ఇల్లే ఆఫీస్..
కరోనా మహమ్మారి కార్యాలయాల రూపురేఖలనేమార్చేసింది. కొవిడ్ వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ ‘వర్క్ ఫ్రం హోమ్’ విస్తరించింది. ఈ విధానం ఉద్యోగాల నిర్వహణలోనూతన శకానికి నాంది పలికింది. ఈ క్రమంలో ఇంటి నుంచే అన్ని పనులూ పూర్తి చేసుకోవాల్సి వస్తున్నది. ఇందుకోసం గృహాన్నే ఆఫీస్‌గా మార్చుకోవడం అనివార్యమైంది.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అనేక సంస్థలు, తమ ఉద్యోగులను ఇంటినుంచే పని చేయమని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంగా ‘వర్క్ ఫ్రం హోం’ కల్చర్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంటినుంచే పని చేసుకొనే ఉద్యోగులు, తమ పనికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఇంట్లోనే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరమున్నది. భవిష్యత్తులోనూ ఈ విధానం కొనసాగే అవకాశం ఉండటంతో కొందరు నిర్మాణదారులు ఇప్పటినుంచే ‘వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్’లతో ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే, ఇప్పటికే ఇండ్లను కొనుగోలు చేసిన ఉద్యోగులు మాత్రం ఉన్నదాంట్లోనే ఆఫీస్‌కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ‘వర్క్ ఫ్రం హోం’ను దృష్టిలో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అమర్చుకోవాల్సిన వస్తువులు.. తదితర విషయాల గురించి ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ ఆదిత్య పవన్ భమిడిపాటి వివరిస్తున్నారు.
సింగిల్ బెడ్రూమ్
సింగిల్ బెడ్రూమ్ ఉన్నవారు పడక గదిలో కానీ, హాల్లో కానీ, ఖాళీగా ఉన్న ఒక కార్నర్లో ఏర్పాట్లు చేసుకోవచ్చు. దీనికి ముందుగా వర్క్ స్టేషన్ లేదా టేబుల్ సెటప్ అవసరం అవుతుంది. ఇలాంటి చోట ఆఫీస్ పని సజావుగా సాగాలంటే సహజసిద్ధమైన వెలుతురుతోపాటు సరిపడా లైటింగ్ అవసరం. ప్రత్యేకంగా వైట్ లైటింగ్ ఇచ్చే ఎల్యీడీ బల్బులను సీలింగ్‌లో అమర్చుకోవాలి. ఇందుకోసం దాదాపు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ఖర్చవుతుంది.
డబుల్/ట్రిపుల్ బెడ్రూమ్
డబుల్ లేదా ట్రిపుల్ బెడ్రూమ్ ఉన్నట్లయితే, ఒక పడక గదిని ఆఫీస్ రూమ్‌గా మార్చుకుంటే బాగుంటుంది. ఇందుకోసం మల్టీ సీటింగ్ వచ్చేలా పెద్ద టేబుల్‌ను ఒక గోడకు అమర్చుకోవాలి. ఈ గదిలో వైట్ లైటింగ్ వచ్చే ఎల్యీడీ బల్బులతో లైటింగ్ సెట్ చేసుకుంటే నిజమైన ఆఫీస్ అనుభూతిని పొందగలుగుతారు. అవసరమైన వారు హోమ్ థియేటర్ల మాదిరిగా సౌండ్ ప్రూఫింగ్కూడా చేసుకోవచ్చు. ఇందుకు సుమారు రూ. 20 వేల నుంచి రూ.40 వేల దాకా ఖర్చవుతుంది.
ఇండిపెండెంట్ విల్లా
విల్లాలో కనీసం మూడు లేదా నాలుగు బెడ్రూమ్లు ఉంటాయి. ఇందులో ఒక గదిని ఆఫీస్ పనికోసమే ఉపయోగించుకోవడం ద్వారా 100 శాతం ఆఫీస్ వాతావరణాన్ని సృష్టించవచ్చు. సంఖ్యాపరంగా ఎన్ని వర్క్ స్టేషన్స్ కావాలో అన్నిటినీ అమర్చుకోవచ్చు. ఇలాంటి భారీ వర్క్ స్పేస్‌లో ఎయిర్ కండిషనింగ్ తప్పనిసరి. ఫాల్స్ సీలింగ్, ఎల్యీడీ లైటింగ్కూడా ఉండాల్సిందే. అయితే, కంప్యూటర్ మానిటర్లమీద విండోగ్ల్లేర్ పడకుండా ఓరియెంటేషన్ ప్లాన్ చేసుకోవాలి. దీనికి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.
‘వర్క్ ఫ్రం హోం’ సెటప్‌కు కావాల్సినవి:
- సింగిల్ లేదా మల్టీ యూజర్ వర్క్ స్టేషన్, టేబుల్ సెటప్ + ఆఫీస్ కుర్చీ (బ్యాక్ రెస్ట్/హ్యాండ్ రెస్ట్ టైపు)
- ఆఫీస్‌కు సంబంధించిన వస్తువులను పెట్టుకునేందుకు వీలుగా వాల్ స్టోరేజ్ కానీ, ఫ్లోర్ మౌంట్ స్టోరేజ్ కానీ ప్లాన్ చేసుకోవాలి. ఈ స్టోరేజ్ క్యాబినెట్లు ఒక చోటునుండి ఇంకొక చోటుకు మార్చుకునే అవకాశం ఉంటే చాలా ఉపయోగకరం.
- ఇంటర్నెట్ సౌకర్యాన్ని వైఫైద్వారా కాకుండా డైరెక్ట్ లాన్ కేబుల్‌తో హోమ్ ఆఫీస్ సెటప్ దగ్గర అమర్చుకోవాలి. దీనివల్ల వేగంగా పని పూర్తి చేసుకోవచ్చు.
- వాల్ లైటింగ్ కాకుండా ఫాల్స్ సీలింగ్‌లో లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. దీనిద్వారా పనికి సరిపడా లైటింగ్‌ను ఉపయోగించుకొనే అవకాశం ఉంటుంది.
- బాల్కనీ ఉన్న గదిని ఆఫీస్‌గా మలుచుకోవడం ద్వారా వెంటిలేషన్ బాగా ఉంటుంది. అంతేకాకుండా, బ్రేక్ పద్ధతిలో పనిని కొనసాగించవచ్చు.
–వర్దెల్లి బాపురావు
ఉన్న ఇంట్లోనే..
ఇంటి నుంచే సౌకర్యవంతంగా ఆఫీస్ పనిని చేసుకునేలా ఇప్పుడు చాలామంది ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని సలహాలు, సూచనలు పాటించడం ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లోనే ఆఫీస్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కొందరి ఇండ్లలో ‘ఎల్’ అకారంలో హాల్స్ ఉంటాయి. డైనింగ్ ఏరియాలు, సోఫాల పక్క ఉన్న మిగులు స్థలంలోనూ విడిగా ఫర్నీచర్ ఏర్పాటు చేసుకొని వర్క్ స్పేస్‌గా మలుచుకోవచ్చు. ఇక, కొత్తగా ఇల్లు ప్లాన్ చేసుకునేవారు మాత్రం కచ్చితంగా అదనపు బెడ్రూమ్ను ఎంపిక చేసుకోవాలి. దానిని మల్టీపర్పస్‌కు కానీ, స్టడీ రూంగా, వర్క్ ఫ్రం హోం గదిగా వినియోగించుకోవచ్చు. ఎందుకంటే, భవిష్యత్తులోనూ ఈ వర్క్ ఫ్రం హోం పద్ధతి కొనసాగే అవకాశం ఉంది.
–ఆదిత్య పవన్ భమిడిపాటి, ఇంటీరియర్ డిజైనర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు