– నిర్మల్ హస్తకళలు కాకతీయుల కాలంలో ఆవిర్భవించాయి. నిర్మల్ కళకు ఆద్యుడు-
నిమ్మనాయుడు (17వ శతాబ్దం)
– నిర్మల్ హస్తకళలలో లక్కను ఉపయోగించి చేసే ఫర్నిచర్, ఇతర అలంకార వస్తువులు ఎంతో ప్రాచుర్యం పొందాయి.
– నిర్మల్ పెయింటిగ్స్‌ను సహజ రంగులను ఉపయోగించి తయారు చేస్తారు.
– నిర్మల్ కళలో ఇండియన్, మొగలుల శైలి కనిపిస్తుంది.
– నిర్మల్ బొమ్మలను అలంకరించడానికి ప్రత్యేకమైన ఆయిల్ పెయింటింగ్స్ వాడుతారు.
పెంబర్తి
– వరంగల్ జిల్లాలో పెంబర్తి గ్రామం ఉంది. కాకతీయుల కాలంలో పెంబర్తి ఇత్తడి కళా నైపుణ్యం ఉచ్చదశకు చేరుకున్నది.
– ఇక్కడ ఇత్తడిని ఉపయోగించి అత్యద్భుతమైన కళా ఖండాలను తయారు చేస్తారు.
– పెంబర్తి కళావస్తువులు రథాల అలంకరణ, ఆలయాల అలంకరణ, షాండిలియర్లు, జ్ఞాపికలు మొదలైనవి.
ఇక్కత్ (పోచంపల్లి వస్త్రకళ)
– నల్లగొండ జిల్లాలో పోచంపల్లి గ్రామం ఉంది.
– స్వామి రామనంద తీర్థ గ్రామీణ సంస్థ కంప్యూటర్ ఆధారిత నేత డిజైన్లను అందిస్తుంది.
– ఇక్కడ వస్ర్తాలపై వేసే డిజైన్ కళను ఇక్కత్ కళ అంటారు. దీనికి భౌగోళిక గుర్తింపు లభించింది.
చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్
– వరంగల్ జిల్లాలో చేర్యాల గ్రామం ఉంది.
– పురాణ కథలను డిజైనులుగా తీసుకొని వివిధ రంగులతో అత్యంత అద్భుతమైన పెయింటింగ్స్ చేస్తారు.
– చేర్యాల పెయింటింగ్స్ కళాకారులను నకాషీలు అంటారు. ఇక్కడి పెయింటింగ్‌ను థీమ్ పెయింటింగ్ అని కూడా పిలుస్తారు.
– నకాషీ అనేది ఉర్దూ పదం. తెలంగాణ జానపద సంస్కృతి నకాషీ చిత్రాల్లో కనిపిస్తుంది. దీపావళి, కార్తీకమాసంలో కేదారీశ్వరీ వ్రతం చేయడం కోసం ఇండ్లలో తెల్లటి సున్నపు గోడలపై జాజుతో పొప్పెడ అనే చిత్రాలను గీసేవారు.
హైదరాబాద్ బిద్రి వస్తువులు
– హైదరాబాద్ నగరంలో గన్మెటల్ (కాపర్, జింకుల మిశ్రమం)తో తయారు చేసిన కళాఖండాల మీద నల్లటి రంగువేసి దానిపై వెండి లేదా బంగారు రంగులతో డిజైన్లు వేస్తారు.
– హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న బీదర్ జిల్లాలో ఈ కళ అభివృద్ది చెందింది. కాబట్టి ఈ కళకు బిద్రి అనే పేరు వచ్చింది. బిద్రి కళ ఇరాన్ నుంచి హైదరాబాద్ సంస్థానానికి వచ్చింది.
సిల్వర్ ఫిలిగ్రీ (వెండి తీగ కళాఖండాలు)
– ఈ కళకు కరీంనగర్ జిల్లా పెట్టింది పేరు. వెండితీగ, బంగారపు తీగలతో అల్లకం పద్ధతిలో తయారు చేసే వస్తువులను సిల్వర్
ఫిలిగ్రీ అని పిలుస్తారు.
– 200 ఏండ్ల క్రితం జిల్లాలో ఈ కళ ఆవిర్భవించింది. దీనిని ప్రవేశపెట్టింది కడార్ల రామయ్య. సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులలో పొందానాలు, అత్తర్దానాలు, హుక్కాలు, ప్లేట్లు మొదలైన వస్తువులు ఉంటాయి.
ఆసియా రుమాల్
– నల్లగొండ జిల్లాలోని పోచంపల్లిలో వీటిని తయారు చేస్తారు. ఇక్కత్ అనే నేతను దీనిలో ఉపయోగిస్తారు.
– సంక్లిష్టమైన రేఖా చిత్రాలు, మార్జిన్లను వీటిపై ఉపయోగిస్తారు. దారాన్ని తైలంలో ముంచి ఆరవేస్తారు.
– వీటిని గొర్రె పేడతో నింపిన నీటిలో ఒక రాత్రి ఉంచి, మరునాడు ఆరబెడుతారు. నాలుగు రోజులపాటు ఈ విధంగా చేస్తారు. ఆ తర్వాత టై-డై ప్రక్రియలో రంగులను అద్ది చిత్రాలను గీస్తారు.
బంజార హస్త కళ
– తెలంగాణలోని బంజార తెగలు వారి వస్ర్తాలపై సూదిని ఉపయోగించి చిన్నచిన్న అద్దాలు రంగురాళ్లు గవ్వలతో ఈ కళను ప్రదర్శిస్తారు.
డోక్రా మెటల్ క్రాఫ్ట్స్
– బెల్‌మెటల్ ఉపయోగించి ఆదిలాబాద్ గిరిజన ప్రాంతంలోని గిరిజనులు అతిసున్నితమైన, సహజమైన కళాఖండాలను తయారు చేస్తారు.
– జానపద డిజైన్లు, నెమళ్లు, ఏనుగులు, గుర్రాలు, దీపాలు తదితర వస్తువులను తయారు చేస్తారు. వీటిలో ఎక్కడా ఒక్క అతుకు కూడా ఉండదు.
కంచు కళాఖండాలు
– హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఈ కళాఖండాలు కొలువుదీరి ఉన్నాయి.
– దేవతల విగ్రహాలు, నటరాజ విగ్రహం అలంకరణ వస్తువులు, సాధారణంగా తయారుచేస్తారు.
లంబాడా ఎంబ్రాయిడరీ
– నిజామాబాద్ జిల్లాలోని లంబాడా మహిళలు రంగురంగుల దుస్తులు, బంగారం, వెండి, బీడ్స్‌తో తయారు చేసిన ఆభరణాలతో అలంకరించుకుంటారు.
– లంబాడా మహిళలు ఎంబ్రాయిడరీ వర్క్, వారి బట్టలు, సంచులు, టుక్రీలు తయారు చేయడంలో ప్రసిద్ధి పొందారు.
గద్వాల కొత్తకోట చీరలు- మహబూబ్‌నగర్ జిల్లా గాద్వాల కొత్తకోట ప్రాంతాల్లో అనేక కుటుంబాలు ఈ విధమైన చేనేత చీరలను నేస్తారు.
– పట్టు, జరీ, లేసులు, కలంకారీలు ఉపయోగించి ఈ చీరలను అత్యంత నైపుణ్యంతో తయారు చేస్తారు.
నాయక్‌పోడుల మాస్క్‌లు
– నాయక్‌పోడులు లక్ష్మీదేవరను, కృష్ణున్ని, పాండవులను, పోతరాజు మొదలైన దేవుళ్లను మాస్క్‌ల రూపంలో పూజిస్తారు.
– ఈ మాస్క్‌లను స్థానిక వడ్రంగి వారితో తయారు చేయించి గ్రామ ఆలయాల్లో ఉంచి సంరక్షిస్తూ ప్రతి ఏడాది ఉత్సవాల్లో పూజిస్తారు.
డర్రీలు (వరంగల్ తివాచీలు)
– కాకతీయుల కాలం నుంచి ఈ కళ వరంగల్‌లో కొనసాగుతున్నది. వీటినే డర్నీలుగా పిలుస్తారు.
– ఇటలీ యాత్రికుడైన మార్కోపోలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించి వీటిని తన రచనలలో ప్రస్తావించారు.
రంజన్ కుండలు
– వీటి తయారీకి ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధి మహబూబ్‌నగర్‌లోని షాద్‌నగర్‌లో కూడా వీటిని తయారు చేస్తారు.
– సాంకేతికంగా, శాస్త్రీయంగా తయారు చేసే మట్టికుండలనే రంజన్ కుండలు అని పిలుస్తారు. వీటి ప్రత్యేకత కాలానికి తగ్గట్లుగా నీటిని సరైన ఉష్ణోగ్రతలో ఉంచుతాయి.