A program of twenty principles | ఇరవై సూత్రాల కార్యక్రమం
-ఈ కార్యక్రమాన్ని 1975లో ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు.
-దీన్ని పేదరికం నిర్మూలన, ఉపాధి, విద్య, గృహవసతి, ఆరోగ్యం, వ్యవసాయం, భూ సంస్కరణలు, నీటిపారుదల, తాగునీరు, సామాజిక న్యాయం, లింగ సమానత్వం, మురికివాడల అభివృద్ధి, బాధ్యతాయుత పరిపాలన, రక్షణ, బలహీన వర్గాల సాధికారత, వినియోగదారుల రక్షణ, పర్యావరణం లాంటి 20 లక్ష్యాలను, దాని 66 అంశాలను సాధించడానికి ఎంపికచేశారు.
-కార్యక్రమ పర్యవేక్షణ, అమలుకు కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖకు కేటాయించారు.
-దీన్ని మొదటిసారిగా 1982,1986ల్లో సవరించారు.
-దీని విజయాలు, అనుభవాల నేపథ్యంలో కొత్త విధానాలను అనుసరించి పునర్నిర్మాణంలో భాగంగా పేదరిక నివారణకు ఉత్పాదకతను పెంచడం, ఆదాయ అసమానతలు తగ్గించడం, తొలగించడం, సామాజిక, ఆర్థిక అంతరాలను పునర్వ్యవస్థీకరించారు.
-జాతీయ కనీస ఉమ్మడి కార్యక్రమం, యునైటెడ్ నేషన్స్ మిలీనియం డెవలప్మెంట్, సార్క్ సామాజిక శాసనపత్రం, సహస్రాబ్ది ప్రకటన, 2000 శాంతి హక్కు నివేదించిన లక్ష్యాలను పొందుపర్చారు.
-అభివృద్ధికి బలమైన నిబద్ధత, భద్రత, లింగ సమానత్వం, పేదరికాన్ని అనేక కోణాల్లో రూపుమాపడానికి స్థిరమైన మానవ అభివృద్ధికి సంబంధించిన అంశాలను పేర్కొన్నారు.
-కార్యక్రమంలోని వివిధ పథకాలను పునర్నిర్మించాలని 2006లో 65 అంశాలను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని విధాన కార్యాచరణ ఏప్రిల్ 2007లో ప్రారంభించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?