Tech | స్మార్ట్ ఫోన్లో వైరస్ అటాక్ చేస్తే ఎలా కనిపెట్టాలి… ?టెక్ నిపుణులు ఏం చెబుతున్నారు..?


హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కంప్యూటర్ వైరస్, ట్రోజన్స్, స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్ వేర్, వార్మ్స్, ఫైల్ లెస్ మార్వెల్స్ సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇలాంటి దాడులకు ప్రత్యేకంగా మెషీన్ లెర్నింగ్స్‌ను ఉపయోగిస్తున్నసమాచారం. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై వైరస్ ను వదులుతున్నారు.
అది ఎలాగంటే..? ప్రత్యేక ఆఫర్ల పేరుతో , మీకు భారీ మొత్తంలో బహుమతులు వచ్చాయని, ఈ లింక్ ఓపెన్ చేస్తే మీరు సూపర్ బనాంజా గెలుచుకుంటారంటూ సందేశాలు వస్తుంటాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఏవైనా యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. అయితే మీ ఫోన్ హ్యాక్ అయితే వైరస్ ఉందా లేదా అనేది ఎలా తెలుసు కోవాలి..?
స్మార్ట్ ఫోన్లో వైరస్‌లను గుర్తించవచ్చు ఇలా…
- ఫోన్ రీచార్జ్ చేస్తే వెంటనే కట్ అవడం,
-మీ స్మార్ట్ ఫోన్‌కు గుర్తు తెలియని టెక్స్ట్ సందేశాలు రావడం, -ఫోన్ కాల్స్ రావడం,
-మీ పర్మిషన్ లేకుండా యాప్స్ కొనుగోలు వంటివి జరగడం.
-కంటిన్యూగా మీ ఫోన్‌కు యాడ్స్ వస్తే యాడ్ వేర్ మీ ఫోన్‌ను అటాక్ చేసినట్లే..
-మాల్వేర్, ట్రోజన్ మీ స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే స్పామ్ టెక్స్ట్ సందేశాలను మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి సెండ్ అవుతుంటాయి.
-అప్పుడు మీ కాంటాక్ట్ ఫోల్టర్‌లోకి గుర్తు తెలియని వైరస్ దాడి చేసినట్లుగా గుర్తించాలి.
వైరస్ అటాక్ చేస్తే మీ స్మార్ట్ ఫోన్ పనితీరు తగ్గిపోతుంది.
వైరస్లు, మాల్వేర్ మీ స్మార్ట్ ఫోన్స్ కొత్త యాప్స్‌ను కూడా డౌన్ లోడ్ చేస్తాయి.
-వైరస్, మాల్వేర్ స్మార్ట్ ఫోన్లో కొత్త యాప్స్ డౌన్ లోడ్ చేస్తాయి. అప్పుడు మీ డేటా త్వరగా అయిపోతుంది.
-బ్యాటరీ టైమ్ కూడా తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యలు ఉంటే వైరస్ దాడి చేసినట్లు గుర్తించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు..
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు