Bank of Maharashtra | బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 400 పోస్టులు.. దరఖాస్తులకు ఎల్లుండే చివరితేదీ
Bank of Maharashtra Recruitment 2023 | పుణెలోని ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank Of Maharashtra) లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్కేల్-2, 3 (Officer Scale) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు ఎల్లుండితో ముగియనుంది. అప్లయ్ చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ, వంటి కోర్సులు పాసై.. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో మూడేండ్ల నుంచి ఐదేండ్లపాటు ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో 400 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ పరీక్ష(Online Test), గ్రూప్ డిస్కషన్ (Group Discussion), ఇంటర్వ్యూ (Interview) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ప్రారంభంకాగా.. జూలై 25 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 400
పోస్టులు: ఆఫీసర్ స్కేల్-2, ఆఫీసర్ స్కేల్- 3
అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ, వంటి కోర్సులు పాసైనవారికి ప్రాధాన్యం ఉంటుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో మూడేండ్ల నుంచి ఐదేండ్లపాటు ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు : పోస్టులను బట్టి 25 నుంచి 38 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
జీతం: నెలకు స్కేల్-2 పోస్టులకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు
స్కేల్-3 పోస్టులకు రూ.63,840 నుంచి రూ.78,230 వరకు
అప్లికేషన్ ఫీజు: రూ.1,180, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.118
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 25
వెబ్సైట్: www.bankofmaharashtra.in
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






