Current Affairs | అంతరిక్ష అన్వేషణ.. వ్యోమగాములకు శిక్షణ
ప్రధాని అమెరికా అధికారిక పర్యటన
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఇటీవల అగ్రరాజ్య పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అక్కడ ఏర్పాటు చేసిన అధికారిక విందుకు ప్రధానితో పాటు భారత్‌కు చెందిన కొందరు ప్రముఖులు హాజరయ్యారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
- State Visit: అమెరికా దేశాధ్యక్షుడు జోబైడెన్ ఆహ్వానం మేరకు ఇతర దేశాల అధినేతలు అమెరికాలో పర్యటించడం.
- 2023, జూన్ 21 నుంచి 23 వరకు ప్రధాని మోదీ తొలిసారి అధికారిక పర్యటనకు వెళ్లారు.
- జో బైడెన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అధికారిక పర్యటన ఇది మూడోసారి. గతంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (2022) దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (2023, ఏప్రిల్ 26) పర్యటించారు.
- State Visitలో అతిథి దేశాన్ని అమెరికా ఒక ముఖ్యమైన స్నేహితుడు, మిత్ర దేశంగా పరిగణిస్తుంది.
- State Visitలో State Dinner అనేది అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంటుంది. State Dinner అనేది అతిథిని గౌరవించే సంప్రదాయం. ఇది మర్యాద, మంచి సంకల్పానికి సంబంధించి వ్యక్తీకరణ, ఆతిథ్యాన్ని అందించే మార్గం.
- State Dinnerలో అమెరికా మొదటి మహిళ కీలక భాగస్వామి అవుతారు. అమెరికా మొదటి మహిళ జిల్ బైడెన్.
- అమెరికాలో తొలిసారి అధికారిక విందును 1874, డిసెంబర్ 22న అప్పటి అమెరికా అధ్యక్షులు యులిసెస్ గ్రాంట్, ఆయన భార్య జూలియా గ్రాంట్లు హవాయి రాజు ‘కలకౌవా’కు ఇచ్చారు.
- ఈ విందు ఇచ్చే గదిలో 120 మంది వరకు కూర్చోవచ్చు.
అధికారిక విందు - దీన్ని 2023, జూన్ 22న ఏర్పాటు చేశారు. 400 మందికి పైగా అతిథులను ఆహ్వానించారు.
- ఇందులో ముఖేశ్ అంబానీ, సుందర్ పిచాయ్, టిమ్‌కుక్, ఆనంద్ మహీంద్రా, ఇంద్రానూయి, సత్య నాదెళ్ల, శంతను నారాయణ్ తదితరులున్నారు.
- అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌లు పాల్గొన్నారు.
- ఈ విందును వైట్‌హౌస్‌లోని సౌత్‌లాన్‌లో ఏర్పాటు చేశారు. పూర్తిగా శాకాహార వంటకాలు, తృణ ధాన్యాలకే ప్రాధాన్యం ఇచ్చారు.
భారత్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాలు
- సాంకేతిక భాగస్వామ్యం: ఇందులో ఎనిమిది కీలకాంశాలు ఉన్నాయి.
1. సెమీ కండక్టర్ సరఫరా గొలుసులను బలోపేతం చేయడం: - అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ, భారత సెమీ కండక్టర్ మిషన్‌లో 800 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.
- లామ్ రీసెర్చ్ భారత్‌కు చెందిన 60,000 మంది ఇంజినీర్లకు శిక్షణనిస్తుంది.
2. క్రిటికల్ మినరల్స్ భాగస్వామ్యం - ప్రపంచ వ్యాప్తంగా విభిన్నమైన, స్థిరమైన కీలకమైన శక్తి ఖనిజాల సరఫరా గొలుసుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి స్థాపించబడిన అమెరికా నేతృత్వంలోని మినరల్ సెక్యూరిటీ పార్టనర్షిప్ (MSP)కు భారతదేశం భాగస్వామిగా మారింది.
- MSP2022, జూన్‌లో ఏర్పాటైంది. ఇందులో యూరోపియన్ యూనియన్‌తో పాటు 12 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి.
- భారతదేశానికి చెందిన ఎప్సిలాన్ కార్బన్ లిమిటెడ్ గ్రీన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ కాంపోనెంట్ ఫ్యాక్టరీలో 650 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుంది. ఇది అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పరిశ్రమలో అతిపెద్ద భారతీయ పెట్టుబడి.
3. అధునాతన టెలీ కమ్యూనికేషన్స్ - ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ (RAN) వ్యవస్థల అభివృద్ధి, విస్తరణ, అధునాతన టెలికం పరిశోధన, అభివృద్ధిపై భారతదేశం, అమెరికా ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ టాస్క్‌ఫోర్స్‌లను ప్రారంభించాయి.
- దీన్ని భారత్‌కు సంబంధించి భారత్ CG, అమెరికాకు సంబంధించి US నెక్స్G కూటమి సంయుక్తంగా నడపనున్నాయి.
NASA-ISRO సహకారం
- చంద్రుడు, అంగారకుడు, వెలుపల అన్వేషణను ప్రారంభించే శాంతియుత, స్థిరమైన, పారదర్శక సహకారానికి కట్టుబడి ఉన్న 26 ఇతర దేశాల్లో చేరి భారత్ ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసింది.
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) 2024లో నాసా, ఇస్రోలు ఉమ్మడి మిషన్‌ను చేపట్టనున్నాయి. దీని ద్వారా భారతీయ వ్యోమగామిని ISSకి తొలిసారి పంపనున్నారు. దీనికోసం నాసా భారతీయ వ్యోమగాములకు శిక్షణ ఇస్తుంది.
- 2023 చివరి కల్లా మానవ అంతరిక్ష ప్రయాణ సహకారం కోసం నాసా-ఇస్రోలు ఒక వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నాయి.
5. క్వాంటం, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ - రెండు దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య ఉమ్మడి పరిశోధనను సులభతరం చేయడానికి రెండు దేశాలు జాయింట్ ఇండో-అమెరికన్ క్వాంటం కో ఆర్డినేషన్ మెకానిజంను ఏర్పాటు చేశాయి.
6. అత్యాధునిక పరిశోధన - యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ భారత సైన్స్, టెక్నాలజీ విభాగంలో 35 ఉమ్మడి పరిశోధన సహకారాలను ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై భారతదేశ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో ఒక కొత్త సహకార ఏర్పాటుపై సంతకం చేసింది.
7. ఇన్నోవేషన్ హ్యాండ్‌షేక్ - భారత్-అమెరికా దేశాల స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలను అనుసంధానించడానికి ఇన్నోవేషన్ హ్యాడ్షేక్ను యూఎస్-ఇండియా కమర్షియల్ డైలాగ్ ప్రారంభించనుంది.
- ఇది యూఎస్-ఇండియా ఇనీషియేటివ్ ఆన్ క్రిటికల్ ఎండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (iCET) కి సహకారం అందిస్తుంది.
8. ఫైబర్ ఆప్టిక్స్ పెట్టుబడులు - భారత్‌కు చెందిన స్టెరిలైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ కొలంబియాలోని సౌత్ కరోలినాలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తయారీలో యూనిట్ నిర్మాణంలో$100 మిలియన్ పెట్టుబడి పెట్టింది.
రక్షణ భాగస్వామ్యం
1. GE-F414 ఇంజిన్ల సంయుక్త ఉత్పత్తి
- GE-F414 ఇంజిన్లను భారత్‌లో సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు జనరల్ ఎలక్ట్రిక్ (GE) ఏరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
- GE-F414 ఇంజిన్లు తేజస్ మార్క్-2 యుద్ధ విమానాల్లో ఉపయోగిస్తారు. ఈ ఇంజిన్ 154 అంగుళాలు (391 సెం.మీ) పొడవు, 35 అంగుళాలు (89 సెం.మీ) వ్యాసం, 1,110 కిలోల బరువు ఉంటుంది.
2. MQ-9B సీ గార్డియన్ డ్రోన్లు - అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ నుంచి MQ-9B రీపర్ సాయుధ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది.
- హిందూ మహా సముద్రంతో పాటు చైనాతో సరిహద్దులో భారత భద్రత, నిఘా సామర్థ్యాలు దీని వల్ల గణనీయంగా పెరుగుతాయి.
- 50 వేల అడుగుల ఎత్తు వరకు వెళ్లగలవు, 27 గంటల పాటు గగన విహారం చేయగలవు.
3. అమెరికా నేవీ నౌకల సర్వీసు, మరమ్మతు - అమెరికా నావికా దళానికి చెందిన నౌకల సర్వీసు, మరమ్మతులు రిపేర్ చేయడానికి లార్సన్, టూబ్రో షిప్‌యార్డ్‌తో మాస్టర్షిప్ రిపేర్ అగ్రిమెంట్ (MSRS) ను అమెరికా కుదుర్చుకొంది.
- దీని ప్రకారం లార్సన్, టూబ్రో చెన్నై సమీపంలోని కట్టుపల్లి వద్ద ఈ సర్వీసు సదుపాయం ఉంటుంది.
- దీంతోపాటు ముంబయిలోని మజగావ్ డాక్ లిమిటెడ్, గోవాలోని గోవా షిప్‌యార్డ్‌తో ఒప్పందాలు ఖరారు చేసుకొంది.
4. డిఫెన్స్ ‘ఇన్నోవేషన్ బ్రిడ్జ్’ - 2023, జూన్ 21న ఇండియా-యూఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్ (INDUS-X)ను ప్రారంభించారు.
- ఇది ఒక విశ్వవిద్యాలయం, ఇంక్యుబేటర్, కార్పొరేట్, థింక్‌ట్యాంక్, ప్రైవేటు వాటాదారులను కలిగి ఉంటుంది.
- ఇండస్-ఎక్స్ రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ఉత్పత్తికి భారత్-అమెరికా అంకుర పరిశ్రమలు కలిసికట్టుగా పని చేసేలా చేస్తుంది. దీని ద్వారా రక్షణ రంగంలో భారత ఎగుమతులు భారీగా పెరిగేలా దోహదం చేస్తుంది.
5. స్టూడెంట్ ఎక్సేంజ్, స్కాలర్షిప్స్ - 2022లో అమెరికా 1,25,000 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసింది. అమెరికాలో చదువుతున్న విద్యార్థుల్లో అత్యధికులు భారతీయ విద్యార్థులే.
- భారత్‌లో ఐఐటీలతో సహా ప్రముఖ విద్యాసంస్థలు, అమెరికాలోని యూనివర్సిటీల సంఘం ఒక కొత్త జాయింట్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
- అమెరికా- భారత్‌ల విద్యా నిధి ద్వారా నిర్వహిస్తున్న ఫుల్బ్రైట్-కలామ్ ైక్లెమేట్ ఫెలోషిప్స్ ఫర్ రీసెర్చ్ ద్వారా వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసే భారతీయ, అమెరికా విద్యార్థులకు సహకరిస్తుంది.
- బెంజిమన్ ఎ.గిల్మన్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా అమెరికా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 100 మంది వరకు భారత్‌లో చదువుకోవచ్చు.
6. సాంస్కృతిక ఆస్తులపై ఒప్పందం - భారతదేశం నుంచి సాంస్కృతిక ఆస్తులు అక్రమ రవాణాను నిరోధించడానికి, సాంస్కతిక ఆస్తుల రక్షణ, చట్టబద్ధమైన మార్పిడిపై సహకారాన్ని పెంపొందించడానికి సహాయపడే ఒప్పందం కోసం రెండు దేశాలు చర్చలు జరిపాయి.
గమనిక: మోదీ అమెరికా పర్యటన తర్వాత అమెరికా, భారత్‌కు 105 అక్రమ రవాణా చేయబడిన భారతీయ పురాతన వస్తువులను అందించింది. ఈ 105 కళా ఖండాలు హిందూ, జైన, ఇస్లాం మతానికి చెందినవి. - ఈ 105 కళా ఖండాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవి.
- తూర్పు భారత్ నుంచి 47, దక్షిణ భారత్- 27, మధ్య భారత్-22, ఉత్తర భారత్-6, పశ్చిమ భారత్ నుంచి 3 ఉన్నాయి.
7. ఇండో-పసిఫిక్‌లో సహకారం - స్థిరమైన సముద్ర డొమైన్ ను ప్రోత్సహించడానికి, దాని పరిరక్షణ , స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2015లో ప్రధాని మోదీచే ప్రారంభించిన కార్యక్రమం ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనీషియేటివ్‌లో అమెరికా చేరనుంది.
8. ఇంధన వనరుల్లో సహకారం
9. గ్రీన్ టెక్నాలజీలో సహకారం
10. క్యాన్సర్, డయాబెటిస్ వ్యాధులపై పోరాటానికి సహకారం
11. టెర్రరిజంపై పోరాటం కోసం సహకారం
12. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధానికి ఫ్రేమ్‌వర్క్ రూపకల్పన.
అమెరికన్ కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగం-కీలకాంశాలు - ప్రసంగించిన తేదీ -2023, జూన్ 22
- అమెరికన్ కాంగ్రెస్‌లో రెండుసార్లు ప్రసంగించిన ఏకైక భారతీయ ప్రధానమంత్రిగా రికార్డు నెలకొల్పారు. గతంలో మోదీ 2016లో ప్రసంగించారు.
- ఇప్పటివరకు మోదీతో సహా ఆరుగురు భారతీయ ప్రధానులు అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.
1. జవహర్ లాల్ నెహ్రూ (1949లో)
2. రాజీవ్‌గాంధీ (1985)
3. పీవీ నరసింహారావు (1994)
4. అటల్ బిహారీ వాజ్‌పేయి (2000)
5. మన్మోహన్ సింగ్ (2005)
6. నరేంద్ర మోదీ (2016, 2023)
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
Previous article
Economy | క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ అంటే?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు