Economy | జనాభా వృద్ధిలో మేఘాలయ..జన సాంద్రతలో బీహార్
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121, 08,54,977 (121.09 కోట్లు) (1210 మిలియన్లు) (1.21 బిలియన్లు)
- పురుషుల జనాభా 62,32,70,258 (51.47 శాతం)
- స్త్రీల జనాభా 58,75,84, 719 (48.53 శాతం)
అధిక జనాభా గల రాష్ర్టాలు
- 1) ఉత్తరప్రదేశ్ – 19.98 కోట్లు (16.49 శాతం)
- 2) మహారాష్ట్ర -11.24 కోట్లు (9.29 శాతం)
- 3) బీహర్ – 10.41 కోట్లు (8.58 శాతం)
- 4) పశ్చిమబెంగాల్ – 9.13 కోట్లు (7.55 శాతం)
- 5) ఆంధ్రప్రదేశ్ – 8.46 కోట్లు (7 శాతం)
- 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ప్రపంచంలో జనాభాలో 5వ స్థానంలో ఉన్న బ్రెజిల్ జనాభా కంటే ఎక్కువుగా ఉంది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల జనాభా ప్రపంచంలోని జనాభాలో 3వ స్థానంలో ఉన్న అమెరికా జనాభా కంటే ఎక్కువగా ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా గల రాష్ర్టాలు:
1) సిక్కిం- 6.11 లక్షలు (0.05శాతం)
2. మిజోరం 10.97 లక్షలు
3. అరుణాచల్‌ప్రదేశ్ -13.83 లక్షలు
4. గోవా – 14.58 లక్షలు
5. నాగాలాండ్ 19.78 లక్షలు - 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల కేంద్ర పాలిత ప్రాంతాలు
1) ఢిల్లీ – 1.68 కోట్లు
2) పుదుచ్చేరి 12.47 లక్షలు - 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప జనాభా గల కేంద్ర పాలిత ప్రాంతాలు
1) లక్షదీవులు – 64,473 (0.01 శాతం)
2) డామన్ డయ్యూ 2.43 లక్షలు
(0.02 శాతం) - 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అధిక జనాభా గల జిల్లా థానే (మహారాష్ట్ర ) (1.10 కోట్లు).
- అల్ప జనాభా గల జిల్లా దిబంగ్ వ్యాలీ (అరుణాచల్ ప్రదేశ్) (7,900)
జనాభా వృద్ధిరేటు
- ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్దిష్ట వేరియబుల్ శాతానికి సంబంధించిన మార్పును వృద్ధిరేటు అంటారు.
- ఒక నిర్దిష్ట ప్రదేశంలో రెండు కాలాల్లో పెరిగిన జనాభాను జనాభా వృద్ధి అంటారు.
ఉదా : 2001-2011 మధ్య పెరిగిన జనాభాను శాతంలో సూచిస్తే దాన్ని జనాభా వృద్ధి రేటు అంటారు. - జనాభా వృద్ధిని 10 సంవత్సరాలకు గణిస్తే అది దశాబ్ది జనాభా వృద్ధిరేటు అంటారు.
- జనాభా వృద్ధిని ఒక సంవత్సరానికి గణిస్తే అది వార్షిక జనాభా వృద్ధి రేటు.
- రెండు కాలాల మధ్య జనాభా పెరిగితే అది ధనాత్మక జనాభా వృద్ధి రేటు
- రెండు కాలాల మధ్య జనాభా తగ్గితే అది రుణాత్మక జనాభా వృద్ధి రేటు
- 2001-11 మధ్య వార్షిక జనాభా వృద్ధిరేటు 1.64 శాతం
- 2001-11 మధ్య దశాబ్ద జనాభా వృద్ధిరేటు 17.72 శాతం
- అధిక వార్షిక (2.25 శాతం) దశాబ్దపు (24.8 శాతం) జనాభా వృద్ధిరేటు గల సంవత్సరం 1971
- అల్ప వార్షిక (-0.03 శాతం) దశాబ్దపు (-0.31 శాతం) జనాభా వృద్ధిరేటు గల సంవత్సరం 1921
అధిక జనాభా వృద్ధిగల రాష్ర్టాలు
1. మేఘాలయ (27.9 శాతం)
2. అరుణాచల్ ప్రదేశ్ (26.08 శాతం)
3. బీహార్ (25.4 శాతం)
అల్ప జనాభా వృద్ధి గల రాష్ర్టాలు
1. నాగాలాండ్ (-0.6 శాతం)
2. కేరళ (4.9 శాతం)
3. గోవా (8.2 శాతం) - అధిక జనాభా వృద్ధిగల కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలి (55.9 శాతం)
- అల్ప జనాభా వృద్ధి గల కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు (6.3 శాతం)
- దేశంలో అధిక జనాభా వృద్ధి గల జిల్లా కురుంగ్కుమే (అరుణాచల్‌ప్రదేశ్) (111%)
- దేశంలో అల్ప జనాభావృద్ధి గల జిల్లా
లాంగ్ లెంగ్ (నాగాలాండ్) (-58 శాతం)
జన సాంద్రత (Density of Population)
- ఒక చదరపు కిలో మీటరు వైశాల్యంలో నివసించే సగటు జనాభాను జనసాంద్రత అంటారు.
- జనసాంద్రత = మొత్తం జనాభా / మొత్తం విస్తీర్ణం
- 1901 సెన్సస్ ప్రకారం భారతదేశంలో జనసాంద్రత 77
- 1951 సెన్సస్ ప్రకారం భారతదేశంలో జనసాంద్రత 117
- 2011 సెన్సస్ ప్రకారం భారతదేశంలో జనసాంద్రత 382
అధిక జనసాంద్రత గల రాష్ర్టాలు
1) బీహార్ (1106) - 2) పశ్చిమబెంగాల్ (1029)
అల్ప జనసాంద్రత గల రాష్ర్టాలు
1) అరుణాచల్ ప్రదేశ్ (17) - 2) మిజోరం (52)
- అధిక జనసాంద్రత గల కేంద్ర పాలిత ప్రాంతం న్యూఢిల్లీ (11,320)
- అల్ప జనసాంద్రత గల కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు (46)
- దేశంలో అధిక జనసాంద్రత గల జిల్లా నార్త్ ఈస్ట్ ఢిల్లీ (37,348)
- దేశంలో అల్ప జన సాంద్రత గల
జిల్లా ది బంగ్ వ్యాలీ (1)
లింగ నిష్పత్తి : ప్రతి 1000 మంది పురుషులకు గల స్త్రీల సంఖ్యను తెలిపేది లింగనిష్పత్తి (Sex Ratio)
లింగ నిష్పత్తి / స్త్రీ పురుష నిష్పత్తి (సెక్స్ రేషియో)
- లింగనిష్పత్తి = స్త్రీల సంఖ్య /పురుషుల సంఖ్య 1000
- 1901 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో లింగ నిష్పత్తి – 972:1000
- 1951 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో లింగ నిష్పత్తి 946:1000
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో లింగ నిష్పత్తి 943:1000
- 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల్లో లింగ నిష్పత్తి (0-6 సం.లు) : 919:1000
- 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ లింగ నిష్పత్తి : 949:1000
- 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ లింగ నిష్పత్తి : 929/1000
అధిక లింగ నిష్పత్తి గల రాష్ర్టాలు :
1) కేరళ (1080:1000)
2) తమిళనాడు (996:1000)
అల్ప లింగ నిష్పత్తి గల రాష్ర్టాలు :
1) జమ్ముకశ్మీర్ (889:1000)
2) హర్యానా (879:1000) - అధిక లింగ నిష్పత్తి గల కేంద్ర పాలిత ప్రాంతం : పాండిచ్చేరి : (1037:1000)
- అల్ప లింగ నిష్పత్తి గల కేంద్ర పాలిత ప్రాంతం: డామన్ డయ్యూ (618:1000)
- దేశంలో అధిక లింగ నిష్పత్తి గల జిల్లా : మహే (పాండిచ్చేరి) (1176:1000)
- దేశంలో అల్ప లింగ నిష్పత్తి గల జిల్లా డామన్ (డామన్ డయ్యూ) (533:1000)
గమనిక : ఆగస్టు 10వ తేదీ IIవ పేజీలో 39వ ప్రశ్న నాబార్డు ప్రధాన కార్యాలయం ముంబైగా చదువుకోగలరు.
ప్రాక్టీస్ బిట్స్
1. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎన్ని బిలియన్లు?
ఎ) 121.0 బి) 1210
సి) 12.10 డి) 1.21
2. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో?
ఎ) పురుష జనాభా కంటే స్త్రీల జనాభా ఎక్కువ
బి) పురుష జనాభా కంటే స్త్రీల జనాభా తక్కువ
సి) పురుష జనాభా స్త్రీల జనాభాకు సమానం డి) ఏదీకాదు
3. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల రెండో రాష్ట్రం ఏది?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) మహారాష్ట్ర
సి) బీహార్ డి) పశ్చిమబెంగాల్
4. 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప జనాభా గల రాష్ట్రం ఏది?
ఎ) సిక్కిం బి) మిజోరం
సి) అరుణాచల్ ప్రదేశ్ డి) గోవా
5. 2011 జనాభా లెక్కల ప్రకారం యూపీ, మహారాష్ట్రల జనాభా ప్రపంచంలోని ఏ దేశ జనాభాతో దాదాపు సమానంగా ఉంటుంది?
ఎ) బ్రెజిల్ బి) అమెరికా
సి) ఆస్ట్రేలియా డి) జపాన్
6. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
ఎ) లక్షదీవులు
బి) పాండిచ్చేరి
సి) డామన్ డయ్యూ
డి) అండమాన్ దీవులు
7. 2011 సెన్సస్ ప్రకారం దేశంలో అల్ప జనాభా గల జిల్లా ఏది?
ఎ) థానే బి) దిబంగ్ వ్యాలీ
సి) కురుంగ్ కుమే డి) లాంగ్ లెంగ్
8. ఒక నిర్దిష్ట ప్రదేశంలో రెండు కాలాల మధ్య పెరిగిన జనాభాను శాతంతో సూచిస్తే దాన్ని ఏమంటారు?
ఎ) వృద్ధి రేటు
బి) జనాభా వృద్ధి
సి) జనాభా వృద్ధిరేటు డి) వృద్ధి
9. 2001-11 మధ్య వార్షిక జనాభా వృద్ధి రేటు ఎంత?
ఎ) 15.7 శాతం బి) 17.7 శాతం
సి) 1.64 శాతం డి) 1.24 శాతం
10. అధిక దశాబ్దపు జనాభా వృద్ధి రేటు గల సంవత్సరం ఏది?
ఎ) 1921 బి) 1951
సి) 1961 డి) 1971
11. అధిక దశాబ్దపు జనాభా వృద్ధి రేటు గల సంవత్సరం ఏది?
ఎ) కేరళ బి) నాగాలాండ్
సి) మేఘాలయ డి) బీహర్
12. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా వృద్ధి గల కేంద్రపాలిత ప్రాంతం?
ఎ) ఢిల్లీ బి) పాండిచ్చేరి
సి) లక్షదీవులు డి) దాద్రానగర్ హవేలి
13. 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప జనసాంద్రత గల రెండో రాష్ట్రం?
ఎ) గోవా బి) మిజోరం
సి) అరుణాచల్‌ప్రదేశ్ డి) సిక్కిం
14. 2011 సెన్సస్ ప్రకారం దేశంలో అల్ప జనసాంద్రత గల జిల్లా ది బంగ్ వ్యాలీ జనసాంద్రత ఎంత
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
15. కిందివాటిలో సరైనది ఏది?
ఎ) లింగ నిష్పత్తి = స్త్రీల సంఖ్య / పురుషుల సంఖ్య
బి) లింగ నిష్పత్తి = స్త్రీల సంఖ్య / పురుషుల సంఖ్య 100
సి) లింగ నిష్పత్తి = స్త్రీల సంఖ్య / పురుషుల సంఖ్య 1000
డి) లింగ నిష్పత్తి = పురుషుల సంఖ్య / స్త్రీలసంఖ్య 1000
16. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ లింగ నిష్పత్తి ఎంత?
ఎ) 949:1000 బి) 929:1000
సి) 919:1000 డి) 943:1000
17. 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏది?
ఎ) పంజాబ్ బి) హర్యానా
సి) సిక్కిం డి) గోవా
18. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అల్ప లింగ నిష్పత్తి గల జిల్లా ఏది?
ఎ) మహే బి) డామన్
సి) డయ్యూ డి) ది బంగ్ వ్యాలీ
19. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత గల బీహార్ రాష్ట్ర జనసాంద్రత ఎంత?
ఎ) 1206 బి) 1306
సి) 1106 డి) 1026
20. 2011 జనాభా లెక్కల ప్రకారం రెండో అల్ప లింగ నిష్పత్తి గల జమ్మూకశ్మీర్ లింగ నిష్పత్తి ఎంత?
ఎ) 889:1000 బి) 879:1000
సి) 888:1000 డి) 798:1000
21. 2001-11 మధ్య దశాబ్దపు జనాభా వృద్ధి రేటు?
ఎ) 15.5 శాతం బి) 17.72 శాతం
సి) 16.4 శాతం డి) 18.42 శాతం
22. 2011 సెన్సస్ ప్రకారం ప్రపంచంలో జనాభాలో 5వ స్థానంలో ఉన్న బ్రెజిల్ దేశ జనాభా భారతదేశంలోని ఏ రాష్ట్ర జనాభాతో దాదాపు సమానం?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) బీహార్
సి) మహారాష్ట్ర డి) కర్ణాటక
23. అల్ప వార్షిక, దశాబ్దపు జనాభా వృద్ధిరేటు గల సంవత్సరం ఏది?
ఎ) 1901 బి) 1921
సి) 1951 డి) 1971
24. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా దేశ జనాభాలో ఎంత శాతం?
ఎ) 15.50 బి) 16.49
సి) 18.19 డి) 19.98
25. 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప జనాభా గల సిక్కిం జనాభా శాతం ఎంత?
ఎ) 0.01 బి) 0.03
సి) 0.05 డి 1.0
సమాధానాలు
1-డి 2-బి 3-బి 4-ఎ
5-బి 6-సి 7-బి 8-సి
9-సి 10-డి 11-సి 12-డి
13-బి 14-ఎ 15-సి 16-ఎ
17-బి 18-బి 19-సి 20-ఎ
21-బి 22-ఎ 23-బి 24-బి
25-సి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు