The law that led to direct elections in the country | దేశంలో ప్రత్యక్ష ఎన్నికలకు దారితీసిన చట్టం?
1. బాల్య వివాహాలు ఆపడానికి ఏ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలి?
1) 1800 425 2908 2) 1800 425 033
3) 1800 455 1967 4) 1800 425 1950
2. మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టానికి (1956) ఎప్పుడు సవరణ చేశారు?
1) 2004 2) 2005 3) 2006 4) 2008
3. కిందివాటిని సరైన వాటితో జతపర్చండి.
1) గృహహింస నుంచి మహిళలు రక్షణ పొందే చట్టం ఎ) 1961
2) వరకట్న నిషేధ చట్టం బి) 2005
3) మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టం సి) 1989
4) ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం డి) 1956
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలగింపునకు సంబంధించి సరైన అంశాలు?
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పదవీచ్యుతులను చేయవలసిందిగా పార్లమెంట్ ఒక అభిశంసన తీర్మానం ద్వారా రాష్ట్రపతిని కోరితే రాష్ట్రపతి వారిని పదవి నుంచి తొలగించడానికి ఆదేశాలు జారీచేస్తాడు
2) న్యాయమూర్తులను అభిశంసించే ప్రక్రియ సుదీర్ఘ, అత్యంత జటిలమవడం వల్ల ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రధాన న్యాయమూర్తిని లేదా ఇతర న్యాయమూర్తులను తొలగించలేదు
3) 1991-93 మధ్యకాలంలో ఆర్ రామస్వామి అనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానమొకటి పార్లమెంట్ పరిశీలనకు వచ్చింది. ఆ తీర్మానం ఆమోదించే విషయంలో లోక్‌సభలోని కొందరు సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరు కావడంతో తీర్మానం వీగిపోయింది
4) పై వన్నీ సరైనవే
5. భారతదేశంలో అత్యున్నత న్యాయవస్థ అయిన సుప్ట్రీంకోర్టు తీర్పులను దేశంలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర సిబ్బందితో సహా ప్రతి ఒక్కరూ గౌరవించి అనుసరించాలని తెలిపే అధికరణం?
1) 131 2) 142 3) 143 4) 137
6. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు జరిగే ఎన్నికల విషయంలో ఏర్పడే వివాదాలపై ఎవరికి స్వయంగా విచారణ జరిపే అవకాశం ఉంది?
1) సుప్రీంకోర్టు 2) రాష్ట్రపతి
3) పార్లమెంట్ వ్యవహారాల కమిటీ
4) స్పీకర్
7. ఏ చట్టం ద్వారా భారత్‌లో బ్రిటిష్ ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది. ఈ చట్టం బెంగాల్ గవర్నర్ హోదాను పెంచుతూ గవర్నర్ జనరల్‌గా వారన్ హేస్టింగ్ను నియమించారు?
1) రెగ్యులేటింగ్ చట్టం-1773
2) పిట్స్ ఇండియా చట్టం-1784
3) చార్టర్ చట్టం-1833
4) భారత ప్రభుత్వ చట్టం- 1858
8. కిందివారిలో రాష్ట్రపతిచే నియమించబడేవారు?
ఎ) యూపీఎస్సీ చైర్మన్ బి) అధికారభాషా సంఘం చైర్మన్
సి) ప్రణాళికా సంఘం చైర్మన్
డి) ఆర్ఘిక సంఘం
1) బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
9. జాతీయోద్యమంలో జరిగిన సంఘటనలు సరైనవాటిని గుర్తించండి.
ఎ) సహాయ నిరాకరణలో భాగంగా గాంధీజీ కైజర్-ఇ-హింద్, రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్‌హుడ్ గౌరవ బిరుదులను త్యజించారు
బి) 1919 రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా హర్తాళ్లు నిర్వహించాలని మహాత్మాగాంధీ పిలుపునిచ్చారు
సి) దండియాత్రను గాంధీజీ మార్చి 12, 1930న సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించాడు
డి) 1931లో గాంధీ-ఇర్విన్ ఒప్పందం జరిగింది
1) బి, డి 2) బి, సి, డి 3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
10. పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని పెట్టి, ఓటు హక్కు కేవలం ఆస్తిపరులకు, విద్యావంతులకు పరిమితం చేసిన చట్టం?
1) భారత కౌన్సిల్ చట్టం-1892
2) భారత ప్రభుత్వం చట్టం-1909
3) భారత ప్రభుత్వ చట్టం-1919
4) భారత ప్రభుత్వ చట్టం-1935
11. రాజ్యాంగ పరిషత్ సభ్యులకు సంబంధించిన సరైన వాక్యాలు.
ఎ) రాజ్యాంగ పరిషత్‌లో మొత్తం 389 మంది ప్రతినిధులు ఉన్నారు
బి) 292 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు, 93 మంది సంస్థానాధీశులకు, చీఫ్ కమిషనర్ ప్రావిన్సులకు నలుగురు ప్రాతినిధ్యం వహించారు
సి) బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు 292 మందిలో 210 మంది సాధారణ స్థానాల నుంచి, 78 మంది ముస్లిం స్థానాల నుంచి, నలుగురు సిక్కుల స్థానాల నుంచి ఎన్నికయ్యారు
డి) రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 199, యూనియన్ పార్టీ ఆఫ్ పంజాబ్-2, కమ్యూనిస్టులు-1, షెడ్యూల్డ్ కులాల సమాఖ్య-2, ఇండిపెండెంట్లు-6 స్థానాలు గెలిచాయి.
1) బి, డి 2) ఎ, సి, డి 3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
12. భారత స్వాతంత్య్ర చట్టం-1947కు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ) భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన, అమలు చేసిన చివరి చట్టంగా పేర్కొనవచ్చు
బి) భారతదేశంలో చివరి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటన్, బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీల ఉమ్మడి ప్రయత్న ఫలితంగా ఈ చట్టం రూపొందింది
సి) ఈ చట్టం ముసాయిదాను బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో జూలై 4, 1947లో ప్రవేశపెట్టారు
డి) ఈ చట్టానికి జూలై 18, 1947లో ఆమోదముద్ర లభించింది
1) సి, డి 2) ఎ, సి 3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
13. రాజ్యాంగ పరిషత్ ప్రధాన కమిటీలు, వాటి అధ్యక్షులు సరైన వాటిని జతపర్చండి
1) విధాన నిబంధన కమిటీ ఎ) వల్లభాయ్ పటేల్
2) రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీ
బి) బీఆర్ అంబేద్కర్
3) ముసాయిదా రాజ్యాంగ రచనా కమిటీ
సి) రాజేంద్రప్రసాద్
4) సభా వ్యవహారాల పర్యవేక్షణ కమిటీ
డి) డా. రాజేంద్రప్రసాద్
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
2) 1-డి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
జవాబులు
1)1, 2)3, 3)4, 4)4, 5)2, 6)1, 7)1, 8)3, 9)4,
10)3, 11)4, 12)4, 13)2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?