Name of the gold coin during the Chalukya period | చాళుక్యుల కాలంలో బంగారు నాణేనికి పేరు?
1. చాళుక్య వంశం దక్షిణ భారతదేశంలో సుమారు ఆరు శతాబ్దాల పాటు పాలన సాగించింది. బీజాపూర్ జిల్లా బాదామి (వాతాపి)ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారిది మాతృశాఖ. అయితే చాళుక్య వంశంలో ప్రధాన శాఖ ఏది?
1) బాదామి చాళుక్య వంశం 2) తూర్పు చాళుక్య వంశం
3) వేంగి చాళుక్య వంశం 4) ఏదీకాదు
2. గుణగవిజయాదిత్యుడు మొదటి అమోఘవర్షునికి (రాష్ట్రకూట) సామంతుడని, అతనికి కప్పం చెల్లించాడని తెలిపే శాసనం?
1) సంజన్ తామ్రపత్ర శాసనం 2) నీల్గుండ్ శాసనం
3) చీపురుపల్లి శాసనం 4) కొప్పారం శాసనం
3. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యుల్లో వేములవాడ చాళుక్యుల పరిపాలనా విషయాలను తెలుసుకోవడానికి కొన్ని శాసనాలు, గ్రంథాలు, తామ్ర శిలా శాసనాలు ప్రధాన ఆధారం. అయితే వినయాదిత్య యుద్ధమల్లుని రెండో కుమారుడైన బీరగృహుడు రాయించిన శిలాశాసనం ఏది?
1) కురువగట్టు శిలా శాసనం
2) వేములవాడ తామ్ర శాసనం
3) చెన్నూరు తామ్ర శాసనం 4) ఏదీకాదు
4. పంప మహాకవి ఆదిపురాణాన్ని క్రీ.శ. 941లో రచించాడని తెలిపే శాసనం ఏది?
1) కురువగట్టు శిలా శాసనం 2) కుర్క్యాల శాసనం
3) చెన్నూరు తామ్ర శాసనం 4) ఏదీకాదు
5. వేములవాడ చాళుక్యుల చివరి రాజుల కాలంలో సోమదేవసూరి అనే విద్వాంసుడు రచించిన యశస్థిలక చంపూ కావ్యం ముఖ్యమైన ఆధార గ్రంథం. దీన్నే యశోధర చరిత్ర అని కూడా అంటారు. ఈ గ్రంథం ఆనాటి ఏ మత సిద్ధాంతాలను గురించి వివరిస్తుంది?
1) బౌద్ధమతం 2) శైవ మతం
3) జైనమతం 4) ఏదీకాదు
6. తూర్పు చాళుక్య శక్తివర్మ కాలంలో చాళుక్య చంద్ర అనే పేరుతో జారీచేసిన కొన్ని బంగారు నాణేలు ఆరకాన్, సయామ్ల్లో కొన్నేండ్ల క్రితం కనుగొన్నారు. వీరి కాలంలో బంగారు నాణెం 88 గ్రైన్ల బరువుండేది. ఈ బంగారు నాణెం పేరేమిటి?
1) గద్య 2) మాడా 3) కాసు 4) ఏదీకాదు
7. చాళుక్యుల యుగంలో బంగారు వెండి నాణేలు చెలామణిలో ఉన్నాయి. అయితే వెండి నాణేన్ని ఏమని పిలిచేవారు?
1) గద్య 2) మాడా 3) కాసు 4) ఏదీకాదు
8. త్రిమూర్తుల్లో మొదటివాడైన బ్రహ్మదేవునికి ఆలంపూర్లో నవబ్రహ్మ ఆలయాన్ని నిర్మించారు. ఇది చాళుక్యుల వాస్తు శిల్ప కళాశైలితో ప్రత్యేకతను సంతరించుకొంది. దీన్ని నిర్మించింది ఏ చాళుక్యులు?
1) వేములవాడ చాళుక్యులు 2) బాదామి చాళుక్యులు
3) వేంగి చాళుక్యులు 4) పశ్చిమ చాళుక్యులు
9. చాళుక్యుల పూర్వీకులు విజయపురిని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని ఏలిన ఇక్షాకులకు సామంతులుగా కడప జిల్లాలోని హిరణ్య రాష్ర్టాన్ని పాలించారు. వీరి జన్మభూమి హిరణ్య రాష్ట్రం. దాంతోపాటే తెలంగాణలోనూ, మహబూబ్నగర్ జిల్లా ప్రాంతాన్ని కలిపి పాలించారు. అయితే చాళుక్య వంశానికి మూలపురుషుడు ఎవరు?
1) మొదటి పులకేశి 2) కీర్తివర్మ
3) మంగళేశుడు 4) జయసింహుడు
10. చాళుక్య వంశీయుల్లో ప్రథమంగా మహారాజు బిరుదు పొందింది మొదటి పులకేశి (క్రీ.శ. 535-566). ఇతడు రణరాగుని కుమారుడు. వాతాపిని ఆక్రమంచి అక్కడ బలిష్టమైన కోటను నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకొన్నాడు. ఇతని విజయాలను తెలియజేయడానికి అశ్వమేథ యాగాన్ని నిర్వహించాడు. ఇతని శాసనం ఒకటి ఎక్కడ లభించింది?
1) నల్లగొండ జిల్లా ఏలేశ్వరం
2) మహబూబ్నగర్ జిల్లా కురవగట్టు
3) ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు 4) లభించలేదు
11. కీర్తివర్మ పెద్ద కుమారుడు రెండో పులకేశి పసివాడైనందువల్ల అతని తమ్ముడు మంగళేశుడు సింహాసనాన్ని అధిష్టించాడు. కదంబులను ఓడించి రేవతి ద్వీపాన్ని అంటే గోవాను జయించాడు. ఇతని తదనంతరం చాళుక్య సింహాసనం తన వారసులకే దక్కాలని ప్రయత్నించడంతో కీర్తివర్మ కుమారుడైన రెండో పులకేశి, మంగళేశునికి మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. మంగళేశున్ని వధించి కీర్తివర్మ శక సంవత్సరం 581 అంటే క్రీ.శ 609లో సింహాసనాన్ని అధిష్టించాడని తెలిపే శాసనం ఏది?
1) హైదరాబాద్ శాసనం 2) కురువగట్టు శాసనం
3) పర్బణి శాసనం 4) రేపాక శాసనం
12. పశ్చిమ చాళుక్య వంశ రాజుల్లో రెండో పులకేశి అగ్రగణ్యుడు. రెండో పులకేశి రాకతో దక్షిణ భారతదేశ చరిత్రలో చాళుక్య యుగం ప్రారంభమైంది. కదంబ, గాంగ, అలూప, మౌర్య, లాట, మాలవ, ఘార్జర రాజులను జయించాడు. కర్ణాటక, మహారాష్ట్రలు మొత్తం రెండో పులకేశి స్వాధీనమయ్యాయి. నర్మదానది తీరంలో ఉత్తరాధిపతి హర్షవర్ధనునిపై క్రీ.శ. 632లో యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో తన సైన్యాలను అతిశక్తిమంతంగా రూపొందించి స్వయంగా హర్షుడిని ఓడించినట్లు తెలిపే శాసనం ఏది?
1) కురువగట్టు శాసనం 2) రేపాక శాసనం
3)పర్బణి శాసనం 4) అయ్యవోలు శాసనం
13. విజయాదిత్యుని తర్వాత అతని కుమారుడైన రెండో విక్రమాదిత్యుడు అధికార పగ్గాలు చేపట్టాడు. పల్లవ మల్ల అనే బిరుదును ధరించిన నందివర్మ ఇతనికి సమకాలికుడు. వీరి మధ్య జరిగిన అనేక యుద్ధాల్లో బాదామీలు పల్లవులను ఓడించారు. కాలచూర్య వంశానికి చెందిన లోకమహాదేవి, రాణి త్రైలోక్యదేవిలు ఇతని భార్యలు. వీరి పేరుమీద నిర్మించిన ఆలయాలు ఏవి?
1) ఆలంపూర్లో నవబ్రహ్మ ఆలయం
2) పట్టడకల్లో లోకేశ్వరాలయం, త్రైలోకేశ్వరాలయం
3) వేములవాడ రాజరాజేశ్వర ఆలయం 4) ఏదీకాదు
14. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని విప్పర్ల గ్రామంలో తెలుగు భాషలో శాసనం ఉంది. ఇది తూర్పు చాళుక్యుల నాటి మొదటి తెలుగు శాసనం. దీనివల్ల చాళుక్యుల రాజ్యంలో తెలుగు భాష ప్రాచుర్యంలో ఉందని తెలుస్తుంది. ఇది వేయించిన రాజు ఎవరు?
1) మొదటి జయసింహుడు 2) ఇంద్రభట్టారకుడు
3) రెండో పులకేశి 4) రెండో విష్ణువర్ధనుడు
జవాబులు
1-1, 2-2, 3-1, 4-2, 5-3, 6-1, 7-2, 8-4,
9-4, 10-1, 11-1,12-4, 13-2, 14-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?