Current Affairs | అంతర్జాతీయం

ఇండో-యూరోపియన్
ఇండో-యూరోపియన్ భాషలు 8100 ఏండ్ల ప్రాచీనమై ఉండవచ్చ జర్మనీ సైంటిస్టులు జూలై 30న అభిప్రాయం వెలిబుచ్చారు. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎవల్యూషనరీ ఆంత్రోపాలజీ పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. 7 వేల ఏండ్ల క్రితమే ఇండో-యూరోపియన్ భాషలు ఐదు శాఖలుగా విభజన చెందాయని వారు భావించారు. ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ సైన్స్‌లో ప్రచురించారు.
వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే
ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం (వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే)ను ఆగస్టు 1న నిర్వహించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ప్రజలు స్వీయ రక్షణ పాటించడం, ఈ వ్యాధి గురించి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని వ్యాప్తి చేయడం కోసం ఏటా ఈ డేని నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అండ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ చెస్ట్ ఫిజీషియన్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ ఈ డేని 2012 నుంచి చేపడుతున్నారు.
హెలియోలింక్3డీ
హెలియోలింక్ (HelioLinc)3డీ టెక్నాలజీకి సంబంధించిన కొత్త అల్గారిథమ్‌ను అభివృద్ధి చేసినట్లు వాషింగ్టన్ సైంటిస్టులు గస్టు 2న వెల్లడించారు. ఈ టెక్నాలజీతో భూమికి సమీపంలో ఉన్న గ్రహశకలాల(ఆస్టరాయిడ్స్)ను కనుగొంటారు. దీని ద్వారా ‘2022 ఎఫ్289’ అనే ఆస్టరాయిడ్‌ను కనుగొన్నారు. ఇది 600 అడుగుల పొడవు ఉంది. ఇది భూమి కక్ష్యకు 1,40,000 మైళ్ల దూరంలో ఉంది. చిలీలో నిర్మిస్తున్న సర్వే టెలిస్కోప్ వెరా సీ రూబిన్ అబ్జర్వేటరీలో ఈ అల్గారిథమ్‌ను ఉపయోగిస్తారు. ఈ అబ్జర్వేటరీ ద్వారా డార్క్ మ్యాటర్ పరిశీలించడం, పాలపుంతను మ్యాపింగ్ చేస్తారు.
ఓషన్ షీల్డ్-2023
బాల్టిక్ సముద్రంలో నౌకా విన్యాసాలు ప్రారంభించినట్లు రష్యా ఆగస్టు 2న ప్రకటించింది. ‘ది ఓషన్ షీల్డ్-2023’ పేరుతో ఈ విన్యాసాలను రష్యా నేవీ కమాండర్ ఇన్ చీఫ్ అడ్మిరల్ నికోలాయ్ యెవ్మెనోవ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ వ్యాయామంలో 30కి పైగా రష్యన్ నేవీ యుద్ధనౌకలు, ఓడలు, 30 విమానాలు, సుమారు 6,000 మంది సైనిక సిబ్బంది పాల్గొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం, యూరోపియన్ దేశాలు, నాటోతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ విన్యాసాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Current Affairs, TSPSC, Current Affairs International , Groups Special
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు