Nobel for service | సేవకు పట్టం నోబెల్
ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతి. ఈ నోబెల్ బహుమతిని డైనమేట్‌ను కొనుగొన్న విఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ప్రారంభించారు. వైద్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాల్లో ఈ బహుమతిని అందజేస్తారు. 1968లో స్వీడన్ బ్యాంక్ 300వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతిని ఏర్పాటు చేసి, 1969 నుంచి ప్రదానం చేస్తున్నారు. దీన్ని నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్‌గా పిలుస్తారు. నోబెల్ బహుమతులను డిసెంబర్ 10న నోబెల్ వర్ధంతి సందర్భంగా స్టాక్‌హోంలో ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా నోబెల్ బహుమతులపై నిపుణ పాఠకుల కోసం ప్రత్యేక వ్యాసం..
-నోబెల్ బహుమతికి ప్రారంభంలో 1,50,782 స్వీడిష్ క్రోనార్లు ఇచ్చేవారు. ప్రస్తుతం 80 లక్షల స్వీడిష్ క్రోనార్లు (సుమారు రూ.6.7 కోట్లు) ఇస్తున్నారు.
-ప్రతి ఏడాది నోబెల్ బహుమతిని ఒక్కో రంగంలో గరిష్టంగా ముగ్గురికి ఇస్తారు.
-ప్రతి ఏడాది ముందుగా వైద్యరంగంలో.. ఆ తర్వాత వరుసగా భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, శాంతి, అర్థశాస్త్రం, సాహిత్యరంగాల్లో ప్రదానం చేస్తారు.
-ఆల్ఫ్రెడ్ నోబెల్ కృషిని గుర్తిస్తూ అతని పేరు మీద కృత్రిమ మూలకానికి నోబెలియమ్ అని పేరు పెట్టారు.
-1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధంవల్ల, 1939 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధంవల్ల, కొన్ని ప్రత్యేక కారణాలవల్ల నోబెల్ బహుమతిని కొన్ని విభాగాల్లో ఇవ్వలేదు.
నోబెల్ బహుమతుల విశేషాలు
-1901 నుంచి 2016 వరకు 579 సార్లు నోబెల్ బహుమతులు ప్రకటించగా, 911 మంది అందుకున్నారు.
-1901 నుంచి 2016 వరకు వైద్యంలో 107 సార్లు, 211 మందికి అందజేశారు.
-1901 నుంచి 2016 వరకు భౌతికశాస్త్రంలో 110 సార్లు, 204 మందికి ప్రదానం చేశారు.
-1901 నుంచి 2016 వరకు రసాయనశాస్త్రంలో 108 సార్లు, 175 మందికి నోబెల్ ఇచ్చారు.
-1901 నుంచి 2016 వరకు శాంతి విభాగంలో 97 సార్లు, 130 మందికి అందజేశారు.
-1901 నుంచి 2016 వరకు సాహిత్య విభాగంలో 109 సార్లు, 113 మందికి ప్రదానం చేశారు.
-1901 నుంచి 2016 వరకు అర్థశాస్త్ర విభాగంలో 48 సార్లు, 78 మందికి ఇచ్చారు.
-1901 నుంచి 2016 వరకు నోబెల్ బహుమతి అందుకున్న మహిళలు 49 మంది.
-అడాల్ఫ్ హిట్లర్ ఆదేశాలతో రిచర్డ్ కూన్, అడాల్ఫ్, బెటెన్ నండెంట్, గెర్హర్డ్ డోమాగ్క్ నోబెల్ బహుమతులను స్వీకరించలేదు.
-రష్యా ఆదేశంతో బోరిస్ పాస్టర్ నాక్ నోబెల్ ప్రైజ్ తీసుకోలేదు.
-అత్యధిక వయస్సులో నోబెల్ బహుమతి అందుకున్నది – లియోనీడ్ (90 ఏండ్లు). 2007లో అర్థశాస్త్రంలో.
-అతిచిన్న వయస్సులో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నది – మలాలా యూసఫ్‌జాయ్ (17 ఏండ్లు). 2014లో.
మరణానంతరం నోబెల్ బహుమతి గ్రహీతలు
-నోబెల్ కమిటీ 1974లో.. మరణానంతరం నోబెల్ బహుమతి ఇవ్వరాదని నిర్ణయించింది. కానీ అంతకుముందే 1931లో ఎరిక్ ఎక్సెల్ కార్ల్ఫెల్డ్కు (సాహిత్యంలో), 1961లో డాగ్ హమేర్స్ జోల్డ్‌కు (శాంతి విభాగంలో) మరణానంతరం నోబెల్ బహుమతులు లభించాయి.
ఒకటి కంటే ఎక్కువసార్లు నోబెల్ ప్రైజ్ స్వీకర్తలు
-జె.బర్దీన్ 1956, 1972లో రెండుసార్లు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు.
-మేడం క్యూరీ 1903లో భౌతికశాస్త్రంలో, 1911లో రసాయనశాస్త్రంలో నోబెల్ తీసుకున్నారు.
-ఎల్ పౌలింగ్ 1954లో రసాయనశాస్త్రంలో, 1962లో శాంతి విభాగంలో నోబెల్ స్వీకరించారు.
-ఎఫ్.సాంగర్ 1958లో, 1980లో రెండుసార్లు రసాయనశాస్త్రంలో నోబెల్ అందుకున్నారు.
-అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థ శాంతి విభాగంలో 1917, 1944, 1963లో మూడుసార్లు నోబెల్ అందుకుంది.
-యూఎన్హెచ్ఆర్సీ శాంతి విభాగంలో 1954, 1981లో రెండుసార్లు నోబెల్ స్వీకరించింది.
భారత మూలాలున్న నోబెల్ గ్రహీతలు
-1902లో వైద్యంలో నోబెల్ బహుమతి అందుకున్న రోనాల్డ్‌రాస్ ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో జన్మించారు.
-1907లో సాహిత్యంలో నోబెల్ అందుకున్న రుడ్వార్డ్ ముంబైలో జన్మించారు.
-1968లో వైద్యంలో నోబెల్ బహుమతి అందుకున్న హరగోవింద ఖొరాన పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో, 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్ అందుకున్న సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జన్మించి జన్మతః భారతీయులైనప్పటికీ (వారు జన్మించినప్పుడు పాకిస్థాన్.. భారత్‌లో అంతర్భాగం) అమెరికాలో స్థిరపడ్డారు.
-1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న మహమ్మద్ అబ్దుస్ సలాం పంజాబ్‌లోని షాహిహాల్ జిల్లాలో జన్మించారు.
-1989లో శాంతి విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్న దలైలామా 1959 నుంచి భారత్‌లోనే ఉంటున్నారు.
-2001లో సాహిత్యంలో నోబెల్ బహుమతి స్వీకరించిన వీఎస్ నైపాల్ భారత సంతతికి చెందినవాడు. ఆయన ట్రినిడ అండ్ టుబాగోలో జన్మించారు.
-2007లో శాంతి విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్న మహమ్మద్ యూనస్ చిట్టగాంగ్‌లో జన్మించారు.
-2009లో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వెంకటరామన్ రామకృష్ణన్ తమిళనాడులోని చిదంబరంలో జన్మించారు. ఆయన బ్రిటన్, అమెరికన్ పౌరసత్వం తీసుకున్నారు.
నోబెల్ బహుమతుల నిర్ణేతలు
-వైద్యశాస్త్రం – స్వీడన్‌కు చెందిన కరోలిన్స్కా చిరాచికిల్ ఇన్స్టిట్యూట్
-భౌతికశాస్త్రం – రాయల్ స్వీడన్ అకాడమీ ఆఫ్ సైన్స్
-రసాయనశాస్త్రం – రాయల్ స్వీడన్ అకాడమీ ఆఫ్ సైన్స్
-శాంతి విభాగం – నార్వే పార్లమెంటరీ కమిటీ
-ఆర్థిక రంగం – స్వీడిష్ బ్యాంక్
-సాహిత్యం – స్వీడిష్ కమిటీ
2016లో నోబెల్ బహుమతి గ్రహీతలు
వైద్యరంగం
-2016 ఏప్రిల్ 3న వైద్యరంగంలో నోబెల్ బహుమతి జపాన్ శాస్త్రవేత్త యోసినోరి ఓసుమీకి (71) దక్కింది.
-కొనుగొన్న అంశం: కణాలు తమలోని దెబ్బతిన్న భాగాలను స్వీయ విధ్వంసం చేసుకుని, పునరుద్ధరించుకునే ప్రక్రియ (ఆటోపేజ్) గుట్టు విప్పినందుకు నోబెల్ బహుమతి ప్రకటించారు.
భౌతికశాస్త్రం
-2016, ఏప్రిల్ 4న భౌతికశాస్త్ర నోబెల్ బహుమతిని బ్రిటన్ శాస్త్రవేత్తలు డేవిడ్ థౌలస్ (82), డంకన్ హాల్డెన్ (65), మైఖేల్ ఖొస్టేర్లిడ్జ్ (73) లకు లభించింది. ప్రైజ్‌మనీ మొత్తంలో (రూ.6.16 కోట్లు) సగం డేవిడ్ థౌలస్‌కు, మరో సగం మిగతా ఇద్దరికి సమానంగా పంచుతారు.
-కొనుగొన్న అంశం: అసాధారణ స్థితిలో ఉండే పదార్థాల్లో అంటే సూపర్ కండక్టర్లు, సూపర్ ఫ్లూయిడ్స్, అత్యంత పలుచగా ఉండే మాగ్నటిక్ ఫిల్మ్‌కు సంబంధించిన పొరల్లో మార్పులను వివరించడానికి గణితశాస్త్రంలో టోపాలజీని వినియోగించారు. ఈ బావనలు భవిష్యత్‌లో అతిచిన్న, వేగవంతమైన కొత్త తరం క్వాంటమ్ కంప్యూటర్స్ పురోభివృద్ధిలో, నానో ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన డిజైన్ రూపకల్పనకు ఎంతగానో దోహదపడుతాయి. అధిక ఉష్ణోగ్రత వెలువడకుండా సూపర్ కండక్టివిటీ ప్రక్రియను కనిష్టస్థాయి ఉష్ణోగ్రతవద్ద నిర్వహించడంలో వీరు సఫలమయ్యారు.
-రసాయన శాస్త్రం: భవిష్యత్‌లో సూక్ష్మ రోబోలు, కృత్రిమ అవయవాలకు యాంత్రిక కండరాలుగా పనిచేసే విధంగా అణువుల స్థాయిలో పనిచేసే యంత్రాల (మాలిక్యులర్ మెషిన్స్)ను అభివృద్ధి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయనశాస్త్ర నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఈ ఆవిష్కరణలు భవిష్యత్‌లో సెన్సర్లు, ఎనర్జీ, స్టోరేజీ సిస్టమ్, ఇతర కొత్త తరం మెటీరియల్ తయారీలో కీలకం కానున్నాయి.
శాంతి బహుమతి
-2016 నోబెల్ శాంతి బహుమతిని కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ గెలుచుకున్నారు. 52 ఏండ్లుగా కొలంబియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధాన్ని అంతం చేసి, దేశంలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు చేసిన కృషికి శాంటోస్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
ఫార్క్ : భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామీణ పేదల తరపున గళం వినిపించే లక్ష్యంతో 1960లో ఫార్క్ (ఫ్యూయోర్జాస్ ఆర్మడాస్ రివల్యూషనరీస్ ది కొలంబియా)ను ఏర్పాటుచేశారు. కొలంబియాలో పేదరికం, నిరుద్యోగం, అవిద్య, అసమానతలు ఎక్కువ. కేవలం ఒక శాతం ఉన్న సంపన్నుల చేతిలో 60 శాతం సాగు భూములున్నట్లు సాక్ష్యాత్తు ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది.
శాంతి బహుమతి విశేషాలు
-1901 నుంచి 2016 వరకు 97 సార్లు నోబెల్ శాంతి బహుమతులను ప్రదానం చేశారు.
-19 సార్లు వివిధ కారాణాలతో ప్రకటించలేదు.
-16 మంది మహిళలు మాత్రమే శాంతి విభాగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
-నోబెల్ బహుమతిని తిరస్కరించింది లెడుక్తో
-నోబెల్ బహుమతి ప్రకటించిన సమయంలో జైలులో ఉండి అందుకోని వారు కార్ల్ వొన ఒస్సీత్జి (జర్మనీ), ఆంగ్‌సాన్ సూచి (మయన్మార్) లియు క్షియోఓబో (చైనా).
-అర్థశాస్త్రం : అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి బ్రిటన్‌కు చెందిన ఒలివర్హార్డ్, ఫిన్లాండ్కు చెందిన బెంగెట్ హోంస్టోర్మ్లకు సంయుక్తంగా దక్కింది. ఒప్పంద సిద్ధాంతంలో విశేష కృషి చేసినందుకు ఈ అవార్డుకు ఎంపికైనట్లు జ్యూరీ తెలిపింది.
-ఒలివర్హార్డ్ కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
అర్ధశాస్త్ర నోబెల్ బహుమతి విశేషాలు
-1901 నుంచి 2016 వరకు 48 సార్లు అర్ధశాస్త్ర నోబెల్ బహుమతులను ప్రదానం చేశారు.
-ఇప్పటి వరకు అర్ధశాస్త్రం విభాగంలో నోబెల్ బహుమతులను అందుకున్నవారు 78 మంది
-ఒక్క మహిళ మాత్రమే అర్ధశాస్త్రం విభాగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
-24 సార్లు ఒక్కరే నోబెల్ బహుమతిని అందుకున్నారు.
-అతి చిన్న వయస్కుడు కెనెత్ జె.యారో (51)-1972
-అతి పెద్ద వయస్కుడు లియోనిడ్ హుర్విక్జ్ (90)
-అర్ధశాస్త్ర విభాగంలో నోబెల్ సాధించిన శాస్త్రవేత్తల సగటు వయస్సు 67 ఏండ్లు.
-సాహిత్యం: సాహిత్యంలో అమెరికా సంగీత దిగ్గజం, జానపద గాయకుడు, చక్కటి చిత్రకారుడు, గేయ రచయిత బాబ్ డిలాన్ (75)కు 2016 నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. తొలిసారిగా గీత రచయిత బాబ్డిలాన్ నోబెల్ బహుమతిని అందుకొని రికార్డ్ సృష్టించాడు. అమెరికన్ గేయ సంప్రదాయంలో సరికొత్త కవితాశైలి, భావవ్యక్తీకరణకు ఆయన ఊపిరి పోశారని స్వీడిష్ అకాడమీ పేర్కొన్నది. 1941 మే 24న మిన్నిసోటా (అమెరికా)లో సెయింట్ మేరి ఆస్పత్రిలో రాబర్ట్ అలెన్ జీమ్మర్ మెన్‌గా జన్మించారు. బాబ్ డిలాన్, 11 గ్రామీ అవార్డులను, 2008లో పులిట్జర్ బహుమతి పొందటంతో పాటు గోల్డెన్ గ్లోబ్ అకాడమీ అవార్డులను సొంతం చేసుకున్నాడు. 2012లో ఆయన అమెరికా అధ్యక్షుడు ఒబామా చేతుల మీదుగా ప్రెసిడెన్సియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అవార్డును అందుకున్నాడు.
సాహిత్య నోబెల్ విశేషాలు
-1901 నుంచి 2016 వరకు 109 సార్లు నోబెల్ బహుమతులను ప్రదానం చేశారు.
-ఇప్పటివరకు సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతులను అందుకున్నవారు 113 మంది
-14 మంది మహిళలు మాత్రమే సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
-అతి చిన్న వయస్కుడు రుడ్ యార్డ్ కిప్ లింగ్ (41)-1907
-అతి పెద్ద వయస్కుడు డొరిస్ లేస్సింగ్ (88)-2007
-సాహిత్య విభాగంలో నోబెల్ సాధించిన శాస్త్రవేత్తల సగటు వయస్సు 65 ఏండ్లు.
1901లో నోబెల్ బహుమతి గ్రహీతలు
బహుమతి పొందిన రంగం శాస్త్రవేత్త దేశం
వైద్యం ఏమిల్. ఎ. వాన్ బెహరింగ్ జర్మనీ
భౌతికశాస్త్రం విల్హెల్మ్ రాంట్జెన్ జర్మనీ
రసాయనశాస్త్రం జాకొబస్ హెచ్ వాంట్ హాఫ్ డచ్
సాహిత్యం సల్లీ పృదుమ్నే ఫ్రాన్స్
శాంతి హెన్నీ డ్యూనంట్ స్విట్జర్లాండ్
ఫ్రెడరిక్ పాసీ ఫ్రాన్స్
అర్థశాస్త్రం రగ్నర్ ఫ్రిషర్ నార్వే
జాన్ టిన్ బెర్గున్ నెదర్లాండ్
గమనిక: 1969 నుంచి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?