To have a high level of memory | జ్ఞాపకశక్తి ఉన్నతస్థాయిలో ఉండాలంటే ?
-ఒకే సమయంలో విన్న లేదా, చూసిన విషయాలను మైండ్‌లో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. మనం గ్రహిస్తున్న విషయం అర్థమంతమైనదిగా ఉన్నప్పుడే అది మనకు ప్రయోజనకరమైనదా? కాదా? అనే సంగతి తెలుస్తుంది. మనం ఆ సమాచారం ఎంత ప్రయోజనకరమైనదో భావించినవారిని బట్టి అది మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. చదివే చదువుపట్ల దాని ప్రయోజకత్వంపట్ల నిజమైన అవగాహనను, ఇష్టతను పెంచుకున్నైట్లెతే చదివింది మర్చిపోవటమనేది ఎప్పటికీ ఉండదు.
-జ్ఞాపకశక్తి దశలో అతిముఖ్యమైన దశ రిజిస్ట్రేషన్ దశ. ఈదశలో ఒక విషయం మెదడులో రికార్డు కావటం అనే కార్యక్రమం సక్రమంగా జరగాలి. అలా జరగాలంటే మెదడును వ్యక్తి పూర్తిగా అప్రమత్తంగా ఉంచాలి. ఇంద్రియ సమాచారం పట్ల ఓపెన్‌గా ఉండాలి. అంటే అటెన్షన్ చాలా ముఖ్యం. కేంద్రీకృతమైన అటెన్షన్ (ఏకాగ్రత) అవసరం. అటెన్షన్ లోపాలను సరిదిద్దుకుంటే స్మృతి చిహ్నాలు ఏర్పడే తొలి కార్యక్రమం సవ్యంగా జరుగుతుంది. విద్యార్థుల్లో బద్ధకం, నిర్లక్ష్యం, నామమాత్రంగా కళ్లప్పగించి చూడటం.. లెక్చరర్ పాఠం చెబుతుంటే.. సాయంత్రం ఏ సినిమాకు ఎవరితో వెళ్లాలా అని ప్లాన్ చేస్తూ ఉండటం వంటి ఎన్నో లోపాలు అటెన్షన్ ప్రక్రియను దెబ్బతీస్తాయి. అటెన్షన్ సూత్రం ప్రకారం మనం ఒక సమయంలో కేవలం ఒకదాని గురించి మాత్రమే ఆలోచించగలం. దృష్టి పెట్టగలం. ఏకకాలంలో రెండు లేక అంతకన్నా ఎక్కువ అంశాల పట్ల దృష్టి పెట్టడం చేత, ఏదీ సరిగా నమోదు కాదు. ఆ రోజుకు అంతా సవ్యంగానే ఉన్నట్లే అన్పిస్తుంది. వారం రోజుల తర్వాత ఎంత గింజుకున్నా ఏదీ గుర్తుకురాదు. మెదడు అందివ్వబడే సమాచారంలో స్పష్టత, సరైన అర్థమూ గోచరించకపోయినా నమోదు కార్యక్రమం సరిగా జరగదు. అర్థం పర్థం లేని పది మాటలను పదిసార్లు చదివినా గుర్తుండటం కష్టం. సమాచారం అర్థవంతమైనదై ఉండాలి. సారూప్యత, సంసర్గం (అసోసియేషన్) కనిపించాలి. జ్ఞాపకశక్తి సరిగా ఉన్నత స్థాయిలో ఉండాలంటే సమాచారం సక్రమంగా ఉండాలి. ఆ సమాచారం పట్ల చక్కని అటెన్షన్, ఏకాగ్రత ఉంచాలి. ఇదంతా ఒక వ్యక్తి మానసికంగా చేయాల్సిన, చేయదగిన పనులే. కాబట్టే జ్ఞాపకశక్తిని, అభివృద్ధి పర్చుకోవటం విద్యార్థుల చేతుల్లోనే ఉంది.
-ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి ? ఒక విషయాన్ని నేర్చుకునే సమయంలో, అది మెదడులో సక్రమంగా నమోదు కావాలంటే అందుకు మీరు మీ మనసుని లగ్నం చేయాలి. అటెన్షన్, ఏకాగ్రత కుదరాలి. అటెన్షన్ పెంచుకోవడానికి మీకు కొన్ని సజేషన్లను తెలియచేస్తాను. అటెన్షన్ రెండు రకాలుగా ఉంటుంది. యత్నపూర్వకంగా ఉండేది. అయత్నపూర్వకంగా ఉండేది. సహజంగా మీకు బాగా ఆసక్తి ఉన్న అంశం పట్ల మీకు తెలియకుండానే మీకు అటెన్షన్ కుదురుతుంది. కాబట్టి, ఈ విషయంలో మీరు డెవలప్మెంట్ కోసం శ్రమ పడనక్కర్లేదు. పరీక్షలకోసమనో, మంచి మార్కులు సాధించాలనో, ఎంసీఏలో సీటు కోసమో మీరు ఒక విషయాన్ని నేర్వదలిస్తే, ఆవిషయం మీకు ఆసక్తిలేనిదైతే, దానిని నేర్చుకోవడానికి యత్నపూర్వకమైన అటెన్షన్ కుదుర్చుకోవాల్సిందే. యత్నపూర్వకమైన అటెన్షన్‌ని (వాలంటరీ అటెన్షన్) మనోబలంతోను, సంకల్పబలంతోను ఏర్పరచుకోవచ్చు.
1. మీరు ఏకాగ్రత పెట్టాల్సిన (మీరు చదువుతున్న టాపిక్) అంశం మీకు అతి ముఖ్యమైనది, అవసరమైనది అని భావించాలి.
2. ఏకాగ్రత కేంద్రీకృతం కావాలి.
3. మనసుని చెదరగొట్టే అంశాలను తరిమికొట్టాలి.
4. ఏకాగ్రత పెట్టడం ఒక అలవాటుగా మారాలి.
ఒక ఉదాహరణ :
నా లక్ష్యం : ఎంపీఏలో సీటు సాధించటం, అందువల్ల నాకు కలిగే ప్రయోజనాలు : 1) మంచి ర్యాంకు వస్తే సీటు గ్యారంటీగా వస్తుంది. 2) ఎంసీఏలో ప్రతిభ చూపగలుగుతాను. 3) ఎంసీఏని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాను. 4) ఎంసీఏ వల్ల నాకు మంచి ఉద్యోగం వస్తుంది. 5) అవకాశం కల్సివస్తే విదేశాల్లో జాబ్ దొరుకుతుంది. 6) కుటుంబ, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. 7) మంచి హోదా లభిస్తుంది. 8) అందిరి మెప్పు లభిస్తుంది. 9) నాలోని ఉత్పాదకత వల్ల సమాజానికి ఎంతో సేవ చేసినవాడినవుతాను.
సజేషన్లు : అందుచేత నా అంతరంగం ఇందుకు సంసిద్ధంగా ఉంది. నేను ప్రశాంతమైన మనసుతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. కాబట్టి, ఇకపై నేను నా చదువు పట్ల మరింత శ్రద్ధ పెట్టాను. చదువుపట్ల శ్రద్ధ, ఆసక్తి, ఎవేర్నెస్ పెరిగినందువల్ల నేను ఇకపై నా చదువుపట్ల నా మనసుని పూర్తిగా లగ్నం చేస్తాను. నేను పూర్తిగా నా చదువు మీదనే మనసు లగ్నం చేస్తాను. సెల్ఫ్- హిప్నాసిస్ సెషన్లో కూర్చునే ప్రతిసారీ నా ఏకాగ్రత సామర్థ్యం మరింతగా పెరిగిపోతుంది. ఎన్ని పనులు ఉన్నా నేను చదువుకోవడానికి నిర్ణయించుకున్న వేళల్లో (ప్రతిరోజూ సాయంత్రం ఫలానా సమయానికి) తప్పనిసరిగా, నా చదువు మీదకు నా ధ్యాస మళ్లుతుంది. పుస్తకం తీయాలనే తపన ఎక్కువవుతుంది. తపన మరింత ఎక్కువయ్యే కొద్దీ నాలో ఏకాగ్రత మరింత పెరిగిపోతుంది. ఏకాగ్రతతో చదవటం ఫలితంగా అతి తక్కువ సమయంలోనే ఎక్కువ అధ్యాయాలు చదువగలుతాను. అనుకున్న సమయానికంటే ఎంతో ముందుగానే కోర్సును పూర్తి చేయగలుగుతాను. నాలో ఈ ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతూనే ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?