Silk City of Telangana | తెలంగాణ సిల్క్ సిటీగా పేరుగాంచింది?
1. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏ ప్రాంతానికి చెందుతుంది?
1) శుష్క ప్రాంతం
2) ఉపశుష్క ప్రాంతం
3) ధ్రువ ప్రాంతం
4) అతి ధ్రువ ప్రాంతం
2. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం దక్షిణ దిశ నుంచి ఏ దిశకు వెళ్లేకొద్ది పెరుగుతుంది?
1) ఉత్తరం 2) తూర్పు
3) పశ్చిమం 4) ఏదీకాదు
3. రాష్ట్రంలో ఏ జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది?
1) హైదరాబాద్ 2) వికారాబాద్
3) వనపర్తి 4) ఆదిలాబాద్
4. దక్కన్ పీఠభూమిలో ఎత్తయిన ప్రాంతం సోలమైల్ ఏ జిల్లాలో ఉంది?
1) జయశంకర్ భూపాలపల్లి
2) వరంగల్ (అర్బన్ )
3) జనగామ
4) సూర్యాపేట
5. కింది వాటిలో సరైనది ఏది?
1) ఆదిలాబాద్ – నిర్మల్ గుట్టలు
2) నాగర్ కర్నూల్ – అమ్రాబాద్ గుట్టలు
3) వికారాబాద్ – అనంతగిరి గుట్టలు
4) పైవన్నీ
6. గోండ్వానా శిలల్లో ప్రధానమైన ఖనిజం ఏది?
1) మాంగనీస్ 2) నేలబొగ్గు
3) రాగి 4) బైరటీస్
7. తెలంగాణలో ఎక్కువ భాగం ఏ మృత్తికలు విస్తరించి ఉన్నాయి?
1) ఎర మృత్తికలు
2) నల్లరేగడి మృత్తికలు
3) ఒండ్రు మృత్తికలు
4) లాటరైట్ మృత్తికలు
8. లాటరైట్ మృత్తికల నిర్మాణం ఏ ప్రక్రియ వల్ల జరుగుతుంది?
1) ఎక్కువ లోతులో శైథిల్య ప్రక్రియ
2) నదుల వల్ల కొట్టుకొచ్చి మేటవేసిన మన్ను ప్రక్రియ
3) ధూళిరూపంలో గాలిద్వారా కొట్టుకొచ్చి మేటవేసిన మన్ను ప్రక్రియ
4) పైవన్నీ
9. నల్ల మృత్తికలను ఏ విధంగా వర్గీకరించవచ్చు?
1) లోతైన నల్లని మృత్తికలు
2) మధ్యస్థ నల్లని మృత్తికలు
3) వర్గీకరించని నల్లని మృత్తికలు
4) పైవన్నీ
10. ‘తనను తాను దున్నుకునే నేలలు’ అని ఏ మృత్తికలను అంటారు?
1) నల్లరేగడి మృత్తికలు
2) ఎర మృత్తికలు
3) ఒండ్రు మృత్తికలు
4) లాటరైట్ మృత్తికలు
11. రాళ్లు రప్పలతో కూడి సేంద్రియ పదార్థ అవశేషాలకు మూలమైన భూ ఉపరితల భాగాన్ని ఏమంటారు?
1) మృత్తికలు 2) బీడు భూములు
3) మైదానాలు 4) పంపాలు
12. అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏ సంవత్సరంలో వన్యమృగ సంరక్షణ కేంద్రంగా గుర్తించారు?
1) 1965 2) 1972
3) 1978 4) 1982
13. కింది వాటిలో మంచిర్యాల జిల్లాలో గల ఉభయారణ్యం ఏది?
1) కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం
2) శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం
3) ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం
4) పైవన్నీ
14. రాష్ట్రంలో అతిపురాతనమైన అభయా రణ్యం ఏది?
1) మంజీరా అభయారణ్యం
2) కిన్నెరసాని అభయారణ్యం
3) కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం
4) ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
15. మొసళ్లకు ప్రాముఖ్యత సంతరించుకున్న అభయారణ్యం?
1) కిన్నెరసాని 2) పాకాల
3) మంజీరా 4) ఏటూరు నాగారం
16. మహారాష్ట్రలో ‘మంజ్రా’ అని ఏ నదిని పిలుస్తారు?
1) మంజీరా 2) ఇంద్రావతి
3) ప్రాణహిత 4) కిన్నెరసాని
17. ప్రాణహిత నది సరస్వతి నదితో కలిసి ఎక్కడ త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది?
1) పోచంపాడు 2) కందుకుర్తి
3) బోధన్ 4) కాళేశ్వరం
18. కడెం నది ఏ జిల్లాలోని బోథ్ మండలం నుంచి మొదలవుతుంది?
1) ఆదిలాబాద్ 2) యాదాద్రి
3) కరీంనగర్ 4) సిద్దిపేట
19. గోదావరి నది రాష్ట్రంలో సుమారు ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది?
1) 450 2) 560
3) 600 4) 700
20. కింది వాటిలో కాకతీయులు నిర్మించిన చెరువులు ఏవి?
1) పాకాల
2) లక్నవరం
3) రామప్ప, గణపురం
4) పైవన్నీ
21. బైరటీస్ తెలంగాణలోని ఏ జిల్లాలో ఎక్కువగా లభ్యమవుతుంది?
1) మహబూబ్ నగర్
2) పెద్దపల్లి 3) జోగులాంబ
4) రంగారెడ్డి
22. కింది వాటిలో అతి తక్కువ శ్రేణికి చెందిన బొగ్గు ఏది?
1) ఆంథ్రసైట్ 2) బిట్యుమినస్
3) సెమీ బిట్యుమినస్
4) లిగ్నైట్
23. ఇనుప ఖనిజాన్ని కరిగించడానికి తక్కువగా ఏ బొగ్గును వినియోగిస్తారు?
1) టాన్ బ్రౌన్
2) సెమీ బిట్యుమినస్ బొగ్గు
3) ఆంథ్రసైట్
4) లిగ్నైట్
24. కరీంనగర్ జిల్లాలో ఏ రకం గ్రానైట్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి?
1) టాన్ బ్రౌన్
2) మాపెల్ రెడ్
3) కాఫీబ్రౌన్
4) పైవన్నీ
25. రాష్ట్రంలో బంగారు గనులు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) మంచిర్యాల
2) సిద్దిపేట
3) జయశంకర్ భూపాలపల్లి
4) కుమ్రం భీం
26. మధ్య అక్షాంశం వద్ద ఎక్కువగా ఏ అడవులు ఉంటాయి?
1) శీతోష్ణ అడవులు
2) ఉప శీతోష్ణ అడవులు
3) సమ శీతోష్ణ అడవులు
4) ఉష్ణ మండల అడవులు
27. దక్కన్ పీఠభూమిలో ఎక్కువగా ఏ అడవులు ఉన్నాయి?
1) ఆకురాల్చే అడవులు
2) మడ అడవులు
3) ఉష్ణమండల ముళ్లజాతి
అడవులు
4) ఆల్పైన్ అడవులు
28. కృష్ణానది సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది?
1) 945 మీటర్లు
2) 1337 మీటర్లు
3) 1441 మీటర్లు
4) 1526 మీటర్లు
29. రాష్ట్రంలో 2015, జూన్ 12న సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో ప్రారంభించిన నూతన పారిశ్రామిక విధానం ఏది?
1) టీఎస్-ఐపాస్ 2) టీ-ప్రైడ్
3) టీ-హబ్ 4) టీ-ఐజీవో
30. తెలంగాణ సిల్క్‌సిటీ అని ఏ ప్రాంతాన్ని అంటారు?
1) నిర్మల్ 2) పోచంపల్లి
3) సిరిసిల్ల 4) జనగామ
Answers
1-2, 2-1, 3-4, 4-3, 5-4, 6-2, 7-1, 8-1, 9-4, 10-1, 11-1, 12-3, 13-4, 14-4, 15-3, 16-1, 17-4, 18-1, 19-3, 20-4, 21-1, 22-4, 23-2, 24-4, 25-3, 26-3, 27-1, 28-2, 29-1, 30-2
నాగార్జునసాగర్ ముఖ్యాంశాలు
– అధికార నామం- నాగార్జునసాగర్ ఆనకట్ట
– ప్రదేశం- నల్లగొండ జిల్లా (తెలంగాణ), గుంటూరు (ఏపీ)
– నిర్మాణం ప్రారంభం- డిసెంబర్ 10, 1955
-నిర్మాణం పూర్తి- 1969
-నిర్మాణ వ్యయం- రూ.1300 కోట్లు
-ఎత్తు- 124 మీటర్లు (407 అడుగులు)
-పొడవు- 1,550 మీటర్లు, మొత్తం 26 క్రస్ట్‌గేట్లు
-రిజర్వాయర్ పేరు- నాగార్జునసాగర్
– మొత్తం సామర్థ్యం- 590 అడుగులు
– గరిష్ట సామర్థ్యం- 594 అడుగులు
– కనీస నిల్వ సామర్థ్యం- 510 అడుగులు (డెడ్ స్టోరేజీ)
-పరీవాహక ప్రాంత వైశాల్యం -2,14,185 (83,083 చ.కిమీ)
– విద్యుత్ కేంద్రం కమిషన్ తేదీ-1978-1985
– వ్యవస్థాపనా సామర్థ్యం- 816 MW
-ప్రస్తుత సామర్థ్యం- 960 MW
-1955లో నాటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన
– 1956 ఫిబ్రవరిలో ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభం
– 1967 ఆగస్ట్ 4న ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ
– అదే రోజున కుడి, ఎడమ (జవహర్ , లాల్ బదూర్ శాస్త్రి) కాలువలకు నీరు విడుదల
– 1969లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి
– 1974లో క్రస్ట్‌గేట్ల నిర్మాణం
– ప్రాజెక్టు తొలి చీఫ్ ఇంజినీర్ – మీర్ జాఫర్ అలీ
-పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ నిధులతో నిర్మించిన దీని రాతి ఆనకట్ట ప్రపంచంలో కెల్లా పొడవైనది. అతి ఎత్తయినది.
– కుడికాలువ (జవహర్ కాలువ) ప్రపంచంలోని సేద్యపు నీటి కాలువల్లో కెల్లా పొడవైనది. (203 కిలోమీటర్లు)
– ప్రాజెక్టు అంచనాల వ్యయం రూ.91.92 కోట్లు. 2005 నవంబర్ నాటికి ఖర్చు చేసిన మొత్తం రూ.1300కోట్లు
– ప్రపంచంలోని మానవ నిర్మిత సరోవరాల్లో మూడవ అతిపెద్దది.
– దేశంలో మొదటిసారిగా రివర్సబుల్ టర్బైన్ లను వినియోగించిన జలవిద్యుత్ కేంద్రం
,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?