WARANGAL NIT | ఉన్నతం ఉత్తమం.. వరంగల్ నిట్
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఐఐటీల తర్వాత స్థానం ఎన్‌ఐటీలదే (నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ). జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ద్వారా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తే జేఈఈ మెయిన్ ర్యాంక్ ద్వారా ఎన్ఐటీల్లో ప్రవేశాలు ఉంటాయి. మెయిన్ స్కోర్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 31 నిట్లతోపాటు, 23 ఐఐఐటీ, ఐఐఐటీఎం & ఐఐఐటీడీఎం, 23 కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న సంస్థల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తారు. వీటితోపాటు పలు ప్రైవేట్ యూనివర్సిటీలు/కాలేజీలు కూడా మెయిన్ ర్యాంక్‌తో అడ్మిషన్లు ఇస్తున్నాయి. అయితే ఎక్కువమంది ఐఐటీల తర్వాత ప్రాధాన్యం ఇచ్చేది నిట్లకే. రాష్ట్రంలో వరంగల్‌లో నిట్ ఉంది. మంచి ప్లేస్‌మెంట్స్‌తో పలు ప్రత్యేకతలతో ఉన్న వరంగల్ నిట్‌లో గతేడాది ఏ ర్యాంకుల వారికి సీట్లు వచ్చాయి, ఇక్కడి ప్రత్యేకతలపై నిపుణ పాఠకుల కోసం ప్రత్యేక కథనం..
వరంగల్ నిట్
-సుమారు 250 ఎకరాల ప్రాంగణంతో వరంగల్ నిట్ ఉంది. దేశ తొలి ప్రధాని నెహ్రూ 1959, అక్టోబర్ 10న వరంగల్ నిట్‌కు శంకుస్థాపన చేశారు. మొదట్లో వీటిని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలుగా వ్యవహరించేవారు. ఆసియా, మధ్య ఆసియా, ఆఫ్రికా వంటి 40 దేశాల విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ 8 యూజీ పోగ్రామ్స్, 25 ఎంటెక్, 4 ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పీజీ స్థాయిలో 32 కోర్సులు కలిగి ఉన్న నిట్‌గా వరంగల్ రికార్డు సృష్టించింది. ఇంజినీరింగ్, సైన్సెస్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్ విభాగాల్లో డాక్టోరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ కలిగి ఉన్న ఏకైక నిట్ వరంగల్ కావడం విశేషం.
సీట్లు – రాష్ట్ర కోటా.. ?
-దేశవ్యాప్తంగా ఉన్న 31 నిట్లలోని సీట్లలో 50 శాతం ఆయా రాష్ర్టాలకు, 50 శాతం జాతీయకోటా కింద విభజిస్తారు.
-వరంగల్ నిట్‌లో 8 బ్రాంచీలు ఉన్నాయి. మొత్తం 800 సీట్లు ఉన్నాయి. వీటిలో 50 శాతం అంటే 400 సీట్లు రాష్ట్ర కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లు జాతీయకోటా కింద భర్తీ చేస్తారు. జోసా ద్వారా సీట్ల భర్తీ ప్రక్రియ జరుగుతుంది.
-ఈసారి నిట్‌లలో బాలికల శాతం పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయం మేరకు వరంగల్ నిట్‌లో 17 సీట్లు సూపర్‌న్యూమరీ కోటా కింద బాలికలకు కేటాయిస్తారు.
ఏయే బ్రాంచీలు ఉన్నాయి?
-సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్, మెటలర్జీ, కెమికల్, బయోటెక్నాలజీ బ్రాంచీలు ఉన్నాయి.
వరంగల్ నిట్‌లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ కలిగిన ఏకైక నిట్ ఇది. అంతేకాకుండా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (క్యూఐపీ) సెంటర్‌గా గుర్తింపు పొందింది. ముఖ్యంగా రాష్ట్ర అభ్యర్థులకు మంచి అకడమిక్ ప్రోగ్రామ్స్‌ను, ప్లేస్మెంట్స్ను అందిస్తున్న సంస్థల్లో వరంగల్ నిట్ అగ్రస్థానంలో ఉంది. పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీ, లైబ్రెరీ, ల్యాబ్‌లు, హాస్టల్ సౌకర్యాలు ఉన్నాయి. ఎస్టాబ్లిష్ అయిన సంస్థ కావడంవల్ల ఇక్కడ చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?