Simply .. clearly | సరళంగా.. స్పష్టంగా..
గ్రీన్ సిగ్నల్ వెలగడంతో తన కారును ముందుకు తీసుకువెళ్లింది శ్రావణి. తను కలలు గన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడం ఒక ఎత్తయితే ప్రాజెక్ట్ పై మూడేండ్లపాటు న్యూయార్క్ వెళ్లడం మరో ఎత్తు. ఇంగ్లిష్ మాట్లాడలేకపోవడం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో తెల్లమొహం వేయడం ఇలాంటి దశలన్నీ దాటి విజయపథంలోకి తన జీవితం మలుపు తిరిగి ఆ నలభై రోజుల ట్రైనింగ్ పీరియడ్‌ను ఆప్యాయంగా గుర్తుకు తెచ్చుకుంది శ్రావణి.
-ఎస్ మైడియర్ ఫ్రెండ్ మరొక ఆర్నెళ్లపాటు మీరు కేవలం ఇంగ్లిషే మాట్లాడాలి. నాతోనే కాదు, మీరంతా కూడా ఒకరితో ఒకరు ఇంగ్లిషులోనే మాట్లాడుకోవాలి. అంతేకాదు ఇంటా, బయటా, క్యాంటీన్లో, బస్సులో ఇలా ఒకటేమిటి ఎక్కడ పడితే అక్కడ మీరు ఇంగ్లిషే మాట్లాడాలి. వేదికపై నుంచి చెబుతున్నాడు నందు (ఫ్యాకల్టీ).
-ఆయనే ఉంటే అన్నట్లు నసిగాడు ఓ విద్యార్థి. మీ ఉద్దేశం అర్థమైంది. మాకు ఇంగ్లిష్‌లో మాట్లాడటం బాగా వచ్చిఉంటే కోచింగ్‌లో ఎందుకు చేరుతాం! ఇదేగా మీ ఉద్దేశం?
-అందరూ ఔనన్నట్లుగా తలూపారు విద్యార్థు లు. చాలా మంచి సందేహం వచ్చింది మీ అందరికీ. బాగా వస్తే ఎందుకు ఇక్కడ చేరి తిప్పలు పడుతాం కరక్టే. మనకు ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడటం వచ్చాక ఇంగ్లిష్ మాట్లాడతాం అని మీరనుకొంటున్నారు. మాట్లాడుతూ ఉంటేనే ఇంగ్లిష్ బాగా మాట్లాడగలరని నేననుకుంటున్నాను అని చెప్పి అందరి వైపు చూస్తూ ఉండిపోయాడు. అందరికీ అర్థమై అర్థమవ్వనట్లుగా ఉంది. మీ అందరి సమస్య ఇంగ్లిష్‌లో మాట్లాడలేక పోవడం. కాబట్టి పొందాల్సిన పరిష్కారం ఏమిటి? ఏం సాధిస్తే మీరు ఆనందంగా ఇంటికి వెళ్లొచ్చు? ఏం చేస్తే విజయం లభించిందని మీరు భావిస్తారు? ఎప్పుడయితే మీరు ఇంగ్లిష్‌లో అనర్గలంగా మాట్లాడగలరో అప్పుడే ఆనందం లభిస్తుంది. ఏ రోజైతే మీరు మీ భావాలను ఇంగ్లిష్‌లో సునాయాసంగా వ్యక్తపర్చగలరో అప్పుడే మీ ప్రయత్నంలో సఫలం అయ్యారని అర్థం.
-ఇంగ్లిష్‌లో ఒక సామెత ఉంది. Mother knows the best అంటే పిల్లకు ఏం కావాలో తల్లికి తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలియదని అర్థం. అదేవిధంగా మిమ్మల్ని విజేతలుగా ఎలా మార్చాలో నాకు తెలుసు. అదే విధంగా ఇంగ్లిషే మీ మాతృభాష అన్నంత సునాయాసంగా మాట్లాడగలరు. మీరు అలా మాట్లాడాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. నన్ను సంపూర్ణంగా విశ్వసించండి. మొదట చిన్న చిన్న వాక్యాలతో మాట్లాడటం ప్రారంభించాలి. ఇంగ్లిష్‌లో మాట్లాడటం నేర్చుకోవడానికి మీరు ఇప్పటికే అనేక పద్ధతులు ఉపయోగించి, ప్రయోగాలు చేసి విఫలమై ఉంటారు. నాకు తెలుసు ఆ సంగతి. అందరూ ఆయన చెప్పే మాటల్ని ఆమోదిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టారు. కరతాళ ధ్వనులతో సెమినార్ హాలు దద్దరిల్లి పోయింది చాలా చేపు.
ఇప్పటిదాకా ఉపయోగించిన పద్ధతులు
-Accent నేర్చుకోవడం
-ఆడియో సీడీలు వినడం
-వీడియోలు, డీవీడీలు చూడటం
-లాంగ్వేజ్ ల్యాబ్ పేరుతో కంప్యూటర్ ముందు కూర్చొని, రిపీట్ చేస్తూ వినడం
-డీవీడీలు చూస్తూ ఇన్స్ట్రక్టర్ చెప్పినప్పుడల్లా పైకి ఉచ్చరిస్తూ చూడటం
-గ్రామర్ సూత్రాలను బట్టీ పట్టడం
-గ్రామర్ ఎక్సర్సైజులు చేయడం
-అనువాద పద్ధతుల్లో మాట్లాడటం
-యూ ట్యూబ్ చూసి నేర్చుకోవడం
-ఎంఏ ఇంగ్లిష్ చేసి ఏదో కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసే వారి వద్ద స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకోవటం.
-వర్డ్ పవర్ బుక్స్ చదవడం.
-ఇవన్నీ ఇప్పటి వరకు అమల్లో ఉన్న పద్ధతు లు. ఇంగ్లిష్‌లో మాట్లాడటం మీ లక్ష్యం అయితే ఇవేవీ కూడా సంపూర్ణ ఫలితాలు ఇవ్వవు. మహా అంటే ఇంగ్లిష్ గ్రామరో, వొకాబులరీనో, ఆక్సెంటో ఇంప్రూవై ఉండొచ్చు పై పద్ధతుల ద్వారా. ఈ పద్ధతుల ద్వారా మీరు అనర్ఘళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగే అవకాశాలు తక్కువ. ఇటీవల సినిమా థియేటర్లా ఏర్పాటు చేసి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇచ్చే విధానాన్ని కొందరు ప్రయత్నిస్తున్నారు. ట్రైనర్ల కొరత వల్ల ఏర్పడిన పరిణా మం ఇది. బాగా చెప్పగలిగిన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. అన్ని ఊర్లలో ఉన్న బ్రాంచ్‌లను ఆయన ఒక్కడే ఎలా చెప్పగలడు? ఆ విధానం యూట్యూబ్ చూడటం కన్నా మెరుగేం కాదు.
-ఇటీవల ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఒకటి వ్యాప్తిలోకి వచ్చింది. పై పద్ధతులు అన్నింటికన్నా ఇది కాస్తా మెరుగు అని చెప్పడం ముగించాడు నందు. మరి ఏది సరైన పద్ధతి? మీ ఇన్స్టిట్యూట్లో చేరడమొక్కటేనా? ఒక కుర్రాడు చిలిపిగా ప్రశ్నించాడు. కానే కాదు. ఇందాక మనం చెప్పుకొన్న పద్ధతులు సరైనవి కావని చెప్పడమే నా ఉద్దేశం. చిరునవ్వుతో చెప్పాడు నందు సార్. మరి ఏ పద్ధతి సరైనది? తప్పకుడా చెప్తాను. కాకపోతే నాకంటే ముందే మీరు చెబుతారు ఇప్పుడు నేను చెప్పే ఉదాహరణ మీకు అర్థమయితే.
-కూచిపూడి నృత్యం
-ఈత
-పాట పాడటం
-కార్ డ్రైవింగ్ చేయడం
-మోటర్ సైకిల్ నడపడం
-వంట వండటం
-ఇవన్నీ స్కిల్స్. అంటే నైపుణ్యాలు. అదేవిధంగా ఇంగ్లిష్‌లో మాట్లాడటం కూడా స్కిల్. ఉదాహరణకు డీవీడీ చూస్తూనో, బుక్ చదువుతూనో ఈత కొట్టడం నేర్చుకోగలమా? కం ప్యూటర్ ద్వారానో, ఆన్లైన్ కోచింగ్ ద్వా రానో, యూట్యూట్ ద్వారానో ఈత కొట్టడం నేర్చుకోగలమా? నేర్చుకోవడంలో మేళకువలను మెరుగుదిద్దుకోవడానికి ఈ పద్ధతులు సాహాయపడతాయి అంతే. మరి ఈతకొట్టడం నేర్చుకోవడం ఎలా? అని ప్రశ్నించాడు నందు సార్.
-నీళ్లలో దిగడమే పరిష్కారం. ఒక అనుభవజ్ఞుడైన శిక్షకుడి పర్యవేక్షణలో నీళ్లలోకి దిగి నేర్చుకోవడమే పరిష్కారం. ముక్తకంఠంతో చెప్పారందరూ. సరిగ్గా చెప్పారు. ఇంగ్లిష్ కూడా ఒక స్కిల్. మాట్లాడే స్కిల్‌ను మాట్లాడుతూ నేర్చుకోవడమే ఇంగ్లిష్ భాషలో మాట్లాడాలంటే పరిష్కారం. కాకపోతే అనుభవజ్ఞుడైన శిక్షకుడిని ఎంచుకోవడమే మీరు చేయాల్సిన పని.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?