The first steps in self-governance | సొంత పాలనలో తొలి అడుగులు
-దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
1) జవహర్లాల్ నెహ్రూ – ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, సాంతికేక పరిశీలన, కామన్వెల్త్ దేశాలతో సంబంధాలు
2) వల్లభాయ్ పటేల్ – ఉప ప్రధానమంత్రి, హోం, సమాచార మంత్రిత్వ శాఖలు
3) అంబేద్కర్ – న్యాయశాఖ
4) రాజేంద్రప్రసాద్ – వ్యవసాయం, ఆహారం
5) ఆర్కే షన్ముఖం శెట్టి – ఆర్థిక శాఖ
6) బల్దేవ్ సింగ్ – రక్షణ శాఖ
7) జాన్ మథాయ్ – రైల్వే, ఉపరితల రవాణా
8) మౌలానా అబుల్ కలాం ఆజాద్ – విద్య శాఖ
9) రాజకుమారి అమృత్‌కౌర్ ఆరోగ్య, వైద్య శాఖలు
10) జగ్జీవన్ రామ్ – కార్మిక శాఖ
11) సీహెచ్ బాలు – వాణిజ్యం
12) రఫీ మహ్మద్ కిద్వాయ్ – కమ్యూనికేషన్
13) ఎన్వీ గార్గిల్ – విద్యుత్ శక్తి, గనులు
14) శ్యాంప్రసాద్ ముఖర్జీ – పరిశ్రమలు
-రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం అనే వాక్యంతో ప్రవేశిక ముగుస్తుంది.
-ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాగానే సుప్రీంకోర్టు బెరుబారీ కేసుపై 1960లో తీర్పునిచ్చింది.
-ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని సుప్రీంకోర్టు కేశవానంద భారతి వర్సెస్ కేరళ 1973 కేసులో తీర్పునిచ్చింది.
-రాజ్యాంగ పరిషత్ సభ్యులు ప్రపంచంలోని 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు.
-రాజ్యాంగ నిర్మాత – అంబేద్కర్
-రాజ్యాంగ చిహ్నం – ఐరావతం (ఏనుగు)
-ఐరావతాన్ని ప్రతిపాదించింది- హెచ్వీ కామత్
-దేశంలో ప్రత్యేక రాజ్యాంగాన్ని కలిగిన రాష్ట్రం- జమ్ముకశ్మీర్
-జమ్ముకశ్మీర్ రాజ్యాంగం 1957, జనవరి 26న అమల్లోకి వచ్చింది.
-370 నిబంధన ప్రకారం జమ్మకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది.
-రాజ్యాంగ పరిషత్‌కు న్యాయ సలహాదారుడు- బెనగల్ నర్సింగరావు
-రాజ్యాంగాన్ని రూపొందించింది- రాజ్యాంగ పరిషత్
-అంతిమంగా రాజ్యాంగాన్ని రూపొందించింది- ప్రజలు
-రాజ్యాంగ పరిషత్ 11 (చివరి)వ సమావేశం (1950, జనవరి 24)లో రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
-లక్ష్యాలు, ఆశయాలు, తీర్మానాన్ని ఆహ్వానించింది- 1947, జనవరి 22
-లక్ష్యాలు, ఆశయాల తీర్మానం ప్రకారం ప్రవేశిక తయారుచేశారు.
-రాజ్యాంగ పరిషత్ 22 కమిటీలను నియమించుకుంది. వీటిలో అతిముఖ్యమైనది డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ. ఇది 1947, ఆగస్టు 29న ఏర్పడింది.
-ఈ సంఘంలో ఒక చైర్మన్, 6గురు సభ్యులున్నారు. వారు చైర్మన్- అంబేద్కర్, సభ్యులు- అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్, గోపాలస్వామి అయ్యర్, సాదుల్లా, కృష్ణమాచారి, మాధవచారి, మాధవరావు, మున్షీ.
-ముసాయిదా సంఘం ఏర్పడినప్పుడు కృష్ణమాచారి, మాధవరావులు లేరు. వివిధ కారణాల వల్ల ఖైతాన్, మిట్టల్ పదవులు ఖాళీ కావడంతో కృష్ణమాచారి, మాధవరావులను సభ్యులుగా నియమించారు.
-ప్రాథమిక హక్కులన్నింటిలో కంటే అతిముఖ్యమైంది- రాజ్యాంగ పరిహారపు హక్కు
-రాజ్యాంగ పరిహారపు హక్కును రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా అభివర్ణించింది- అంబేద్కర్
-ప్రస్తుతం ప్రాథమిక హక్కులు – 6
-44వ రాజ్యాంగ సవరణ చట్టం-1976 ప్రకారం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలిగించి చట్టబద్దమైన హక్కుగా గుర్తించారు.
-ప్రస్తుతం ఆస్తి హక్కు గురించి వివరించే నిబంధన- 300 (A) 12వ భాగం
-జమ్ముకశ్మీర్‌లో ఆస్తిహక్కు ప్రాథమిక హక్కుగా కొనసాగుతుంది.
-సమన్యాయ భావనను పోలి ఉన్న ప్రాథమిక హక్కు- సమానత్వపు హక్కు
-ప్రపంచంలో తొలిసారిగా సమన్యాయ పాలన విధానాన్ని ప్రవేశపెట్టింది- ఏవీ డైసీ
-రాజ్యాంగ నిర్మాతలు సమన్యాయ పాలన విధానాన్ని బ్రిటన్ నుంచి స్వీకరించారు.
-సమన్యాయ పాలన అంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే.
-రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు శాశ్వతమైనవికావు.
-దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి 359 నిబంధన ప్రకారం ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దుచేస్తారు. (20, 21 నిబంధనలు మినహా)
-దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నంతవరకు ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా రద్దయి ఉంటాయి.
-ఆర్టికల్ 12 – రాజ్యం నిర్వచనం.
-ఆర్టికల్ 13 – ప్రాథమిక హక్కుల రక్షణ.
-32వ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్ లేదా అధిలేఖలను లేదా ఆజ్ఞలను జారీచేసి ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తాయి.
-226 నిబంధన ప్రకారం హైకోర్టు ప్రాథమిక హక్కులను కాపాడటానికి రిట్స్‌ను జారీచేస్తాయి.
-RITS: హెబియస్ కార్పస్, మాండమస్,
సెర్షియోరరీ, కోవారెంటో, ప్రొహిబిషన్.
-86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం కొత్తగా ప్రాథమిక హక్కులను 21 (A) నిబంధనలో ఏర్పాటు చేశారు.
-21 (A) నిబంధన ప్రకారం ప్రభుత్వం 14 ఏండ్లలోపు బాల, బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి.
-ప్రాథమిక హక్కుల్లో అతి చిన్న నిబంధన – 21
-21వ నిబంధన జీవించే హక్కు గురించి వివరిస్తుంది.
-రాజ్యాంగ నిర్మాతలు జీవించే హక్కును జపాన్ నుంచి స్వీకరించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?