టీశాట్లో గ్రూప్ 1 ఇంగ్లిష్ పాఠాలు

టీ శాట్ మరో ముందడుగు వేసింది. ఈ నెల 1 నుంచి అక్టోబర్ 5 వరకు గ్రూప్ 1 పాఠ్యాంశాలను ఆంగ్లమాధ్యమంలో ప్రసారం చేస్తున్నట్టు టీశాట్ సీఈవో శైలేశ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అరగంట నిడివి ఉన్న రెండు పాఠ్యాంశాలు ప్రసారం చేస్తామని తెలిపారు. ఇవే పాఠ్యాంశాలు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు నిపుణ చానల్లో పునఃప్రసారమవుతాయన్నారు. సుమారు 60 గంటల పాటు ఇంగ్లిష్లో పాఠ్యాంశ భాగాలను అందిస్తామన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీపై పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. గ్రూప్-1 అభ్యర్థులకు ప్రశ్నలు-సమాధానాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నామని శైలేశ్రెడ్డి తెలిపారు. సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలను సంధిస్తూ సమాధానాలను ఆసక్తికరంగా వివరిస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతున్నదని వెల్లడించారు. ప్రస్తుతం గ్రూప్-1 కంటెంట్పై కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.
- Tags
- English Lessons
- Group 1
- TSAT
Latest Updates
టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఎస్ఐ ప్రిలిమ్స్ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు గడువు ఆగస్టు 15
Chicken hearted fellow
భారత రాజ్యాంగ పరిణామం
‘మత నియోజకవర్గాల’ పితామహుడు?
సెప్టెంబర్ 18న వివేకానంద ప్రసంగాలపై క్విజ్
విద్యార్థులకు ‘సెమ్స్ ఒలింపిక్స్’ పోటీ పరీక్షలు
20 లోపు గురుకులాల్లో చేరండి
సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో గ్రూప్ సీ పోస్టులు
ఆర్టిఫిషియల్ లింబ్స్లో మేనేజర్ పోస్టులు