If you want to speak English fluently | ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలంటే…!
-న్యూయార్క్ నగర వీధిలో కారు నడుపుతూ వెళ్తుతోంది శ్రావణి. సాయంత్రం ఏడయ్యింది. లైట్ల వెలుగుల్లో సిటీ మెరుస్తున్నది. రోడ్డుకిరువైపులా పెద్ద పెద్ద షాఫులు, మాల్స్, భవంతులు. తను ఇలాంటి నగరంలో స్థిరపడగలదని కలలో సైతం ఊహించలేదు. సిగ్నల్ వద్ద బ్రేక్ పడింది. తన ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి.
ఇంగ్లిష్‌లో మాట్లాడమంటే ముచ్చెమటలు పట్టే రోజులవి. స్టేజీ మీద మాట్లాడమంటే అదో సాహసం. సబ్జెక్టుల్లో మంచి మార్కులయితే తెచ్చుకోగలిగింది. కానీ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, సెమినార్లు అంటే పెద్ద గండంగా భావించేది. నందుసర్ స్పోకెన్ ఇంగ్లిష్ ఇనిస్టిట్యూట్‌లో చేరిన వారం రోజుల వ్యవధిలోనే ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. చిన్న ఊరి నుంచి వచ్చిన శ్రావణికి తెలుగు మీడియం ప్రభావం తనపై ఇంకా ఉన్నట్లు భావించేది మొదట్లో. అది అపొహ అని తెలిసింది. సిటీలోనే చదివిన చాలామందికి, ఇంగ్లిష్ మీడియంలోనే చిన్నప్పటి నుంచి చదువుకున్న చాలా మందికి, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడిన చాలామందికి కూడా ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడటం రాదని తెలిసి ఆశ్చర్యపోయింది. తమ తమ సబ్జెక్టుల్లో అనుభవం ఉన్న చాలామంది టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్ కూడా ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలంటే భయపడతారని, మాట్లాడాలంటే అదొక చాలెంజ్ లాగా భావిస్తారని గమనించింది. నందుసర్ శిక్షణలో తను రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న రోజులవి. ఏ ఇన్స్టిట్యూట్లో చేరినా ఇవన్ని సహజంగా కలిగే మార్పులేమో అనుకుంది మొదట్లో. అది కూడా తప్పు అభిప్రాయం అని త్వరలో తెలిసిపోయింది. తన ఫ్రెండ్స్ చాలామంది ఇతర శిక్షణ సంస్థల్లో చేరి భాషపై పట్టు సాధించలేక సమయం, డబ్బు వృథా చేసుకున్నామని బాధపడేవారు. శ్రావణిని చూసి అసూయ పడేవారు వారంతా.
ఇంగ్లిష్‌లో మాట్లాడలేకపోవడం అనేది లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు, ఇది సైకలాజికల్ ప్రాబ్లం. అంటే మానసిక సమస్య. జీవితంలో ఎదుర్కొనే ఒక అవమానం, ఒక అపజయం సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. కాబట్టి స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పించడం అంటే గ్రామర్ సూత్రాలతోనే చేతులు దులుపుకోవటం కాదు. దీనికి అనుసరించాల్సిన పద్ధతులు మనసుపై విజయం సాధించే దిశగా ఉండాలి అని చెప్పేవాడు నందుసర్. ఇంగ్లిష్ నేర్పిస్తామని చెప్పినా విజయం సాధించి పెట్టగలిగే ఎన్ఎల్పీ టెక్నిక్స్‌తో కూడిన శిక్షణ ఎలాంటి మంచి మార్పులు తేగలదు అనేదానికి తనే ఉదాహరణ అనుకుంది శ్రావణి. తన సమస్య ప్రధానంగా గడగడ మాట్లాడలేకపోవటం.
-ఎవరైనా ఇంగ్లిష్ మాట్లాడితే అర్థమవుతుంది. కానీ తాను అంతే ఈజీగా మాట్లాడలేదు. అదే ఆమె సమస్య. తన బ్యాచ్‌లోనూ అందరు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. క్లాసులో అడుగుపెట్టిన మొదటి, రెండు రోజుల్లోనే అర్థం చేసుకోగలిగింది. అందరు తమ సొంత ఫ్యామిలీ మెంబర్లలా కలిసిపోయారు. ఇంకో ఆస్తికరమైన అంశం గమనించింది శ్రావణి. ఒక బ్యాచ్‌లో విద్యార్థులను జమ చేసేటప్పుడు వారు అవలంభించే విధానం శాస్త్రీయంగా అనిపించింది. సాధారణంగా విద్యార్థుల వయసును బట్టో, క్వాలిఫికేషన్ బట్టో విభజించి ఒక బ్యాచ్ ప్రారంభిస్తుంటారు ఎక్కడైనా. ఇక్కడి విధానం చాలా భిన్నంగా అనిపించింది. ఇప్పటిదాకా చెప్పుకున్నట్లు ఎవరైనా ఇంగ్లిష్‌లో మాట్లాడితే తనకు చాలా బాగా అర్థమవుతుంది. కానీ మాట్లాడటంలోనే సమస్యంతా. ఇన్స్టిట్యూట్కు వచ్చే విద్యార్థులకు కామన్ ప్రాబ్లం ఇంగ్లిష్‌లో మాట్లాడలేకపోవడం. అందుకే ఇక్కడ అందరికి ఇంగ్లిష్‌ను ఎలా అర్థం చేసుకోగలరనే అంశం ద్వారానే బ్యాచ్‌లుగా వేరు చేస్తారు. సున్నా శాతం కూడా అర్థంకాని విద్యార్థులున్నారు. వారికి అర్థం కాదు, మాట్లాడటం రాదు. ఇలాంటి వారంతా ఒక బ్యాచ్. ఇలా అర్థం చేసుకోగలిగే సామర్థ్యం బట్టి వారిని మరో బ్యాచ్‌లాగా విభజించేవారు.
ఈ అంశం చాలా నచ్చింది శ్రావణికి. విద్యార్థులంతా ఒకరితోఒకరు ఇంగ్లిష్‌లోనే మాట్లాడుకోవాలని నియమం. ప్రయత్నం ముఖ్యం. అంతేకాదు ఒక ఆర్నేళ్లపాటు బయట జీవితంలో కూడా తప్పనిసరిగ్గా ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలని నియమం. మేం బయట ఇంగ్లిషే మాట్లాడుతున్నామో లేదో మీకేంటి సర్ గ్యారంటీ? ఓ విద్యార్థి ప్రశ్న. దీనికి నందుసార్ ఓ కథ చెప్పాడు.
– పూర్వం ఓ గ్రామానికి ఒక సాధువు వచ్చాడు. ఆయనకు దైవశక్తులున్నాయని అందరికి అర్థమైంది. మొదట ఆకట్టుకోవడానికే భూత, భవిష్యత్తు వివరాలు చెప్పి అందరిని సన్మార్గంలో పెట్టడానికి ప్రవచనాలతో కాలం గడుపుతున్నాడు. సాధువును ఎలాగైనా అభాసుపాలు చేయడానికి ఓ అల్లరి యువకుడు నిర్ణయించుకున్నాడు. ఆ యువకుడు ఓ చిన్ని పిచ్చుకని తన పిడికిట్లో బిగించి, వెనక వైపు ఉంచి ఆ సాధువు దగ్గరికి వెళ్లాడు. స్వామి నా చేతిలో ఏముందో చెప్పగలరా? అని అడిగాడు. అక్కడ ఉన్నవారంతా ఆసక్తిగా చూస్తున్నారు. నీ చేతిలో పిచ్చుక ఉంది నాయనా. అది బతికి ఉందా, చచ్చిందా? తిరిగి ప్రశ్నించాడు ఆ యువకుడు. సాధువుకు అర్థమైంది ఆ యువకుడి ప్లాన్. బతికి ఉంది అని చెబితే పిడికిలి బిగించి ఆ పిచ్చుకని చంపేస్తాడు.
చనిపోయింది అని చెప్తే, దాన్ని స్వేచ్ఛగా వదిలేసి సాధువు మాటలకు విలువ లేదని నిరూపించాలనుకుంటున్నాడు ఆ యువకుడు. ఆ పరిస్థితిని ఎదుర్కొంటూ సాధువు ఇలా సమాధానమిచ్చాడు. ఆ పిచ్చుక ప్రాణం నీ చేతిలో ఉంది నాయనా! అంతే ఆ యువకుడి కళ్లు తెరుచుకున్నాయి. కథ చెప్పటం ముగించాడు నందుసర్. చిన్న చిన్న వాక్యాలైన సరే ఆర్నేళ్ల పాటు కేవలం ఇంగ్లిష్‌లోనే మాట్లాడండి. మీ ప్రయత్నం మీకు మంచి భవిష్యత్తును ఇస్తుంది. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?