రొటీన్ కాదు.. రొటేటింగ్
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో ఓ ఇల్లు రొటీన్‌కు భిన్నంగా నిర్మితమైంది. 360 డిగ్రీల్లో సవ్య దిశలోనూ.. అపసవ్య దిశలోనూ తిరుగుతూ, తాను సమ్‌థింగ్ స్పెషల్ అంటున్నది.
న్యూ సౌత్‌వేల్స్‌లో నివాసముండే ఎవరింగ్ హామ్ స్వతహాగా ఇంటి డిజైనర్, బిల్డర్ కూడా. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతోమందికి వెరైటీ ఇండ్ల డిజైన్లను అందించాడు. అందుకే, తన ఇల్లు మరింత ప్రత్యేకంగా ఉండాలని ‘రొటేటింగ్ హౌస్’కు రూపకల్పన చేశాడు. 360 డిగ్రీల్లో.. ఎటునుంచి ఎటైనా తిరిగేలా ఈ ఇంటిని డిజైన్ చేశాడు. కేవలం డిజైన్‌కు తుదిరూపం ఇవ్వడానికే పదేండ్ల సమయం పట్టింది. 2004లో ఇంటి నిర్మాణం ప్రారంభం కాగా, 2006లో పూర్తయింది. అష్టభుజి ఆకారంలో నిర్మితమైన ఈ భవనంలో ఐదు బెడ్రూమ్లు, ఒక వంటగదితోపాటు నాలుగు వరండాలు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సూర్యుడి భ్రమణానికి అనుగుణంగా, తన ఇంటినీ తిప్పుతానని ఎవరింగ్ సరదాగా చెబుతున్నాడు. తన ఇంటిని స్ఫూర్తిగా తీసుకొని, కెనడాలోనూ ఇలాంటి ఇంటినే మరొకటి నిర్మించాడు ఎవరింగ్ హామ్.
ఇవీ కూడా చదవండీ…
కీరదోస తింటే 7 రోజుల్లో 7 కిలోల బరువు తగ్గుతారా?
రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే ఆరోగ్యం మీ వెంటే
గొంతునొప్పి తగ్గాలా..అయితే వీటిని తీసుకోండి..!
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు