Nobel Prize | నోబెల్ బహుమతి
ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతిని 1901లో ప్రారంభించారు. స్వీడన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఈ బహుమతిని ప్రవేశపెట్టారు. ఆయన పేలుడు పదార్థమైన డైనమేట్‌ను కనుగొన్నారు. మొదట ఈ బహుమతిని ఐదు (శాంతి, సాహిత్యం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రం) రంగాల్లో ఇచ్చేవారు. 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ ఇవ్వడం ప్రారంభించారు. అంటే ప్రస్తుతం ఆరు రంగాల్లో నోబెల్ బహుమతి ఇస్తున్నారు. ఈ బహుమతి విలువ 13.5 లక్షల అమెరికన్ డాలర్లు. ప్రతి ఏడాది నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న నోబెల్ బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుంది. నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో, మిగతా ఐదింటిని స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ప్రదానం చేస్తారు.
ఉద్దేశం
-ప్రతి ఏడాది జాతి, మత, ప్రాంత వివక్ష లేకుండా మానవజాతి మేలుకోసం మహత్తరమైన కృషి చేసిన వారికి నోబెల్ బహుమతి ఇస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో.. తనకుగల 90 లక్షల డాలర్ల విలువైన ఆస్తి నుంచి వచ్చే ఆదాయంతో ఏటా ఐదు రంగాల్లో బహుమతులు ఏర్పాటు చేయాలని రాశారు.
నోబెల్ గ్రహీతలను ఎంపికచేసే సంస్థలు
-ప్రతి ఏడాది ఆరు రంగాల్లో ప్రదానం చేసే నోబెల్ బహుమతుల గ్రహీతలను.. ఒకే సంస్థ కాకుండా రంగాల వారీగా 5 వేర్వేరు సంస్థలు ఎంపిక చేస్తాయి.
-నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ
– మేరీ క్యూరీ (భౌతికశాస్త్రం – 1903)
-రెండు రంగాల్లో నోబెల్ పొందిన తొలి వ్యక్తి
– మేరీ క్యూరీ (భౌతిక శాస్త్రం-1903, రసాయనశాస్త్రం – 1911)
-అతిచిన్న వయస్సులో నోబెల్ పొందిన వ్యక్తి
– మలాలా యూసఫ్‌జాయ్ (17),(శాంతి – 2014)
-అతి ఎక్కువ వయస్సులో నోబెల్ పొందిన వ్యక్తి – లియోనిడ్ హ్యూరిచ్ (90), (అర్థశాస్త్రం – 2007)
-2009లో ఎక్కువ మంది మహిళలు (ఐదుగురు) నోబెల్ బహుమతి అందుకున్నారు.
రంగాల వారీగా తొలి నోబెల్ పొందినవారు
-సాహిత్యం (1901) – సూలి ప్రూదోమి
-శాంతి (1901) – జీన్‌హెన్రీ డ్యూనాంట్ (స్విట్జర్లాండ్), ఫ్రెడరిక్ ప్యాసీ (ఫ్రాన్స్)
-భౌతిక శాస్త్రం (1901) – విల్హెల్మ్ కొనార్డ్ రాంట్జన్ (జర్మనీ)
-వైద్యం (1901)
– ఎమిల్ అడాల్ఫ్ వోన్ బెహరింగ్ (జర్మనీ)
-రసాయన శాస్త్రం (1901)
– జాకోబస్ హెన్రీకస్ వాంట్‌హాఫ్ (నెదర్లాండ్స్)
-అర్థశాస్త్రం (1969)
– రగ్నార్ఫ్రిష్ (నార్వే), జాన్ టిన్బెర్గెన్ (నెదర్లాండ్స్)
రెండుసార్లు నోబెల్ పొందినవారు
-మేరీ క్యూరీ – ఫిజిక్స్ (1903), కెమిస్ట్రీ (1911)
-లినస్ పౌలింగ్ – కెమిస్ట్రీ (1954), శాంతి (1962)
-జాన్ బార్డీన్ – ఫిజిక్స్ (1956, 1972)
-ఫ్రెడరిక్ సాంగర్ – కెమిస్ట్రీ (1958, 1980)
రంగం ఎంపిక సంస్థ
శాంతి నార్వేజియన్ పార్లమెంట్ (నార్వే)
సాహిత్యం స్వీడిష్ లిటరేచర్ అకాడమీ (స్వీడన్)
భౌతిక శాస్త్రం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (స్వీడన్)
రసాయన శాస్త్రం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (స్వీడన్)
వైద్య శాస్త్రం కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ (స్వీడన్)
ఆర్థిక శాస్త్రం బ్యాంక్ ఆఫ్ స్వీడన్ (స్వీడన్)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?