Where is the product..how..why | వస్తూత్పత్తి ఎక్కడ..ఎలా..ఎందుకు?
ఎకానమీలో భాగంగా అసలు వస్తువులంటే ఏమిటి? ఎన్ని రకాల వస్తువులు ఉంటాయి? ఏయే వస్తువులు ఎక్కడెక్కడ ఉత్పత్తి చేయాలి? భారతదేశం మౌలిక ఆర్థిక లక్షణాలేంటి? భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎందుకు అమలు చేస్తుందో తెలుసుకుందాం.
నాలుగు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు
1. ఏం ఉత్పత్తి చేయాలి?
2. ఎలా ఉత్పత్తి చేయాలి?
3. ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి?
4. ఆర్థిక వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలేమిటి?
వీటికి పరిష్కారంగా తీసుకున్న చర్యలు మూడు. అవి..
1. సామ్రాజ్యవాద/పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
2. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
3. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
-పైన పేర్కొన్నవిధంగా ఒక్కొక్క దేశం ఒక్కో పరిష్కారమార్గాన్ని అనుసరిస్తుంది.
-భారతదేశం అన్నింటికి భిన్నంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తున్నది.
భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు
-వస్తువులను, సేవలను ఎలా ఉత్పత్తి చేయాలో, ఎవరు ఉత్పత్తి చేస్తారో, ఎవరు కొనుగోలు చేస్తారో అని చక్రీయ వస్తుసేవల ప్రవాహం ద్వారా తెలుసుకున్నాం.
-ఇప్పుడు ఆ వస్తువులను సేవలను ఏ ప్రాతిపదికన ఉత్పత్తి చేస్తారు? ఎలా ఉత్పత్తి చేస్తారు? ఎంత మొత్తంలో ఉత్పత్తి చేస్తారు? మొదలైనవన్ని ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంటాయి.
ఏ వస్తువులు ఉత్పత్తి చేయాలి?
-ఒక దేశ ప్రజల సాంఘిక, సాంస్కృతిక భేదాల్ని బట్టి వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఏయే వస్తువులు ఉత్పత్తి చేయాలో కింది అంశాల ఆధారంగా నిర్ధారణ అవుతుంది. అవి..
-ప్రజల అవసరాలు
-దేశంలో లభించే ఆర్థిక వనరులు
-సాంకేతిక పరిజ్ఞానం
-ప్రాంతీయ భేదాలు, ఆ దేశ రాజకీయ పరిస్థితులను బట్టి.
ఉదా: భారతదేశం వ్యవసాయ ప్రధానమైనది కాబట్టి వ్యవసాయ సంబంధ వస్తువులను, అలాగే జపాన్, జర్మనీ, యూఎస్ఏ మొదలైన దేశాల్లో పారిశ్రామిక సంబంధ వస్తువులను సమాచార సంబంధ, ఎలక్ట్రానిక్ సంబంధ వస్తువులను ఉత్పత్తి చేస్తారు.
ఏవిధంగా ఉత్పత్తి చేయాలి?
-ఏవిధంగా ఉత్పత్తి చేయాలనేది ఆయా దేశ సాంకేతిక పరిజ్ఞానం, ఆయా దేశ ఉద్యోగ, నిరుద్యోగ పరిస్థితులు, ఆయా దేశాల సాంఘిక పరిస్థితులను బట్టి ఉంటుంది.
ఉదా: ఎన్నో వస్తువులను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా ఉద్యోగ పరికల్పనలో ఇబ్బందులు ఎదురవుతాయని, ఇంకా మానవ వనరులను మాత్రమే వాడటం జరుగుతుంది.
-అలాగే ఎంతో అత్యున్నత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా అది ఉపయోగించే సామర్థ్యం ఉన్న టెక్నీషియన్ల కొరత, వాటిపై ఉండే అధిక ధరలు, వాటిని ఉపయోగించకుండా అడ్డుకుంటున్నాయి.
ఉదా: నేచురల్ గ్యాస్, పెట్రోలియం వెలికితీయడానికి ఇంకా విదేశీ నిపుణులపైనే మనం ఆధారపడుతున్నాం.
ఎక్కడ ఉత్పత్తి చేయాలి?
-ముఖ్యంగా ఇది వనరుల లభ్యత, ఆయా ప్రాంతాల్లో ఉండే భూగోళ వాతావరణ, మౌలిక సదుపాయాలపై ఆధారపడుతుంది.
-మొదటగా వనరులు లభించే ప్రాంతాల్లోనే పరిశ్రమలను స్థాపించడం.
-అంటే వనరుల ఆధారిత పరిశ్రమలు
-రెండోది ఉద్యోగాలు కల్పించడానికి పరిశ్రమలు స్థాపించడం. అంటే ఉద్యోగ పరికల్పన ఆధారిత పరిశ్రమలు, ఆయా ప్రాంతాల్లో ఉండే వాతావరణ, నీటి, విద్యుత్, మౌలిక సదుపాయాలైన భూమి, ఇంటర్నెట్, ముడిసరుకు మొదలైనవి లభించే ప్రాంతాల్లో స్థాపించడం.
ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి
-దీన్ని ముఖ్యంగా ఆయా దేశాల్లో నివసించే ప్రజల ఆదాయ స్థాయిని బట్టి నిర్ణయిస్తారు. అంటే ఆయా దేశాల ప్రజల ఆదాయ స్థాయిని ఆధారంగా చేసుకొని ఆయా వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి చేయాలి.
ఉదా: దేశంలో విలాసవంతమైన వస్తువుల కంటే, ప్రజల కనీస అవసరాలు తీరే ప్రాథమిక వస్తువులనే ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు.
భారతదేశ ఆర్థిక మౌలిక సూత్రాలకనుగుణంగా పై అంశాలు ఎంతవరకు దోహదపడతాయి?
ప్రపంచంలో రెండు రకాల ఆర్థిక వ్యవస్థలు ఉండేవి.
1.పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ: లాభాలే పరమావధిగా వస్తుసేవల ఉత్పత్తి ఉంటుంది. ఇందులో ప్రజా అవసరాల కంటే లాభాలే ధ్యేయంగా ఉత్పత్తి ఉంటుంది. అసమానతలు పెరుగుతాయి. ఉదా: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ మొదలైనవి.
2.సామ్యవాద ఆర్థిక వ్యవస్థ: లాభాపేక్ష లేకుండా ప్రజల సాంఘిక అవసరాలే ధ్యేయంగా ఉంటుంది. ఇందులో సంక్షేమం ప్రధానంగా, ప్రభుత్వ ఆధీనంలో పరిశ్రమలు ఉంటాయి.
పై రెండు ఆర్థిక వ్యవస్థలకు భిన్నంగా భారతదేశం స్వాతంత్య్రానంతరం మరో కొత్త ఆర్థిక వ్యవస్థ అయిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఏర్పర్చుకుంది. అంటే ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థలు రెండు కలిపి లాభాలు, ప్రజా సంక్షేమం ప్రధానంగా వస్తువుల ఉత్పత్తి ఉంటుంది.
-1947లో స్వాతంత్య్రం లభించినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ సంబంధ ప్రధానంగా ఉండేది.
-మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కాబట్టి ప్రభుత్వం, ప్రైవేటు సమపాళ్లలో ఆర్థిక వ్యవస్థను శాసిస్తాయి.
-అంటే లాభాలను పొందుతూనే సంక్షేమం అందిస్తారు.
-పరిశ్రమలను స్థాపిస్తారు. అలాగే పరిశ్రమల్లో వివిధ వెనుకబడిన వర్గాల వారికి తగు ప్రాధాన్యం ఉంటుంది.
-వస్తువులను ఉత్పిత్తి చేస్తారు. ఇక్కడ సబ్సిడీలు ఇస్తూ ఆయా వస్తువులను పేదవారు కూడా కొనేట్టు చేస్తారు.
-అంటే ప్రభుత్వం, ప్రైవేటు సమానంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని దేశ అభివృద్ధే పరమావధిగా వస్తువు, సేవల ఉత్పత్తిని కొనసాగిస్తారు.
-ఇంకా ఎవరి కోసం ఉత్పత్తి చేయాలనేది ఆయా దేశాల ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులను బట్టి ఉంటుంది.
ఉదా: దేశం దాదాపుగా 30 శాతం పేదరికంతో ఉన్నప్పుడు అంతరిక్ష పరిశోధన, అణుబాంబుల తయారీ మొదలైనవి చేయొచ్చా లేదా అనేది వివాదాంశం.
-ఇలా కోరుకున్న వస్తువులను పొందాలంటే వాటి ఉత్పత్తి జరగాలి. ఇలా వస్తువులను ఉత్పత్తి చేయడానికి, ఎంత మోతాదులో ఉత్పత్తి చేయాలో, ఎలా ఉత్పత్తి చేయాలో నిర్ణయించడమనేది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల మౌలిక భావనలకు అనుగుణంగా జరుగుతుంది.
1. ఆర్థిక వస్తువులు
-ఉచితంగా లభించని వస్తువులు అంటే ధర చెల్లించి కొనే వస్తువులు. అంటే మానవుల కోరికలను తీర్చగలిగిన కొరత స్వభావం గల వస్తువులు లేదా సేవలను ఆర్థిక వస్తువులు అంటారు.
లక్షణాలు
1. ఉచితం కాదు
2. కొరత ఉండాలి
3. మానవుని కోరికను తీర్చాలి
4. ధర చెల్లించి కొనాలి. మార్కెట్లో ఉండాలి.
ఉదా: మనం మార్కెట్లో కొనే ప్రతి వస్తువు ఆర్థిక వస్తువే.
గాలి ఆర్థిక వస్తువు కాదు. ఎందుకంటే ఇది మానవుని కోరికను తీరుస్తుంది. కానీ కొరత ఉండదు. ఎంత కావాలంటే అంత గాలిని పీల్చుకోవచ్చు.
2.ఉచిత వస్తువులు: ఏ ఖర్చు లేకుండా అధిక సంఖ్యలో లభించే వస్తువులు ఉచిత వస్తువులు.
లక్షణాలు
-ఇవి ప్రకృతి వనరులు
-వీటికి ధర చెల్లించాల్సిన అవసరం లేదు.
ఉదా: నీరు (నదుల్లో, సముద్రాల్లో కావాల్సిన దాని కంటే ఎక్కువ లభిస్తుంది, ఉచితంగా వాడుకోవచ్చు)
సార్వజనీక వస్తువులు
-మానవుని కోరికలు తీర్చడమే కాకుండా ఇంకా వీటి పరిమాణం తగ్గదు.
లక్షణాలు
-అందరు ఉపయోగించుకున్నా వీటి పరిమాణం తగ్గదు.
-కాకపోతే ఉచిత వస్తువు లాగా కాకుండా ఈ వస్తువుల ఉత్పత్తికి కొంత వ్యయాన్ని వెచ్చించాలి.
-మార్కెట్లో పబ్లిక్ వస్తువుల క్రయవిక్రయాలు జరగవు.
-వీటిని ఒక వ్యక్తి ఉపయోగించటం వల్ల వేరే వ్యక్తికి ఆటంకం ఉండదు.
ఉదా: విమాన, నౌకాదళ సైన్యాలు, దేశ రక్షణ దళాలు.
-పై వాటి వల్ల దేశంలోని ప్రతిఒక్కరు లాభం పొందుతారు. కాబట్టి ఇవి పూర్తిగా సార్వజనీక వస్తువులు
-అవధులు: ఉదాహరణకు పబ్లిక్ పార్కులు, రోడ్లు మొదలైనవి స్వచ్ఛమైన సార్వజనీక వస్తువులు కావు. ఎందుకంటే పార్కులో ఎక్కువ మంది వచ్చినప్పుడు, రోడ్డు రద్దీగా ఉన్నప్పుడు ఏ ఒక్కరు పై వస్తువులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేరు. ఎవరు పూర్తిగా లాభపడరు.
-ప్రభుత్వం రుసుము వసూలు చేసి అందించే రైల్వే, బస్సు మొదలైన సేవలు ఉచితం కాదు కాబట్టి అవి పబ్లిక్ వస్తువులు కావు.
ప్రైవేటు వస్తువులు
-మార్కెట్లో ధర చెల్లించి, క్రయవిక్రయ పద్ధతిపై పొందగలిగే ఆర్థిక వస్తువులన్నీ ప్రైవేటు వస్తువులే.
లక్షణాలు
-మార్కెట్లో లభ్యమయ్యే అన్ని వస్తువులు
-కొన్నవాడికి తప్ప ఇతరులకు లభించవు.
-అంటే పబ్లిక్, ప్రైవేటు వస్తువులన్నీ ఆర్థిక వస్తువులే.
-ఉచిత వస్తువులు ఆర్థిక వస్తువులు కావు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?