Current Affairs | ఏ దేశంలో ‘గాంధీ వాక్’ నిర్వహిస్తారు?
1. ఏ సుస్థిరాభివృధ్ధి లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రపంచం విఫలమవుతుందంటూ ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది? (4)
1. 5 2. 6 3. 7 4. 8
వివరణ: సుస్థిర ఆర్థిక వృద్ధి, పూర్తి స్థాయిలో ఉద్యోగాల కల్పన, పని చేసే ప్రదేశంలో మంచి విధానాలు తదితర అంశాలు ఎనిమిదో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఉన్నాయి. అయితే దీన్ని సాధించడంలో విఫలం చెందుతున్నారంటూ జెనివా కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఈ లక్ష్య పురోగతి దాదాపు 2/3వ వంతు మేర లేదని నివేదికలో పేర్కొంది. పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు విధానాల్లో మార్పు తీసుకురావాలని సూచించింది. ఎనిమిదో సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు భారత్ అమలు చేస్తున్న పథకాలు-జాతీయ సేవ పథకం, నైపుణ్యాభివృద్ధి మిషన్, అసంఘటిత రంగంలోని కార్మికులకు రాష్ట్రీయ స్వాస్త్య బీమా యోజన వంటి పథకాలు, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ పట్టణ అభివృద్ధి మిషన్.
2.ఎన్ని రంగాల్లో విశ్వకర్మ పథకం దృష్టి సారించనుంది? (2)
1. 16 2. 18 3. 21 4. 15
వివరణ: పీఎం విశ్వకర్మ పథకాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ సెప్టెంబర్ 17న ప్రారంభించారు. ఇందులో 18 రంగాలపై దృష్టి సారించనున్నారు. ఇందుకుగాను రూ. 13,000 కోట్లు వ్యయం చేయనున్నారు. విశ్వకర్మలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధిని కూడా చేపట్టనున్నారు. చేతివృత్తుల వారిని ఇందులో ప్రోత్సహిస్తారు. ఇందుకుగాను రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. ఏటా 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నది కూడా దీని లక్ష్యం.
3. ఇటీవల ప్రాజెక్ట్ అభినందన్ వార్తల్లో నిలిచింది. ఇది ఏ రంగానికి సంబంధించింది? (3)
1. ఔషధ రంగం 2. విద్యా రంగం
3. వైమానిక రంగం 4. రైల్వేలు
వివరణ: ప్రాజెక్ట్ అభినందన్ పేరుతో ఒక కొత్త విధానాన్ని ఏయిర్ ఇండియా ప్రకటించింది. వాయు ప్రయాణాల్లో ఏదైనా లగేజీ కోల్పయినా దాన్ని తిరిగి దక్కించుకోవడంతో పాటు, ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఇందుకోసం దేశంలోని 16 ప్రధాన విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా సర్వీస్ అష్యురెన్స్ ఆఫీసర్లను నియమిస్తారు. ప్రయాణికులకు వీళ్లు తగిన సాయం చేస్తారు.
4. ఈ ఏడాది ఆసియా కప్ గెలిచిన జట్టు ఏది? (1)
1. భారత్ 2. శ్రీలంక
3. బంగ్లాదేశ్ 4. పాకిస్థాన్
వివరణ: ఈ ఏడాది ఆసియా క్రికెట్ కప్‌ను భారత్ గెలుచుకుంది. ఈ టైటిల్‌ను గెలవడం ఇది ఎనిమిదోసారి. శ్రీలంకలో ఈ టోర్నీ ఆగస్టు 30న ప్రారంభమై సెప్టెంబర్ 17న ముగిసింది. తుదిపోరులో శ్రీలంకను ఓడించి భారత్ టైటిల్‌ను గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా సిరాజ్ నిలవగా మ్యాన్ ఆఫ్ ది సీరిస్‌ను కుల్దీప్ యాదవ్ దక్కించుకున్నారు. ఈ టోర్నీ తొలిసారిగా 1984లో జరిగింది. తొలి విజేత కూడా భారతే.
5. ఐక్యరాజ్య సమితి 78వ సమావేశాలకు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? (2)
1. ఆంటోనియో గుటెర్రస్
2. డెన్నిస్ ఫ్రాన్సిస్
3. సభ కొరోసీ 4. ఎవరూ కాదు
వివరణ: 78వ యూఎన్జీఏ సమావేశాలకు డెన్నిస్ ఫ్రాన్సిస్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ట్రినిడాడ్ టొబాగో దేశానికి చెందిన వారు. ఈ దేశం నుంచి ఆ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి ఆయనే. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 78వ సమావేశాలు సెప్టెంబర్ 2023లో ప్రారంభమయ్యాయి. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో సంస్కరణలు అవసరమని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. అలాగే పర్యావరణ పరిరక్షణ చర్యలను వేగంగా తీసుకోవాలని కూడా సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను సంపన్న దేశాలు అందివ్వాలని కోరారు. హరిత శక్తి వనరుల కోసం, పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయం చేయాలని ఆయన కోరారు.
6. ఏ దేశంలో ‘గాంధీ వాక్’ నిర్వహిస్తారు? (3)
1. మడగాస్కర్ 2. ఫిజీ
3. దక్షిణాఫ్రికా 4. యూఎస్ఏ
వివరణ: గాంధీ వాక్ ఏటా దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్‌లో నిర్వహిస్తారు. ఈ ఏడాది 35వ వాక్‌ను నిర్వహించారు. కరోనా నేపథ్యంలో గత మూడేళ్లలో దీన్ని నిర్వహించలేదు. ఈ ఏడాది నిర్వహించిన గాంధీ వాక్‌లో దాదాపు 2000కు పైగా ప్రజలు పాల్గొన్నారు. ఆరు కిలోమీటర్ల మేర ఇది ఉంటుంది. లెనాసియా అనే ప్రాంతంలో గాంధీ హాల్ నిర్మాణానికి నిధుల సమీకరణకు ఉద్దేశించి దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది కొనసాగుతూనే ఉంది.
7. ఉదంపూర్ రైల్వే స్టేషన్ పేరును ఇటీవల మార్చారు. ఇది ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది? (4)
1. రాజస్థాన్ 2. పశ్చిమబెంగాల్
3. చండీగఢ్ 4. జమ్మూ కశ్మీర్
వివరణ: ఉదంపూర్ రైల్వే స్టేషన్ జమ్మూ కశ్మీర్లో ఉంది. దీని పేరును తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్‌గా మార్చారు. ఆయన వీర సైనికుడు. పంపోర్ ఆపరేషన్‌లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇటీవల పలు పేరు మార్పులు జరిగాయి. మహారాష్ట్రలోని ముంబయిలో చర్చిగేట్ రైల్వే స్టేషన్ గేట్ పేరు మార్చి సి.డి. దేశ్‌ముఖ్ పేరు పెట్టారు. అహ్మద్ నగర్ పేరును అహల్యనగర్‌గా, ఔరంగాబాద్‌ను ఛత్రపతి సంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ రెవెన్యూ డివిజన్ పేరును ధారశివ్గా మార్చారు.
9. ఆపరేషన్ సజగ్ ఏ ప్రాంతంలో నిర్వహించారు? (3)
1.తూర్పు తీరం 2. హిమాలయాలు
3. పశ్చిమ తీరం 4. నీలగిరి కొండలు
వివరణ: భారత తీర రక్షక దళం ఆపరేషన్ సజగ్ను నిర్వహించింది. ఇది పశ్చిమ తీరంలో కొనసాగింది. మత్స్యకారులకు అవగాహన కల్పించడంతో పాటు తీర భద్రతలకు సంబంధించి నిర్వహించిన ఆపరేషన్ ఇది. భారత కస్టమ్స్, మెరైన్ పోలీస్, పోర్ట్స్‌కు చెందిన మొత్తం 118 నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ప్రతి నెలకొకసారి దీన్ని నిర్వహిస్తారు. తీర భద్రత ప్రధాన ఇతి వృత్తంగా ఉంటుంది. భారత తీర రక్షణ దళాన్ని 1977లో ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది.
10. చట్టసభల్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లును ఇటీవల ప్రవేశపెట్టారు? (1)
1. 33% 2. 18%
3. 25% 4. 27%
వివరణ: మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు 128వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గతంలో ఈ బిల్లును 1996, 1998, 1999, 2008 సంవత్సరాల్లో ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. 1996లో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీలకు అప్పగించారు. గతంలో 108వ రాజ్యాంగ సవరణ బిల్లుగా కూడా దీన్ని ప్రవేశపెట్టారు. లోక్‌సభతో పాటు అన్ని రాష్ర్టాల శాసనసభలు, ఢిల్లీ శాసనసభలోనూ ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే ఇది అమలులోకి రానుంది. 15 సంవత్సరాల పాటు ఇది అమలులో ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. ఇది ఆమోదం పొందితే లోక్‌సభలో మహిళల సంఖ్య 181కి పెరుగుతుంది.
11. ఎవవేనిల్ వలరివన్ ఏ క్రీడతో ముడిపడి ఉన్నారు? (2)
1. ఫుట్ బాల్ 2. షూటింగ్
3. వెయిట్ లిఫ్టింగ్ 4. బాక్సింగ్
వివరణ: ఎలవేనిల్ వలరివన్ షూటింగ్ క్రీడాకారిణి. తమిళనాడు రాష్ర్టానికి చెందిన వ్యక్తి. బ్రెజిల్‌లోని రియో డి జెనెరియోలో నిర్వహించిన 10 మీటర్ల ఐఎస్ఎస్ఎఫ్ పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ స్థాయి పోటీల్లో వ్యక్తిగత విభాగంలో ఆమెకు ఇది రెండో పథకంగా చెప్పొచ్చు. ఈ ప్రపంచకప్‌కు భారత్ నుంచి 16 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
12. ప్రవేశిక చదవడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఏది? (4)
1. కేరళ 2. మణిపూర్
3. మహారాష్ట్ర 4. కరాటక
వివరణ: పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశిక చదవడాన్ని తప్పనిసరి చేస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజు దీన్ని పఠించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది ప్రవేశిక. రాజ్యాంగ తాత్వికతను తెలియచేస్తుంది. రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభం కావడాన్ని అమెరికా నుంచి స్వీకరించారు. ప్రవేశికను ఇప్పటి వరకు ఒకసారి సవరించారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత వంటి పదాలను చేర్చారు. భారత ప్రభుత్వ తీరును, లక్ష్యాలు-ఆశయాలను ప్రవేశిక తెలియచేస్తుంది. ప్రవేశికకు మూలం నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు-ఆశయాల తీర్మానం.
13. జనన మరణాలకు సంబంధించి ఏ రోజు నుంచి డిజిటల్ నమోదు అమలులోకి రానుంది? (2)
1. 2023 నవంబర్ 1
2. 2023 అక్టోబర్ 1
3. 2023 డిసెంబర్ 1
4. 2023 అక్టోబర్ 15
వివరణ: భారత్‌లో జరిగే జనన, మరణాలకు సంబంధించి డిజిటల్ పద్ధతిలో నమోదు ప్రక్రియ 2023 అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు, అలాగే పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ నమోదు, వివాహాల నమోదు వంటి అన్నింటికి డిజిటల్ నమోదు తప్పనిసరి కానుంది. అలాగే జనన, మరణాలను రాష్ర్టాలు కేంద్ర పౌర నమోదు వ్యవస్థకు సంబంధించిన పోర్టల్‌లో నమోదు చేయడం తప్పనిసరి. ఈ మొత్తం సమాచారాన్ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు కూడా పంపాల్సి ఉంటుంది. ఈ కార్యాలయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తుంది.
14. వోఐఎంఎల్ సర్టిఫికెట్ ఇచ్చిన దేశాల జాబితాలో భారత్ ఎన్నోది? (2)
1.12 2.13 3.14 4.15
వివరణ: అంతర్జాతీయ ఆమోదం ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీని అందించిన దేశాల జాబితాలో భారత్ 13వ స్థానంలో ఉంది. భారత్‌లో తూకం వేయించిన వస్తువులను ఇక అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు వీలు అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సర్టిఫికేషన్‌కు గుర్తింపు ఉంటుంది. భారతదేశంలో ఉండే వివిధ వస్తువుల తయారీ దారులు, ఏజెంట్లు వోఐఎంల్ సర్టిఫికెట్‌ను పొందేందుకు వీలు ఉంటుంది.
15. ఇటీవల భారత్ నుంచి యునెస్కో సాంస్కృతిక జాబితాలో కింది వాటిలో దేన్ని చేర్చారు? (3)
1. రామప్ప దేవాలయం
2. అమరావతి స్తూపం
3. శాంతినికేతన్ 4. కొల్లేరు సరస్సు
వివరణ: యునెస్కో వారసత్వ జాబితాలో శాంతినికేతన్‌కు చోటు దక్కింది. ఇది పశ్చిమబెంగాల్లో ఉంది. యునెస్కో పారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ 45వ సమావేశం సౌదీ అరేబియాలో నిర్వహించారు. శాంతినికేతన్‌ను సాంస్కృతిక జాబితాలో చేరుస్తూ ఇక్కడే నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇదే సమావేశంలో ఉక్రేయిన్లోని కివ్, లివ్ నగరాలను యునెస్కో ప్రమాదపు నగరాల జాబితాలో చేర్చారు. యునెస్కో జాబితాలో ప్రస్తుతం భారత్ నుంచి ఉన్న సాంస్కృతిక ప్రదేశాల సంఖ్య 42. తెలంగాణ నుంచి రామప్ప దేవాలయం కూడా ఉంది. ఇది ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉంది. యునెస్కోను 1945 నవంబర్ 16వ తేదీన ఏర్పాటు చేశారు. ఇదే రోజున భారత దేశంలో జాతీయ పత్రిక స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈ జాబితాలో హోయసల దేవాలయాలను కూడా చేర్చారు. ఇవి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి.
8. రైతుల కోసం ఇటీవల కింది వాటిలో ప్రవేశపెట్టినవి ఏవి? (4)
1. కేఆర్ఫీ
2. డోర్ కేసీసీ ప్రచారం
3.డబ్ల్యూఐఎన్డీఎస్ 4. పైవన్ని
వివరణ: రైతుల కోసం ఇటీవల కేంద్రం కిసాన్ రిన్ పోర్టల్ (కేఆర్ఫీ), ఇంటింటికి కిసాన్ క్రెడిట్ కార్డ్‌ల ప్రచారం (డోర్ కేసీసీ), విండ్స్-వెదర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డేటా సిస్టమ్స్‌ను ప్రవేశపెట్టింది. కిసాన్ క్రెడిట్ కార్టుల ద్వారా ఇచ్చే రుణాలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా అందించేందుకు కిసాన్ రిన్ పోర్టల్‌ను తీసుకొచ్చారు. రైతులకు సంబంధించిన సమాచారం, రుణ వడ్డీ, వడ్డీపై రాయితీ, వ్యవసాయ రుణాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. అలాగే విండ్స్ ప్రాజెక్ట్ కూడా కీలకమైంది. వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని మరింత వేగంగా రైతులకు అందిస్తుంది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు