Method is better with urbanization | పద్ధతిగా ఉంటేనేపట్టణీకరణతో మేలు
ఆర్థికాభివృద్ధి పరిణామాల్లోని ప్రధాన మార్పుల్లో ఒకటి పట్టణీకరణ. ఉత్పాదక, ఉపాధి కేంద్రీకరణతో ప్రారంభయ్యే పట్టణీకరణతో మానవ వలసలు పెరిగి తద్వారా సామాజిక, ఆర్థికరంగాల్లో భారీ మార్పులు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రకమైన ఆర్థికాభివృద్ధితో ప్రయోజనాలతోపాటు అనేక కొత్త సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పట్టణీకరణ పర్యవసానాలపై నిపుణ పాఠకులకోసం ప్రత్యేకం..
పట్టణ జనాభా – ప్రభావం
పట్టణీకరణ అనేది అభివృద్ధికి సూచిక కానప్పటికీ ఇది పద్ధతి ప్రకారం పెరిగితే అది ఆరోగ్యమైన పెరుగుదల. అలాకాకుండా మురికివాడలు, కాలుష్యం సృష్టిస్తూ పట్టణీకరణ జరిగితే అది అనారోగ్యమైన అభివృద్ధి. పట్టణీకరణ వల్ల ధనాత్మక, రుణాత్మక అంశాలు ఉంటాయి. రుణాత్మక అంశాలు గమనిస్తే..
విద్య అవకాశాలు
గ్రామం యావత్తు విద్య కోసం గ్రామాల నుంచి వెళ్లడంతో పట్టణీకరణ సమస్య ఉండదు. దేశంలో మానవ మూలధనం కూడా పెరుగుతుంది.
రవాణా – సమాచార అభివృద్ధి
జనాభా గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లడంతో ప్రజల జీవన ప్రమాణం పెరుగుతుంది. అంటే అవసరాల నుంచి సౌకర్యాలకు, సౌకర్యాల నుంచి విలాసాలకు ప్రజలు కోరికలను పెంచుకుంటూ వెళ్తారు. ఉపాధి అవకాశాలు గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో అనేక రకాల వస్తువుల తయారీ జరుగుతుంది. అందువల్ల ఉపాధి అవకాశం అధికంగా ఉంటుంది.
గ్రామాల్లో ఒత్తిడి తగ్గుతుంది
గ్రామాల్లో అధిక జనాభా ఉండటంతో బహిర్గత, కాల, ప్రచ్ఛన్న నిరుద్యోగాల వంటి సమస్యలు ఉన్నాయి. కమతాలపై ఒత్తిడి పెరిగి సగటు కమతం 3.12 నుంచి 1.16 హెక్టార్లకు తగ్గినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఇలాంటి సమస్యలన్నీ గ్రామం నుంచి పట్టణ గమనశీలత పరిష్కరిస్తుంది.
పట్టణీకరణ సమస్యలు
పట్టణీకరణ అనేది అభివృద్ధికి సూచన. అయినప్పటికీ అది పరిమితి దాటితే సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆ సమస్యలు..
అధిక జనాభా
అధిక పట్టణీకరణ వల్ల మురికివాడలకు దారితీయడం, జబ్బులు ప్రబలడం, వసతిగృహాల సమస్య, నీటి సమస్య మొదలైనవి తలెత్తుతాయి.
అధిక జీవన ప్రమాణం
జనాభా తక్కువ విస్తీర్ణంలో అధికంగా పెరగడంతో జీవన వ్యయం పెరుగుతుంది. దాని ప్రభావం వస్తువుల ధరలపై పడటం, చివరికి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.
వస్తువులన్నీ కొన్ని నగరాల్లోనే ఉత్పత్తి కావడంతో ఆ వస్తువులను దేశానికంతటికీ రవాణా చేయడంతో ప్రాంత ప్రాంతానికి ధరల్లో భేదం ఉంటుంది. చాలావరకు వస్తువులు ముంబై, దాని పరిసర ప్రాంతాల్లో తయారవుతున్నాయి.
హింస పెరగడం
వలసలు అధికం కావడంతో జీవనం సమస్యగా మారడం, ఉపాధి అందరికీ అందుబాటులో లేకపోవడంతో కొన్ని అహింసా అంశాలు తలెత్తుతాయి. ముఖ్యంగా దొంగతనం, హత్యలు, మోసం, జేబుదొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు మొదలైనవి.
రుణాత్మక ప్రవర్తన
వ్యక్తుల ప్రవర్తన కొంతవరకు విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్వార్థం, మానవీయ విలువలు లేకపోవడం మొదలైనవి పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
కాలుష్య సమస్య
ఉత్పత్తి ప్రక్రియలో చమురు మండించడం ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, ఆయిల్, బొగ్గు, సహజ వాయువు మండించడంతో గ్రీన్హౌస్ గ్యాస్ ఏర్పడి ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఒత్తిడి
జీవన విధానం ప్రశాంతంగా కాకుండా కొంత ఒత్తిడితో కూడి ఉంటుంది. వాణిజ్య ధోరణి పెరుగుతుంది. ఉదా: హైదరాబాద్ అక్షరాస్యత తెలంగాణలో మొదటిస్థానంలో ఉంది. కానీ స్త్రీ, పురుష నిష్పత్తిలో చివరి స్థానంలో ఉంది. ఇలాంటి విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది.
పట్టణాలు, స్థూల దేశీయోత్పత్తి
దేశంలో పట్టణీకరణ జరిగి వస్తుత్పత్తి పట్టణాల్లో కేంద్రీకృతం కావడంతో జాతీయ ఆదాయం అధికంగా పట్టణాల నుంచే వస్తుంది. దాదాపు 65 శాతం దేశ జాతీయ ఆదాయం పట్టణాల నుంచే వస్తుంది. అంటే 69 శాతం ఉన్న గ్రామ జనాభా 35 శాతం జాతీయ ఆదాయాన్ని మాత్రమే ఇస్తుంది.
రాష్ర్టాల్లో పట్టణీకరణ
2011 గణాంకాల ప్రకారం దేశంలో పట్టణ జనాభా 31.16 శాతంగా నమోదైంది. గ్రామ జనాభా 72.19 నుంచి 68.84 శాతానికి తగ్గింది.
దేశంలో పట్టణీకరణలో అధిక శాతం గోవా 62.17 శాతం కలిగి ఉండగా తరువాత మిజోరం 51.51 శాతం, తమిళనాడు 48.45 శాతం, కేరళ 47.72 శాతం కలిగి ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 33.49 శాతంగా పట్టణ జనాభా నమోదైంది. అదేవిధంగా తక్కువ శాతం గల రాష్ర్టాలు హిమాచల్‌ప్రదేశ్ 10.04 శాతం, బీహార్ 11.30 శాతం, అసోం 14.08 శాతం మాత్రమే కలిగి ఉన్నాయి. పట్టణ జనాభా అధికంగా మహారాష్ట్ర, జనాభా శాతం ఎక్కువగా గోవాలో ఉండే పట్టణాల సంఖ్య అధికం తమిళనాడులో ఉంది.
అభివృద్ధి – వలస
ఒక వ్యక్తి ఉపాధి కోసం తన సొంత ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి 60 రోజులపైగా మారినట్లయితే దాన్ని వలస అంటారు.
వలస అధికంగా ఉపాధి కోసం జరుగుతుంది. అదేవిధంగా వలసల్లో అధికంగా ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. అదేవిధంగా స్త్రీలు పిల్లలు కూడా వలసలో ఉన్నారు. అయితే మహిళల్లో అధికం పెండ్లిళ్లు చేసుకొని వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. దాదాపు 10 శాతం జీడీపీ వలస కార్మికుల వల్ల సమకూరుతుందని గణాంకాలు వివరిస్తున్నాయి.
గల్ఫ్ దేశాలకు వెళ్లి తిరిగివచ్చిన కార్మికులు అధికంగా నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు. నిర్మాణరంగంలో నైపుణ్యం ఉన్నవారు (కార్పెంటర్), లేనివారు (ఇసుక, ఇటుకలు మోసేవారు) ఇద్దరికి అవకాశం ఉంటుంది.
మహబూబ్‌నగర్ జిల్లా వాసులు కరువు వల్ల వేరే ప్రాంతాలకు వలస వెళ్లి నిర్మాణరంగంలో పనిచేస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని దక్షిణప్రాంతం నుంచి గిరిజనులు వేరే ప్రాంతాలకు వలసవెళ్లి జీవనాన్ని వెళ్లదీస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలు, అడవి ప్రాంతా ల ప్రజలు అధికంగా వలస వెళ్తున్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ఈ వలసలకు ప్రధానంగా పేదరికం, కరువు పరిస్థితులు కారణం. వీరు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
పట్టణ ప్రాంత అభివృద్ధి పథకాలు
పట్టణ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలను చేపడుతుంది.
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎడ్యుకేటెడ్ అన్ ఎంప్లాయ్డ్ యూత్ (1983)
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ది అర్బన్ పూర్ (1986)
నెహ్రూ రోజ్‌గార్ యోజన (1989)
అర్బన్ బేసిక్ సర్వీస్ ప్రోగ్రామ్ (1990-91)
ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అర్బన్ స్లమ్స్ (1972)
ప్రైమ్ మినిస్టర్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ పావర్టీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (1995)
నేషనల్ స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (1996)
స్వర్ణ జయంతి షహరి రోజ్‌గార్ యోజన (1997)
అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులేషన్ యాక్ట్ (1976)
జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (2005)
వాల్మీకి అంబేడ్కర్ ఆవాస్ యోజన (VAMBAY – వాంబే) (2001-02
స్మార్ట్ సిటీ మిషన్ (2015)
హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (HRIDAY) (2015)
పట్టణాల విభజన
-జనాభా ఆధారంగా పట్టణాలను విభజించారు. ఏ ప్రదేశంలో 5000 జనాభా 400 జన సాంద్రత 75 శాతం వ్యవసాయేతర పురుష కార్మికులు ఉంటారో దాన్ని సెన్సస్ పట్టణాలు అని పిలుస్తారు. వీటి సంఖ్య దేశంలో 3,894.
-ఏ ప్రదేశం మున్సిపాలిటీ, మున్సిపాలిటీ కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డు మొదలైన లక్షణాలు కలిగి ఉంటుందో దాన్ని స్టాట్యుటరీ పట్టణంగా పిలుస్తారు. ఇవి 4,041 ఉన్నాయి. నగరానికి చుట్టుపక్కల పెరిగే ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న పట్టణాలను అర్బన్ అగ్లోమెరేషన్ అంటారు. ఇవి 475 ఉన్నాయి.
-నగరం చుట్టు పక్కల ఉండే రైల్వే కాలనీలు, యూనివర్సిటీ క్యాంపస్‌లు ఇలాంటి వాటిని OG అంటారు. ఇవి 981 ఉన్నాయి.
-అదేవిధంగా పట్ణాలు జనాభా పరిమాణాన్ని బట్టి కిందివిధంగా ఉంటుంది.
జనాభా పేరు
5000 వరకు క్లాస్-VI పట్టణం
5000 నుంచి 9999 వరకు క్లాస్-V పట్టణం
10,000 నుంచి 19,999 వరకు క్లాస్-IVపట్టణం
20,000 నుంచి 49,999 వరకు క్లాస్-III పట్టణం
50,000 నుంచి 99,999 వరకు క్లాస్-II పట్టణం
100,000 నుంచి 9,99,999 క్లాస్-I పట్టణం
10,000,000 నుంచి 49,99,999 మెట్రోసిటీ
50,000,000 నుంచి 99,99,999 మెగాసిటీ
కోటి పైగా ఉంటే యునైటెడ్ నేషన్స్ మెగాసిటీ
అన్ని దేశాల ప్రజలు నివసించేదాన్ని కాస్మోపాలిటన్ సిటీ అంటారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?