Economy | ఖండాల్లో ఆసియా.. దేశాల్లో ఇండియా
ప్రపంచ జనాభా
- జనాభా శాస్త్రంలో ప్రపంచ జనాభా అనేది ప్రస్తుతం నివసిస్తున్న మొత్తం మానవుల సంఖ్య.
- ప్రపంచ జనాభాను వారి స్వభావంతో అంచనా వేయడం ఆధునికత అంశం. ఇది ఆవిష్కరణ యుగం నుంచి మాత్రమే సాధ్యమవుతుంది.
- జనాభా గణన అనేది ఒక నిర్దిష్ట జనాభాలోని సభ్యులకు సంబంధించిన జనాభా సమాచారాన్ని క్రమపద్ధతిలో పొందడం నమోదు చేయడం, గణించడం వంటి ప్రక్రియ.
- ప్రపంచ జనాభా తొలి అంచనాను 1661లో గియోవన్నీ బాటిస్టా రికియోలీ రూపొందించారు.
- ప్రపంచ జనాభాకు సంబంధించిన ప్రారంభ అంచనాలు 17వ శతాబ్దానికి చెందినవి.
- విలియం పెట్టి 1682లో ప్రపంచ జనాభా 320 మిలియన్లుగా అంచనా వేశారు.
- 18వ శతాబ్దం చివరినాటికి జనాభా అంచనాలు దాదాపు ఒక బిలియన్కు చేరాయి.
- ఖండాల వారీగా విభజించబడిన శుద్ధి చేసిన అంచనాలు 19వ శతాబ్దం మొదటి భాగంలో ప్రచురించబడ్డాయి.
- ప్రపంచ జనాభాలో వచ్చిన పెరుగుదలను యునైటెడ్ నేషన్స్ పాపులేషన్స్ బ్యూరో ప్రకటిస్తుంది.
ప్రపంచ జనాభాలో మైలు రాళ్లు
- ప్రపంచ జనాభా 1830లో 100 కోట్లు లేదా 1 బిలియన్కు చేరుకుంది.
- ప్రపంచ జనాభా 1930లో 200 కోట్లు లేదా 2 బిలియన్లకు చేరుకుంది.
- ప్రపంచ జనాభా 1960లో 300 కోట్లు లేదా 3 బిలియన్లకు చేరుకుంది.
- ప్రపంచ జనాభా 1975లో 400 కోట్లు లేదా 4 బిలియన్లకు చేరుకుంది.
- ప్రపంచ జనాభా 1987 జూలై 11 నాటికి 500 కోట్లు లేదా 5 బిలియన్లకు చేరుకుంది.
- ప్రపంచ జనాభా 1999 అక్టోబర్ 12 నాటికి 600 కోట్లు లేదా 6 బిలియన్లకు చేరుకుంది.
- ప్రపంచ జనాభా 2011 అక్టోబర్ 31 నాటికి 700 కోట్లు లేదా 7 బిలియన్లకు చేరుకుంది.
- ప్రపంచ జనాభా 2022 నవంబర్ 15 నాటికి 800 కోట్లు లేదా 8 బిలియన్లకు చేరుకుంది.
ప్రపంచ జనాభా బిలియన్ల మైలురాళ్లు
- ప్రపంచ జనాభా ఒకటి రెండు బిలియన్ల మార్క్లను అధిగమించిన ఖచ్చితమైన రోజుకు ఎటువంటి అంచనా లేదు. మూడు నాలుగు బిలియన్ రోజులను అధికారికంగా గుర్తించలేదు.
DAY OF FIFTH BILLION - 1987 జూలై 11న ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరిన రోజుగా యూఎన్ పాపులేషన్ బ్యూరో గుర్తించింది.
- యుగోస్లావియాలోని కొసావోలో మాటేజ్ గాస్పర్ అనే శిశువు జన్మించడంతో ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరింది.
- జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవం (వరల్డ్ పాపులేషన్ డే)గా ప్రకటించారు.
DAY OF SIXTH BILLION - 1999 అక్టోబర్ 12న ప్రపంచ జనాభా ఆరు బిలియన్లకు చేరిన రోజుగా యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ బ్యూరో నిర్ణయించింది.
- యుగోస్లావియాలోని కొసావోలో అద్నాన్మెవిక్ అనే బాలుడు జన్మించడంతో ప్రపంచ జనాభా 6 బిలియన్లకు చేరింది. అందుకే అక్టోబర్ 12ను ‘డే ఆఫ్ సిక్స్ బిలియన్’ గా ప్రకటించారు.
DAY OF SEVENTH BILLION - 2011 అక్టోబర్ 31న ప్రపంచ జనాభా ఏడు బిలియన్లకు చేరిన రోజుగా యూఎన్ పాపులేషన్ బ్యూరో ప్రకటించింది.
- భారతదేశంలోని ఉత్తరప్రదేశ్కు చెందిన నర్గీస్కుమార్ను 7TH బిలియన్ బేబీగా ప్రకటించారు.
- ఫిలిప్పీన్స్లోని మనీలాకు చెందిన డానికా మేకమాచో, శ్రీలంకలోని కొలంబోకు చెందిన వాటలాగే ముత్తుమాయి ఇతర శిశువులలో ఉన్నారు.
DAY OF EIGHT BILLION - 2022 నవంబర్ 15న ప్రపంచ ఎనిమిది బిలియన్లకు చేరిన రోజుగా యూఎన్ పాపులేషన్ బ్యూరో ప్రకటించింది.
- ఫిలిప్పీన్స్లోని మనీలాలో జన్మించిన శిశువు వినీస్ మబాన్సాగ్ను 8వ బిలియన్ వ్యక్తిగా గుర్తించారు.
- 20వ శతాబ్దం ప్రారంభంలో మొత్తం ప్రపంచ జనాభా 2 బిలియన్ల కంటే తక్కువ.
- 2011లో మొత్తం ప్రపంచ జనాభా 7 బిలియన్లకు మించిపోయింది.
- ప్రపంచ జనాభా పెరుగుదలలో ఎక్కువ భాగం పేద దేశాల్లో కేంద్రీకృతమై ఉంది.
- ప్రపంచ జనాభా వార్షిక వృద్ధిరేటు 1.2 శాతానికి తగ్గినప్పటికీ జనాభా సంవత్సరానికి దాదాపు 83 మిలియన్లు పెరుగుతుంది.
- ప్రస్తుత ప్రపంచ జనాభా వృద్ధి రేటు 1.14 శాతం
- ప్రపంచంలో దాదాపు సగం మంది (48 శాతం) పేదరికంలో ఉన్నారు.
- ప్రపంచ జనాభాలో నిమిషానికి దాదాపు 140 మంది పెరుగుతున్నారు.
- ప్రపంచంలో అధిక జనాభా గల దేశం- చైనా (134.01 కోట్లు)
- ప్రపంచ జనాభాలో చైనా జనాభా శాతం- 19.4 శాతం
- ప్రపంచంలో అధిక జనాభా గల 2వ దేశం భారతదేశం (121.09 కోట్లు)
- ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం- 17.5 శాతం
- ప్రపంచంలోని ప్రతి 100 మందిలో భారతీయులు – 17.5 శాతం
- ప్రపంచంలో అతి తక్కువ జనాభా గల దేశం-వాటికన్ సిటీ ( 832 మంది)
- ప్రపంచంలో అధిక జనాభాగల మూడో దేశం అమెరికా
- ప్రపంచంలో అధిక ముస్లింలు గల దేశం ఇండోనేషియా
- ప్రపంచంలో ఒక చెట్టుపేరు గల దేశం బ్రెజిల్
- ప్రపంచంలో అధిక జనాభా వృద్ధి రేటు
- గల దేశం నైజీరియా (26.8 శాతం)
- ప్రపంచంలో అల్పజనాభా వృద్ధిరేటు
- గల దేశం రష్యా (-4.29 శాతం)
- 1950లో ప్రపంచ జనాభాలో చైనా జనాభా వాటా 22 శాతం, భారతదేశ జనాభా వాటా 14.2 శాతంగా ఉండేది.
- 2011 నాటికి ప్రపంచ జనాభాలో చైనా వాటా 19.5 శాతం, భారతదేశ వాటా 17.5 శాతానికి మారింది. అంటే చైనా, భారతదేశం మధ్య జనాభా అంతరం తగ్గుతుంది. భారతదేశం, అమెరికా మధ్య జనాభా అంతరం పెరుగుతుంది.
- యూఎస్ సెన్సస్ బ్యూరో ప్రకారం ప్రపంచ జనాభా 804,87,49,800
- ప్రస్తుతం ప్రపంచంలో అధిక జనాభా గల మొదటి ఐదు దేశాలు 2023 జూలై 18
1) భారతదేశం (142, 92,36,708)
2) చైనా (142,56,48,334)
3) యూఎస్ఏ (34,00,81,286)
4) ఇండోనేషియా (27,76,39,497)
5) పాకిస్థాన్ (24,07,04,361) - 2023 జనవరి 18 నాటికి భారత దేశ జనాభా చైనా జనాభాను అధిగమించినట్లు వరల్డ్ పాపులేషన్ రివ్యూ తన నివేదికలో ప్రకటించింది.
- ప్రపంచంలో ఒక బిలియన్, అంతకంటే ఎక్కువ గల దేశాలు రెండు.
1) భారతదేశం 2) చైనా - ప్రపంచంలో 100 మిలియన్ నుంచి 999.9 మిలియన్ జనాభా గల దేశాలు 12
- ప్రపంచంలో 10 మిలియన్ల నుంచి 99.9 మిలియన్ల జనాభా గల దేశాలు 80
- ప్రపంచంలో 1 మిలియన్ నుంచి 9.9 మిలియన్ల జనాభా గల దేశాలు 66
- ప్రపంచంలో 1 మిలియన్ కంటే తక్కువ గల దేశాలు 74.
ఖండాలవారీగా ప్రపంచ జనాభా-2011 (Population of the Continents)
- ప్రపంచంలో అధిక జనాభా గల ఖండం – ఆసియా (421,60,20,000)
- అధిక జనాభాలో రెండోస్థానంలో ఉన్న ఖండం ఆఫ్రికా (105,14,94,600)
- యూరప్ (74,00,99,500
- అమెరికా (46,31,80,649)
- దక్షిణ అమెరికా (39,61,83,600)
- ప్రపంచంలో తక్కువ జనాభా గల ఖండం- ఆస్ట్రేలియా (3,71,04,600)
- అంటార్కిటికా (స్థానిక నివాసులు లేరు)
ప్రపంచంలో అధిక జనాభా గల మొదటి పది దేశాలు (2011)
1) చైనా 134.01 కోట్లు 19.4 శాతం
2) భారతదేశం 121.09 కోట్లు 17.5 శాతం
3) యూఎస్ఏ 30.87 కోట్లు 4.5 శాతం
4) ఇండోనేషియా 23.7 కోట్లు 3.4 శాతం
5) బ్రెజిల్ 19.07 కోట్లు 2.8 శాతం
6) పాకిస్థాన్ 18.48 కోట్లు 2.7 శాతం
7) బంగ్లాదేశ్ 16.44 కోట్లు 2.4 శాతం
8) నైజీరియా 15.8 కోట్లు 2.3 శాతం
9) రష్యా 14.04 కోట్లు 2.0 శాతం
10) జపాన్ 12.81 కోట్లు 1.9 శాతం
1. 1930 నాటికి ప్రపంచ జనాభా ఎన్ని బిలియన్లకు చేరింది?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
2. ఏ రోజునాటికి ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకుంది?
ఎ) 1985 జూన్ 11
బి 1986 జూలై 11
సి) 1987 జూలై 11 డి) 1988 జూలై 11
3. DAY OF SIXTH BILLION?
1) 1999 అక్టోబర్ 12
బి) 2000 అక్టోబర్ 12
సి) 2000 డిసెంబర్ 15
డి) 2001 జనవరి 15
4. DAY OF SEVENTH BILLION?
ఎ) 2010 అక్టోబర్ 31
డి) 2011 అక్టోబర్ 2
సి) 2011 అక్టోబర్ 31
డి) 2012 అక్టోబర్ 31
5. DAY OF EIGHT BILLION?
ఎ) 2021 అక్టోబర్ 2
డి) 2021 నవంబర్ 15
సి) 2022 నవంబర్ 15
డి) 2023 జనవరి 10
6. ప్రపంచ మొత్తం జనాభాలో అధిక పేద ప్రజలు ఏ దేశాల్లో కేంద్రీకృతం అయ్యారు?
ఎ) అభివృద్ధి చెందిన దేశాలు
బి) అభివృద్ధి చెందుతున్న దేశాలు
సి) వెనుకబడిన దేశాలు
డి) పైవన్నీ
7. ప్రస్తుతం ప్రపంచ జనాభా వృద్ధి రేటు ఎంత?
ఎ) 1.2 శాతం బి) 1.5 శాతం
సి) 1.14 శాతం డి) 2.0 శాతం
8. ప్రపంచంలో అధిక జనాభాగల ఖండం ఏది?
ఎ) ఆఫ్రికా బి) ఆసియా
సి) యూరప్ డి) ఉత్తర అమెరికా
9. 2011 జనాభా లెక్కల ప్రకారం చైనా జనాభా ఎంత?
ఎ) 130.4 కోట్లు 2) 132.1 కోట్లు
సి) 134.01 కోట్లు డి) 135.01 కోట్లు
10. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం ఎంత?
ఎ) 14.3 శాతం బి) 15.2 శాతం
సి) 16.3 శాతం డి) 17.5 శాతం
11. ప్రపంచంలో అతి తక్కువ జనాభా గల దేశం ఏది?
ఎ) ఆస్ట్రేలియా బి) జపాన్
సి) వాటికన్ సిటీ డి) ఫిలిప్పీన్స్
12. ప్రపంచంలో అధిక జనాభా గల నాలుగో దేశం ఏది?
ఎ) పాకిస్థాన్ బి) బంగ్లాదేశ్
సి) నైజీరియా డి) ఇండోనేషియా
13. ప్రపంచంలో అధిక జనాభా వృద్ధిరేటు గల దేశం ఏది?
ఎ) బంగ్లాదేశ్ బి) నైజీరియా
సి) బ్రెజిల్ డి) చైనా
14. కింది వాటిలో ఒక చెట్టు పేరు గల దేశం?
ఎ) నైజీరియా బి) విక్టోరియా
సి) బ్రెజిల్ డి) చైనా
15. ప్రపంచంలో అల్ప జనాభా వృద్ధిరేటు గల దేశం ఏది?
ఎ) భారతదేశం బి) చైనా
సి) ఇండోనేషియా డి) రష్యా
16. ఏ రోజు నాటికి భారతదేశ జనాభా చైనా జనాభాను అధిగమించినట్లు వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకటించింది?
ఎ) 2023 జనవరి 18
బి) 2022 డిసెంబర్ 15
సి) 2023 జనవరి 15
డి) 2022 జనవరి 15
17. ప్రపంచంలో ఒక బిలియన్ కంటే ఎక్కువ జనాభా గల దేశాలు ఎన్ని?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 6
18. ప్రపంచంలో అదిక ముస్లిం జనాభా గల దేశం ఏది?
ఎ) పాకిస్థాన్ బి) అఫ్గానిస్థాన్
సి) ఇండోనేషియా డి) నైజీరియా
19. 1950లో ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా ఎంత శాతం ఉండేది?
ఎ) 10.2 శాతం బి) 12.5 శాతం
సి) 12.1 శాతం డి) 14.2 శాతం
20. 2011 సెన్సస్ ప్రకారం అమెరికా జనాభా ఎంత?
ఎ) 28.20 కోట్లు బి) 29.40 కోట్లు
సి) 30.87 కోట్లు డి) 45.35 కోట్లు
21. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచంలో అధిక జనాభా గల ఐదో దేశం ఏది?
ఎ) అమెరికా బి) పాకిస్థాన్
సి) ఇండోనేషియా డి) బ్రెజిల్
సమాధానాలు
1-బి 2-సి 3-ఎ 4-సి
5-సి 6-సి 7-సి 8-బి
9-సి 10-డి 11-సి 12-డి
13-బి 14-సి 15-డి 16-ఎ
17-ఎ 18-సి 19-డి 20-సి
21-డి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు