Which is the most populous state in slums | మురికివాడల జనాభా ఎక్కువగా గల రాష్ట్రం?

1. దేశంలో ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు ప్రధానమార్గం?
1) పూర్తిస్థాయి ప్రాంతీయాభివృద్ధి
2) సంతులన ప్రాంతీయాభివృద్ధి
3) సామాజిక ప్రాంతీయాభివృద్ధి
4) శీఘ్రతర ప్రాంతీయాభివృద్ధి
2. ప్రాంతీయ అసమానతలకు కారణం?
1) ఖనిజాల లభ్యత, విస్తరణ
2) చారిత్రక గొప్పతనం
3) వివక్షాపూరిత పాలన 4) పైవన్నీ
3. జిల్లాస్థాయి స్మూక్ష్మ ప్రణాళికలను రూపొందించినవారు?
1) మొరార్జీదేశాయ్ 2) గాడ్గిల్
3) మహలనోబిస్ 4) గోపాలన్
4. ప్రాంతీయ అసమానతల సూచీని గుర్తించండి.
1) తలసరి ఆదాయం 2) పేదరిక తీవ్రత
3) మానవాభివృద్ధి సూచీ 4) పైవన్నీ
5. సంతులిత అభివృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినదెవరు?
1) రగ్నార్నర్క్స్ 2) కుజునెట్స్
3) కారల్‌మార్క్స్ 4) ఆర్థర్ లూయిస్
6. ఆర్థికాభివృద్ధి సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలు?
1) అభివృద్ధి చెందుతున్న దేశాలు
2) అభివృద్ధి చెందిన దేశాలు
3) వెనుకబడిన దేశాలు 4) పారిశ్రామిక దేశాలు
7. వెనుకబడిన దేశాలను మూడో ప్రపంచ దేశాలని పేర్కొన్న ఆర్థిక శాస్త్రవేత్త?
1) ఫ్రాన్స్ ఫాసన్ 2) కీన్స్
3) కారల్‌మార్క్స్ 4) గున్నార్ మిర్దాల్
8. ప్రాంతీయ అసమానతలను సూచించేందుకు రాజ్‌కృష్ణ పరిగణలోకి తీసుకున్న అంశాలు?
1) పేదరికం, నిరుద్యోగం 2) ఆదాయస్థాయి
3) పట్టణీకరణ తీరు 4) పైవన్నీ
9. తలసరి ఆదాయం, తలసరి వినియోగం, ఆదాయ అసమానతల స్థాయి ఆధారంగా ప్రాంతీయ అసమానతలను గుర్తించినదెవరు?
1) కారల్‌మార్క్స్ 2) రాజ్‌కృష్ణ
3) సైమన్ కుజునెట్స్ 4) ఏఆర్ దేశాయ్
10. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి చేపట్టే చర్య?
1) పారిశ్రామిక వికేంద్రీకరణ
2) స్థానిక పరిశ్రమల అభివృద్ధి
3) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకాలు
4) పైవన్నీ
11. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ రూపొందించిన సూచీ?
1) అవస్థాపన సదుపాయాల సూచీ
2) అభివృద్ధి సూచీ 3) ఉపాధి కల్పన సూచీ
4) ప్రాంతీయాభివృద్ధి సూచీ
12. సామాజిక రంగం అభివృద్ధిపరంగా ముందున్న రాష్ట్రం?
1) తెలంగాణ 2) పంజాబ్ 3) కేరళ 4) నాగాలాండ్
13. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభాను ఎక్కువగా కలిగి ఉన్న రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) తమిళనాడు
3) గుజరాత్ 4) తెలంగాణ
14. పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలను గుర్తించడానికిగాను జాతీయాభివృద్ధి మండలి ఎంచుకున్న సూచీ?
1) రాష్ట్ర తలసరి ఆదాయం
2) మౌలిక సదుపాయాలు
3) ప్రతి లక్ష జనాభాకు పారిశ్రామిక కార్మికులు
4) పైవన్నీ
15. ప్రాంతీయ అసమానతల తగ్గింపునకు సంబంధించిన కమిటీ?
1) వాంఛూ కమిటీ 2) దత్తు కమిటీ
3) పాండే కమిటీ 4) పైవన్నీ
16. ప్రాంతీయ అసమానతలను తగ్గించే లక్ష్యంతో 2002-03లో ప్రవేశపెట్టిన పథకం?
1) రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
2) రాష్ట్రీయ సమవికాస్ యోజన
3) రాష్ట్రీయ అభివృద్ధి యోజన
4) రాష్ట్రీయ వికాస్ యోజన
17. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూపొందించిన కార్యక్రమం?
1) డీపీఏపీ 2) డీడీపీ 3) హెచ్ఏడీపీ 4) పైవన్నీ
18. ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను ఎప్పటి నుంచి రూపొందిస్తున్నారు?
1) 1971 2) 1972 3) 1973 4) 1974
19. రఘురాం రాజన్ కమిటీ దేనికి సంబంధించింది?
1) కేంద్రం నుంచి రాష్ర్టాలకు నిధుల కేటాయింపు
2) కేంద్రం నుంచి రాష్ర్టాలకు ప్రత్యేక సహాయం అందించడం
3) కేంద్రం నుంచి రాష్ర్టాలకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అందించడం 4) పైవన్నీ
20. భారతదేశంలో లింగపరమైన అసమానత్వం ఏ రూపంలో కనిపిస్తుంది?
1) ఆదాయం 2) ఉపాధి
3) సామాజిక అంతస్తు 4) పైవన్నీ
21. సామాజిక మార్పు, సామాజిక కొనసాగింపునకు సంబంధించిన అంశం?
1) జననాలు 2) మరణాలు 3) వలసలు 4) పైవన్నీ
22. ఏ భాషకు చెందిన మైగ్రేర్ అనే పదం నుంచి మైగ్రేషన్ అనే పదం వచ్చింది?
1) లాటిన్ 2) గ్రీకు 3) జపాన్ 4) పాలినేషియా
23. మాతృ స్థలానికి తిరిగి రావడాన్ని ఏమంటారు?
1) తాత్కాలిక వలస 2) పాక్షిక వలస
3) శాశ్వత వలస 4) సంపూర్ణ వలస
24. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి జరిగే వలస?
1) పాక్షిక వలస 2) శాశ్వత వలస
3) అంతర్గత వలస 4) అంతర్జాతీయ వలస
25. మాతృదేశాన్ని వదిలి మరోదేశానికి వలస పోవడాన్ని ఏమంటారు?
1) ఎమ్మిగ్రేషన్ 2) ఇమ్మిగ్రేషన్
3) ఇంటర్నేషనల్ మైగ్రేషన్ 4) ఇంటర్ మైగ్రేషన్
26. తెలంగాణ ప్రాంతం నుంచి మొదట వలసపోయినవారు?
1) దళితులు 2) చేనేత కార్మికులు
3) వ్యవసాయ కూలీలు 4) ఇటుకబట్టీ కార్మికులు
27. వలసల నివారణకు సంబంధించిన కార్యక్రమం?
1) పుర 2) భారత్ నిర్మాణ్
3) జాతీయ ఉపాధి హామీ పథకం 4) పైవన్నీ
28. వలస అనేది?
1) నిరంతర ప్రక్రియ 2) సామాజిక ప్రక్రియ
3) సామాజిక గతిశీల ప్రక్రియ 4) పైవన్నీ
29. ఒక వ్యక్తి తన జన్మస్థలం నుంచి అంతిమ స్థానానికి దశలవారీగా వలస పోవడం?
1) గ్యాస్ మైగ్రేషన్ 2) నెట్ మైగ్రేషన్
3) స్టెప్ మైగ్రేషన్ 4) ఇంపెల్ల్డ్ మైగ్రేషన్
30. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వలస రావడం?
1) ఇమ్మిగ్రేషన్ 2) ఎమ్మిగ్రేషన్
3) శరణార్థి మైగ్రేషన్ 4) బలవంతపు మైగ్రేషన్
31. ఏడాది కాలంలో ప్రతి వెయ్యిమంది జనాభాకు ఎంతమంది వలసదారులు ఉన్నారనే విషయాన్ని వివరించేది?
1) మొత్తం అంతర వలస తీరు
2) మొత్తం బాహ్యవలస తీరు
3) మొత్తం నికర వలస తీరు 4) పైవేమీకావు
32. ఒక ప్రాంతాన్ని వదిలి వలసపోవడానికి అక్కడ గల కారకాలు?
1) ఫుల్ ఫ్యాక్టర్స్ 2) పుష్ ఫ్యాక్టర్స్
3) ఫోర్స్‌ఫుల్ ఫ్యాక్టర్స్ 4) పైవేవీకావు
33. వలసలను ప్రోత్సహించే కారకం?
1) పట్టణీకరణ 2) పారిశ్రామికీకరణ
3) వ్యవసాయ సంక్షోభం 4) పైవన్నీ
34. ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం ఎంత జనాభా దాటితే వాటిని మెగాసిటీగా పరిగణిస్తారు?
1) 50 లక్షలు 2) కోటి
3) రెండు కోట్లు 4) మూడు కోట్లు
35. మురికివాడల జనాభా ఎక్కువగా గల రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) గుజరాత్
3) మధ్యప్రదేశ్ 4) ఉత్తరప్రదేశ్
36. మురికివాడలు లేని భారతదేశం నినాదంతో 2009లో ప్రారంభమైన పథకం?
1) ఇందిరా ఆవాస్ యోజన
2) రాజీవ్ ఆవాస్ యోజన
3) జవహర్ ఆవాస్ యోజన 4) పైవేవీకావు
37. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఇస్లాం మతానికి చెందిన ప్రజల జనాభా శాతం?
1) 18.4 2) 16.8 3) 14.2 4) 11.2
38. హిందూ మతానికి ఆధారాలు?
1) వేదాలు 2) పురాణాలు
3) వర్ణాశ్రమ వ్యవస్థలు 4) పైవన్నీ
39. బౌద్ధ మతంలోని అష్టాంగ మార్గంలో అంశంకానిది?
1) సరైన దృక్పథం 2) సరైన లక్ష్య నిర్ణయం
3) సరైన జీవన విధానం 4) సరైన విద్య
40. మహావీరుని నైతిక ప్రవర్తన నియమావళిలోని ప్రధాన సూత్రం?
1) అహింస 2) బ్రహ్మచర్యం
3) అత్యాశ లేకపోవడం 4) పైవన్నీ
41. సిక్కుల పవిత్రగ్రంథమైన శ్రీగురుగ్రంథ్ సాహెబ్‌ను సంకలనం చేసినవారు?
1) గురు రాందాస్ 2) గురు అర్జున్దేవ్
3) గురు గోవింద్‌సింగ్ 4) గురు నానక్
42. బైబిల్లోని పవిత్రగ్రంథంగా పరిగణిస్తూ మోక్షం కోసం క్రీస్తుమార్గాన్ని అనుసరించేవారు?
1) కేథలిక్‌లు 2) ప్రొటెస్టెంట్లు
3) జొరాస్ట్రియన్లు 4) జైల్ అబిదిన్లు
43. మతం ప్రధాన విధి?
1) మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దడం
2) మానవుని మానసిక అవసరాలను తీర్చడం
3) మానవుని సమస్త అవసరాలను తీర్చడం
4) ప్రకృతిని కాపాడటం
44. కులం అనే పదాన్ని దేశంలో మొదటిసారిగా ఉపయోగించినవారు?
1) డచ్‌వారు 2) ఫ్రెంచ్‌వారు
3) పోర్చుగీసువారు 4) ఇంగ్లిష్‌వారు
45. కులం ఒక?
1) సామాజిక సంస్థ 2) అంతర్వివాహ సమూహం
3) జన్మతఃసంక్రమించే లక్షణం కలది 4) పైవన్నీ
46. వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయని పేర్కొన్నదెవరు?
1) రిస్లే 2) నెస్‌ఫీల్డ్
3) ఎంఎన్ శ్రీనివాస్ 4) ఏఆర్ దేశాయ్
47. ప్రాబల్య కులం అనే పదాన్ని ఉపయోగించినదెవరు?
1) విలియం వైజర్ 2) ఎంఎన్ శ్రీనివాస్
3) హైమన్ డార్ఫ్ 4) ఎమిలి దుర్క్‌హైమ్
48. గ్రామీణ వ్యవసాయిక సమాజాన్ని నడిపించిన వ్యవస్థ?
1) అగ్రకుల వ్యవస్థ 2) జాజ్‌మానీ వ్యవస్థ
3) వర్ణ వ్యవస్థ 4) ఆశ్రమ వ్యవస్థ
49. కులతత్వంలో కనిపించే లక్షణం?
1) తన కులంపట్ల అభిమానం
2) ఇతర కులాలపట్ల ద్వేషం
3) ఇతర కులాలపై దాడులు చేసే తత్వం 4) పైవన్నీ
50. కులతత్వం వల్ల కలిగే ప్రధాన నష్టం?
1) సామాజిక సంఘర్షణ 2) అవినీతి, ఆశ్రిత పక్షపాతం
3) జాతీయ సమైక్యత దెబ్బతింటుంది 4) పైవన్నీ
51. కులతత్వం పెరగడానికి కారణం?
1) వైవాహిక ఆంక్షలు
2) తన కులవాదాన్ని పెంచుకోవాలన్న బలమైన కోరిక 3) నగరీకరణ, పారిశ్రామికీకరణ 4) పైవన్నీ
52. పట్టణ మురికివాడలు, పరిసరాల అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది ఎప్పుడు?
1) 1972 2) 1974 3) 1976 4) 1978
53. కింది వాటిలో పట్టణ పేదరిక నిర్మూలన పథకం ఏది?
1) ఎన్ఆర్‌వై 2) యూబీఎస్పీ
3) ఎస్జేఎస్ఆర్వై 4) పైవన్నీ
54. పరిమాణాత్మక అభివృద్ధి సూచీకి సంబంధించిన అంశం?
1) తలసరి ఆదాయంలో పెరుగుదల
2) వనరుల సంపూర్ణ వినియోగం
3) విద్యావైద్య సదుపాయాల వృద్ధి 4) పైవన్నీ
55. భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థికాభివృద్ధి సూచీ?
1) ఆర్థికవ్యవస్థలో వ్యవస్థాపక మార్పులు
2) వ్యవసాయరంగం వాటా తగ్గడం
3) సేవారంగం వాటా పెరగడం 4) పైవన్నీ
56. కింది వాటిలో ఆర్థికాభివృద్ధిని కొలిచే అత్యుత్తమ సాధనం?
1) స్థూల జాతీయాదాయం
2) నికర జాతీయాదాయం
3) తలసరి ఆదాయం 4) మానవాభివృద్ధి సూచీ
57. అసంతులిత వృద్ధి అనే సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
1) హర్ష్‌మన్ 2) సైమన్ కుజునట్స్
3) కార్ల్‌మార్క్స్ 4) గున్నార్ మిర్దాల్
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?