దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయం
దేశానికి దశ, దిశ చూపే కార్యసాధకుడు కేసీఆర్
రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్
ఏ వర్గానికి ఏం కావాలో ఉద్యమనేతగా, పాలకుడిగా కేసీఆర్‌కు తెలుసు. తెలంగాణ రాక ముందు గోసపడ్డ సబ్బండ వర్గాలకు స్వరాష్ట్రంలో మునుపెన్నడూలేని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారు. ఉద్యమం తొలినాళ్ల నుంచి కేసీఆర్ సార్‌తోనే ఉన్నాను. నా భుజం తట్టి మరీ తెలంగాణ కోసం ఎట్ల పోరాడాలో నడిపించిన గురువు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, జైలుకి వెళ్లినా నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు నడిపించారు. 14ఏండ్ల పాటు నిర్విరామంగా సాగిన ఉద్యమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా కేసీఆర్ చేయి వదల్లేదు. కేసీఆర్ లాంటి నాయకుడు ఒక తెలంగాణకే కాదు.. యావత్ దేశానికి నాయకత్వం వహించాలి. దేశంలోని ప్రతి పౌరుడికి సమన్యాయం దక్కాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిందే. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి.. నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీ సర్కారుకు గట్టి బుద్ధి చెప్పి దేశానికి కొత్త వెలుగు తీసుకురాగల సమర్థుడు కేసీఆరే. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించే సత్తా సీఎం కేసీఆర్‌కు ఉంది. అందుకే కేసీఆర్ వంటి బలమైన నాయకుడు జాతీయ రాజకీయాల్లో ఉండాలి. దేశంలో దళితులను చిన్నచూపు చూస్తున్న తరుణంలో దళితబంధు వంటి పథకం అన్ని రాష్ట్రాల్లో అమలైతే అంబేద్కర్ ఆశయాలు సాధించిన వారమవుతాం.
దేశం బాగుపడాలనేదే తపన
దేశం బాగుండాలని సీఎం కేసీఆర్ తపిస్తున్నారు. రాష్ర్టాన్ని సాధించి, తెలంగాణను ఎనిమిదేండ్లలోనే ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం దేశంలోనూ జరగాల్సిన అవసరం ఉంది. మా నాయకుడితో దేశ భవిష్యత్ మారిపోతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అధికార ధ్యాస తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. ఇవాళ కేసీఆర్ నేనున్నాను అని బయల్దేరిండు. దేశ ప్రజల మద్దతు టీఆర్ఎస్కు తప్పకుండా ఉంటుంది.
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఢిల్లీ కోటపై బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న తరుణంలో దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరం. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది. ఎనిమిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి భారతదేశానికే రోల్ మోడల్‌గా కనిపిస్తుంది. తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమం ద్వారా దేశ భవిష్యత్ బాగుటుందని ప్రజలంతా నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. కచ్చితంగా రానున్న రోజుల్లో ఢిల్లీ కోటపై బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయం.
– మాగంటి గోపినాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
సరైన సమయంలో సరైన నిర్ణయం
దేశాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తుడిచి పెట్టుకుపోతున్న క్రమంలో దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం అవసరం. దేశ ప్రజల అకాంక్ష మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీగా మార్చి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్(టీఆర్ఎస్)పార్టీని దేశంలోని వివిధ రాష్ర్టాలలో చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు.దేశంలో బీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టిస్తుంది.
– చామకూర మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి
పేదల కష్టాలు తీర్చేందుకే…
సరైన ఆలోచనలు, దూరదృష్టి ఉన్న సీఎం కేసీఆర్‌లాంటి వారే దేశాన్ని నడిపించే నాయకుడిగా ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. తెలంగాణ దేశానికే అన్నంపెట్టే స్థాయికి చేరిందంటే దానికి కారణం కేసీఆర్ మాత్రమేనని ప్రతి ఒక్కరికి తెలుసు. దేశంలో అరాచకం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో దూరదృష్టి కలిగిన కేసీఆర్ దేశాన్ని నడిపించేందుకు బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. పేదలు ఎక్కడ ఉన్నా వారి కష్టాలు తీర్చాలన్న లక్ష్యంతో కేసీఆర్ కొత్తపార్టీని ఏర్పాటు చేశారు. రానున్న ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ సంచలనం సృష్టించడం ఖాయం.
– గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ మేయర్
సామాన్యుల సంక్షేమ నాయకుడు
తెలంగాణ రాష్ట్రంలో సామాన్యుల సంక్షేమ నాయకుడిగా సీఎం కేసీఆర్ నిలిచారు. రైతులు, కార్మికులతో పాటు అనేక వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. ఇదిచాలు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడానికి. ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం.
– జి.తిరుపతయ్య, (ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్)
విజన్ ఉన్న లీడర్
దేశమంతా తెలంగాణ వైపు చూసేలా పరిపాలన చేయడంలో సీఎం కేసీఆర్ విజయం సాధించారు. ఇదే అభివృద్ధి దేశ వ్యాప్తంగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉన్నట్లుగానే, యావత్ భారత దేశంపై కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉంది. అలాంటి రాజకీయ నాయకుడు దేశానికి అవసరం.
– సందీప్ కుమార్ మక్తాల, టీటా గ్లోబల్ అధ్యక్షులు.
కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం
ప్రత్యేక రాష్ట్రం సాధించి ఇక్కడి సహజ వనరులను, మానవ వనరులను సరైన విధంగా వినియోగించడంలో కేసీఆర్ సఫలీకృతమయ్యారు. అలాంటి విధానాన్నే దేశ వ్యాప్తంగా అమలు కావాలి. అందుకోసం కేసీఆర్ నాయకత్వం ఈ దేశానికి అవసరం. జాతీయ పార్టీ ఏర్పాటు ద్వారా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవకాశం కలుగుతుంది. పార్టీ ఏర్పాట్లు అందరూ స్వాగతిస్తున్నారు.
– వెంకట రమణ, ఐటీ ఉద్యోగి
దేశమంతా కేసీఆర్ పాలన విస్తరించాలి
దేశంలో దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్, బీజేపీలు స్వార్థ పూరిత రాజకీయాలతో పరిపాలించాయి. అలాంటి పార్టీలను పూర్తిగా పక్కన పెట్టి కొత్త రాజకీయ పార్టీ దేశానికి అవసరం. దాన్ని ఏర్పాటు చేసి, ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని నాలాంటి ఐటీ ఉద్యోగులు కోరుకుంటున్నారు. అందుకు రాష్ర్టాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆరే సమర్థుడు. సమగ్ర అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే ఎజెండాగా పాలన కొనసాగిస్తున్నారు. ఇది దేశమంతా విస్తరించాలని కోరుకుంటున్నాను.
– శ్రీకాంత్ గూడెపు, ఐటీ ఉద్యోగి
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నయం
సీఎం కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టకొచ్చిన బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి)పార్టీ ఇప్పుడే దేశంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నయంగా ఎదుగుతుంది. భారత దేశ సర్వతోముఖాభివృద్ధికి కొత్త పార్టీ అన్ని విధాలుగా కృషి చేయడానికి ఆస్కారం ఉంది. బీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా అమలు పరుస్తున్న జాతి మెచ్చిన పథకాన్ని కూడా దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి సాధ్యం అవుతుంది. అమెజాన్, గూగుల్ వంటి అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్ తెలంగాణలోనే ఎక్కువగా ఏర్పాటు చేస్తున్న విధానాలు కూడా దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నూతన పార్టీ కృషి చేస్తుంది.
– ప్రొఫెసర్ సత్యనారాయణ, మాజీ వీసీ, ఓయూ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు