Economy | ఉత్పాదకాలను ఉత్పత్తిగా మార్చే ప్రక్రియను ఏమంటారు?
1. కింది వాటిని జతపరచండి?
ఎ) కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ 1. భారతదేశం
బి) మార్కెట్ ఆర్థిక వ్యవస్థ 2. అమెరికా
సి) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ 3. రష్యా
ఎ) 3, 2, 1 బి) 1, 2, 3
సి) 2, 1, 3 డి) 3, 1, 2
2. భౌతిక జీవన నాణ్యత సూచీ ఏ సంవత్సరంలో రూపొందించారు?
ఎ) 1978 బి) 1979
సి) 1980 డి) 1982
3. ఆర్థిక సంక్షేమ మాపనాన్ని ఎవరు రూపొందించారు?
ఎ) విలియం నోర్డస్
బి) జెమ్స్ టోబిన్
సి) ఎ, బి సి) పాల్ శామ్యూల్ సన్
4. సంప్రదాయ రంగానికి మరొక పేరు?
ఎ) జీవనాధార రంగం
బి) కృత్రిమ రంగం
సి) ఆధునిక రంగం డి) ఎ, బి
5. కింది వాటిని జతపరచండి?
ఎ) సంతులిత వృద్ధి 1. అల్బర్ట్ హర్ష్మన్
బి) పేదరిక విష వలయం 2) అల్బర్ట్ హర్ష్మన్
సి) అసంతులిత వృద్ధి 3) రాగ్నర్ నర్క్స్
డి) మూడు అనుబంధాలు 4. రాగ్నర్ నర్క్స్
ఎ) 4, 3, 2, 1 బి) 3, 4, 1, 2
సి) ఎ, బి డి) 1, 2, 3, 4
6. ఆసియా దేశాల్లోని పేదరికం గురించి వివరించిన గ్రంథం ఏది?
ఎ) ఏసియన్ డ్రామా
బి) ప్రిన్సిపుల్ ఆఫ్ ఎకనామిక్స్
సి) ప్రిన్సిపుల్ ఆఫ్ పాపులేషన్
డి) ఏదీకాదు
7. వ్యష్టి ఆదాయానికి మరొక పేరు?
ఎ) వైయక్తిక ఆధాయం
బి) వ్యక్తిగత ఆదాయం
సి) వ్యయార్హ ఆదాయం డి) ఎ, బి
8. ఉత్పత్తి మదింపు పద్ధతికి మరొక పేరు ఏది?
ఎ) వస్తు సేవల పద్ధతి
బి) ఉత్పత్తి సేవా పద్ధతి
సి) నికర ఉత్పత్తి పద్ధతి డి) పైవన్నీ
9. కింది వాటిని జతపరచండి?
ఎ) అధిక జనాభా 1) రష్యా, ఆస్ట్రేలియా
బి) అభిలషణీయ జనాభా 2) భారత్, బంగ్లాదేశ్
సి) అల్ప జనాభా 3) అభివృద్ధి చెందిన దేశాలు
ఎ) 2, 3, 1 బి) 1, 2, 3
సి) 3, 2, 1 డి) 3, 1, 2
10. స్తబ్దత జనాభా అంటే ?
ఎ) నిర్ణీత కాలంలో జనన, మరణాల రేటు అధికంగా ఉండటం
బి) నిర్ణీత కాలంలో జనన మరణాల రేటు తక్కువగా ఉండటం
సి) నిర్ణీత కాలంలో జనన రేటు అధికం, మరణ రేటు అల్పంగా ఉండటం
డి) ఎ, బి
11. 1911-21 దశాబ్ద కాలంలో జనాభా తగ్గడానికి కారణం?
ఎ) మలేరియా బి) మశూచి
సి) కలరా డి) ఇన్ఫ్లూయెంజా
12. మానవ అభివృద్ధి సూచీని ప్రచురించే సంస్థ ఏది?
ఎ) ఐఎంఎఫ్ బి)యునిసెఫ్
సి) యూఎన్డీపీ డి) ఐబీఆర్డీ
13. మతబోధకులు, పూజారులు ఏ రంగంలో భాగం?
ఎ) వ్యవసాయ రంగం
బి) పారిశ్రామిక రంగం
సి) సేవా రంగం
డి) ప్రాథమిక రంగం
14. జనాభా అంశాలు మారుతూ ఉండటానికి కారణం?
ఎ) జననాలు బి) మరణాలు
సి) వలసలు డి) పైవన్నీ
15. డబ్ల్యూటీవో అనేది?
ఎ) అంతర్జాతీయ వ్యాపార సంస్థ
బి) జాతీయ వ్యాపార సంస్థ
డి) అంతర్జాతీయ రవాణా సంస్థ
డి) అంతర్జాతీయ విద్యుత్ సంస్థ
16. రెండు రంగాల నమూనా సమతుల్యంలో ఉండటానికి కావలసిన పరిస్థితులు?
ఎ) సమష్టి ఆదాయం = సమష్టి వ్యయం
బి) పొదుపు = పెట్టుబడులు
సి) ఎగుమతులు = దిగుమతులు
డి) పన్నులు = ప్రభుత్వ వ్యయం
17. భారత్ నిర్మాణ్ పథకంలో భాగం కాని అవస్థాపనా సౌకర్యం ఏది?
ఎ) నీటి పారుదల బి) గ్రామీణ రోడ్లు
సి) గ్రామీణ ఆరోగ్యం
డి) గ్రామీణ ఆవాసం
18. కింది ఆర్థిక వేత్తలు, వారికి సంబంధించిన వాటిని జతపరచండి?
ఎ) వీకేఆర్వీ రావు 1) పేదరికం అంచనాలు
బి) సుఖమయి చక్రవర్తి 2) జాతీయదాయ అంచనాలు
సి) రాజా చెల్లయ్య 3) కోశ విధానం
డి) దండేకర్, రథ్ 4) అభివృద్ధి ప్రణాళికా రచన
ఎ) 4, 1, 3, 2 బి) 1, 2, 3, 4
సి) 3, 1, 2, 4 డి) 2, 1, 3, 4
19. కింది వాటిలో ద్రవ్యాన్ని సృష్టించే ఏజెన్సీ కానిది?
ఎ) కుటుంబ రాబడి
బి) వాణిజ్య బ్యాంకులు
సి) కేంద్ర బ్యాంకు డి) ప్రభుత్వం
20. రాష్ట్ర ప్రణాళికలు తయారు చేయడానికి ఆధారమైనది?
ఎ) మండల ప్రణాళికలు
బి) జిల్లా ప్రణాళికలు
సి) కేంద్ర ప్రభుత్వం పంపిన నిర్దిష్ట సూచనలు
డి) రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సమర్పించిన ప్రణాళికలు
21. భారత ప్రణాళిక రంగంలో జవహర్లాల్ నెహ్రూ దేని అభివృద్ధి గురించి నొక్కి చెప్పేవారు?
ఎ) ఉపాధి కల్పన
బి) వ్యాపారం, వాణిజ్యం
సి) చిన్న తరహా పరిశ్రలు
డి) మౌలిక, భారీ పరిశ్రమలు
22. భారతదేశంలో హరిత విప్లవం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 2వ ప్రణాళిక బి) 3వ ప్రణాళిక
సి) 1966-69 వార్షిక ప్రణాళికలు
డి) 4వ ప్రణాళిక
23. భారీ వ్యూహరచన కింది వాటిలో ఎవరికి సంబంధించినది?
ఎ) వకీల్, బ్రహ్మానందం బి మహలనోబీస్
సి) భగవతి డి) చక్రవర్తి
24. సంపూర్ణ ఉద్యోగిత స్థితిలో సైతం ఏ రకం నిరుద్యోగిత ఉండవచ్చు
ఎ) నిర్మాణాత్మక నిరుద్యోగిత
బి) ప్రకార్యాత్మక నిరుద్యోగిత
సి) చక్రీయ నిరుద్యోగిత
డి) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
25. పేదరిక రేటును ఎలా తెలుసుకుంటాం?
ఎ) మొత్తం జనాభా /పేదవారి సంఖ్య X 100
బి) మొత్తం జనాభా /పేదవారి శాతం X 100
సి) పేదవారి శాతం/మొత్తం జనాభా X 100
డి) పేదవారి సంఖ్య/మొత్తం జనాభాX100
26. కింది వాటిలో సరికానిది?
ఎ) 20 సూత్రాల పథకం -1975
బి) అంత్యోదయ పథకం – 1977
సి) ఐఏఏపీ – 1964
డి) జాతీయ విస్తరణ సేవా పథకం -1962
27. హరిత విప్లవ ఫలితాలను ఇచ్చిన రాష్ర్టాలు వరుసగా
1) హర్యానా 2) యూపీ
3) పంజాబ్ 4) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
5) తమిళనాడు
ఎ) 4, 3, 2, 1, 5 బి) 5, 3, 1, 4, 2
సి) 1, 2, 3, 4, 5 డి) 3, 1, 2, 4, 5
28. ఉత్తమమైన సహకార వ్యవసాయం?
ఎ) సహకార సామాజిక వ్యవసాయం
బి) సహకార కౌలుదారీ వ్యవసాయం
సి) సహకార మేలు రకం వ్యవసాయం
డి) సహకార ఉమ్మడి వ్యవసాయం
29. సామాజిక మౌలిక సదుపాయాల్లో అతర్భాగం కానిది?
ఎ) విద్య బి) దూర శ్రవణ సేవలు
సి) తాగునీటి వసతి డి) ఆరోగ్యం
30. భారత వ్యవసాయ రంగ లక్షణం?
ఎ) మిగులు భూమి, వ్యవసాయ కూలీల కొరత గల ఆర్థిక వ్యవస్థ
బి) మిగులు భూమి, అధిక వ్యవసాయ కూలీలు గల ఆర్థిక వ్యవస్థ
సి) భూమి కొరత, అధిక వ్యవసాయ కూలీలు గల ఆర్థిక వ్యవస్థ
డి) భూమి కొరత, వ్యవసాయ కూలీల కొరత గల ఆర్థిక వ్యవస్థ
31. అభివృద్ధికి నూతన కొలమానం?
ఎ) తలసరి ఆదాయం
బి) సాంకేతిక పరిజ్ఞానం
సి) ఎగుమతులు
డి) మానవ అభివృద్ధి సూచీ
32. ప్రపంచ దేశాలను అధిక, మధ్య, తక్కువ ఆదాయ ఆర్థిక వ్యవస్థ, వర్గీకరణ దేని ఆధారంగా చేస్తారు?
ఎ) జనాభా బి) జీఎన్పీ
సి) విస్తీర్ణం డి) తలసరి జీఎన్పీ
33. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు?
ఎ) 1985 బి) 1986
సి) 1987 డి) 1988
34. సుస్థిరాభివృద్ధి భావనలో ఎన్ని మూలధన రకాలు ఉన్నాయి?
ఎ) 5 బి) 4 సి) 3 డి) 2
35. దామోదర వ్యాలీ కార్పొరేషన్ను ఏ సంవత్సరంలో నిర్వహించారు?
ఎ) 1950 బి) 1949
సి) 1948 డి) 1947
36. ఏ తేదీన నిర్బంధ విద్య అమల్లోకి వచ్చింది?
ఎ) 2009 ఏప్రిల్ 1 బి) 2009 ఏప్రిల్ 10
సి) 2010 ఏప్రిల్ 1 డి) 2010 ఏప్రిల్ 10
37. ఏ పంచవర్ష ప్రణాళిక మానవ వనరుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది?
ఎ) 6వ బి) 7వ సి) 8వ డి) 9వ
38. ఏ సంవత్సరంలో టీఎస్ ఐ పాస్ యాక్ట్ను చేశారు?
ఎ) 2015 బి) 2014
సి) 2016 డి) 2013
39. నాబార్డ్ ప్రధాన కార్యాలయం ఏ ప్రాంతంలో ఉంది?
ఎ) లక్నో బి) ముంబై
సి) న్యూఢిల్లీ డి) హైదరాబాద్
40. గ్రామదాన ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
ఎ) 1951 బి) 1952
సి) 1953 డి) 1954
41. ప్రకృతి వ్యవసాయం అనే భావనను మొదట ఏ దేశ రైతులు ప్రవేశ పెట్టారు?
ఎ) అమెరికా బి) రష్యా
సి) జపాన్ డి) భారతదేశం
42. ఉత్పాదకాలను ఉత్పత్తిగా మార్చే ప్రక్రియను ఏమంటారు?
ఎ) ఉత్పత్తి బి) వస్తువు
సి) సేవలు డి) పైవన్నీ
43. వ్యవసాయదారులు వివిధ ప్రాంతాల్లోని కమతాల్లో ఉత్పత్తి చేసిన వ్యవసాయ ఉత్పత్తిని ఒక నిర్ణీత ప్రదేశానికి చేరవేసే ప్రక్రియను ఏమంటారు?
ఎ) అసెంబ్లింగ్ బి) గ్రేడింగ్
సి) ప్రాసెసింగ్ డి) పైవన్నీ
44. భారతదేశంలో వలసవాదాన్ని విమర్శించిన ఆర్థిక విమర్శకులు ఎవరు?
1) దాదాభాయ్ నౌరోజి
2) జి. సుబ్రమణ్యం అయ్యర్
3) ఆర్.సి.దత్
ఎ) 1 బి) 1, 2
సి) 1, 2, 3 డి) 2, 3
45. బహుళ పేదరిక సూచీలో లేని అంశం ఏది?
1) ఆరోగ్యం 2) విద్య
3) భౌతిక జీవన ప్రమాణస్థాయి
4) మాతా మరణాల రేటు
ఎ) 1 బి) 4 సి) 3, 4 డి) 2, 4
46. కింది వాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి?
ఎ) రాగ్నార్ నర్క్స్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూల ధన కల్పన సమస్యలు
బి) సైమన్ కుజునెట్స్ ఆధునిక ఆర్థిక వృద్ధి
సి) గుర్నార్ మిర్దాల్ అసియన్ డ్రామా
డి) షుంపీటర్ అభివృద్ధి లేకుండా వృద్ధి
47. అమర్త్యసేన్ ప్రకారం భారతదేశంలో క్షామం సంభవిస్తుంది ఎందుకు?
ఎ) డిమాండ్ లేకపోవడం
బి) రవాణా సౌకర్యాలు లేకపోవడం
సి) ఆహార పదార్థాల కొరత
డి) సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడం
48. జతపరచండి.
ఎ) 2వ ఆర్థిక సంఘం 1 రాజమన్నార్
బి) 4వ ఆర్థిక సంఘం 2) సంతానం
సి) 6వ ఆర్థిక సంఘం 3) బ్రహ్మానందరెడ్డి
డి) 8వ ఆర్థిక సంఘం 4) చవాన్
ఎ) 2, 1, 3, 4 బి) 1, 2, 3, 4
సి) 4, ,3, 2, 1 డి) 3, 1, 2, 4
49. క్షీర విప్లవ పితామహుడు ఎవరు?
ఎ) నార్మన్ బోర్లాగ్ బి) వర్గీస్ కురియన్
సి) పారెటో డి) కీన్స్
50. కింది వాటిలో మేధావుల వలసను నియంత్రించడానికి విధించే పన్ను ఏది?
ఎ) టాబిన్ పన్ను బి) ఎగ్జిట్ పన్ను
సి) పీగూ పన్ను డి) సేవ పన్ను
51. భారత జనాభా విధానం 2000 ప్రకారం ఏ సంవత్సరం నాటికి జనాభా స్థిరీకరణను సాధిస్తాం?
ఎ) 2025 బి) 2035
సి) 2045 డి) 2055
52. సంప్రదాయ వృద్ధి సిద్ధాంతానికి సంబంధించి సరికాని అంశం ఏది?
ఎ) స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ
బి) స్తబ్దత స్థితి లేకపోవడం
సి) అభివృద్ధికి మూలధన సంచయనం
డి) క్రమంగా లాభాలు క్షీణించడం
53. కింది వాటిని జతపరచండి?
ఎ) MPC = 0.2 1) K = 2
బి) MPC = 0.5 1) K = 1.66
సి) MPC = 0.75 1) K = 1.33
డి) MPC = 0.4 1) K = 1.25
ఎ) 1, 2, 3, 4 బి) 2, 4, 1, 3
సి) 4, 1, 3, 2 డి) 3, 1, 4, 2
54. అగ్మార్క్ అనేది?
ఎ) పర్యావరణ అనుకూల వస్తువులకు ఇస్తారు
బి) నాణ్యత గల వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం ఇచ్చే నాణ్యత గుర్తు
సి) పారిశ్రామిక వస్తువులకు ఇచ్చే గుర్తు
డి) ఏదీకాదు
55. కీన్స్ ప్రకారం ఆర్థిక మాంద్యం కాలంలో సమష్టి సప్లయ్రేఖ ఏ విధంగా ఉంటుంది?
ఎ) సమాంతరంగా
బి) లంబంగా
సి) కుడివైపు కిందికి వాలుతూ
డి) కుడివైపు నుంచి పైకి పోతూ
సమాధానాలు
1-ఎ 2-బి 3-సి 4-ఎ
5-సి 6-ఎ 7-డి 8-డి
9-ఎ 10-డి 11-డి 12-సి
13-సి 14-డి 15-ఎ 16-ఎ
17-సి 18-ఎ 19-ఎ 20-డి
21-డి 22-సి 23-బి 24-సి
25-డి 26-డి 27-డి 28-డి
29-బి 30-సి 31-డి 32-డి
33-బి 34-సి 35-బి 36-సి
37-సి 38-బి 39-సి 40-బి
41-సి 42-ఎ 43-ఎ 44-సి
45-బి 46-డి 47-డి 48-ఎ
49-బి 50-బి 51-సి 52-బి
53-సి 54-బి 55-ఎ
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు