Group-I Special | భారతదేశంలో జనాభా విస్తరణ
గతవారం తరువాయి..
భారతదేశంలో జనాభా విస్తరణ
- 2011, మార్చి 1 సమయం 00.00.00 గంటలకు భారతదేశ జనాభా 121,08,54,977 (1.21 బిలియన్లు)
- 121.09 కోట్లతో అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్ల జనాభా (121.43 కోట్లు)కు సమానం.
- ప్రపంచ ఆదాయంలో భారత ఆదాయం 1.2 శాతం కంటే తక్కువగా ఉండగా జనాభాలో 17.5 శాతం ఉంది. దీన్ని బట్టి పేదరికం ఎక్కువగా ఉంది.
- 1901లో 23.8 కోట్ల జనాభా ఉన్న దేశం 2011 నాటికి 121.09 కోట్లకు చేరింది.
- 110 సంవత్సరాల్లో 97 కోట్ల జనాభా కంటే ఎక్కువగా పెరిగింది.
- 2011 ప్రకారం.. 121,08,54,977 జనాభాలో పురుష జనాభా 62,32,70,258 (51.47 శాతం), స్త్రీ జనాభా 58,84,719 (48.53 శాతం)
- పురుష జనాభా కంటే స్త్రీ జనాభా సుమారు 1.5 శాతం తక్కువగా ఉంది.
- 2001-11 మధ్య పెరిగిన జనాభా 18.19 కోట్లు.
- పురుషుల్లో 9.097 కోట్లు, స్త్రీల్లో 9.099 కోట్లు పెరిగింది.
- అదనంగా పెరిగిన జనాభా పురుషుల్లో కంటే స్త్రీలల్లో ఎక్కువగా ఉంది.
- పెరిగిన జనాభా ప్రపంచంలో బ్రెజిల్ దేశ జనాభాకు సమానం.
అధిక జనాభా గల రాష్ర్టాలు
1) ఉత్తరప్రదేశ్- 19.98 కోట్లు- 16.49 శాతం
2) మహారాష్ట్ర- 11.24 కోట్లు- 9.29 శాతం
3) బీహార్- 10.41 కోట్లు- 8.58 శాతం
4) పశ్చిమబెంగాల్- 9.13 కోట్లు- 7.55 శాతం
5) మధ్యప్రదేశ్- 7.26 కోట్లు- 6 శాతం
తక్కువ జనాభా రాష్ర్టాలు
1) సిక్కిం- 6.11 లక్షలు (0.05 శాతం)
2) మిజోరం- 10.97 లక్షలు
3) అరుణాచల్‌ప్రదేశ్- 13.83 లక్షలు
4) గోవా- 14.58 లక్షలు
5) నాగాలాండ్- 19.78 లక్షలు
n ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభా బ్రెజిల్ జనాభా కంటే ఎక్కువ.
n ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల జనాభా, 3వ పెద్ద దేశమైన అమెరికా జనాభా కంటే ఎక్కువ.
అధిక జనాభా కేంద్రపాలిత ప్రాంతాలు
1) ఢిల్లీ- 1.63 కోట్లు
2) అండమాన్ నికోబార్- 3.80 లక్షలు
3) చండీగఢ్- 10.55 లక్షలు
4) పాండిచ్చేరి- 12.47 లక్షలు
అల్ప జనాభా కేంద్రపాలిత ప్రాంతం
1) లక్షదీవులు- 64,473 (0.01 శాతం)
2) డామన్ డయ్యూ- 2.43 లక్షలు (0.02 శాతం)
3) దాద్రానగర్ హవేలి- 3.43 లక్షలు (0.03 శాతం) - అత్యధిక జనాభా గల జిల్లా థానె (మహారాష్ట్ర)- 1.10 కోట్లు
- అల్ప జనాభా గల జిల్లా దిబంగ్ వ్యాలీ (అరుణాచల్‌ప్రదేశ్)- 7900
800 కోట్లకు చేరిన జనాభా - ప్రపంచ జనాభా 2022, నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరింది.
- మనీలా (ఫిలిప్పీన్స్)లోని టాండోలో జన్మించిన పాపతో జనాభా 800 కోట్లకు చేరినట్లు యూఎన్వో జనాభా నిధి (యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్-యూఎన్ఎఫ్పీఏ) తెలిపింది.
- ఈ పాపకు ‘వినీస్ మబన్సాగ్’ అని పేరు పెట్టారు.
- 2022 లెక్కల ప్రకారం అత్యధిక జనాభా దేశాలు
1) చైనా- 145.335 కోట్లు
2) భారతదేశం- 141.427 కోట్లు
3) అమెరికా- 33.590 కోట్లు
4) ఇండోనేషియా- 28.053 కోట్లు
5) పాకిస్థాన్- 23.173 కోట్లు
6) నైజీరియా- 21.905 కోట్లు
7) బ్రెజిల్- 21.637 కోట్లు
8) బంగ్లాదేశ్- 16.883 కోట్లు
9) రష్యా- 14.61 కోట్లు
10) మెక్సికో- 13.235 కోట్లు
అత్యల్ప జనాభా దేశాలు
1) వాటికన్ సిటీ- 800
2) నౌరూ- 10,896
3) తువాలు- 11,931
4) పలావు- 18,169
5) శాన్‌మారినో- 34,017
6) లీచెన్‌స్టెయిన్- 38,250
7) మొనాకో- 39,511
8) సెయింట్ కిట్స్ అండ్ నేవిస్- 53,544
9) మార్షల్ దీవులు- 59,610
10) డొమినికా- 72,167 - ప్రపంచ జనాభాలో 61 శాతం మంది ఆసియా ఖండంలో నివసిస్తున్నారు.
- జనాభా వృద్ధి రేటు అత్యధికంగా ఆఫ్రికా ఖండంలో ఉంది.
- జనాభా వృద్ధి రేటును అధికంగా కలిగి ఉన్న దేశాలు- నైజీరియా, పాకిస్థాన్
- జనాభా వృద్ధి రేటును అత్యల్పంగా కలిగి ఉన్న దేశాలు- రష్యా, జపాన్
- అత్యంత వేగంగా పెరుగుతున్న దేశం- దక్షిణ సూడాన్
- అత్యంత వేగంగా తగ్గుతున్న దేశం- కూక్ దీవులు
- జనాభా స్థిరత్వాన్ని కలిగి ఉన్న దేశం- దక్షిణ కొరియా
- అత్యధిక లింగ నిష్పత్తిని కలిగిన దేశం- రష్యా
- ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల దేశం- మొనాకో (24,500)
- ప్రపంచంలో అత్యల్ప జనసాంద్రత గల దేశం- గ్రీన్లాండ్ (0.139)
మత పరంగా ప్రపచంలో అత్యధిక శాతం ఉన్న జనాభా
1) క్రిస్టియన్లు (217.32 కోట్లు)- అమెరికా, బ్రెజిల్
2) ముస్లింలు (159.855 కోట్లు)- ఇండోనేషియా, పాకిస్థాన్, ఇండియా
3) హిందువులు (103.33 కోట్లు)- ఇండియా, నేపాల్
4) బౌద్ధులు (48.75 కోట్లు)- చైనా, జపాన్
అత్యధిక జనాభా మాట్లాడే భాషలు
1) మాండరిన్ (చైనా) 2) స్పానిష్
3) ఇంగ్లిష్ 4) హిందీ 5) అరబిక్ - ప్రపంచ వ్యాప్తంగా అధికారికంగా ఏ మతాన్ని పాటించని వారి జనాభా- 112.65 కోట్లు
- జనాభా పెరుగుదల అనేది దేశంలో సంభవించిన జననాలు, మరణాలు, వలసల సంఖ్యను బట్టి నిర్ధారిస్తారు.
- జననాలు మరణాల కంటే ఎక్కువగా ఉంటూ, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన ప్రజలు ఎక్కువగా ఉంటే జనాభా వృద్ధి జరిగింతి అంటారు.
- జనాభా విస్తరణను ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశాలు.. 1) నైసర్గిక స్వరూపం,
2) సహజ ఉద్బిజ్జ సంపద, 3) శీతోష్ణస్థితి,
4) మృత్తికలు, 5) రవాణా సౌకర్యాలు - వ్యవసాయాభివృద్ధికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో జనాభా ఎక్కువగా కేంద్రీకృతమైంది.
- వ్యవసాయకంగా, పారిశ్రామిక అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో జీవనోపాధి అధికం.
- 2011 ప్రకారం, మరణాల రేటు ప్రతి 1000 మందికి 7-10 మధ్యలో ఉంది.
- ఈ రేటు 1951లో 20-25 మధ్యలో ఉంది.
- జనాభా పెరుగుదల అధికంగా ఉండటానికి మరణాల తగ్గుదల కూడా కారణమే.
- దేశంలో మరణాల రేటు తగ్గడానికి కారణాలు..
1) పోషకాహార లభ్యత
2) పారిశుద్ధ్య సౌకర్యాలు
3) రక్షిత మంచినీరు
అంటువ్యాధుల నివారణ
5) వైద్య సౌకర్యాలు
6) జీవన ప్రమాణాల పెరుగుదల - ఒక దేశ మరణాల రేటును బట్టి ఆ దేశ ఆరోగ్య ప్రమాణాల స్థితిని అంచనా వేస్తారు.
- భారతదేశంలో మరణాల రేటు మధ్యస్థ దశలో ఉందని చెప్పవచ్చు.
జనాభా ముఖ్య లక్షణాలు
1) జనసాంద్రత 2) అక్షరాస్యత
3) జనాభా పరిమాణం 4) గ్రామీణ-పట్టణ జనాభా
5) లింగ నిష్పత్తి 6) వయస్సుల వారీ వర్గీకరణ
7) ఆయుప్రమాణం
జనసాంద్రత: ఒక చ.కి.మీ. వైశాల్యాన్ని కలిగి ఉన్న ప్రాంతం లో నివసించే జనాభాను ఆ ప్రాంత జనసాంద్రత అంటారు. - 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత 382గా ఉంది.
ఎక్కువ జనసాంద్రత గల ప్రాంతాలు - జీవనానికి అనుకూలంగా ఉండి, అధిక జీవనోపాధిని కలిగి ఉన్న ప్రాంతాలు అత్యధిక జనసాంద్రతను కలిగి ఉన్నారు.
1) అత్యల్ప జనసాంద్రత ప్రాంతాలు: ఒక చ.కి.మీ.కు 100 లేదా అంత కంటే తక్కువ మంది జనాభా ఉన్న ప్రాంతాలు.
1) అరుణాచల్‌ప్రదేశ్- 17 (జనసాంద్రత)
2) మిజోరం- 32
3) అండమాన్ నికోబార్ దీవులు- 46
4) సిక్కిం- 86
2) అల్ప జనసాంద్రత ప్రాంతాలు: ఒక చ.కి.మీ.కు 101-250 మంది జనాభా ఉన్న ప్రాంతాలు.
1) మేఘాలయ- 103
2) హిమాచల్‌ప్రదేశ్- 109
3) మణిపూర్- 111
4) నాగాలాండ్- 120
3) మాధ్యమిక జనసాంద్రత ప్రాంతాలు: చ.కి.మీ.కు 251-500 మంది జనాభా ఉన్న ప్రాంతాలు. - భారతదేశ సగటు జనసాంద్రత 382 కూడా ఈ జాబితాలోకి వస్తుంది.
1) గుజరాత్- 258 2) కర్ణాటక- 276
3) ఆంధ్రప్రదేశ్- 277 4) త్రిపుర- 305
5) తెలంగాణ- 312
4) అధిక జనసాంద్రత ప్రాంతాలు: చ.కి.మీ.కు 501-1000 మంది జనాభా ఉన్న ప్రాంతాలు.
1) ఉత్తరప్రదేశ్- 690
2) దాద్రానగర్ హవేలి- 700
3) కేరళ- 809
4) పశ్చిమబెంగాల్- 1028
5) బీహార్- 1166
5) అత్యధిక జనసాంద్రత ప్రాంతాలు: చ.కి.మీ.కు 1000 లేదా అంతకంటే ఎక్కువమంది జనాభా ఉన్న ప్రాంతాలు.
1) ఢిల్లీ- 11,320 2) చండీగఢ్- 9252
3) పాండిచ్చేరి- 2598 4) లక్షదీవులు- 2013
అత్యధిక జనసాంద్రత గల జిల్లాలు
1) నార్త్-ఈస్ట్ ఢిల్లీ- 36,165
2) సెంట్రల్ ఢిల్లీ- 27,730
3) ఈస్ట్ ఢిల్లీ- 27,132
4) చెన్నై- 26,553
అత్యల్ప జనసాంద్రత గల జిల్లాలు
1) దిబంగ్ వ్యాలీ (అరుణాచల్‌ప్రదేశ్)- 1 (ఒక్కరు మాత్రమే)
2) లాహుల్ అండ్ స్పిటీ (హిమాచల్‌ప్రదేశ్)- 2
3) లేహ్ (జమ్మూకశ్మీర్)- 3
4) అంజావ్ (అరుణాచల్‌ప్రదేశ్)- 3 - 1951లో జనసాంద్రత- 117
- 2001లో జనసాంద్రత- 324
- 2011లో జనసాంద్రత- 382
- 2001-11 మధ్య వృద్ధి రేటు 17.5 శాతం)
- 2022లో జనసాంద్రత- 431
- 2011-22 మధ్య వృద్ధి రేటు- 12 శాతం
అక్షరాస్యత
- ఒక దేశ మొత్తం జనాభాలో అక్షరాస్యులుగా ఉన్న జనాభా శాతాన్ని ఆ దేశ అక్షరాస్యత రేటు అంటారు.
- అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం- సెప్టెంబర్ 8 (యునెస్కో 1966లో ఏర్పాటు చేసింది)
- అక్షరాస్యత దినోత్సవ 2022 థీమ్ ‘ట్రాన్స్ఫార్మింగ్ లిటరసీ లెర్నింగ్ స్పేసెస్’.
- 1820లో ప్రపంచ అక్షరాస్యత రేటు- 12 శాతం
- ప్రస్తుతం ప్రపంచ అక్షరాస్యత రేటు- 87 శాతం
- యూఎస్ఏ, యూరప్, అర్జెంటీనా, ఉరుగ్వే అక్షరాస్యత రేటు- 99 శాతం
- 2011 ప్రకారం చైనా అక్షరాస్యత రేటు- 97 శాతం
- 2011 ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు- 74.04 శాతం
- అత్యల్ప అక్షరాస్యత రేటు దక్షిణ సూడాన్- 35 శాతం, అఫ్గానిస్థాన్- 37 శాతం
- ప్రపంచంలో పురుషుల అక్షరాస్యత శాతం- 90 శాతం
- ప్రపంచంలో మహిళల అక్షరాస్యత శాతం- 82.7 శాతం
- ప్రపంచంలో అక్షరాస్యత శాతం- 87 శాతం
- 1901లో భారతదేశ అక్షరాస్యత- 5.35 శాతం, పురుషుల అక్షరాస్యత- 9.83 శాతం, స్త్రీల అక్షరాస్యత- 0.60 శాతం
2017-18 జాతీయ గణాంక కమిషన్ సర్వే ప్రకారం..
- భారతదేశ అక్షరాస్యత- 77.7 శాతం, పురుషులు- 84.7 శాతం, స్త్రీలు 70.3 శాతం
- 2011 ప్రకారం.. దేశంలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య- 76.35 కోట్లు. దీంట్లో పురుషుల అక్షరాస్యత- 43.47 కోట్లు (80.89 శాతం), స్త్రీల అక్షరాస్యత- 32.39 కోట్లు (64.64 శాతం).
- భారత పట్టణ అక్షరాస్యత- 87.7 శాతం, గ్రామీణ అక్షరాస్యత- 73.5 శాతం.
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు