Public life chariots are minerals | జనజీవన రథచక్రాలు ఖనిజాలు (గ్రూప్-1 ప్రత్యేకం)
అలోహ ఖనిజాలు
అభ్రకం (మైకా)
-ప్రపంచ ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉన్నది.
– దేశంలో ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లో అత్యధిక నిల్వలు ఉన్నాయి.
గనులు
– ఆంధ్రప్రదేశ్- గూడూరు (నెల్లూరు జిల్లా)
– ఇక్కడున్న షా గని దేశంలోనే అత్యంత లోతైనది.
-జార్ఖండ్- కోడెర్మా గని, హజారీబాగ్
– రాజస్థాన్- జైపూర్, బిల్వార్, ఉదయ్‌పూర్
ఆస్బెస్టాస్
– రాతినారను ప్రపంచంలో రష్యా అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది. దేశంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుండగా, రాజస్థాన్, కర్ణాటకలో అత్యధిక నిల్వలు ఉన్నాయి.
– తెలంగాణలో ఖమ్మంలో రాతినార ఎక్కువగా లభిస్తున్నది.
ముగ్గురాయి
– ప్రపంచంలోనే నాణ్యమైన, అధికపరిమాణంలో బెరైటీస్ నిల్వలు ఆంధ్రప్రదేశ్‌లోని మంగంపేట (కడప) దగ్గర ఉన్నాయి. రాష్ట్రంలో ఖమ్మంలో ముగ్గురాయి అధికంగా లభిస్తున్నది.
యురేనియం
-ప్రపంచంలో కజకిస్థాన్ యురేనియంను అధికంగా ఉత్పత్తి చేస్తున్నది.
-దేశంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నది. జాదుగూడ (జారండ్), పెద్దఅడిశర్లపల్లి (నల్లగొండ), ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మలపల్లి (కడప), శంకరంపేట (నెల్లూరు)లో ఈ గనులు విస్తరించి ఉన్నాయి.
మోనోజైట్
– దీని నుంచి థోరియంను గ్రహిస్తారు.
– ప్రపంచంలో దీని నిల్వలు భారతదేశంలో అధికంగా ఉన్నాయి.
– దేశంలో కేరళ, ఆంధ్రప్రదేశ్ (విశాఖ బీచ్ ఇసుకలో) ఎక్కువగా ఉన్నాయి.
సున్నపురాయి
– దీన్ని ఎక్కువగా సిమెంట్ పరిశ్రమలో ఉపయోగిస్తారు.
– సున్నపురాయిలో 10 శాతం మెగ్నీషియం ఉంటే దాన్ని డోలమైట్ అంటారు.
– దేశంలో ఉత్పత్తి పరంగా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లు అగ్రస్థానంలో ఉండగా, నిల్వల పరంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
– తెలంగాణలో నల్లగొండలో సున్నపురాయి అధిగా లభ్యమవుతున్నది.
ఇంధన ఖనిజాలు
బొగ్గు
-ఇది హైడ్రో కార్బన్.
– ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా, అమెరికా, భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-బొగ్గులోని కార్బన్ శాతం ఆధారంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి..
ఆంత్రసైట్ బొగ్గు- 90 శాతం
బిట్యుమినస్ బొగ్గు- 75- 80 శాతం కార్బన్
– ఈ రకం బొగ్గు భారత్‌లో అధికంగా లభ్యమవుతున్నది.
లిగ్నైట్- 65 శాతం
– తమిళనాడులోని నైవేలీలో లభిస్తుంది.
పీట్- 35 శాతం
– ఇది చెక్కలా కాలుతుంది. మంట తక్కువ, పొగ ఎక్కువగా ఉంటుంది.
– దేశంలో కోకింగ్ రకానికి చెందిన బొగ్గు నిల్వలు చాలా తక్కువ. కాబట్టి మనకు కావాల్సిన ఈ రకపు బొగ్గును ఆస్ట్రేలియా, చైనాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.
కాలం ఆధారంగా బొగ్గు రెండు రకాలు..
– గోండ్వానా రకపు బొగ్గు: ఇది 200-250 మి. ఏండ్ల క్రితం ఏర్పడింది.
– టెర్షియరీ బొగ్గు: ఇది 55-60 మి. ఏండ్ల క్రితం ఏర్పడింది.
– ఈ రకపు బొగ్గు దేశంలో 2 శాతం మాత్రమే లభిస్తున్నది. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో, తమిళనాడు విస్తరించి ఉంది.
– దేశంలో ఉత్పత్తిపరంగా జారండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మొదటి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో ఖమ్మం, వరంగల్‌లో ఎక్కువగా లభిస్తున్నది. ఒడిశా, జారండ్, ఛత్తీస్‌గఢ్‌లో నిల్వలు అధికంగా ఉన్నాయి.
గోండ్వానా రకపు బొగ్గు విస్తరణ..
– ప్రస్తుతం అత్యంత విలువైన, పెద్ద గని ఝరియా (జారండ్). దీన్ని స్టోర్ హౌస్ ఆఫ్ ద బెస్ట్ మెటలర్జికల్ కోల్ ఇన్ ఇండియా అని పిలుస్తారు.
– అతి పురాతన బోగ్గుగని- రాణిగంజ్ (పశ్చిమబెంగాల్)
– ఎక్కువ నిల్వలున గనులు రాణిగంజ్, తాల్చేర్ (ఒడిశా)
– దేశంలో అతిపెద్ద ఓపెన్‌కాస్ట్ గని- తాల్చేర్
– రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న బొగ్గుగని- సింగ్రౌలి (ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో విస్తరించి ఉంది)
పెట్రోలియం
-పెట్రోలియం అనే ఇంగ్లిష్ పదం పెట్రో (రాయి), ఓలియం (నూనె) అనే లాటిన్ పదాల నుంచి వచ్చాయి. పెట్రోలియంను ద్రవ బంగారం అని పిలుస్తారు. ఇది అవక్షేప శిలలో దొరుకుతుంది.
– దేశంలో పూర్తిస్థాయిలో తవ్విన చమురు బావి, పురాతన బావి- దిగ్భాయ్ (అసోం)
– మొదటిసారిగా పెట్రోలియంను గుర్తించిన ప్రాంతం- మాకూమ్ (అసోం)
– పెట్రోలియం ఉత్పత్తిలో ప్రపంచంలో అమెరికా, చైనా, కువైట్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో మహారాష్ట్ర- బాంబేహై, రాజస్థాన్-బర్మార్, అసోం-దిగ్భాయ్, మాకూమ్, ఆంధ్రప్రదేశ్- రవ్వ, తాటిపాక (తూర్పుగోదావరి), కృష్ణాగోదావరి బేసిన్లో లభిస్తున్నది.
– దేశంలో అతిపెద్ద చమురు బావి- మధురా (ఉత్తరప్రదేశ్)
– ప్రైవేట్‌రంగంలో ఏకైక చమురుశుద్ధి కర్మాగారం- రిలయన్స్ చమురుశుద్ది కర్మాగారం జామ్‌నగర్ (గుజరాత్)
పైప్లైన్లు (పెట్రోలియం, సహజవాయువు)
-దేశంలో మొదటి పెట్రోలియం పైప్‌లైన్- సహర్కాటియా నుంచి గువాహటి వరకు (1964). తర్వాత దీన్ని బరౌని వరకు పొడిగించారు. దీని పొడవు 1167 కి.మీ.
– రెండో పైప్‌లైన్ హెచ్బీజే పైప్‌లైను. దీనిపొడవు 1750 కి.మీ. ఇది హజీరా (గుజరాత్), బీజాపూర్ (మధ్యప్రదేశ్), జగదీష్పూర్ (ఉత్తరప్రదేశ్‌లను) కలుపుతున్నది. ప్రస్తుతం దీన్ని ఢిల్లీకి దగ్గర్లోని బత్రాలా వరకు పొడిగించారు.
-దేశంలో పెట్రోలియం తూర్పు తీరం, పశ్చిమతీరంలో ఖండాంతర్గత సముద్రప్రాంతాల్లో లభిస్తున్నది.
పశ్చిమతీరం
-ఇటీవల పెట్రోలియం నిల్వలు బయటపడిన ప్రాంతం- మాంగ్లా (రాజస్థాన్)
తూర్పుతీరం
– ఆంధ్రప్రదేశ్‌లోని కేజీ బేసిన్ (రవ్వ, లింగాల, అమలాపురం మొదలైన ప్రాంతాలు)
– తమిళనాడులో కావేరీ బేసిన్ (నారీమనం, కొవెలపూర్)
సహజవాయువులు
– సహజవాయువుల అధికంగా లభించే ప్రాంతాలు అసోం, గుజరాత్, ప్రపంచంలో రష్యాలో అధికంగా ఉత్పత్తి అవుతున్నది.
లభించే ప్రాంతాలు
– గుజరాత్- అంకలేశ్వర్, కాంబే బేసిన్
– మహారాష్ట్ర- బొంబాయ్హై
– రాజస్థాన్- తానోట్
– అరుణాచల్‌ప్రదేశ్- లాప్టంగ్పుంగ్
– అసోం- సహర్ కటియా
– పశ్చిమబెంగాల్- మిడ్నాపూర్
– హిమాచల్‌ప్రదేశ్- జ్వ్యాలా ముఖి, ఖాంగ్రా
– పంజాబ్- ఫిరోజ్‌పూర్
చమురుశుద్ధి కేంద్రాలు
– దేశంలో ప్రస్తుతం 22 చమురుశుద్ధి కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 17 ప్రభుత్వ రంగంలో, 3 ప్రైవేటు రంగంలో (జామ్‌నగర్ స్టేజ్ వన్, వాడినార్ స్టేజ్ 3, వాడినార్), రెండు ఉమ్మడి యాజమాన్యంలో (బినా-మధ్యప్రదేశ్, బటిన్డా (పంజాబ్) ఉన్నాయి.
– ప్రభుత్వ రంగంలో అతిపెద్దది- కియాలి (గుజరాత్)
– ప్రభుత్వరంగంలో అతి చిన్నది- నుమాలిగర్ (అసోం)
– దేశం మొత్తంలో అతిపెద్దది- జామ్‌నగర్ (గుజరాత్)
– దేశంలో అతిచిన్నది- నుమాలిగర్ (అసోం)
అణుఖనిజాలు
యురేనియం
– దీని ముడి ఖనిజం- పిచ్‌బ్లెండ్
-ఇది జాదుగూడ (జారండ్), గయా (బీహార్), ఆరావళి పర్వతాలు (రాజస్థాన్), నల్లగొండ (తెలంగాణ), కడప (ఆంధ్రప్రదేశ్)లో లభిస్తుంది.
– యురేనియం అణువిద్యుత్ కేంద్రాలు.. జైతాపూర్ (మహారాష్ట్ర), హరిపూర్ (పశ్చిమబెంగాల్), కుడంకుళం (తమిళనాడు)
థోరియం (Th)
– దీని ముడిఖనిజం మోనజైట్. ఇది ఎక్కువగా మలబార్ తీరంలో (కేరళ) ఇసుక రూపంలో లభిస్తుంది. జారండ్, బీహార్, తమిళనాడులో స్వల్పంగా లభిస్తుంది.
జర్కోనియం (Zr)
– ముడిఖనిజం జిర్కాన్
– ఇది మలబార్ తీరంలో లభిస్తుంది.
టైటానియం (Ti)
– ఇది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ తీరంలో లభిస్తుంది.
ఇల్మనైట్
-ఇవి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ తీరానికి దగ్గర్లో ఉన్న చింతపల్లి, ముక్కాముల ఇసుక దిబ్బల్లో లభిస్తుంది.
ప్రస్తుతం ప్రపంచంలో అణువిద్యుత్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం: ఫ్రాన్స్ (70 శాతం)
భారత్ వాటా 3 శాతం
దేశంలోని అణువిద్యుత్ కేంద్రాల సంఖ్య- 7
(తారాపూర్-మహారాష్ట్ర, రావత్‌భటా-రాజస్థాన్, కుడంకుళం-తమిళనాడు, కైగా-కర్ణాటక, కాక్రపార్-గుజరాత్, కల్పకం-తమిళనాడు, నరోరా-ఉత్తరప్రదేశ్)
– దేశంలో మొదటి అణువిద్యుత్ కేంద్రం- తారాపూర్ (మహారాష్ట్ర)
– తారాపూర్‌లోని అణురియాక్టర్ పేరు- అప్సర
– ఇది తమిళనాడులోని కల్పకం కేంద్రంలో ఉన్నది.
– కల్పకం పేరు.. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్
– ఇటీవల మూసివేసిన రియాక్టర్ కెనడా ఇండియన్ రియాక్టర్ యుటిలిటీ సర్వీస్ (CIRUS)
భారజల కేంద్రాలు
– అణువిద్యుత్ కర్మాగారంలో మితకారిగా భారజలాన్ని వాడుతారు.
పంజాబ్- నంగల్
రాజస్థాన్- కోటా
గుజరాత్-బరోడా
మధ్యప్రదేశ్-హజీరా
మహారాష్ట్ర- థాల్
తమిళనాడు- ట్యుటికోరన్
తెలంగాణ- మణుగూరు (ఖమ్మం)
ఒడిశా- తాల్చేరు
కాసం రమేష్
జాగ్రఫీ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్, నిజామాబాద్
9440690883
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?