What is the ‘orbit’ shape of the moon | చంద్రుడి ‘ఆర్బిట్’ ఆకారం ఎలా ఉంటుంది?
1. 5880X10 21 టన్నుల ద్రవ్యరాశి, నీటికన్నా 5.52 రెట్లు అధికసాంద్రత భూమి సొంతం. గురుత్వాకర్షణ శక్తి 9.8 m/s2 భూమి గురుత్వాకర్షణ శక్తితో పోల్చినప్పుడు సూర్య చంద్రులపై గురుత్వాకర్షణ శక్తి ఎంత?
1) సూర్యునిపై 28 రెట్లు అధికం, చంద్రునిపై 3 రెట్లు తక్కువ
2) సూర్యునిపై 30 రెట్లు అధికం, చంద్రునిపై 4 రెట్లు తక్కువ
3) సూర్యునిపై 28 రెట్లు అధికం, చంద్రునిపై 4 రెట్లు తక్కువ
4) సూర్యునిపై > 1/28, చంద్రునిపై <1/4
2. భూమి వృత్తం అక్షంపై గాక తనకంటూ ఒక ప్రత్యేక అక్షం సృష్టించుకుని తన చుట్టూ తాను తిరుగుతుంది. ఆ అక్షం కోణం 23.27 డిగ్రీలు కుడివైపునకు వంగి ఉంది. మరి భ్రమణం, పరిభ్రమణం ఏయే దిశల్లో కొనసాగుతుంది?
1) భ్రమణం క్లాక్‌వైజ్, పరిభ్రమణం యాంటీ క్లాక్‌వైజ్
2) భ్రమణం, పరిభ్రమణం రెండూ యాంటీక్లాక్వైజ్
3) భ్రమణం, పరిభ్రమణం రెండూ క్లాక్‌వైజ్
4) భ్రమణం యాంటీక్లాక్వైజ్, పరిభ్రమణం క్లాక్‌వైజ్
3. భూ భ్రమణానికి సంబంధించి ఒకటి సరికాదు.
1) రాత్రి, పగళ్లు 2) పోటు-పాటులు
3) సూర్యుడు వివిధ సమయాల్లో వివిధ ఎత్తులతో ఉండటం
4) పవనాలు- సముద్ర పవనాల్లో మార్పులుండవు
4. భూమధ్య రేఖ పొడవు 39,960 కి.మీ అయినప్పుడు, తనచుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పట్టినప్పుడు, భూమి భ్రమణ వేగాన్ని అంచనా వేయండి.
1) గంటకు 370 కి.మీ 2) నిమిషానికి 60 కి.మీ
3) గంటకు 630 కి.మీ 4) నిమిషానికి 1665 కి.మీ
5. జూలై 4న అపహేళి, జనవరి 3న పరిహేళి. సగటు ఎత్తు 760 మీ., సగటు ఉష్ణోగ్రత 140C. ఒక వస్తువు భూమ్యా కర్షణ శక్తిని అధిగమించి ఆకాశంలో ఎరగడానికి కావాల్సిన వేగం 8 కి.మీ/సెకన్, బాహ్య అంతరాళంలోకి శాశ్వతంగా ఎగిరిపోవడానికి రాకెట్ లాంటి వాటికి ఉండాల్సిన పలాయన వేగం 11 కి.మీ/సెం. మరి కొరియాలిస్ ప్రభావం అంటే ఏమిటి?
1) భూభ్రమణం వల్ల రాకెట్లు తమ దిశలను మార్చుకోవడం
2) తన సహజసిద్ధ మార్గాల్లో కాకుండా ప్రవాహాలు, పవనాలు తమ దిశను మార్చుకోవడం
3) అపకేంద్ర, అభికేంద్ర బలాలవల్ల రాకెట్లు అపవర్తనం చెంది ప్రయాణిస్తాయి
4) గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడేందుకు, రాకెట్ రాడార్లలో పెరల్స్ ప్రిన్సిపుల్ ను ఉపయోగించి 231/20 వంగి ప్రయాణిస్తూ నింగిలోకి ఎగరడం
6. భూమి, సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఆర్బిట్ నిలబెట్టిన బండి చక్రంలా పటంలో చూపుతారు. దాన్ని పడుకోబెట్టిన బండి చక్రంగా ఊహించుకొని ఫలితాలు రాబడితే కింది వాటిలో ఒకటి సరికాదు (పరిభ్రమణ ఫలితం కాదు).
1) పగలు, రాత్రుల్లో తేడాలు
2) ఋతువులు, అరణ్యాలు
3) ఆయనాంతాలు+విషవత్తులు
4) సూర్యునికి అటువైపు ఎండాకాలం, ఇటువైపు వానాకాలం
7. విషవత్తులు అంటే పరిభ్రమణ ప్రక్రియలో భాగంగా భూమి తిరుగుతూ సూర్యునికి అవతలి వైపు వెళ్లినప్పుడు (మార్చి), చుట్టూ తిరిగి ఇటువైపుగా వచ్చినప్పుడు (సెప్టెంబర్) సూర్యుడు భూమధ్య రేఖపై ఉంటాడు. ఇక ఆయనాంతాలు అంటే పరిభ్రమణంలో భాగంగా భూమి తిరుగుతూ సూర్యునికి కుడివైపు వచ్చినప్పుడు (డిసెంబర్) మకరరేఖపై, ఎడమవైపు వచ్చినప్పుడు (జూన్) కర్కాటకరేఖపై ఉండటాన్ని ఆయనాంతాలు అంటారు. విషవత్తుల సమయంలో జరగని ఫలితాన్ని గుర్తించండి.
1) భూమధ్యరేఖపై సూర్యుడు నిలువుగా ఉండటం 2) భూమి అక్షం నిట్టనిలువుగా మారడం
3) భూమిపై అన్ని ప్రాంతాల్లో సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడి-భూమధ్య రేఖ ప్రాంతంలో రాత్రిళ్లు-పగళ్లు సమానంగా ఉండటం
4) అటువైపు వసంతకాలం, ఇటువైపు శరత్కాలం కాకుండా వర్షాలు మొదలవుతాయి
8. ఆయనాంతాల సమయంలో, భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో, మనం నిల్చున్నప్పుడు ఎదురుగా ఉన్న సూర్యునికి కుడివైపు / డిసెంబర్ / శీతాకాల ఆయనాంతం, ఎడమవైపు/ జూన్/ వేసవి ఆయనాంతం అవుతుంది. అంటే పరిభ్రమణంలో భూమి డిసెంబర్ నెలలో కాస్త పైకి లేస్తుంది. అప్పుడు మకరరేఖ సూర్యునికి ఎదురుగా ఉండి, ఉత్తరార్ధ గోళంలో శీతాకాలం, భూమి జూన్‌లో కాస్త కిందికి దిగుతుంది. అప్పుడు సూర్యుడు కర్కాటక రేఖ అభిముఖంగా మారి ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలం పుడుతుంది. అయితే వేసవిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకునే దేశం?
1) నార్వే 2) ఆస్ట్రేలియా 3) చీలి 4) ఐస్లాండ్
9. వేసవి ఆయనాంతం జూన్ 21న ప్రారంభం. సూర్యుడు ఉత్తర బిందువు/కర్కాటకరేఖను తాకి కిందికి/దక్షిణ బిందు వు వైపు ప్రయాణం మొదలుపెడతాడు. కాబట్టి దక్షిణాయన కాలం మొదలు. ఉత్తరాన వేసవి అంటే దీర్ఘమైన పగళ్లు, హ్రస్వమైన రాత్రుళ్లు, దక్షిణాన శీతాకాలం, అంటే దీర్ఘమైన రాత్రుళ్లు, హ్రస్వమైన పగళ్లు. ఈ సమయంలో ధృవాలు ఎలా ఉంటాయి?
1) జూన్ 21న సూర్యుడు ఉత్తర ధృవంపై ఉదయిస్తాడు. దక్షిణ ధృవంపై అస్తమిస్తాడు.
2) మార్చి 21న ఉత్తర ధృవంపై సూర్యుడు ఉదయిస్తాడు. తిరిగి సెప్టెంబర్ 22/23న అస్తమిస్తాడు.
3) డిసెంబర్ 22న ఉత్తరధృవంపై ఉదయిస్తాడు. దక్షిణ ధృవంపై అస్తమిస్తాడు
4) సెప్టెంబర్ 22న ఉత్తరాన ఉదయిస్తాడు. దక్షిణాన అస్తమిస్తాడు
10. భూ భ్రమణం కన్నా, భూపరిభ్రమణ ఫలితాలు చాలా ఉన్నతమైనవి. ఈ ఫలితాలకు ప్రధాన కారణం కానిది ఏది?
1) భూ అక్షం కేంద్రకం వద్ద 231/20 వంగి ఉండుటం
2) అది భూసమతల కక్ష్యలో 661/20 కోణంలో సూర్యుని వైపు / దూరంగా ఉండటం
3) భూమధ్య రేఖ వద్ద ఉబ్బెత్తుగా ఉండి ధృవాలవైపు వెళ్లేకొద్దీ అక్షాంశాల సైజు తగ్గడం
4) ధృవాల వద్ద అక్షాంశాలు జీరో కావడం
11. గ్లోబుపై నిలువు గీతలు రేఖాంశాలు, అడ్డగీతలు అక్షాంశాలు. రేఖాంశాలు ఉత్తర, దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలు. వీటి ప్రయాణం ఉత్తర, దక్షిణాలు. కాని గ్రీనిచ్ రేఖాంశం నుంచి తూర్పువైపు లెక్కిస్తూ వస్తే, వాటిని తూర్పు రేఖాంశాలని, జీఎంటీ నుంచి పడమర వైపు లెక్కిస్తూ పోతే వాటిని పశ్చిమ రేఖాంశాలు అంటారు. తూర్పువైపు 179ం, పడమరవైపు 179ం లెక్కిస్తాం. రెండు కలుసుకునే 180ం రేఖాంశాన్ని (గ్లోబు వెనుకవైపు) అంతర్జాతీయ దినరేఖ అంటారు. రేఖాంశాల గురించి కింది వాటిలో ఏది సరికాదు.
1) భూమధ్యరేఖకు సంబంధం లేదు
2) వీటి సంఖ్య 3600
3) కాలాన్ని తెలియజేస్తాయి కాబట్టి ఇవి మెరిడియన్స్ 4) ఒకదానితో ఒకటి ఖండించుకోవు – ఉత్తర, దక్షిణ ధృవాల వద్ద జీరో అవుతాయి
12. భూమధ్య రేఖ పొడవు 39,960 కి.మీ./40వేల కి.మీ. 24 గంటలు అంటే 24X60 = 1440 ని. 40000/1440= 4 ని. అంటే ఒక రేఖాంశానికి, మరో రేఖాంశానికి మధ్య సూర్యుడు ప్రయాణించే కాలం 4 నిమిషాలు. అయితే రెండు రేఖాంశాల మధ్య దూరం?
1) 140 కి.మీ. 2) 151కి.మీ.
3) 111 కి.మీ. 4) 410 కి.మీ.
13. భూగోళాన్ని 15రేఖాంశాలకు ఒక గ్రూపు చొప్పున 24టైమ్ జోన్లుగా ప్రకటించారు. (24 X 15=3600) అత్యధిక టైమ్ జోన్లు రష్యా (11) కలిగి ఉంది. అమెరికా (6), కెనడా (5), ఆస్ట్రేలియా (3), ఆ తర్వాతి స్థానాలు ఆక్రమిస్తాయి. భారత కాలమానాన్ని నిర్ధారించే రేఖాంశాన్ని గుర్తించండి.
1) 551/20 ఉత్తర రేఖాంశం
2) 551/20 దక్షిణ రేఖాంశం
3) 821/20 తూర్పు రేఖాంశం
4) 821/20 పశ్చిమ రేఖాంశం
14. IST, GMT కన్నా 5.30 గంటలు ముందుంది. అప్పుడు యూకేలో ఉదయం 6 గంటలు అయినప్పుడు భారత్‌లో సమయం ఎంత?
1) 12:30pm 2) 11:30 am
3) 5:30pm 4) 3:30pm
15. IST వద్ద మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నప్పుడు యూకేలో సమయం ఎంత?
1) 6:30pm 2) 6:30 am
3) 8:30 am 4) ) 8:30pm
16. భారత ప్రధాని యూఎన్ఓలో ఉదయం 8 గంటలకు ప్రసంగిస్తుంటే, భారత ప్రజలు సాయంత్రం 4గంటలకు లైవ్‌లో చూస్తున్నారు. అప్పుడు భారత్- న్యూయార్క్‌ల మధ్య ఎన్ని రేఖాంశాల దూరం ఉంది?
1)110 2)120 3)130 4)140
17. అక్షాంశాలు గ్లోబుపై అడ్డంగా గీయబడ్డాయి. భూమి బంతిలాగా మధ్య ఉబ్బెత్తుగా ఉండటంతో మధ్యలో చుట్టూ గీయబడిన వృత్తం భూమధ్య రేఖ. తూర్పు – పడమరలుగా వీటి ప్రయాణం కొనసాగినప్పటికీ భూమధ్య రేఖ నుంచి పైకి /ఉత్తరం వైపు ఒకటి, రెండు లెక్కిస్తూ పోతాం. కాబట్టి అవి ఉత్తర అక్షాంశాలు. అలాగే భూమధ్య రేఖ నుంచి కిందికి/ దక్షిణం వైపు లెక్కిస్తూ పోతాం. కాబట్టి వీటిని దక్షిణ అక్షాంశాలు అంటారు. అన్ని కూడా సున్న ఆకారంలో ఉంటాయి. ఉత్తరాన 900, దక్షిణాన 900 వీటి సంఖ్య మొత్తం 1800. మరి అక్షాంశాలు ప్రధానంగా దేని కోసం గీయబడతాయి?
1)దేశాల ఉనికి గుర్తింపు కోసం
2) శీతోష్ణస్థితి అంచనా వేయడం
3) జలం- భూమి గుర్తింపు
4) ఉష్ణోగ్రత = సూర్యకిరణాలు
18. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణం చెందే క్రమంలో సూర్యకిరణాలు భూమండలం అంతా ఒకే తీరుగా ప్రసరించవు. సూర్య కిరణాల వాలును బట్టి భూమండలాన్ని కొన్ని జోన్లుగా విభజించడానికి అక్షాంశాలను ఉపయోగించుకుంటాం. సూర్య కిరణాలు నిలువుగా పడే ప్రాంతం ఆయన రేఖామండలం. సూర్య కిరణాలు ప్రసరించని ప్రాంతాన్ని ధృవ మండలంగా విభజన చేసుకున్నాం. మరి భూ మండలం అంతా సూర్యకిరణాలు సమంగా ప్రసరించక పోవడానికి కారణం?
1) భూమి కుడివైపునకు వంగి ఉండటంతో
2) పరిభ్రమణంలో కాస్త పైకి, కాస్త కిందికి వెళ్లడం
3) భూమి బంతిలాగా ఉండి మధ్యలో ఉబ్బి ఉండటం 4) పైవన్నీ
19. భూమిని,చంద్రున్ని కలిపి జంట గ్రహాలు /గ్రహాల ద్వయం/ బైనరీ ప్లానెట్ సిస్టం అంటారు. బుధుడు, శుక్రుడు ఈ రెండు గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. కాబట్టి సౌర కుటుంబంలో చంద్రుడు మొదటి ఉపగ్రహం. భూమి వ్యాసంలో, భూమి గురుత్వాకర్షణలో, మధ్యాహ్నపు సూర్యకాంతిలో చంద్రుని వెన్నెల ఈ మూడు కూడా 1/2 తక్కువ. తన చుట్టూ తాను తిరగడానికి 271/4 రోజులు. భూమి చుట్టూ తిరిగి రావడానికి కూడా 27 రోజుల 17 గంటల 43 ని.లు. రెండు దాదాపు సమానం కాబట్టి, మనం దాని మొత్తం సైజులో 59 శాతం మాత్రమే చూడగలం. భూమికి, సూర్యునికి సంబంధించి అపహేళి, పరిహేళి ఉన్నట్లు, భూమికి, చంద్రునికి మధ్య అపోజి, పెరిజి ఉంటాయి. అపోజి 4,06,000 కి.మీ. పెరిజి 1,84,000 కి.మీ. అత్యధిక ఉష్ణోగ్రత 1170C. అత్యల్పం -1630C. వేగం 3680 కి.మీ/గంటకు. అయితే, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అండ్ టీమ్ అక్కడి నుంచి తెచ్చిన మట్టి నమూనా ఆల్మాకొలైట్లో లేని ధాతువులను గుర్తించండి.
1) క్రోమియం, టిటానియం
2) ఇట్రియం, బిర్కోనియం
3) అపటైట్, ట్రియోటైట్ 4) సిలికా, మెండ్రోతిన్
20. ప్రశాంత సముద్రం అంటే?
1) పసిఫిక్ 2) చంద్రుడిపై నీటి జాడలున్న ప్రాంతం 3) చంద్రుడిపై ఎత్తయిన శిఖరం
4) మానవుడు కాలు మోపిన ప్రదేశం
21. ఎడ్విన్ అల్డ్రిన్, మైఖేల్ కొలిన్ అనేవారు ఎవరు?
1) డ్రైవర్లు 2) స్పేస్ వాకర్స్
3) ఆస్ట్రోనాట్స్ 4) కాస్మోనాట్స్
22. చంద్రుడి ఆర్బిట్ షేప్ ఎలా ఉంటుంది?
1) గుండ్రంగా 2) ఓవల్ 3) రెక్టాంగిల్ 4) డైమండ్
23. అపోలో -II చంద్రుడిపై దిగిన రోజు?
1) జూన్ 21 2) జూలై 21
3) జూన్ 19 4) జూలై 15
24. వెన్నెల అంటే?
1) గ్రహించిన కాంతి 2) వదిలేస్తున్న కాంతి
3) వెదజల్లుతున్న కాంతి 4) ప్రకాశం
25. లిబ్నిడ్జ్ అనేది ఒక?
1) గ్రహ శకలం
2) చంద్రుడిని పోలిన మరుగుజ్జు గ్రహం
3) పర్వతం 4) లోయ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?