The list of goals is the guide | లక్ష్యాల జాబితానే మార్గనిర్దేశి..
ఊహల్లో ఏర్పర్చుకున్న ఇంద్రియానుభూతులు మీ మైండ్ పవర్‌ని ద్విగుణీకృతం చేస్తాయి. మీ అంతరంగానికి మీరు ప్రత్యక్షంగా అందించే అఫర్మేషన్లా ఇవి ఉపయోగపడతాయి. అందుచేత మీ ఇంద్రియానుభూతులను అన్నింటిని వర్తమాన కాలంలోనే రాసుకోవాలి. ఒక ఉహను వాస్తవంగా అనుభూతి చెందటం అంటే ఇదే! లక్ష్యాల జాబితాను రూపొందించుకోవడం, వాటికనుగుణంగా ప్రణాళికల జాబితాను తయారుచేసుకోవటం మీ మైండ్ పవర్ నోట్‌బుక్‌లో మీరు చేయాల్సిన పేపర్ వర్క్. ఇది ఎలా చేయాలో మీకు తొలుత అవగాహన లేకపోవచ్చు. అందుకే మీకు ఒక నమూనా స్టేట్మెంట్లను, జాబితాను ఈ వారం అందిస్తున్నాం. ఉదాహరణగా మీరు చైతన్య అనే వ్యక్తి రాసుకున్న లక్ష్యాల స్టేట్మెంట్లను తీసుకోండి.
లక్ష్యాల స్టేట్మెంట్
-దీర్ఘకాలికం (ఐదేండ్లు) : నేను Wake Forest School of Law స్కూల్లో పేరు నమోదు చేసుకున్నాను.
-మధ్యస్థ స్థాయి (ఏడాది) : యూఎన్సీలో చదువుకుంటున్న నాకు, టెన్నిస్ చాంపియన్ స్కాలర్షిప్ అందింది.
-స్వల్పకాలిక (2 నెలలు) : ప్రాంతీయ టోర్నమెంట్ గెలుపు
-(4 నెలల్లో) : రాష్ట్రస్థాయి పోటీలో నా స్కోరు 1150
రోజువారీ చర్యలు
-స్కూల్‌కు వెళ్లేముందు ప్రతిరోజు 1 గంటసేపు టెన్నిస్ ఆడతాను (ఉదయం 6.30-7.30)
-రోజు రెండు గంటలపాటు లైబ్రరీలో దీక్షగా చదువుతాను.
-రోజు 20 నిమిషాల పాటు బరువులు ఎత్తే వ్యాయామం చేస్తాను. 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కుతాను. మూడు గంటలపాటు స్టడీ చేస్తాను.
ఇంద్రియానుభూతులు
తన అంతరంగాన్ని మేల్కొలిపే నేపథ్యంలో చైతన్య అనే విద్యార్థి తన ఇంద్రియాలకు సంబంధించిన పలు రకాల అనుభూతులను ఊహించుకొని తన మానసికానుభవంలో పొందుపర్చుకున్నాడు. ఇవి విజువల్, ఆడిటరీ, కైనస్థటిక్ వర్గాలకు చెందినవి. సాధారణంగా ఈ వర్గాలకు చెందిన సమాచారాలనే మన మైండ్ గ్రహించి ఒక మానసికానుభవంగా మలుచుకుంటుంది. చైతన్య రాసుకున్న అనుభూతులు కింది విధంగా ఉన్నాయి.
దృశ్యపరమైనవి (విజువల్)
అదొక ఆహ్లాదకరమైన వాతావరణం. నేను యూనివర్సిటీ క్యాంపస్‌లో లా విద్యార్థులతో కలిసి నడుస్తున్నాను. పైనుంచి పడుతున్న ఎండ, కాంతి మరీ తీవ్రంగా కాకుండా, స్వల్పంగానూ కాకుండా ఎంతో అందంగా పడుతూ ఉన్నది. ఆ ప్రకృతి కాంతిలో చుట్టూ ఉన్న చెట్లు, వాటి పూలు ఎంతో రమణీయంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశం ఏ మబ్బులు లేకుండా నీలంగా చక్కగా కనిపిస్తుంది.
స్పర్శకు సంబంధించినది (కైనస్థటిక్)
చర్చ ముగిసిన తర్వాత యూనివర్సిటీ వారందించిన సమగ్రమైన మెటీరియల్‌ని మేం కలెక్ట్ చేసుకున్నాం. నా చేతిలో బరువైన ఆ మెటీరియల్ ఫైల్ ఉంది. సంవత్సరాల తరబడి ఎందరో న్యాయమూర్తులు తమ మేధాసంపత్తిని ఉపయోగించి తయారుచేసిన స్టేట్మెంట్ కాగితాలు ఆ ఫైల్లో ఉన్నాయి. దీన్ని పట్టుకుంటూ ఉంటే ప్రపంచంలోని విజ్ఞానం అంతా నా చేతిలోనే ఉందనిపిస్తుంది.
ఉద్వేగాలు (ఎమోషన్స్)
దేశంలోనే పేరొందిన ఈ యూనివర్సిటీలో నాకు సీటు దొరికినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నేనుఎప్పటి నుంచో కోరుకుంటున్న న్యాయశాస్త్రంలో విద్యార్థి అయినందుకు గర్వంగా కూడా అనిపిస్తుంది. మరికొద్ది కాలంలోనే నేను న్యాయశాస్ర్తాన్ని పూర్తిగా అభ్యసించి, నాకు మరింత ఇష్టమైన క్రిమినల్ లా ప్రాక్టీసును ప్రారంభించబోతున్నాననే అనుభూతి ఎంతో థ్రిల్‌ను కల్గిస్త్తుంది. ప్రాక్టీస్ పూర్తయిన కొద్ది కాలానికే నేను రాష్ట్రంలో ఒక గొప్ప క్రిమినల్ లాయర్ కాబోతున్నానే ఫీలింగ్ నాకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ విధంగా మీరు మీ లక్ష్యాలను రాసుకోవడంతో పాటు రోజువారీ చేయదలుచుకున్న పనుల జాబితాను కూడా తయారుచేసుకోవాలి. ఈ లక్ష్య సాధనా కార్యక్రమంలో మీరు గడపబోయే ప్రతి భవిష్యత్తు అనుభవాన్ని ముందుగా ఊహించుకొని మీ మనోభావాల్లో నింపుకోవాలి. మీరు ఏ శాఖలో ఒక స్థానాన్ని సంపాదించాలని కోరుకుంటున్నారో, దాన్ని పొందుతూ ఉన్నట్లుగా నిత్యం మీ ఊహలను కొనసాగించాలి. మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించాలంటే మీ అంతరంగాన్ని అందుకు సంసిద్ధం చేయాలంటే ఈ ఎక్సర్సైజు మీరు ప్రతిరోజూ చేయాలి. దీనికి మీరు ప్రతిరోజు కనీసం 20 నిమిషాల పాటు సమయాన్ని ఖర్చుపెట్టాలి. ఇక్కడ మీకు ఇచ్చిన చైతన్య ఉదాహరణనే మోడల్‌గా తీసుకొని నా లక్ష్య సాధన అనే హెడ్డింగ్ పెట్టి, మీ లక్ష్యాలను రాసుకోండి. ఒక్కొక్క లక్ష్యానికి సంబంధించిన దీర్ఘకాలిక, మధ్యస్థ, స్వల్పకాలిక లక్ష్యాలను విభజించుకోండి. రోజువారీ చేయాల్సిన పనులను ఫిక్స్ చేసుకోండి. ఊహాత్మకతను జోడించిన ఇంద్రియానుభూతులను తయారుచేసుకోండి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?