Towards victory with a definite plan | పక్కా ప్లాన్‌తో గెలుపు దిశగా..
శ్రావ్యక్కా నేను ఓ అరగంటలో వచ్చేస్తాను. వెయిట్ చెయ్యవా ప్లీజ్ .. సోఫావంక చూపిస్తూ అంది శ్రావణి.
-ఏం పర్లేదే టేక్ యువర్ ఓన్ టైం.
-తను చెప్పినట్టే అరగంటలో వచ్చేసింది శ్రావణి. శ్రావ్యక్కా వచ్చేశా! నాటకీయంగా చెప్పింది శ్రావణి.
-ఏంటమ్మాయి నన్ను రమ్మనిచెప్పి తీరా నేను వచ్చాక నన్ను కూర్చుండబెట్టి ఎక్కడికెళ్లి వస్తున్నావేమిటి?
-అక్కా అయాం రియల్లీ సారీ ఇంట్లో ఇంటర్నెట్ కాస్తా స్లో అవడంతో పక్కింటికెళ్లి పని చేసుకొని వస్తున్నా!
-ట్రెయిన్ రిజర్వేషనా ? అవునక్కా నాకు తిరుచిరాపల్లి ఎన్ఐటీలో సీట్ వచ్చింది. వచ్చే వారమే ప్రయాణం. నాకు నాన్నగారికి టికెట్స్ బుక్ చేసుకొని వస్తున్నా.
-కంగ్రాచ్యులేషన్స్ నిన్ను అభినందిద్దామనే వచ్చాను.
-చాలా థ్యాంక్స్. ఇదంతా నీవిచ్చిన ప్రేరణే అక్కా. పొగడ్తలకేం గానీ ఈ టికెట్ రిజర్వేషన్ అనే ప్రక్రియ నుంచి నీ కెరిర్‌కు సంబంధించి కొన్ని అద్భుతమైన విషయాలు నీవు నేర్చుకోవచ్చు తెలుసా ! టికెట్ రిజర్వేషన్ ద్వారా జీవిత పాఠాలా ? భలే అది ఎలాగక్కా.. సరే చెప్తాను విను. రిజర్వేషన్ చేసుకోబోయే ముందు మనం ఒక దరఖాస్తు నింపాలి. అది ఆన్లైన్ రిజర్వేషన్ అయినా సరే మామూలుగా లైన్ల్లో నుంచొని చేసుకొనే రిజర్వేషన్ అయినా సరే
-అవునక్కా.. సరే మొదట మనం నింపాల్సిన అంశం మనగమ్యం తర్వాత వరుసగా
-ప్రయాణ తేదీ
-ఎన్నుకున్న రైలు
-ఎన్నుకునే క్లాసు (క్లాస్ -1, ఏసీనా మొదలైనవి)
-కావలసిన బెర్తు
-ఎలాంటి ఆహారం తీసుకోవాలనుకొంటున్నాం.
-అక్కా.. రిజర్వేషన్ ఫారంలో ఇవన్నీ సాధారణంగా కనిపించే అంశాలే. వీటిలో ప్రత్యేకత ఏం ఉంది ?
-చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. తరచి చూడాలంతే.. అవునా అదెలా ? ఆశ్చర్యపోయింది శ్రావణి. డోంట్‌వర్రీ నేను చెప్తాగా అది ఎలాగో! ముందుగా ఒక చిన్న ప్రశ్న. మనం తిరుచిరాపల్లి వెళ్లాలని ప్లాన్ చేసుకొంటే తిరుచిరాపల్లి చేరుతామా ? వేరే ఎక్కడికో చేరుతామా ?
-ఇదేం పిచ్చి ప్రశ్న అన్నట్లు మొహంపెట్టి తిరుచిరాపల్లి చేరుతాం అని సమాధానం చెప్పింది శ్రావణి.
-వెరీగుడ్ అంటే మనం ఎన్నుకొన్న గమ్యానికి మనం ఖచ్చితంగా చేరుతాం. కాకపోతే మనం గమ్యాన్ని ఎన్నుకోవాలి. ఒక గమ్యం అనేది లేకుండా ప్రయాణం ప్రారంభిస్తే మనం ఎక్కడికి చేరుతామో మనకే తెలియదు ఏమంటావు ?
-నిజమే. అర్థవంతంగా తలూపింది శ్రావణి. చెప్పడం కొనసాగించిన శ్రావ్య పక్కనున్న తమిళనాడులోని తిరుచిరాపల్లికి చేరడానికి మనం ఎంత పకడ్బందిగా ప్రణాళిక వేసుకొని ప్రయాణం ప్రారంభిస్తున్నాం చూడు. అలాంటిది మనం జీవితాన్ని ఇంకా ఎంత ప్రణాళికాబద్ధంగా ఆలోచించుకొని కెరీర్‌ను మొదలుపెట్టాలో ఆలోచించు.
-స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే నీ జీవిత చరిత్ర అనే గ్రంథం ఎలా ఉండాలో నిర్ణయించే రచయితవి నువ్వే. దాని చివర ఎక్సలెన్స్ అనే ఆటోగ్రాఫ్‌తో ముగించవలసిన వాడివి నువ్వే.
-మరోసారి రైల్వే రిజర్వేషన్ ఫారంలోని అంశాల్ని ఒక సరికొత్త కోణంతో పరిశీలించండి.
-ఈసారి వాటిని మీ జీవిత ప్రయాణంతో సరిపోల్చుకొంటూ పరిశీలించండి.
-మొదటి అంశం: ప్రయాణ తేదీ-చేరాల్సిన గమ్యం
-ఇదే మీ గోల్ సెట్టింగ్
-ఏయే వయసులో ఏమేం సాధించాలనుకొన్నారో ఒక పక్కా ప్రణాళికతో ఒక పథక రచన చేసుకోండి.
-మీ జీవితం మీ చేతిలో ఉంది. మీ ప్లానింగ్‌పై ఆధారపడి మీరు ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు. ఇండస్ట్రియలిస్టులుగా ఎదగదలుచుకొన్నవారికి, కెరీర్లో ముందుకు పోదలుచుకొన్నవారికి ఆలీబాబా డాట్కాం అధినేత జాక్‌మా చెప్పిన మాటలు కొన్ని చూద్దాం..
-20 ఏండ్లు వచ్చే వరకు శ్రద్ధగా చుదువుకోండి. చదువుల్లోని పూర్తి సారాన్ని ఒక్క క్షణం విడవకుండా ఆస్వాదించండి.
-25 ఏండ్ల లోపల స్పష్టమయిన గమ్యం ఏర్పరచుకొని ఆ ప్రయత్నంలో తలమునకలుగా నిమగ్నమయిపోండి.
-30 ఏండ్ల వయసు వరకు ఒక మంచి బాస్‌ను ఫాలో అవండి. ఆయన నుంచి అన్ని నేర్చుకోండి. పెద్ద కంపెనీలో చేరితే ప్రాసెస్ నేర్చుకోవచ్చు. చిన్న కంపెనీలో చేరితే ఎదగాలన్న తపన, ప్లానింగ్, డ్రీమింగ్, అచీవ్మెంట్లో ఆనందం ఇవన్నీ నేర్చుకోవచ్చు.
-కాబట్టి 30 ఏండ్ల వయస్సు లోపల కంపెనీ పెద్దదా, చిన్నదా అనే ఆలోచన కన్నా బాస్ సమర్ధుడా ? కాదా ? అన్నది చూసి చేరిపోండి.
-40-50 ఏండ్ల మధ్య మీరు సొంత కంపెనీని ప్రారంభించండి. మీ శక్తి సామర్ధ్యాలను పరీక్షించుకోండి. మీరు ఎందులో దిట్ట అని గ్రహించుకోండి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?