Telangana movies | తెలంగాణ బతుకు చిత్రం
సినిమా రంగం
– తెలుగు చిత్ర పరిశ్రమ మొదట మద్రాసు నగరంలో ఉండేది. తర్వాత హైదరాబాద్‌కు తరలివచ్చింది.
– సినిమా నిడివి, లక్ష్యం, లక్షణం, విషయం, ఫార్మాట్ మొదలైన అంశాల ఆధారంగా సినిమాలను అనేక రకాలుగా విభజిస్తారు.
ఫీచర్ ఫిలిం
– ఏదైనా ఒక కథాంశానికి సంబంధించిన వివిధ సన్నివేశాలతో కూడిన సినిమాను ఫీచర్ ఫిలిం అంటారు.
– దీని ప్రదర్శన కాలవ్యవధి గంటకు పైగా, మూడు గంటల వరకు ఉండవచ్చు.
నాన్ ఫీచర్ ఫిలిం
– ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సంఘటన జరుగుతున్న కాలంలో యథాతథంగా చిత్రీకరణ జరిపితే దానిని నాన్ ఫీచర్ ఫిలిం లేదా డాక్యుమెంటరీ ఫిలిం అంటారు.
– తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా 1970 దశకం తర్వాత ఫీచర్ ఫిలింలను అధికంగా చిత్రీకరించారు.
– మొదట తెలుగు సినిమాలో బి నర్సింగరావు తెలంగాణ జీవితము, కళలు, తెలంగాణ భాష మొదలైన వాటిని ప్రతిబింబిస్తూ సినిమాలు తీశారు.
బి. నర్సింగరావు
– మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ అనే గ్రామంలో 1946లో జన్మించారు.
– బి. నర్సింగరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా చేశారు.
– ఇతను 6 అంతర్జాతీయ అవార్డులు, 4 జాతీయ పురస్కారాలు, ఆసియా ఫిలిం ఫెస్టివల్లో స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు.
– ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010లో ప్రతిష్ఠాత్మక బీఎన్ రెడ్డి పురస్కారాన్ని అందజేసింది.
– ఈయన ముఖ్యంగా ఆనాటి తెలంగాణ పోరాటాలు, రజాకార్ల దురాగత పరిస్థితులను, తెలంగాణ చరిత్ర అంశాలను, తెలుగు చిత్రసీమకు మొదటిసారిగా పరిచయం చేసిన దర్శకుడిగా కీర్తి పొందారు.
– అనేక పరిశోధనలు, డాక్యుమెంటరీల రూపకల్పనలో శ్యాంబెనగల్తో కలిసి పనిచేశారు.
– ప్రముఖ సినిమాలు 1. మా భూమి, 2. రంగుల కల, 3. దాసి, 4. మా ఊరు, 5. మట్టిమనుషులు, 6. హరివిల్లు.
2. రంగుల కల
– నిర్మించిన సంవత్సరం : 1984
– నిర్మాతలు : జీ రవీంద్రనాథ్, బీ వెంకటేశ్వరరావు
– దర్శకుడు : బీ నర్సింగరావు
– సంగీతం : గద్దర్
– నిర్మాణ సంస్థ : సుచిత్ర ఇంటరేల్నషనల్
– తారాగణం : బీ నర్సింగరావు, సాయిచంద్, గద్దర్, రూప.
– కథాంశం పెయింటింగ్వేసే యువకుడి జీవితంలోని సంఘటనలు
ముఖ్యమైన పాటలు
1. మదనసుందారి మదనసుందారి – గద్దర్
2) జమ్జమాల్ మర్రి – గద్దర్
3) భద్రం కొడుకో నా కొడుకో- గద్దర్
– అవార్డు : నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ తెలుగు
– శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని ఈ సినిమా సారాంశం.
– 1984లో ముంబైలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో, ఇండియన్ పనోరమలో ప్రదర్శితమయ్యింది.
– కళల గవాక్షంలోంచి మానవుని అంతరంగ అన్వేషణ రంగులకల.
3. దాసి, 1926 తెలంగాణ
– నిర్మించిన సంవత్సరం : 1988
– కథ, దర్శకత్వం, నిర్మాత : బీ నర్సింగరావు
– తారాగణం : అర్చన, భూపాల్‌రెడ్డి
అవార్డులు
– 5 జాతీయ అవార్డులు గెలుచుకుంది.
1. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ ఫీచర్ ఫిలిం
– బీ నర్సింగరావు
2. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ సినిమాటోగ్రఫీ
– ఏ కిషోర్ బిర్
3. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ హీరోయిన్
– అర్చన
4. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కాస్టూమ్
డిజైనర్ – సుదర్శన్
5. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ – టీ వైకుంఠం
– ఈ సినిమా అంతర్జాతీయంగా 35కు పైగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో దాసి ప్రదర్శితమైంది.
4. మా ఊరు, 1953-55 తెలంగాణ
– ఇది డాక్యుమెంటరీ ఫిలిం
– నిర్మించిన సంవత్సరం : 1987
– దర్శకత్వం : బీ నర్సింగరావు
– నిర్మాత : బీ రామచంద్రరావు
– 51 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ జాతీయ స్థాయిలో 1988లో బెస్ట్ ఆంత్రోపాలాజికల్ ఫిలింగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రజత నంది (1989) పురస్కారాన్ని సాధించింది.
– హంగేరిలో 1992లో జరిగిన ఇంటర్నేషనల్ మీడియా ఫెస్టివల్‌లోనే డాక్యుమెంటరీల్లో మొదటి బహుమతిని పొందింది.
– బొంబాయి (1990), విటెర్చో (1993), బ్రాటిస్లావా (1995), మ్యూనిచ్ (1999) లాంటి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన చిత్రం మా ఊరు.
5. మట్టిమనుషులు
– నిర్మించిన సంవత్సరం : 1990
– దర్శకత్వం : బీ నర్సింగరావు
– నిర్మాతలు : మణికొండ వేదకుమార్, చటర్జీ
– తారాగణం : అర్చన
– 1990లో ఈ సినిమాకు జాతీయస్థాయిలో ఉత్తమ తెలుగు సినిమా అవార్డు లభించింది.
6. హరివిల్లు
– నిర్మించిన సంవత్సరం : 2003
– కథ, దర్శకత్వం, సంగీతం : బీ నర్సింగరావు
– నిర్మాత : డీ రామానాయుడు
– స్క్రీన్‌ప్లే : ప్రాణ్‌రావు, పతంజలి శాస్త్రి
– తారాగణం : భానుచందర్, నిత్య, భూపాల్ రెడ్డి, సుధాకర్.
7. ది సిటీ (డాక్యుమెంటరీ)
– హైదరాబాద్ నగరంతో తనకు ఉన్న ఆత్మీయ బంధం, అవినాభావ సంబంధం గురించి నర్సింగరావు తీసిన డాక్యుమెంటరీనే ది సిటీ.
– స్క్రీన్‌ప్లే , దర్శకత్వం, సంగీతం, నిర్మాత :
బీ నర్సింగరావు
– 96 నిమిషాల నిడివితో తీసిన ఈ డాక్యుమెంటరీ బొంబాయి (1990), తిరువనంతపురం (1998) ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమవ్వడమేగాక 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ డాక్యుమెంటరీగా రజత నంది అవార్డును గెలుచుకుంది.
8. ఆకృతి (డాక్యుమెంటరీ)
– స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : నర్సింగరావు
– ఈ సినిమాకు హరిప్రసాద్ చౌరాసియా వేణు గానాన్ని అందించాడు.
– 11 నిమిషాల నిడివిగల ఈ డాక్యుమెంటరీ జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డు (1991), ఆంధ్రప్రదేశ్ రజత నంది పురస్కారం (1991) గెలుపొందింది.
– ఈ సినిమా ప్రేరణతో సేవ్ ది రాక్స్ సొసైటీ వంటి సంస్థలను స్థాపించారు.
శ్యామ్ బెనెగల్
– ఈయన 1934 డిసెంబర్ 14న బ్రిటిష్ కంటోన్మెంట్ ఆధీనంలో ఉన్న తిరుమలగిరి (సికింద్రాబాద్)లో జన్మించారు.
– ఈయన తండ్రి శ్రీధర్ బెనెగల్ ప్రముఖ ఫోటోగ్రాఫర్.
– శ్యామ్ బెనెగల్ హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో చదివి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే హైదరాబాద్ ఫిలిం సొసైటీని ఏర్పాటు చేశారు.
– శ్యామ్ బెనెగల్ సుప్రసిద్ధ భారతీయ చలనచిత్ర దర్శకుడు, రచయిత.
– తన వైవిధ్య చిత్రాలతో మధ్యతరం భారతీయ సినిమాలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన దర్శకులు.
– 900 ప్రయోజిత కార్యక్రమాలు, ప్రకటనలు, డాక్యుమెంటరీలు రూపొందించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు.
– 1966-73 మధ్యకాలంలో పుణెలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో పాఠ్యాంశాలు బోధించారు.
– శ్యామ్ బెనెగల్ మొదటి చిత్రం అంకుర్ (1973). ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఆనాటి ఆర్థిక, లైంగిక దోపిడీలను ఇతివృత్తంగా తీసుకొని చిత్రించారు.
– శ్యామ్ బెనెగల్ 1980-86 మధ్యకాలంలో జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు సంచాలకుడిగా పనిచేశారు.
– 14వ, 31వ మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు జ్యూరీ సభ్యుడిగా పనిచేశారు.
– ఈయన ప్రస్తుతం ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం సొసైటీస్ ఇన్ ఇండియాకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
– ది చార్మింగ్ విత్ విజయ్ టెండూల్కర్ (1984), సత్యజిత్‌రే (1988), మార్కెట్ ప్లేస్ (1989) వంటి మూడు ప్రముఖ పుస్తకాలను తాను తీసిన చిత్రాల ఆధారంగా శ్యామ్ బెనెగల్ రచించారు.
– చలనచిత్ర రంగంలో శ్యామ్ బెనెగల్ చేసిన విశేష కృషికి 1976లో పద్మశ్రీ అవార్డు, 1991లో పద్మభూషణ్, 2005లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు, 2013లో అక్కినేని నాగేశ్వర్రావు జాతీయ అవార్డు అందుకున్నారు.
1 . మా భూమి, 1946 తెలంగాణ
– నిర్మించిన సంవత్సరం : 1979
– నిర్మాతలు : బి. నర్సింగరావు,
జి. రవీంద్రనాథ్
– దర్శకుడు : గౌతమ్ ఘోష్
– సంగీతం : వింజమూరి సీతాదేవి
– నిర్మాణ సంస్థ : చైతన్య చిత్ర ఇంటర్నేషనల్
– తారాగణం : సాయిచంద్, కాకరాల, రామిరెడ్డి, భూపాల్‌రెడ్డి, యాదగిరి
– సినిమాటోగ్రఫీ : కమల్‌నాయక్
– కథ : కిషన్‌చందర్
– కళాదర్శకుడు : తోట వైకుంఠం
– తెలంగాణ మట్టి చరిత్రలో నైజాంల నుంచి భారత ప్రభుత్వానికి అధికార బదిలీ జరిగిన ఘట్టానికి సంబంధించిన ప్రహసనంలో ఎన్నో ప్రాణాలు బలయ్యాయి. అన్నింటిని మించి రైతులందరి కంటే ఓ సామూహిక శ్రామికస్వర్గ స్వప్నం భగ్నమైంది. ఈ ఛిద్రమైన శకలాలకు భగ్నమైన స్వప్నాలకు హ్యూమన్ డాక్యుమెంట్‌గా నిర్మించిన సినిమా మా భూమి.
– కిషన్‌చందర్ రచించిన జబ్ఖేత్ జాగే అనే నవల అనువాదమైన పొలాలు మేల్కొన్న జైత్రయాత్ర ఆధారంగా మా భూమి సినిమాను నిర్మించారు.
– జబ్ఖేత్ జాగే అనే నవలను తెలుగులోకి అనువదించినవారు విశాలాంధ్ర.
– మా భూమి సినిమా 1980లో విడుదలైంది. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలోని కొన్ని వాస్తవాలు, సంఘటనలు జోడించి స్క్రిప్టును అభివృద్ధి చేశారు.
– మెదక్ జిల్లాలోని మంగళ్పర్తిలోని గ్రామస్తులు ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో నటించారు.
– ఈ సినిమాలో ప్రధాన పాత్రలు
1. త్రిపురనేని సాయిచంద్ (రామయ్య)
2. కాకరాల రామయ్య (వీరయ్య)
3. ఎంబీవీ ప్రసాద్‌రావు (జమీందార్)
– ఈ సినిమాలోని ప్రముఖ పాటలు :
1. పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా
– సుద్దాల హన్మంతు (రచన),
సంధ్య (గాయని)
2. బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి
– బండి యాదగిరి (రచన)
అవార్డులు
1. బెస్ట్ ఫీచర్ ఫిలింగా నంది అవార్డు
2. ఫిలిం ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ ఫిలిం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?