16.3
17.4 18.3 19.2 20.2
21.3 22.1 23.3 24.2
25.4 26.1 27.3 28.3
29.4 30.3 31.1 32.2
33.1 34.3 35.1 36.3
37.1 38.1 39.4 40.1
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు