ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్(Amnesty International)
– ప్రపంచ దేశాల్లో మానవ హక్కులను పరిరక్షించడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం.
– ఈ సంస్థను 1961లో ఇంగ్లండ్‌కు చెందిన పీటర్ బెన్సన్ ప్రారంభించాడు.
– ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉన్నది.
– ప్రపంచంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా ఈ సంస్థ స్పందిస్తుంది.
– ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కృషికిగాను 1977లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్‌క్రాస్ (ICRC)
– దేశాల మధ్య యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే ఉచిత వైద్య సేవలు స్వచ్ఛందంగా అందించడం దీని ప్రధాన విధి.
– స్విట్జర్లాండ్‌కు చెందిన హెన్రీ డ్యూనాంట్ దీన్ని
ప్రారంభించారు.
– ప్రధాన కార్యాలయం స్విట్టర్ల్యాండ్లోని జెనీవాలో ఉన్నది.
– ICRCను ప్రపంచ వైద్య సంస్థగాను, హ్యుమానిటేరియన్గాను పిలుస్తారు.
– దీని నినాదం చారిటీ ఇన్ వార్.
– ఈ సంస్థ స్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.
అంతర్జాతీయ శక్తి సంస్థ (IEA)
– ప్రపంచ దేశాల మధ్య చమురు, సహజవాయువు, ఇతర శక్తి వనరులకు సంబంధించి సంక్షోభం రాకుండా పర్యవేక్షించడం, సంక్షోభ సమయాల్లో పరిష్కారం చూపడం ఈ సంస్థ విధి.
– ఈ సంస్థను 1974లో ఏర్పాటు చేశారు.
– సభ్యదేశాలు: 29
– ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉన్నది.
– ప్రపంచంలో రోజురోజుకీ శక్తి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో IEA ప్రాధాన్యత సంతరించుకున్నది.
అంతర్జాతీయ పౌరయాన సంస్థ (ICAO)
– ప్రపంచ దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాలను, విమాన సర్వీసులను సమన్వయం చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చూడటం దీని విధి.
– ఈ సంస్థను 1947లో ఏర్పాటు చేశారు.
– ప్రధాన కార్యాలయం కెనడాలోని మాంట్రియల్లో ఉంది.
ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ ైక్లెమేట్ చేంజ్ (IPCC)
– ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు సంబంధించిన మావన ప్రేరిత కారణాల సమాచారాన్ని వేలమంది శాస్త్రవేత్తల నుంచి సేకరించి ఎప్పటికప్పుడు నివేదికలను రూపొందించి అందుబాటులో ఉంచడం IPCC ప్రధాన విధి.
– ఈ సంస్థను 1988లో ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ, U-EP లు కలిసి ఏర్పాటు చేశాయి.
– ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్నది.
– భూతాపం, తీవ్రత, సముద్ర మట్టాల పెరుగుదల మొదలైన అంశాల్లో చేసిన కృషికిగాను ఈ సంస్థకు 2007లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
వరల్డ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం
– బాలబాలికల్లో స్కౌటింగ్, ట్రాకింగ్, మ్యాప్‌ల తయారీ వంటి నైపుణ్యాలతోపాటు మంచి వ్యక్తిత్వం, దేశంపై ప్రగాఢ నమ్మకం కలిగించడం, దేహదారుఢ్యం పెంచడంతోపాటు అన్ని పరిస్థితులను ఎదుర్కొనేలా తీర్చిదిద్దడం ఈ ఉద్యమం ముఖ్య విధి.
– ఈ ఉద్యమాన్ని 1907లో బ్రిటన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ సర్ రాబర్ట్ ఎస్ఎస్ బెడెన్-సావెల్ ప్రారంభించారు.
– ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్నది.
– 1910లో పావెల్ సోదరి ఆగ్నస్ ప్రత్యేకంగా బాలికల కోసం The Girl Guide Movementను ప్రారంభించారు.