Did you know | ఇది తెలుసా..!
-ప్రధానమంత్రి అంత్యోదయ అన్న యోజన
-ఈ పథకాన్ని 2000, డిసెంబర్ 25న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
-దేశంలోని కోటి పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం దీని లక్ష్యం.
-ముఖ్యంగా దారిద్య్రరేఖకు (బీపీఎల్) దిగువన నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను గుర్తించడం.
-వీరికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రూ. 2లకు గోధుమలు, రూ. 3లకు బియ్యం కిలో చొప్పున కుటుంబానికి 35 కేజీలు అందజేయడం.
-ముందుగా లబ్ధిదారులను గుర్తించి ఈ కోటా కింద అర్హులైన వారి వివరాలు నమోదు అనంతరం కార్డులను అందించడం.
-అయితే పథకం ప్రారంభంలో 25 కేజీలు అందించగా, 2002 ఏప్రిల్లో 35 కేజీలకు పెంచారు.
-ఈ పథకాన్ని మొదటిసారిగా రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు.
-2002-03లో 41.27లక్షల టన్నుల ఆహారధాన్యాలను కేటాయించగా, 35.39 లక్షల టన్నులను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసింది.
-జూన్ 2003 నాటికి అదనంగా మరో 50 లక్షల నిరుపేద కుటుంబాలను పథకం పరిధిలోకి తీసుకొచ్చారు.
-2003-04లో 38.24లక్షల టన్నుల ఆహారధాన్యాల కేటాంపునకుగాను 45.65లక్షల టన్నులు కేటాయించింది.
-మరింతగా విస్తరించి 2004 నాటికి మొత్తంగా 2 కోట్ల కుటుంబాలను లబ్ధిదారులుగా గుర్తించారు.
-ఈ పథకాన్ని సవరిస్తుండగా, లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ 2016లో ప్రస్తుతం 2.50 కోట్ల కుటుంబాలకు చేరింది.
-ఈ పథకం కింద్ర ప్రయోజనం పొందుతున్న కుటుంబాలకు అందించే కార్డు గులాబీ రంగు గీతతో ముద్రించిన కార్డులను అందిస్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?