Fashion and designing | ఫ్యాషన్ అండ్ డిజైనింగ్
-ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు అంటే మొదటగా గుర్తొచ్చేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్). ఇందులో ఇంటర్ అర్హతతో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్‌లో ఫ్యాషన్ డిజైన్, లెదర్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, నిట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో అపెరల్ ప్రొడక్షన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
-దేశంలో నిఫ్ట్ క్యాంపస్‌లు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, భువనేశ్వర్, గాంధీనగర్, జోధ్‌పూర్, కోల్‌కతా, కన్నూర్ (కేరళ), కాంగ్రా (హిమాచల్‌ప్రదేశ్), ముంబై, పట్నా, రాయబరేలి, షిల్లాంగ్, శ్రీనగర్‌లో ఉన్నాయి.
-వీటిలో మొత్తం 2370 సీట్లు అందుబాటులో ఉన్నాయి. . ఇందులో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ 2010, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో 360 సీట్లు ఉన్నాయి.
-కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రతి ఏడాది అక్టోబర్‌లో విడుదలవుతుంది. అప్లికేషన్ ప్రక్రియ ఆన్లైన్ విధానంలో ఉంటుంది. ప్రవేశపరీక్ష జనవరిలో ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది.
-రాత పరీక్షలో అర్హత సాధించినవారిని గ్రూప్ డిస్కషన్ లేదా సిచ్యుయేషన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చినవారికి కౌన్సెలింగ్ ద్వారా సీట్లను కేటాయిస్తారు.
-బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రవేశపరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది. మొదటిది క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్. దీనిద్వారా విద్యార్థుల ఇన్స్టిట్యూషన్ స్కిల్స్, పవర్ ఆఫ్ అబ్జర్వేషన్, డిజైన్ ఎబిలిటీ, ఇన్నోవేషన్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ కాన్సెప్ట్ వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ పరీక్ష పెన్ పేపర్ విధానంలో ఉంటుంది. మూడు గంటల్లో పరీక్ష రాయాలి.
-రెండోది జనరల్ ఎబిలిటీ టెస్ట్ (జీఏటీ). ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ (20 ప్రశ్నలు), కమ్యూనికేషన్ ఎబిలిటీ (25), ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ (25), అనలిటికల్ ఎబిలిటీ (15), జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (15 ప్రశ్నలు) అంశాలు ఉంటాయి.
-ఆఫ్‌లైన్‌లో ఉండే ఈ పరీక్షను 3 గంటల్లో పూర్తి చేయాలి.
-ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా సిచ్యుయేషన్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
-ఇందులో మెటీరియల్ హ్యాండ్లింగ్, ఇన్నోవేటివ్ ఎబిలిటీని పరీక్షిస్తారు. ఈ పరీక్షను ఇంగ్లిష్‌లోనే రాయాలి.
-బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రవేశపరీక్షలో ఒకే పేపర్ ఉంటుంది. దీన్ని జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. ఇందులో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
-ఇందులో క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు, కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 45, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ 25, జీకే-కరెంట్ అఫైర్స్ 25, కేస్ స్టడీ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి.
-పరీక్షకు 3 గం. సమయం ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారిని గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
ఏఐఈఈడీ
-రాజస్థాన్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆల్ ఇండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (ఏఐఈఈడీ)ను నిర్వహిస్తారు. దీనిద్వారా మొత్తం 138 సీట్లను భర్తీ చేస్తారు.
-దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రతి ఏడాది అక్టోబర్‌లో విడుదలవుతుంది. ప్రవేశ ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది.
-స్టేజ్-1లో జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీఏటీ)
-స్టేజ్-2లో క్రియేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీఏటీ)
-వీటిలో అర్హత సాధించిన వారికి స్టేజ్-3 ఇంటరాక్షన్ ఉంటుంది.
-ఈ ప్రవేశపరీక్ష ద్వారా యూజీ కోర్సులైన బీడిజైన్లో ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, జ్యుయేలరీ డిజైన్, క్రాఫ్ట్ అండ్ యాక్సెసరీ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ (బీవీఏ) అప్లయిడ్ ఆర్ట్స్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇవన్నీ నాలుగేండ్ల వ్యవధి కలిగిన కోర్సులు.
-దరఖాస్తులు, ప్రవేశపరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుంది.
-వెబ్సైట్: https://www.aieed.com/
గమనిక: ఎన్ఐడీ లేదా నిఫ్ట్, నాటా ప్రవేశ పరీక్షల్లో మొదటి దశను పూర్తి చేసినవారు ఏఐఈఈడీ-2019 ఇంటరాక్షన్, పోర్ట్‌పోలియో రౌండ్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?