Principle of triangle area | త్రిభుజ వైశాల్య సూత్రాన్ని తెలిపిన శాస్త్రవేత్త?
-గణిత అభివృద్ధికి కృషిచేసిన శాస్త్రవేత్తలు పైథాగరస్
-పైథాగరస్ గ్రీస్ దేశంలోని శామోస్ ద్వీపంలో (క్రీ.పూ. 580-500) జన్మించాడు.
-ఇతని విద్యాభ్యాసం థేల్స్ ఆఫ్ మిలిటస్లో జరిగింది.
-తన గురువు థేల్స్ పేరుతో ఈజిప్టులో గణితశాస్ర్తాన్ని అధ్యయనం చేశాడు.
-దక్షిణ ఇటలీలోని కాట్రన్ పట్టణంలో పైథాగరస్ అనే పాఠశాలను స్థాపించాడు.
-ఈ పాఠశాలలో 300 మంది విద్యార్థులు ఉండేవారు.
-ఎవరు ఏమనుకున్నా బయటకు తెలుపకూడదనే నిబంధన ఉండేది.
-ఈ పాఠశాలలో గణిత, తత్వ, విజ్ఞానశాస్ర్తాలను బోధించేవారు.
-ఈ పాఠశాల అకాడమీ చిహ్నం ఐదు శీర్షాలున్న నక్షత్రం. దీన్ని Health అని పిలిచేవారు.
-పైథాగరస్ శిష్యుల్లో ముఖ్యమైనవాడు పిలోడస్. ఇతని రచనలవల్ల పైథాగరస్ గణిత కృషి బయటి ప్రపంచానికి తెలిసింది.
పైథాగరస్ గణిత కృషి
-సంఖ్యలను సరి, బేసిసంఖ్యలుగా వర్గీకరించాడు.
ఉదా: 0, 2, 4, . . . . . (స్త్రీ సంఖ్యలు) 1, 3, 5, . . . . . (పురుష సంఖ్యలు)
-పరిపూర్ణ సంఖ్యలను పరిచయం చేశాడు.
ఉదా: 6, 28, 496, . . . . . . . . . 6 కారణాంకాలు- 1, 2, 3, 61 + 2 + 3 + 6 = 2(6) = 12 సంఖ్య.-28 కారణాంకాలు- 1, 2, 4, 7, 14, 28-1 + 2 + 4 + 7 + 14 + 28 = 2(28)
-త్రిభుజ సంఖ్యలను పరిచయం చేశాడు.n(n+1)/2 రూపంలో గల సంఖ్యలను త్రిభుజ సంఖ్యలు అంటారు.
ఉదా: 1, 3, 6, 10, . . . . . .
-స్నేహ సంఖ్యలను పరిచయం చేశాడు.ఉదా: 220, 284ఇక్కడ 220= 284కు కారణాంకాల మొత్తం284= 220కు కారణాంకాల మొత్తం (ఈ సంఖ్యలను గ్రీకులు అమికబుల్ నంబర్స్ అంటారు)
-వర్గ సంఖ్యలను పరిచయం చేశాడు.
-ఉదా: 1, 4, 9, 16, . . .
-చతురస్ర సంఖ్యలను పరిచయం చేశాడు.
-1 నుంచి (2n+1) వరకుగల బేసి సంఖ్యల మొత్తం n2 అనే సూత్రాన్ని తెలియజేశాడు.
-కరణీయ సంఖ్య అని తెలియజేశాడు.
-సంగీతంలో గణిత విజ్ఞానాన్ని ప్రవేశ పెట్టాడు.
-పైథాగరస్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిన సిద్ధ్దాంతం లంబకోణ త్రిభుజ సిద్ధాంతం.
-ఈ సిద్ధాంతానికి సంబంధించిన వివరణ యూక్లిడ్ రాసిన Elements గ్రథంలోని మొదటి భాగంలో ఉన్నది.
part-I లో 47వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధ్దాంతం.
-48వ ప్రతిపాదన దాని విపర్యయం.
-Mathematics, is equal, parabola, ellipse అనే పదాలను ప్రవేశపెట్టాడు.
-జ్యామితీయ పటాలను వివరించడానికి అక్షరాలను మొదటిసారి ఉపయోగించిన శాస్త్రవేత్త పైథాగరస్.
గమనిక: పైథాగరస్‌కు గల బిరుదు అతి తెలివైన సాహసి.
-వైశాల్యం అనే అంశంపై పైథాగరస్ ఎక్కువ కృషి చేశాడు. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురస్రం మిగిలిన రెండు భుజాలపై చతురస్రాల మొత్తానికి సమానమనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
యూక్లిడ్
-అలెగ్జాండ్రియా పట్టణంలో భూ కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన టాలమీ అలెగ్జాండ్రియా అనే విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర అధ్యాపకునిగా పనిచేసేవాడు.
-తన పూర్వీకులైన థేల్స్, పైథాగరస్, ఆర్కిమెడిస్ మొదలైన శాస్త్రవేత్తల గ్రంథాలను అధ్యయనం చేసి తను కనుగొన్న విషయాలను తెలియజేస్తూ ప్రపంచ ప్రసిద్ధ గ్రంథమైన elementsను రచించాడు.
Elements గ్రంథం ప్రత్యేకతలు
-తర్క వివేచన కోసం అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ దీన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేశాడు.
-ఈ గ్రంథం గ్రీకు, అరబిక్, లాటిన్ భాషల నుంచి ఇంగ్లిష్‌లోకి అనువాదమై తొలి ముద్రణ 1482 లో వెలువడింది.
-యూక్లిడ్ను Father of the Geometry అంటారు.
-ఇతను కనుగొన్న సమాంతర స్వీకృతాలు తప్పు అని నిరూపించిన వారు KF Gaiss, Reidman. వీరు కనుగొన్న రేఖాగణితాన్నే Non – యూక్లిడియన్ జామెట్రీ అంటారు.
-రేఖాగణితాన్ని యూక్లిడ్ పేరు మీదుగా యూక్లిడియన్ Geometry అంటారు.
-Elements అనే గ్రంథం 13 ఉప గ్రంథాలుగా ఉంటుంది.
గ్రంథం- 1
-దీనిలో 48 ప్రతిపాదనలు ఉన్నాయి.
-1 నుంచి 26 – త్రిభుజాలకు సబంధించిన వివరణ.
-27 నుంచి 32 – సమాంతర రేఖలు, చతుర్భుజాల గరించి వివరణ.
-47 – పైథాగరస్ సిద్ధాంతం.
-48 – పైథాగరస్ సిద్ధాంత విపర్యయం.
గ్రంథం – 2
-ఇందులో వైశాల్యాలు, బీజగణిత సమస్యల వివరణ ఉన్నది.
గ్రంథం – 4
-అనుపాతానికి సంబంధించిన యుజోక్సస్ వాదం ఉన్నది.
గ్రంథం – 9
-1 కంటే పెద్దగా ఉన్న ప్రతి సహజ సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్దంగా ఏకైకంగా రాయవచ్చు.
-Fundamental Theorem of Arithematic.
-గుణశ్రేఢికి చెందిన n పదాల మొత్తానికి జ్యామితీయ వివరణ ఉన్నది.
-ప్రధాన సంఖ్యల సమితి అపరిమిత సమితి అనే నిరూపణ ఉన్నది.
గ్రంథం – 11, 12, 13
-ఈ 3 గ్రంథాలు త్రిపరిమాణాత్మక జ్యామితిని వివరిస్తాయి.
-ఇతను డాటా అనే గ్రంథాన్ని రచించాడు. ఇది దత్తాంశాన్ని విశ్లేషించే పద్ధతులను వివరిస్తుంది.
జార్జి కాంటర్
-ఇతని పూర్తి పేరు జార్జి ఫెర్డినాండ్ లుడ్విగ్ ఫిలిప్ కాంటర్.
-ఇతను రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించాడు.
-జ్యూరిచ్, బెర్లిన్ విశ్వవిద్యాలయాల్లో ఇతను విద్యాభ్యాసం పూర్తిచేశాడు.
-ఇతనికి కళాశాల విద్యను బోధించిన అధ్యాపకులు క్రోనెకర్, కుమ్మర్, వైర్స్ట్రాస్.
-జార్జ్ కాంటర్ తరుచూ డిప్రెషన్‌కు లోనవుతూ హాలండ్‌లోని మానసిక చికిత్సాలయంలో మరణించాడు.
ఇతని గణిత కృషి
-ఆధునిక గణిత భాషకు ఆద్యుడు.
-సమితి వాదం, ట్రాన్స్ ఫైనట్ సమితులను అభివృద్ధి పరిచాడు.
-ఇతన్ని సమితి వాద శాస్త్ర పితామహుడు అంటారు.
-ఇతను కనుగొన్న సమితివాద విషయాలను మొదటగా ప్రచురించిన పత్రిక Acta Mathematica.
-సమితుల పరిబద్ధత, అపరిబద్ధతలపై పరిశోధన చేశాడు.
-సమితుల విచ్ఛిన్నత, అవిచ్ఛిన్నతలపై పరిశోధన చేశాడు.
-ఈయన 1873 డిసెంబర్ 7న తన స్నేహితుడైన డెడి కైండ్ కు రాసిన ఉత్తరంలో కింది విషయాలు ఉన్నాయి.1. అకరణీయ సంఖ్యలను లెక్కించడం సాధ్యమవుతుంది.2. వాస్తవ సంఖ్యల సరాసరి లెక్కించడం సాధ్యంకాదు.
-7. 12. 1873 ను సమితివాద దినంగా భావించవచ్చు.
-గణితశాస్త్రంలో సాంప్రదాయకవాదాన్ని ప్రతిపాదించిన డేవిడ్ హిల్ బర్ట్ అనే విద్యావేత్త అభిప్రాయం ప్రకారం జార్జికాంటర్ మనకోసం సృష్టించిన ఈ లోకం నుంచి మనల్ని ఎవ్వరు వెళ్లగొట్టలేరు.
రేనే డెకార్టే
-ఇతను ఫ్రాన్స్‌లోని లాహై పట్టణంలో జన్మించాడు.
-ఫ్రాంటియర్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు.
-హాలండ్‌లో ప్రశాంత జీవనం గడిపే రోజుల్లో నిరూపక రేఖాగణితాన్ని కనుగొన్నాడు.
-స్వీడన్ యువరాణి క్రిస్టియానాకు గణితశాస్త్ర అధ్యాపకునిగా పనిచేశాడు.
ఇతని గణిత కృషి
-సమతలంలోని బిందువులను వాస్తవ క్రమయుగ్మాలకు అనుసంధానం చేయడం ద్వారా రేఖాగణితం, బీజగణితాల మధ్య అంతరం తొలగిపోయి రెండింటిని కలిపి అధ్యయనం చేయడం సాధ్యమైంది.
-నిరూపక రేఖాగణితానికి మూలపురుషుడు రేనే డెకార్టే.
-ఇతని పేరుమీదుగా నిరూపక రేఖాగణితాన్ని కార్టీజిన్ జామెట్రి అంటారు.
-ఇతను ఆధునిక గణితశాస్త్ర పితామహుడు, ఆధునిక తత్వశాస్త్ర పితామహుడుగా ప్రసిద్ధి గాంచాడు.
-తన స్నేహితుడైన ఫెర్మాతో కలిసి సమీకరణవాదాన్ని అభివృద్ధి పరిచాడు.
-వక్రం, దాని సమీకరణం అనే భావన ఆధారంగా అనేక రకాల వక్రాలను తెలియజేశాడు.
-తత్వశాస్త్రం, Geometry, డయాప్ట్రిక్స్ అనే మూడింటిని వివరించే డిప్ కోర్స్ ఆన్ మెథడ్స్ అనే గ్రంథాన్ని రచించాడు.
డెకార్టే ప్రకారం విశ్వ సత్యాలు
-నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను.
-ప్రతి దృగ్విషయానికి కారణం ఉంటుంది.
-ఫలితం దాని కారణం కంటే గొప్పది కాదు.
-సమస్యలో పరిపూర్ణత్వం, కాలం, గమనం అనే భావనలున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?