Wildlife conservation | వన్యప్రాణి సంరక్షణ
దేశంలో రక్షిత ప్రాంతాలు
మానవాళి అభివృద్ధి వేగానికి వేల ఏండ్లుగా భూగోళంపై నివసిస్తూ ప్రకృతి సమతౌల్యతను కాపాడుతూ వస్తున్న అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఎన్నో జీవులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని కొంతలో కొంతైనా నివారించేందుకు ప్రతిదేశం తమ భూభాగం పరిధిలో ప్రమాదంలో ఉన్న జీవుల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ చర్యలు భారత్‌లో బ్రిటీష్ పాలనాకాలంలోనే ప్రారంభమయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం అనేక ప్రాంతాలను వన్యప్రాణి రిజర్వులుగా ప్రకటించింది. పర్యావరణ మార్పులు సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వివిధ పోటీ పరీక్షల్లో దేశంలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గురించి లోతైన ప్రశ్నలు వస్తున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని నిపుణ పాఠకుల కోసం ఈ వ్యాసం..
-దేశంలోని జంతు సంపదను పరిరక్షించడానికి 1898లో అప్పటి ప్రభుత్వం మొదటి పక్షుల అభయారణ్యాన్ని తమిళనాడులోని వేదాంతంగల్లో ఏర్పాటుచేసింది.
-ఆ తర్వాత 1935లో మొదటిపార్కుగా ఉత్తరప్రదేశ్‌లో హేలీ జాతీయపార్కు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ పార్కును జిమ్ కార్బెట్ పార్కుగా పిలుస్తున్నాం.
-దేశంలో ప్రస్తుతం జాతీయపార్కులు 102 ఉన్నవి.
వన్యప్రాణుల సంరక్షణ చట్టాలు
1. భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టం -1972
2. అటవీ, పక్షుల, జంతువుల భద్రతా చట్టం – 1912
3. భారతీయ ఏనుగుల భద్రత చట్టం – 1879
4. బెంగాల్ ఖడ్గమృగ చట్టం -1932
5. మద్రాసు అటవీ ఏనుగుల చట్టం -1873
6. అసోం ఖడ్గమృగ భద్రత చట్టం -1954
ఆదేశిక సూత్రాల్లోని 48వ ప్రకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వన్య ప్రాణులను సంరక్షించాలని పేర్కొంది.
అదేవిధంగా 51A ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ పౌరుల ప్రాథమిక విధిగా పేర్కొంది.
42వ సవరణ ద్వారా వన్యప్రాణుల సంరక్షణ రాష్ట్రజాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చారు.
-జాతీయపార్కులు : 2014, ఏప్రిల్ నాటికి 166 జాతీయ పార్కులు ఆమోదించబడి ఉంటే వాటిలో 102 జాతీయ పార్కులు ఏర్పాటయ్యాయి. వీటిలో కూడా వన్యప్రాణులకు, వీటితో పాటు పశుసంపదకూ రక్షణ లభిస్తుంది.
-జాతీయ హోదా ఇవ్వబడిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలే జాతీయపార్కులు.
-ప్రపంచంలో మొదటి జాతీయపార్కును అమెరికాలోని యోమింగ్ ప్రాంతంలో ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ (1872) ఏర్పాటు చేశారు.
దేశంలో ముఖ్యమైన జాతీయ పార్కులు
తెలంగాణ : కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయపార్కు, మృగవణి జాతీయపార్కు, మహావీర్ హరిణ వనస్థలి జాతీయపార్కు, హైదరాబాద్.
ఆంధ్రప్రదేశ్ : శ్రీవేంకటేశ్వర జాతీయపార్కు
కర్ణాటక : బందీపూర్ జాతీయపార్కు, బన్నేర్‌గట్ట జాతీయపార్కు, కుద్రేముఖ్ జాతీయపార్కు, నాగర్హోల్ జాతీయపార్కు (రాజీవ్‌గాంధీ నేషనల్ పార్క్).
తమిళనాడు : గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ జాతీయపార్కు, అన్నామలై వైల్డ్‌లైఫ్ శాంక్చురీ (ఇందిరాగాంధీ వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, నేషనల్ పార్కు), ముదుమలై జాతీయపార్కు, ముకురీ జాతీయపార్కు, పళనిహిల్స్ జాతీయపార్కు.
కేరళ : పెరియార్ జాతీయపార్కు, సైలెంట్‌వ్యాలీ జాతీయపార్కు, ఇరావికుళమ్ జాతీయపార్కు, మలికెట్టన్సోలా జాతీయపార్కు.
రాజస్థాన్ : కియోలాడియో జాతీయపార్కు, డ్రరా జాతీయపార్కు, డెనర్ జాతీయపార్కు, రణతంబోర్ జాతీయపార్కు, సరిస్కా జాతీయపార్కు.
గుజరాత్ : బ్లాక్‌బక్ జాతీయపార్కు, గిర్ జాతీయపార్కు, గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ జాతీయపార్కు, వన్స్థా జాతీయపార్కు.
మహారాష్ట్ర : చందోలీ జాతీయపార్కు, పెంచ్ జాతీయపార్కు, గుగామల్ జాతీయపార్కు, నవేగావ్ జాతీయపార్కు, బొర్విల్లి (సంజయ్‌గాంధీ) జాతీయపార్కు, టడొబ జాతీయపార్కు.
గోవా : మాల్లేమ్ జాతీయపార్కు
సిక్కిం : కాంచన్‌జంగా జాతీయపార్కు
బీహార్ : వాల్మీకి జాతీయపార్కు
జార్ఖండ్ : బెట్లో జాతీయపార్కు
పశ్చిమబంగా : సుందర్బన్స్ జాతీయపార్కు, గౌరుమర జాతీయపార్కు, జల్దపర జాతీయపార్కు, నియోరా వ్యాలీ జాతీయపార్కు. సింగాలీ లా జాతీయపార్కు, కాంప్‌బెల్ బే జాతీయపార్కు, గలారియా జాతీయపార్కు, మహాత్మాగాంధీ మెరైన్ (వండూరు) జాతీయపార్కు, మిడిల్బటన్ ఐలాండ్ జాతీయపార్కు, మౌంట్ హెరైట్ జాతీయపార్కు, నార్త్బటన్ ఐలాండ్ జాతీయపార్కు, రాణిఝాన్సీ మెరైన్ జాతీయపార్కు, సౌత్బటన్ ఐలాండ్ జాతీయపార్కు, బుక్సా జాతీయపార్కు.
ఒడిశా : బితర్కానికా జాతీయపార్కు, నందన్‌కానన్ జాతీయపార్కు, సిమ్లిపాల్ జాతీయపార్కు.
జమ్ముకశ్మీర్ : డచ్గామ్ జాతీయపార్కు, సలీం అలీ జాతీయపార్కు, కిస్తవార్ జాతీయపార్కు, హెమిస్ జాతీయపార్కు.
హిమాచల్‌ప్రదేశ్ : గ్రేట్ హిమాలయన్ జాతీయపార్కు, పిన్వ్యాలీ జాతీయపార్కు.
ఉత్తరాఖండ్ : గంగోలి జాతీయపార్కు, గోవింద్ పశువిహార్ జాతీయపార్కు, నందాదేవి జాతీయపార్కు రాజాజీ జాతీయపార్కు, వ్యాలీ ఫ్లవర్ జాతీయపార్కు, కార్బెట్ జాతీయపార్కు, గంగోత్రి జాతీయపార్కు.
ఉత్తరప్రదేశ్ : దుద్వా జాతీయపార్కు
మధ్యప్రదేశ్ : బాందవ్‌ఘర్ జాతీయపార్కు, కన్హ జాతీయపార్కు, ఫాసిల్ జాతీయపార్కు, మాధవ్ జాతీయపార్కు, పన్నా జాతీయపార్కు, సంజయ్ జాతీయపార్కు, సాత్పూరా జాతీయపార్కు, వనవిహార్ జాతీయపార్కు.
ఛత్తీస్‌గఢ్ : ఇంద్రవల్లి జాతీయపార్కు, కాంగెర్ఘట్ జాతీయపార్కు.
పంజాబ్ : హరైక్ వెట్లాండ్ జాతీయపార్కు
అరుణాచల్‌ప్రదేశ్ : మోలింగ్ జాతీయపార్కు, నామ్దఫా జాతీయపార్కు
నాగాలాండ్ : తంగ్కి జాతీయపార్కు
అసోం : దిబ్రూ- సైకొవా జాతీయపార్కు, కజిరంగా జాతీయపార్కు, మానస్ జాతీయపార్కు, నామేరీ జాతీయపార్కు, బరంగ్ జాతీయపార్కు.
మణిపూర్ : కిబుల్ లామ్జావో జాతీయపార్కు, సిరోహి జాతీయపార్కు
మిజోరాం : ముర్లెన్ జాతీయపార్కు, ప్లావంగ్ బ్లూ మౌంటెన్ జాతీయపార్కు
హర్యానా : కాలేశ్వర్ జాతీయపార్కు, సుల్తాన్పూర్ జాతీయపార్కు.
ప్రాజెక్ట్ ఎలిఫెంట్ : దేశంలో ఏనుగుల సంరక్షణార్థం 1991-92లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్‌ను ప్రారంభించారు.
ప్రస్తుతం దేశంలో 20,000 ఏనుగులు ఉన్నట్లు అంచనా. కానీ అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండడంతో వాటి సంఖ్య త్వరగా తగ్గిపోతుంది.
ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రాంతాన్ని గ్రీన్, ఎల్లో, రెడ్ ప్రాంతాలుగా వర్గీకరించారు.
గ్రీన్ ప్రాంతం – మానవునికి, ఏనుగులకు మధ్య అత్యంత సంఘర్షణ గల ప్రాంతం.
ఎల్లో ప్రాంతం – మానవునికి, ఏనుగులకు మధ్య మధ్యస్థ సంఘర్షణ గల ప్రాంతం.
రెడ్ ప్రాంతం – మానవునికి, ఏనుగులకు మధ్య తరచూ సంఘర్షణ గల ప్రాంతం.
ప్రాజెక్ట్ టైగర్ : 1973, ఏప్రిల్‌లో పులుల సంరక్షణార్థం కేంద్ర ప్రభుత్వం టైగర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసింది.
జిమ్‌కార్బెట్ జాతీయపార్కు దేశంలోనే మొదటి టైగర్ ప్రాజెక్ట్
దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్.
1998 వ సంవత్సరాన్ని పులుల సంవత్సరంగా ప్రకటించారు.
1972లో పులిని జాతీయ జంతువుగా గుర్తించారు.
2011 జూన్ నాటికి 43 పులుల సంరక్షణ కేంద్రాలున్నాయి.
దేశంలో పెద్ద టైగర్ ప్రాజెక్ట్ – నాగార్జునసాగర్& శ్రీశైలం ( తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)
చిన్న టైగర్ ప్రాజెక్ట్ – బన్నేర్‌గట్టా (కర్ణాటక)
ప్రాజెక్ట్ క్రొకోడైల్ : 1975లో ఏర్పాటు చేశారు. మొసళ్ల సంరక్షణ కోసం క్రొకోడైల్ బ్యాంకును చెన్నైలో ఏర్పాటు చేశారు.
భారత్‌లో అత్యంత వేగంగా అంతరించిపోతున్న మొసళ్ల జాతి ఘరియాల్.
ప్రాజెక్ట్ సీ టర్టిడ్ : 1975లో సముద్ర సంరక్షణ కోసం ఆపరేషన్ సీ టర్టిల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రాజెక్ట్ స్నో టైగర్ : 2009, జనవరి 20న జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌ల్లో మంచు చిరుత ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
ఇండియన్ రైనోస్ : పశ్చిమబెంగాల్లోని జల్దపార శాంక్చురీని ఏ హోమ్ ఆఫ్ ఇండియా & వరల్డ్ రైనోస్ అంటారు.
అసోంలోని కజిరంగా శాంక్చురీ ఒంటికొమ్ము ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి.
జీవావరణ మండలాలు (బయోస్పియర్ రిజర్వ్‌లు) : జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, జీవరాశుల మధ్యగల సమగ్రతను కాపాడటం, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ జీవవైవిధ్య అధ్యయనం లక్ష్యాలతో ప్రభుత్వం జీవావరణాలను ఏర్పాటు చేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?