Who says religion is like a drug to human society | మతం మానవ సమాజానికి మత్తు పదార్థం వంటిది అన్నదెవరు?

1. భారతదేశం విభిన్న మతాలకు నిలయం. హిందువులకు వేదాలు, స్మృతులు మొట్టమొదటి మతగ్రంథాలు. ముస్లింలకు పవిత్ర గ్రంథం ఖురాన్. ఇక క్రైస్తవుల మత గ్రంథం బైబిల్. సిక్కుల పవిత్ర గ్రంథం ఆదిగ్రంథ్. బౌద్ధ, జైన మతాలు కూడా గ్రంథాలను కలిగి ఉండగా, జొరాస్ట్రియన్ మత గ్రంథం ఏది ?
1) ఆహుర మద్దా 2) జెండా అవెస్తా
3) జెండా తీస్తా 4) అజెండావెస్తా
2. మానవ సంస్కృతి ప్రారంభమైనప్పటి నుంచి మతం ఉంది. ప్రస్తుత సమాజంలోనూ మతం ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. ప్రపంచంలోనే అతి పురాతనమైన మతం ?
1) హిందూ 2) క్రైస్తవం 3) హిబ్రూ 4) జొరాస్ట్రియన్
3. హిందూ మతంలో కర్మ, పునర్జన్మ, ధర్మం, అర్థం కామం, మోక్షం అనేవి పురుషార్థాలు. బ్రహ్మచర్యం, గృహస్తు, వానప్రస్థం, సన్యాసం అనేవి ?
1) వర్ణవ్యవస్థ 2) మత సూత్రాలు
3) ఆశ్రమ ధర్మాలు 4) న్యాయసూత్రాలు
4. ఇస్లాం అరబ్బీపదం. భగవంతుని పట్ల విధేయతతో ఉండటమని అర్థం. ఇస్లాం మతాన్ని అనుసరించేవారిని ముస్లింలు/ మహ్మదీయులు అంటారు. ఈ మతంలో విగ్రహారాధన లేదు. మతగ్రంథమైన ఖురాన్ ఎన్ని విద్యుక్త ధర్మాలను నిర్దేశించింది?
1) 7 2) 6 3) 4 4) 5
5. ఇస్లాం మతం ఎడారి దేశంలో పుట్టి అతి శక్తివంతమై త్వరితంగా ప్రపంచవ్యాప్తమైంది. ఈ మత స్థాపకులు మహ్మద్‌ప్రవక్త. పవిత్ర యాత్రాస్థలం మక్కాబ. కాగా మహ్మద్ ప్రవక్త వారసుడిని ఏమంటారు?
1) ఖలీఫా 2) అలీఫా 3) ప్రవక్త 4) మహ్మద్
6. భారత్‌లో హిందూవులు, ముస్లింల తర్వాత అత్యధికులు క్రైస్తవులు. సర్వమానవ సేవ, సోదరభావం మొదలైనవి ఈ మతంలోని ప్రధానమైన లక్షణాలు. మతగ్రంథం బైబిల్ పేర్కొన్న ప్రకారం క్రైస్తవులు ఆచరించవలసిన ఆజ్ఞలు ఎన్ని ?
1) 13 2) 10 3) 15 4) 8
7. బ్రిటిష్ పాలనా కాలంలో క్రైస్తవ మతం భారత్‌లో బాగా వ్యాప్తి చెందింది. తమిళనాడు, కేరళలో క్రైస్తవులు అత్యధికంగా ఉన్నా రు. దేశంలోని క్రైస్తవుల్లో అధికశాతం ఎస్సీ,ఎస్టీ, వెనకబడిన కులాలకు చెందినవారే ఉన్నారు. కాగా క్రీస్తు శిష్యుల్లో ఒకరైన సెయింట్ థామస్ క్రీ.శ 46/50లో దేశంలోని ఏ రాష్ట్రానికి వచ్చి మతవ్యాప్తి చేశారు. ?
1) తమిళనాడు 2) కర్ణాటక 3) కేరళ 4) అసోం
8. దేశంలోని క్రైస్తవుల్లో కాథలిక్లు,లూథరన్లు, మెథడిస్ట్లు, సిరియన్ క్రిస్టియన్లు ప్రధాన శాఖలు. మొదటి రెండు శాఖలు అన్నిరాష్ర్టాల్లో ఉండగా, మెథడిస్ట్లు ఎక్కువగా ఉత్తర భారత్‌లోనూ, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోనూ, కేరళలో సిరియన్ క్రిస్టియన్లు అధికంగా ఉండగా, దేశవ్యాప్తంగా ఏ శాఖ వారు ఎక్కువ?
1) కాథలిక్లు 2) సిరియన్లు
3) మెథడిస్టులు 4) లూథరన్లు
9. సిక్కుమత స్థాపకులు గురునానక్. ఈయన తర్వాత తొమ్మిది మంది గురువులు బాగా ప్రాచుర్యం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం. ఈ మతంలో K అని సంబోధించే మతపర చిహ్నాలు ఎన్ని?
1) 6 2) 3 3) 5 4) 2
10. హిందూమతంలోని కులవ్యవస్థకు వ్యతిరేకంగా గౌతమ బుద్ధుడు బౌద్ధమతం స్థాపించారు. సిద్ధాంతరీత్యా మహాయానం, హీనయానం అనే రెండు శాఖలు ఉన్నవి. అస్పృశ్యత లేని మతంగా గుర్తింపు పొందగా, ఈ మతం ఎన్ని పవిత్ర సత్యాలను పేర్కొంది ?
1) 4 2) 3 3) 7 4) 5
11. జైనమతాన్ని స్థాపించిన వారిని తీర్థంకరులు అంటారు. మొదటివారు వర్థమాన మహావీరుడు. బౌద్ధమత సమకాలీన మతంగా బహుళ ప్రచారం పొందింది. ఈ మతం అహింసకు విశిష్ట ప్రాముఖ్యం కల్పించింది. జైనుల్లో శ్వేతంబర, దిగంబర అనే రెండు శాఖలు ఉండగా, ప్రతిబంధకంగా ఉన్న శాఖ ఏది ?
1) శ్వేతంబర 2) దిగంబర
3) జైనంబర 4) శ్వేతంబర,దిగంబర
12. పారశీకులు జొరాష్ట్రియన్ మతాన్ని భారత్‌లో ప్రవేశపెట్టారు. సర్వోన్నతుడైన భగవంతుడిని విశ్వసిస్తూ, నీరు, అగ్ని, భూమిని పూజిస్తారు. వీరు ఈ ప్రపంచానికి మూలకారకుడు అని ఎవరిని నమ్ముతారు?
1) అజుర మద్దా 2) ఆహుర మద్దా
3) విశ్వ మద్దా 4) పారశీక మద్దా
13. మతం మానవ సమాజానికి మత్తు పదార్థం వంటిది అని అభిప్రాయపడినది?
1) ఎ. ఆర్ దేశాయ్ 2) కారల్‌మార్క్స్
3) ఎం.ఎన్ శ్రీనివాస్ 4) ఐరావతి కార్వే
14. మతం అనేది క్రోడీకరించబడిన ఆచార అలవాట్లు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, మానవాతీతమైన శక్తుల పట్ల నమ్మకం అని పేర్కొన్న సామాజికవేత్త ?
1) ఎమిలి దుర్క్‌హైమ్ 2) కారల్‌మార్క్స్
3) ఆగస్ట్కామ్టే 4) ఎం.ఎన్ శ్రీనివాస్
15. సర్వాత్మవాదమే మానవుల ప్రాథమిక మతంఅని పేర్కొంది?
1) ఆర్.ఆర్ మారెట్ 2) ఎడ్వర్డ్ బర్నెట్ టైలర్
3) ఎమిలి దుర్క్‌హైమ్ 4) కారల్‌మార్క్స్
16. సమాజంలో మానవుని అనుభవం నుంచి మతం పుట్టినది. మాన, టోటెమ్వాదం వంటి భావనలు మతం తొలి స్వరూపమని పేర్కొన్న సామాజికవేత్త?
1) ఎడ్వర్డ్ బర్నెట్ టైలర్ 2) ఆర్.ఆర్ మారెట్
3) ఎమిలి దుర్క్‌హైమ్ 4) ఎవరూకాదు
17. సామాజిక సమైక్యతను వ్యక్తం చేయడానికి మతం ఉద్దేశింపబడిందని అభిప్రాయం వ్యక్తం చేసినది?
1) రాడ్‌క్లిఫ్ బ్రౌన్ 2) కారల్‌మార్క్స్
3) ఎడ్వర్డ్ బర్నెట్ టైలర్ 4) చాపెల్
18. మత ఆవిర్భావానికి సంబంధించి సామాజిక వేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలను జతపర్చండి.
1) ఎమిలి దుర్క్‌హైమ్ ఎ) పరమాత్మవాదం
2) టేలర్ బి) ప్రకృతి ఆరాధన
3) ముల్లరన్ సి) టోటెమ్వాదం
4) రాడ్క్లిఫ్బ్రౌన్ డి) ప్రకార్యావాదం
1) 1-ఎ,2-బి,3-సి,4-డి 2) 1-డి,2-ఎ,3-సి,4-బి
3) 1-సి,2-ఎ,3-బి,4-డి 4) 1-డి,2-బి,3-ఎ,4-సి
19. మతతత్వానికి, ఆర్థిక అసమానతలకు సంబంధం ఉందని
విశ్లేషించింది?
1) హ్యూమనిస్టులు 2) మార్క్సిస్టులు
3) క్యాపిటలిస్టులు 4) నేచరిస్టులు
20. మతతత్వానికి ఆరు కోణాలు ఉన్నాయని పేర్కొన్న
సామాజిక వేత్త ?
1) ఊమెన్ 2) నానావతి 3) టేలర్ 4) కారల్‌మార్క్స్
21. ఆమ్నెస్టీ ఇంటరర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం మత ఘర్షణల్లో ప్రజలు అధికంగా చనిపోయిన ప్రాంతం ?
1) గుజరాత్ 2) ఉత్తరప్రదేశ్
3) మధ్యప్రదేశ్ 4) పశ్చిమబంగా
22. ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో చెలరేగిన మత ఘర్షణ ల్లో వేలాదిమంది చనిపోయారు. ఈ ఘర్షణలపై దర్యాప్తు కోసం వేసిన కమిషన్ ?
1) మదన్ 2) నానావతి 3) లిబర్హాన్ 4) శ్రీకృష్ణ
23. బ్లూ స్టార్ ఆపరేషన్ తర్వాత హత్యకు గురైన ప్రధాని?
1) రాజీవ్‌గాంధీ 2) ఇందిరాగాంధీ
3) లాల్‌బహదూర్‌శాస్త్రి 4) నెహ్రూ
24. 1978లో దేశంలో మైనార్టీ కమిషన్‌ను ఏర్పాటు చేయగా, చట్టబద్ధత ఎప్పుడు కల్పించారు?
1) 1991 2) 1990 3) 1992 4) 1994
జవాబులు
1-2, 2-1, 3-3, 4-4, 5-1, 6-2, 7-3, 8-1, 9-3, 10-1, 11-2, 12-2, 13-2, 14-1, 15-2, 16-3, 17-1, 18-3, 19-2, 20-1, 21-3, 22-2, 23-2, 24-3
RELATED ARTICLES
-
Learn tricks of good presentation (TSPSC and TSLPRB)
-
What to do if you’re feeling sleepy while studying
-
Public life chariots are minerals | జనజీవన రథచక్రాలు ఖనిజాలు (గ్రూప్-1 ప్రత్యేకం)
-
The first stage of Telangana development | తెలంగాణ తొలి వికాస దశ ( గ్రూప్-1 మెయిన్స్)
-
An inscription describing the genealogy of Kakatiya | కాకతీయుల వంశవృక్షాన్ని వివరించిన శాసనం? ( పోటీపరీక్షల ప్రత్యేకం )
-
What title did Tanisha give to Madanna | మాదన్నకు తానీషా ఇచ్చిన బిరుదు? హిస్టరీ
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
విద్యా సంస్కరణలతో వికాసం (groups special)
ఖనిజాల కాణాచి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? (Groups Special)
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం (Groups Special)
పుస్తక సమీక్ష / Book Review
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు