Your memory is in your own hands | మీ చేతలలోనే మీ జ్ఞాపకశక్తి!
దుర్వ్యసనాలు నెమ్మదిగా మైండ్‌ని క్షీణింపచేస్తాయి. యాక్సిడెంట్ షాక్‌లు సైతం జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తాయి. తలకు బలమైన గాయం తగలడం ఎలాంటిదో, మానసికంగా షాక్‌కు గురవడం కూడా అలాంటిదే. మైండ్‌లో ఉన్న మానసిక ప్రతిభను వెలికితీసే ప్రజ్ఞాపాటవాలు మనంతట మనమే పలు టెక్నికల్‌ను అనుసరిస్తూ వెలికి తీయవచ్చు. జ్ఞాపకశక్తి కూడా మన మైండ్‌కు గల అనేకానేక శక్తి సామర్థ్యాల్లో ఒకటి. ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తిలోనూ ఈ ప్రజ్ఞాపాటవాలు చక్కగా పనిచేస్తాయి. అయితే వీటి వల్ల సరైన అవగాహన లేకపోవడం, వీటిని పెంపొందించుకోవాలనే ఆలోచనలు కొరవడటం, తగిన శిక్షణను పొందలేకపోవడం, ఉత్తమమైన ఫలితాలను సాధించడానికి మన మైండ్‌ని సరైన దిశగా మలుచుకోవడానికి సంసిద్ధత లేకపోవడం వంటి చర్యలు ఫలితంగా ఈ శక్తి సామర్థ్యాలు బయటపడటం జరగదు. జ్ఞాపకశక్తి విషయంలో కొంతమందికి వయసుతోపాటు ఇది క్షీణిస్తుందని అభిప్రాయం ఉంది. అయితే దీనికి శాస్త్రీయపరమైన ఆధారాలు లేవు. కొంత వయసు గడిచిన తర్వాత కండరాల కణజాలాల్లో సత్తువ సన్నగిల్లి జావకారిపోతాయనే అభిప్రాయం ఎలా అయితే వ్యాప్తి చెందిందో, జ్ఞాపకశక్తి విషయంలో కూడా వయసుకు, క్షీణతకు సంబంధం కలదని భావించడం జరుగుతోంది. అనారోగ్య పరిస్థితుల కారణంగానైతేనేమీ, గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకపోవడం చేతనైతేనేమీ, గుర్తుకు తెచ్చుకోకపోవడం జరుగుతుందేమో తప్ప జ్ఞాపకశక్తి సన్నగిల్లదు.
అనారోగ్య పరిస్థితులు
జ్ఞాపకశక్తిని క్షీణింపచేయడానికి రకరకాల అనారోగ్య పరిస్థితులు కారణమవుతుంటాయి. 1. షాక్, 2. యాక్సిడెంట్, 3. డ్రగ్స్, 4. స్మోకింగ్. విద్యార్థి దశలో ఉన్నప్పుడు పిల్లలు సిగరెట్ అలవాటుకు బానిస కావడం, లేక వయసులోనే రక్తంలో నికోటిన్ పెరిగిపోవడం కచ్చితంగా మెదడు శారీరక ధర్మ విధులను ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యకరంగా ఉండే వ్యక్తిలో పనిచేసినంత గొప్పగా మెదడు వీరికి పనిచేయదు. శరీరంలో స్వచ్ఛంగా ఉండాల్సిన అవయవాలు పలు కారణాల రీత్యా కాలుష్యానికి లోనైనప్పుడు వాటి పనితనం ఆ మేరకు కుంటుపడిపోతుంది. దీనికి తోడు కొంతమంది విద్యార్థులు చెడు స్నేహాలు పట్టి మాదక ద్రవ్యాలను సైతం యథేచ్ఛగా ఉపయోగిస్తారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల హానికరమైన రసాయనిక పదార్థాలు మైండ్‌ను ఛిద్రం చేస్తాయి. ఎక్కువకాలం డ్రగ్స్ వాడే వ్యక్తులు మనోవైకల్యాలకు లోనుకావడంతో పాటు ప్రజ్ఞాపాటవాలు నీరుగారిపోతాయి. కాబట్టి విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
తలకు గాయమైనప్పుడు : ప్రమాదవశాత్తు తలకు దెబ్బ తగిలినప్పుడు అమ్నీషియా ఏర్పడవచ్చు. ఇది రకరాలుగా ఉంటుంది. కొంతమందిలో గతం పూర్తిగా మర్చిపోవడం జరిగితే, మరికొంతమందిలో పాక్షికంగా మరుపు ఏర్పడి, ఏవో కొన్ని విషయాలు మర్చిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మెదడు కాండం వద్ద గట్టిగా దెబ్బ తగిలిన వ్యక్తులకు సెరిబ్రెల్ కార్టెక్స్ సందేశాలను వెన్నుపూసకు అందించే ప్రక్రియ దెబ్బతిని వ్యవస్థ పాడైపోతుంది. కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.
విద్యార్థి దశలో షాక్‌లు
హఠాత్తుగా ఎదురయ్యే ఉద్విగ్నభరితమైన మానసిక అనుభవాన్ని షాక్ అని అంటాం. అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్ర భవనాన్ని తీవ్రవాదులు కూలగొట్టినప్పుడు ఆ జాతి యావత్తూ తీవ్ర షాక్‌కు లోనయ్యింది. దరిమిలా పలు రకాల న్యూరోటిక్, సైకోటిక్ సమస్యలతో ప్రజలంతా కౌన్సెలింగ్ సెంటర్లకు, మనో వైద్యాలయాలకు దారితీశారు. హఠాత్తుగా ఎదురయ్యే ఇటువంటి మానసికానుభావాలు విద్యార్థి దశలోనూ వింతేమీ కాదు. విద్యార్థులు తమ శక్తికి మించి లక్ష్యాలను ఏర్పర్చుకోవడం, అవి సాధించ లేనప్పుడు షాక్‌కు గురికావటం, సున్నితమైన మనసుతో ఉద్వేగాల సమస్యలతో నిత్యం సతమతమయ్యే వ్యక్తులను మానసికంగా ఏర్పడే షాక్‌ల సంఖ్య తక్కువేమీ కాదు. ముఖ్యంగా పిల్లలు ప్రేమ వివాహాల్లో చిక్కుకోవటం, వారికి మానసిక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఒక్కోసారి ప్రేమించిన వ్యక్తి హఠాత్తుగా కాదని వెళ్లిపోవడం, విపత్కర పరిస్థితుల్లో మరణించడం వంటి విషయాలు మానసికంగా షాక్‌కు గురిచేస్తుంటాయి. ఫలితంగా చదువుపై ఏకాగ్రత తగ్గి డిప్రెషన్, అబ్సెషన్ వంటివి కుంగదీస్తాయి. సహజంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?