Commodity price in the market | మార్కెట్లో వస్తువు ధరకు సబ్సిడీలు కలిపితే?
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/04/GDP-660-620x400-1.jpg)
1. ఒక దేశంలో ఏడాది కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల విలువల మొత్తాన్ని జాతీయాదాయం అంటారు. అయితే ఈ జాతీయాదాయం గణనలో మధ్యంతర వస్తువులు, ముడి పదార్థాలను కలుపకుండా దేనిని పరిగణలోకి తీసుకోవాలి?
1) మాధ్యమిక వస్తువులు 2) ప్రాథమిక వస్తువులు
3) పూర్తిగా తయారైన వస్తువులు/అంత్యవస్తువులు
4) వస్తుసేవల విలువను
1) జాతీయ ఆదాయ అంచనాల కమిటీ
2) కేంద్రగణాంక సంస్థ 3) మార్షల్ 4) పిగూ
3. రూ. 10 పండు, రూ. 5ల చక్కెర కలిపి పండ్లరసం చేసి దానిని రూ. 30కి అమ్మినప్పుడు ఆ రూ. 15లను మాత్రమే ఆదాయంగా పరిగణించడాన్ని ఏమంటారు?
1) వాస్తవ ఆదాయం
2) మార్కెట్ ధరలు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం
3) మిశ్రమ ఆదాయం 4) జాతీయాదాయం
4. ఒక దేశ ఆర్థికవ్యవస్థ వనరులను పూర్తిగా ఉపయోగించి గరిష్టంగా చేయగల వస్తు ఉత్పత్తికి, ఉత్పత్తి చేస్తున్న వస్తుసేవలకు మధ్య తేడా?
1) సబ్సిడీలు 2) జీడీపీ అంతరం
3) పరోక్ష పన్నులు 4) ప్రత్యక్ష పన్నులు
5. కింది వాటిని సరిగా జతపర్చండి.
ఎ. స్థిర మూలధన వినియోగం 1. స్థూల ఉత్పత్తి
బి. స్థూల ఉత్పత్తి-నికర ఉత్పత్తి 2. నికర ఉత్పత్తి
సి. స్థూల ఉత్పత్తి-తరుగుదల 3. తరుగుదల
డి. నికర ఉత్పత్తి+ తరుగుదల 4. తరుగుదల
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-1, బి-3, సి-4, డి-2
6. భారతదేశ ఉత్పత్తి కారకాలను విదేశాల్లో ఉపయోగిస్తే వచ్చే ఆదాయం నుంచి, విదేశీ ఉత్పత్తికారకాలు భారతదేశంలో వినియోగిస్తే చెల్లించాల్సిన వ్యయం తీసేస్తే వచ్చేది?
1) నికర విదేశీ ఆదాయం 2) విదేశాలకు చెల్లించే కారక వ్యయం
3) కారక ఆదాయం 4) నికర విదేశీ కారక ఆదాయం
7. జపాన్కు చెందిన హోండా కంపెనీ కార్లను ఉత్పత్తి చేసే విలువ జపాన్కు చెందాలి. మన దేశానికి చెందిన టాటా కంపెనీ సింగపూర్లో నానో కార్లను ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తి విలువ భారతీయులచే చేయబడింది. అందువల్ల అధి భారతదేశానికి చెందాలి. నానో కార్ల ఉత్పత్తి విలువనే చేర్చి, హోండా కార్ల ఉత్పత్తి విలువను తీసివేస్తే వచ్చేది?
1) నికర ఉత్పత్తి 2) జాతీయోత్పత్తి
3) స్థూల జాతీయ ఉత్పత్తి 4) స్థూ దేశీయోత్పత్తి
8. నికర విదేశీ కారక ఆదాయం (Net Factor Income from Abroad-NFIA)కి సంబంధించి కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ. జాతీయ ఉత్పత్తి= దేశీయ ఉత్పత్తి+NFIA
బి. దేశీయ ఉత్పత్తి= జాతీయ ఉత్పత్తి – NFIA
సి. NFIA= జాతీయ ఉత్పత్తి-దేశీయ ఉత్పత్తి
డి. NFIA= R – P (Received Income-Payment Income)
1) ఎ, బి 2) బి, సి, డి 3) ఎ, డి 4) పైవన్నీ
9. దేశీయ, జాతీయ ఉత్పత్తులు, NFIAకి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ. NFIA విలువ ధనాత్మకమైతే (R>P), జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది
బి. NFIA విలువ రుణాత్మకమైతే (R<p), దేశీయోత్పత్తి=”” ఎక్కువగా=”” ఉంటుంది<br=””> సి. NFIA విలువ శూన్యమైతే (R=P) దేశీయ, జాతీయ ఉత్పత్తులు సమానంగా ఉంటాయి
డి. దేశీయోత్పత్తి నుంచి Received Incomeను తీసివేస్తే NFIA వస్తుంది
1) ఎ, డి 2) బి, సి 3) ఎ, బి, సి 4) పైవన్నీ
10. మార్కెట్లో వస్తువు ధరకు సబ్సిడీలు కలిపితే?
1) ఉత్పత్తి వ్యయం వస్తుంది
2) ఆదాయం ఎక్కువగా వస్తుంది
3) మార్కెట్ ధరల్లో ఆదాయం వస్తుంది
4) ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం వస్తుంది
11. కింది వాటిని జతపర్చండి.
ఎ. మార్కెట్ ధరల్లో ఆదాయం 1. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం + నికర పరోక్ష పన్నులు
బి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం 2. మార్కెట్ ధరల్లో ఆదాయం – నికర పరోక్ష పన్నులు
సి. మార్కెట్ ధరల్లో ఆదాయం 3. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం + పరోక్ష పన్నులు-సబ్సిడీలు
డి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం 4. మార్కెట్ ధరల్లో ఆదాయం-పరోక్ష పన్నులు+సబ్సిడీలు
1) ఎ- 4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-1, బి-3, సి-2, డి-4
12. ప్రస్తుత ఏడాది ధరల్లో ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని ప్రస్తుత ధరల్లో ఆదాయం లేదా నామమాత్రపు లేదా ద్రవ్య ఆదాయం అంటారు. స్థిరధరల్లో జాతీయాదాయం లెక్కిస్తే దాన్ని వాస్తవ ఆదాయం అంటారు. ఒక ఏడాదిని ఆధారంగా (Base Year) తీసుకుని, ఆ ఏడాది ధరల్లో ఆదాయాన్ని లెక్కిస్తే స్థిర ధరల్లో ఆదాయం అంటారు. కింది ఆధార సంవత్సరాల్లో తప్పుగా ఉన్నదేది?
1) 1948-49, 1960-61 2) 1970-71, 1980-81
3) 1990-91, 2000-01 4) 2004-05, 2011-12</p),>
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?