Coal in the state | రాష్ట్రంలో అధికంగా లభించే బొగ్గు రకం?

– రాష్ట్రంలో అధికంగా బొగ్గు లభించే ప్రాంతాలు, జిల్లాలు
– ప్రాణహిత, గోదావరి నదీలోయ ప్రాంతంలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం.
– దేశంలో మొత్తం బొగ్గు నిల్వల్లో 20 శాతం వరకు మన రాష్ట్రంలో ఉన్నాయి.
గమనిక: దేశంలో అతిపెద్ద బొగ్గు గని- ఝరియా (జార్ఖండ్)
– దేశంలో అతి పురాతనమైన బొగ్గు గని- రాణిగంజ్ (1774), పశ్చిమబెంగాల్
– దేశంలో అతిపెద్ద ఓపెన్ కాస్ట్ గని- తాల్చేర్ (ఒడిశా)
గమనిక: థర్మల్శక్తి తెలంగాణలో విద్యుత్ శక్తికి ప్రధాన ఆధారం
గమనిక: పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలు తెలంగాణలో లేవు.
అణు ఖనిజాలు (Atomic Minerals)
– యురేనియం, థోరియం, జిర్కోనియం, టిటానియం, ఇల్మనైట్ వంటివి అణు ఖనిజాలు.
యురేనియం (Uranium)
-ముడి ఖనిజం – పిచ్ బ్లెండ్
-యురేనియం నిల్వలు ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే ఉంటాయి.
ఉత్పత్తి
– ప్రపంచంలో కజకిస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, కెనడా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
– దేశంలో తుమ్మలపల్లి (ఆంధ్రప్రదేశ్), జూదుగూడ (జార్ఖండ్)లో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నది.
– రాష్ట్రంలో నల్లగొండలోని లంబాపూర్, నామాపూర్‌లో అధికంగా ఉత్పత్తి అవుతున్నది.
– (ప్రపంచ న్యూక్లియర్ అసోసియేషన్- 2015 ప్రకారం)
– ప్రపంచ యురేనియం ఉత్పత్తిలో భారతదేశ ఉత్పత్తి- 2 శాతం మాత్రమే
– దేశంలో మొదట యురేనియం నిల్వలు గుర్తించిన ప్రాంతం- జాదుగూడ (జార్ఖండ్, 1951)
– 1967లో UCIL (Uranium Corporation of India Limited)
– ప్రధాన కార్యాలయం జాదుగూడ (సింగ్భమ్) జిల్లాలో స్థాపించారు.
– దేశంలో మొదటగా 1967లో యురేనియాన్ని వెలికితీశారు.
– రాష్ట్రంలో యురేనియం విస్తరించిన ప్రాంతాలు- లంబాపూర్, నామాపూర్, కుప్పునూర్, వనపర్తి, పెద్దూరు, పెద్దగట్టు, కొత్తూరు
– ఇతర అణుఖనిజాలు రాష్ట్రంలో లేవు
గమనిక: థోరియం, జిర్కోనియం అనే అణుఖనిజాలు కేరళ తీరంలో లభిస్తాయి.
– టిటానియం అణు ఖనిజం విశాఖ తీరంలో లభిస్తుంది.
– ఇల్మనైట్- విశాఖ తీరంలోని ముక్కామల ఇసుకదిబ్బల్లో లభిస్తుంది.
– అణుఖనిజాలను అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో ఉపయోగిస్తారు.
కొన్ని ఇతర ఖనిజాలు (విస్తరించిన ప్రాంతాలు)
1. డోలమైట్- ఖమ్మం, గద్వాల జిల్లాలు- కాస్మొటిక్స్ తయారీలో
2. ఫెల్డ్‌స్పార్- ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సంగారెడ్డి
ప్రాక్టీస్ బిట్స్
1. తెలంగాణ రాష్ట్ర సహజ వనరుల అభివృద్ధి సంస్థను ఎప్పుడు స్థాపించారు? 1) 2014, అక్టోబర్ 8
2) 2014, జూన్ 2
3) 2016, అక్టోబర్ 2
4) 2016, జూన్ 2
2. 2016-17 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఖనిజరంగం వాటా?
1) 3.3 శాతం
2) 3.1 శాతం
3) 2.8 శాతం
4) ఏదీకాదు
3. ఖనిజాలు అనేవి?
1) తీరస్త వనరులు మాత్రమే
2) పునరుత్పత్తి చేయలేని వనరులు
3) పునరుత్పత్తి చేయగల వనరులు
4) అంత ప్రధానం కాని వనరులు
4. ఖనిజ వనరులను గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు?
1) హైడ్రాలజీ
2) మెమెరాలజీ
3) మినరాలజీ
4) ఒడంటాలజీ
5. ఎన్ఎండీసీని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1958
2) 1956
3) 1962
4) 1967
6. కిందివాటిని జతపర్చండి.
ఎ. రాగి 1. ఫెర్రస్ ఖనిజం
బి. ఇనుము 2. నాన్‌ఫెర్రస్ ఖనిజం
సి. మైకా 3. విలువైన ఖనిజం
డి. వెండి 4. అలోహఖనిజం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-4, బి-1, సి-3, డి-2
7. రాష్ట్రంలో అత్యధికంగా ఇనుము ఏ ముడిఖనిజం నుంచి లభిస్తున్నది?
1) మాగ్నటైట్
2) హెమటైట్
3) లియోనైట్
4) సెడిరైట్
8. రాష్ట్రంలో ఇనుప ఖనిజాల నిల్వలు, ఉత్పత్తి అత్యధికంగా ఉన్న ప్రాంతం?
1) బయ్యారం
2) ఆదిలాబాద్
3) నాగర్‌కర్నూల్
4) జడ్చర్ల
9. రాష్ట్రంలో అత్యధిక మాంగనీస్ ధాతువు ఉత్పాదన ఉన్న ఉమ్మడి జిల్లా?
1) మెదక్
2) ఖమ్మం
3) ఆదిలాబాద్
4) వరంగల్
10. దేశంలో ఖనిజ ఎక్స్ప్లోటేషన్ వల్ల అధిక రెవెన్యూను ఆర్జిస్తున్న రాష్ట్రం?
1) జార్ఖండ్
2) ఒడిశా
3) మధ్యప్రదేశ్
4) ఛత్తీస్‌గఢ్
11. రాష్ట్రంలో బొగ్గు నిల్వలు కలిగిన ప్రాంతం?
1) మంజీర- మానేరు
2) కాగ్నా- భీమ
3) కృష్ణా- కిన్నెరసాని
4) ప్రాణహిత- గోదావరి
12. కింది ఏ ఉమ్మడి జిల్లాల నుంచి అధిక ఖనిజ ఆదాయం లభిస్తున్నది?
1) నిజామాబాద్, మెదక్
2) కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్
3) మహబూబ్‌నగర్, నల్లగొండ
4) రంగారెడ్డి, మెదక్, నల్లగొండ
13. బ్రౌన్గ్రానైట్ శిలల వల్ల అధిక ఆదాయం లభిస్తున్న ఉమ్మడి జిల్లా?
1) కరీంనగర్
2) ఖమ్మం
3) ఆదిలాబాద్
4) రంగారెడ్డి
14. కిందివాటిలో దేశంలో అత్యధికంగా మాంగనీస్‌ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?
1) ఒడిశా
2) ఆంధ్రప్రదేశ్
3) జార్ఖండ్
4) ఛత్తీస్‌గఢ్
15. కిందివాటిలో దేశంలో యురేనియం నిక్షేపాలు కలిగిన ప్రాంతాలు?
1) కొవ్వూరు (ఆంధ్రప్రదేశ్), బాలాసోర్ (ఒడిశా)
2) పోఖ్రాన్ (రాజస్థాన్), చంబల్వ్యాలీ (మధ్యప్రదేశ్)
3) జాదుగూడ (జార్ఖండ్), తుమ్మలపల్లి (ఆంధ్రప్రదేశ్)
4) మిత్రవిధి (గుజరాత్), చిట్కుయా….. (ఒడిశా)
16. కిందివాటిలో ఖనిజ వనరులు అవలభించే రాష్ర్టాల సరికాని జత?
1) బాక్సైట్- ఒడిశా
2) ఇనుము ముడి ఖనిజం- జార్ఖండ్
3) థోరియం- రాజస్థాన్
4) రాగి- మధ్యప్రదేశ్
17. తాల్చేరు బొగ్గు క్షేత్రాలు ఉన్న రాష్ట్రం ఏది?
1) పశ్చిమబెంగాల్
2) బీహార్
3) ఒడిశా
4) మధ్యప్రదేశ్
18. రాష్ట్రంలో విద్యుత్ శక్తికి ప్రధాన ఆధారం?
1) థర్మల్
2) హైడ్రల్
3) న్యూక్లియర్
4) బయో- ఫ్యూయల్స్
19. దేశంలోని ఖనిజాలకు సంబంధించి సరైన జత ఏది?
ఎ. రాగి- జార్ఖండ్
బి. నికెల్- ఒడిశా
సి. టంగ్స్టన్- కేరళ
1) ఎ, బి
2) బి
3) ఎ, సి
4) ఎ, బి, సి
20. నల్ల సీసం అని దేనిని పిలుస్తారు?
1) నల్లగ్రానైట్
2) గ్రాఫైట్
3) బొగ్గు
4) సీసం
21. రాష్ట్రంలో ముగ్గురాయి (బైరైటిస్) నిక్షేపాలు అధికంగా ఉన్న జిల్లా?
1) నల్లగొండ
2) సూర్యాపేట
3) ఖమ్మం
4) మహబూబ్‌నగర్
22. విద్యుత్ బంధకంగా ఉపయోగించే అలోహ ఖనిజం?
1) సున్నపురాయి
2) అభ్రకం
3) బైరైటిస్
4) బొగ్గు
23. గ్రానైట్ శిలలకు సంబంధించి సరిగా ఉన్న జతను గుర్తించండి.
ఎ. బ్రౌన్ గ్రానైట్ శిలలు- కరీంనగర్
బి. ఇండియన్ అరోరా శిలలు- కామారెడ్డి
సి. బ్లాక్ గ్రానైట్ శిలలు- ఖమ్మం
1) ఎ, బి
2) బి
3) ఎ, బి, సి
4) ఎ, సి
24. రాష్ట్రంలో విద్యుత్‌శక్తికి ప్రధాన ఆధారం?
1) థర్మల్
2) హైడల్
3) న్యూక్లియర్
4) బయో ఫ్యూయల్
25. కిందివాటిలో యురేనియం అన్వేషణ, తవ్వకాలకు సంబంధించి వార్తల్లో ఉన్న ప్రాంతం?
1) బెజ్జూరు
2) సోమనపల్లి
3) అమ్రాబాద్
4) జిన్నారం
26. దేశంలో యురేనియంను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) బీహార్
4) పశ్చిమబెంగాల్
27. దేశం నుంచి ఏ దేశానికి ఇనుము ఉక్కు అధికంగా ఎగుమతి అవుతున్నది?
1) జపాన్
2) సింగపూర్
3) ఆస్ట్రేలియా
4) మలేషియా
28. స్పాంజ్ ఐరన్ ఏ ఓడరేవు ద్వారా భారత్ నుంచి జపాన్‌కు ఎగుమతి అవుతున్నది?
1) మలబారు
2) మార్మగోవా
3) కెనరా
4) సర్కారు
29. రాష్ట్రంలో గ్రానైట్ నిల్వలు పుష్కలంగా ఉన్న జిల్లా?
1) వరంగల్
2) ఖమ్మం
3) కరీంనగర్
4) నల్లగొండ
30.ఖమ్మం జిల్లాలో లభించే ఖనిజాల్లో ప్రధానమైనది కానిది?
1) బైరైటిస్
2) మాంగనీస్
3) డైమండ్
4) బొగ్గు
31. దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఏ వనరుకు ప్రసిద్ధి?
1) బొగ్గువనరులు
2) సహజ వాయువు
3) గ్రానైట్
4) అటవీ ఉత్పత్తులు
32. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిల్వలు బయటపడ్డాయి?
1) బయ్యారం
2) జన్నారం
3) గన్నవరం
4) మైలారం
33. దేశంలో ప్రధానమైన ఖేత్రి గనులు దేనికి ప్రసిద్ధి?
1) రాగి
2) ఇనుము
3) బంగారం
4) మాంగనీస్
34. రాష్ట్రంలోని గద్వాల శిలాబెల్ట్లో ఏ ఖనిజ ఉత్పత్తులు ఉన్నాయి?
1) బొగ్గు
2) బంగారం
3) ఇనుము
4) వజ్రాలు
35. అత్యంత నాణ్యమైన బొగ్గు అని దేనికి పేరు?
1) బిట్యుమినస్ బొగ్గు
2) పీట్ బొగ్గు
3) లిగ్నైట్ బొగ్గు
4) ఆంత్రసైట్ బొగ్గు
36. సింగరేణి లాభాల్లో కార్మికులకు ఎంత వాటా చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు?……….
1) 10 శాతం
2) 21 శాతం
3) 31 శాతం
4) 43 శాతం
37. ముక్కాముల ఇసుక దిబ్బల్లో ఏ ఖనిజ నిల్వలు లభిస్తాయి?
1) థోరియం
2) జిర్కోనియం
3) టిటానియం
4) ఇల్మనైట్
38. డోలమైట్ ఖనిజం విస్తరించిన జిల్లా ఏది?
1) మెదక్
2) సంగారెడ్డి
3) ఖమ్మం
4) హైదరాబాద్
39. రాష్ట్రంలో అధికంగా లభించే బొగ్గు రకం?
1) ఆంత్రసైట్ బొగ్గు
2) సెమీ బిట్యుమినస్
3) పీట్
4) లిగ్నైట్
40. కిందివాటిలో లోహఖనిజం కానిది?
1) రాగి
2) వెండి
3) ముగ్గురాయి
4) బంగారం
41. దేశంలో మొదటిసారిగా యురేనియం నిల్వలను ఎక్కడ గుర్తించారు?
1) నామాపూర్
2) ఖేత్రి
3) జాదుగూడ
4) ఝరియా
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
English Grammar | We should all love and respect