Existence of Telangana philosophy | తెలంగాణ తత్వ అస్తిత్వం
పరశురామ పంతులు లింగమూర్తి
-ఈయనది వరంగల్లు జిల్లాలోని మడికొండ గ్రామం. తల్లిదండ్రులు రామమంత్రి, తిమ్మమాంబ. ఈయన తెలుగులో స్వతంత్రంగా వెలసిన తొలి వేదాంత గ్రంథమైన సీతారామాంజనేయ సంవాదం రాశారు. ఇంకా శుకచరిత్ర, వివేకసారం, ఆధ్యాత్మ రామాయణం, సీతారామాంజనేయమనే యక్షగానం రాశారు. లింగమూర్తి గొప్ప వేదాంతవేత్త మహాభక్తుడు. పోతన, గోపన్నలతో పోల్చదగినవాడు. ఇంకా ఈయన రచనలు రతీమన్మథ విలాసం, జీవన్ముక్తి ప్రకరణం, బ్రహ్మ నారద సంవాదం, తారక యోగం, మానస శతకం, ఆత్మారామ శతకం, గోవింద శతకాలను తాళపత్రాలపై రాసి ఉన్నాయి. ఇవి ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృత అకాడమీలో నేటికీ ఉన్నాయని బిరుదురాజు రామరాజు చెబుతున్నారు.
-ఆత్మారామ శతకంలో
గురుడనగా నీశ్వరుడగడు
స్థిరమతి శిష్యుడనంగ జీవాత్ముండ
యిరుపుర కైక్యస్థానం
బరయంగా పరమ పదము నాత్మారామా
జపములు తపములు వ్రతములు
చపల మనో నియమములు విచారింపగ నె
ల్లవు డమనస్కుడనగు నా కవరారోపణము లేల ఆత్మారామా. ఇలా ఆత్మారామ శతకమంతా వేదాంతంతో నిండి ఉన్నది. 1798 వరకు బతికి ఉన్నారని తెలుస్తుంది.
వెంపటి వెంకయ్య (1890-1949)
-ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం సిరిపురం గ్రామ నివాసి. ఈయన తల్లిదండ్రులు అప్పయ్య, అచ్చమ్మ. సంస్కృతం, తెలుగు, ఉర్దూ భాషలు తెలుసు. రచనలు 1) శ్రీకోదండ రామశతకం 2) ముముక్షు జన కల్పకము 3) పార్వతీశ్వర శతకం. ఈయన గొప్ప వేదాంత కవి.
ఉమ్మెత్తుల కేశవరావు
-ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి గ్రామ నివాసి. 1907, ఫిబ్రవరి 9న జన్మించారు. 1992, డిసెంబర్ 12న మరణించారు. రచనలు రామనామ చింతనం, ఖురాన్సారం, ఆధ్యాత్మిక గ్రంథాలు ఇంకా లౌకిక గ్రంథాలు ఉన్నాయి.
ముడుంబై కృష్ణమాచార్యులు
-1946, ఆగస్టు 15న రామనర్సింహాచార్యులు, రామనర్సమ్మ దంపతులకు జన్మించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని నర్సింహపురం గ్రామ నివాసి. రచనలు 1) నారసింహపుర సీతారామ శతకం 2) గణపవరనిలయ శతకం 3) కాళీయమర్దన 4) సన్యాసి శతకం 5) రాధాప్రియ శతకం రాశారు.
గురజాల గోపాలకృష్ణశాస్త్రి
-1910లో శాలిగౌరారం మండలం గురజాలలో జన్మించారు. పట్టాభిరామశాస్త్రి, సీతమ్మ తల్లిదండ్రులు. ఈయన మూడు గ్రంథాలు రాశారు. ఇందులో.. సృష్టి తత్వం (పద్య కృతి) అనే గ్రంథం వేదాంత విషయ ప్రధానంగా రాసిన గ్రంథం. ఈయన వేద, జ్యోతిష, వాస్తు శాస్ర్తాలను అధ్యయనం చేశారు.
నరహరి గోపాలాచార్యులు
-ఈయనది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర గ్రామం. తల్లిదండ్రులు నరసింహాచార్యులు, నరసమ్మలు. ఈయనకు సంస్కృతాంధ్ర ద్రావిడ భాషలు తెలుసు. శ్రీమద్రామాయణాన్ని 108 సార్లు రాశారు.
రచనలు: శ్రీజానకీ నాయక శతకం, కృష్ణ శతకం, కృష్ణ, భార్గవి, నారాయణ, రఘుపతి, జానకీ వర, జానకీ ధర్మపురి లక్ష్మీనర్సింహ, సీతాసనాధ, విఖనసాచార్య, తిరుమలగిరి వెంకటేశ్వర, భద్రగిరి దాశరథి, నందనందన, హనుమత్ప్రభు, మారుతీస్తుతి, వేదగిరి నృకేసరీతారావళి, రామధ్యానసోపానం, రామబాలదిస్తవము, భాగవత్రృపా తరంగము, హరినామ మహిస్తుతి, హరిపాదుకాస్తవము, శ్రీరామ చంద్రప్రభుస్తుతి, అమృతసిద్ది, లక్ష్మీనృసింహస్తుతి వచనము, క్షమాషోడశి, భారన్యాసము (చిత్రకవిత), శ్రీలక్ష్మీఅష్టోత్తర శతనామ స్ర్తోత్ర పద్యాలు, కృష్ణాష్టోత్తరశతనామ పద్యాలు, పరివ్యాస్మి, శ్రీగుణ రత్నకోశం, తిరుప్పావు, అర్వపల్లి యోగానంద లక్ష్మీనృసింహ సుప్రభాతం, మల్లికార్జున సుప్రభాతం, భావతరంగణి, రేపాల నర్సింహస్తుతి (35) మొదలైన రచనలు చేశారు. ఇంకా సంస్కృతంలో వేదాద్రి లక్ష్మీనృసింహసుప్రభాతం, శ్రీమట్టపల్లి నృసింహ సుప్రభాతం, శ్రీస్తుతి రాశారు.
-గోలకొండ కవుల సంచికలో 368వ పేజీలో ఈయన గురించి పరిచయం ఉంది. ఇంకా అముద్రితాలైన రచనలు చాలా ఉన్నాయి.. 1) శ్రీసుమతి సుధర్మ (నాటకం), 2) సుప్రభాతస్ర్తోత్ర మాలికా(సం) 3) రామభద్ర స్తుతి 4) హయానన స్తుతి శతకం 5) శ్రీరామ శతకం 6) శ్రీరంగరాజస్తవం 7) ముకుంద మాల 8) శరణాగథ వత్సలస్తవము 9) శ్రీరామ కథాస్తుతి 10) స్వప్నగాథ 11) పరితాప ప్రార్థనలు 12) భవవిరామ రామస్తుతి శతకాలు 13) కామాగ్రహావేశం 14) ఇంకా పద్య శ్లోకాలు.
రామోజు విశ్వనాథాచారి
-1914లో ఆలేరులో జన్మించారు. తల్లిదండ్రులు అబ్బయచారి, లక్ష్మి. రచనలు 1) శ్రీగురు సుధారసమాల 2) జననీజనక పూజావిధానం (పద్యాలు) 3) ఆధ్యాత్మిక వచనాలు, కీర్తనలు. ఈయనకు శాశ్వతానంద బిరుదు ఉంది. తత్వాలు, కీర్తనలు రాయడమేగాక శ్రావ్యంగా పాడగలరు.
చిదిరె మఠం వీరభద్రయ్య (1800-30)
-నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం మునికుంట గ్రామం. రచనలు శ్రీకృష్ణ శతానందీయం, భల్లాణ చరిత్ర, శరభ విజయ నాటకం, అనేక చాటువులు. విరహణీ విలాసం పేరుతో గోలకొండ కవుల సంచిక 115వ పేజీలో ఈయన 3 పద్యాలు ఉన్నాయి.
చిదిరె మఠం వీరభద్ర శర్మ
-నల్లగొండ పక్కన ఉన్న చర్లపల్లిలో 1906లో జన్మించారు. 1) వీరశైవ వివాహ విధి 2) రుగ్వేదం ప్రథమాష్టకం 3) తర్కసంగ్రహం 4) మీమాంస పరిభాష 5) శిఖా సిద్ధాంత రహస్యం 6) వీరశైవులు 7) కాశీపీఠ ప్రాచీనత (మరాఠిలో) 8) శివపంచస్తవములకు భక్తరంజని టీక. ఇంకా జ్ఞానశ్రీ పేరుతో అనేక కృతులు రాశారు.
పూర్వాంధ్ర ఏషకవిరస్మి నిజాంవిభాగే
నైతాదృశశ్చ కవివ్యధ పశ్చిమాంధ్రే
జీధీశ్చ ఆంధ్రకవిరుజ్వల ఇత్యబద్దం
-కృద్దా: సుతాకిమధవాకిలి యాతుదానా. గోలకొండ కవులు సంచిక 381వ పేజీలో ఉంది. బ్రహ్మిలిపి, అనేక భాషల్లో ప్రజ్ఞ ఉంది. గద్వరత్న, విద్యానిధి బిరుదులు ఉన్నాయి. 1938లో విభూతి పత్రికను స్థాపించారు. ఈయన 500 మైళ్ల హిమాలయ యాత్ర చేశారు. రేణుకా విజయం
రాశారు. సికింద్రాబాద్లో వీరశైవ గురుకులం స్థాపించారు. 1948 జనవరి 25న మరణించారు.
ముదిగొండ వీరేశలింగశాస్త్రి
-ఈయనది వరంగల్లు. 1904, డిసెంబర్ 5న పాపయ్య, పాపమ్మలకు జన్మించారు. ఈయన రచనలు 1) శివజ్ఞాన శేఖరం (రెండు భాగాలు) 2) శైవ సిద్ధాంత దర్శిని 3) విద్యాస్థాపన నిర్ణయం 4) కాశీపాదం 5) సోమనాథ వ్రతోధ్యాపనా కల్పం 6) వీరభద్రష్టోత్తర శతనామావళి 7) శివయోగ సారం 8) అహ్నిక కాండము 9) లింగధారణ దీపిక 10) ఉపదేశకాండం (పద్యాలు) 11) సంభవ కాండం (తెలుగు) 12) సంభవ కాండం (సంస్కృతం) 13) యుద్ధకాండలు 14) దేవకాండం 15) శ్రీమదాంద్ర శివగీత 16) వీరభద్రస్తోత్ర కదంబం 17) అగ్నిముఖ జయాదులు 18) విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం 19) సిద్ది వినాయక వ్రతకల్పం 20) కేదారేశ్వర వ్రతకల్పం 21) వరలక్ష్మీవ్రతం 22) ఉమామహేశ్వరవ్రతకల్పం 21) వరలక్ష్మీవ్రతం 22) ఉమామహేశ్వర వ్రతకల్పం 23) బిల్వపత్రాష్టోత్తర శతనామ శ్లోకాలు 24) రుగ్వేద సంధ్యావందనం 25) భద్రామురుపాఖ్యానం 26) సరసహృదయానురంజనం 27) సర్వమధురం 28) శ్రీశంకరాచార్య చరిత్ర 29) ప్రతాపరుద్ర చరిత్రం 30) భక్తపాల శతకం 31) శరభాంక లింగ శతకం 32) గీతగౌరీశం 33) బసవ విజయం 34) ఉమామహేశ్వర విజయం 35) కాళహస్తీశ విలాసం 36) నిజలింగ చిక్కయ చరిత్ర 37) పురాతన శంకర వచనములు 38) దుర్గేశ్వర భజన కీర్తనలు 39) రాజరాజేశ్వర శతకం 40) వీరభద్ర కంఠమాలిక 41) వీరభద్ర సహస్రనామావళి 42) శాంభవ దీక్షావిధి 43) వీరశైవ దీక్షబోధ 44) సోమశేఖర శతకం
-పై గ్రంథాలన్నీ శైవ ప్రచారణీ గ్రంథమాలను స్థాపించి ముద్రించారు. ఇందుకు సహాయ సహకారాలు అందజేసింది కొడిమెల రాజలింగాచార్యులు. ఇక శైవగ్రంథమాల ద్వారా అచ్చయిన గ్రంథాలు 1) శివాద్వైత నిరూపణం 2) అద్వైత ఖండనం 3) వైష్ణవమత ఖండనం 4) శివాద్వైత వదవిధి 5) వేదాంతార్థతారహరం 6) శివమహోత్సవ విధి 7) శివప్రతిష్టావిధి 8) శైవాగమ కారిక 9) శివసంప్రోక్షణ విధి 10) శైవధర్మసంగ్రహం మొదలైనవి. ఇంకా విశ్వేశ్వర గ్రంథమాలను 1940లో ఆకారపు నర్సింహం ప్రోత్సాహంతో స్థాపించారు. దీనిలో అచ్చయిన గ్రంథాలు, రచయితలు 1) శివచింతామణి ప్రభానామక నీలకంఠ భాష్య వ్యాఖ్యానం- ముదిగొండ నాగలింగశాస్త్రి 2) శైవ సర్వస్వమం- ముదిగొండ కోటయ్యశాస్త్రి 3) శంభుశతకం- ముదిగొండ నాగలింగశాస్త్రి 4) నలవిలాసం- ముదిగొండ నాగలింగశాస్త్రి 5) నిత్యోత్సవ నిబంధం- ఉమానందనాథుడు 6) శివసందర్శన విధి- మల్లంపల్లి జ్వాలావీరభద్రారాధ్యులు 7) శైవమతం – అతిప్రాచీనం- మల్లంపల్లి కనకదర్గాప్రసాద్ 8) గౌరీకల్యాణం- ముదిగొండ వీరభద్రారాధ్యులు 9) పుత్రప్రధానశీల- ముదిగొండ వీరభద్రారాధ్యులు 10) కుమార కల్యాణం, 11) శివతాండవలీల, 12) శైవకల్పద్రుమము- ముదిగొండ జ్వాలాపతి లింగశాస్త్రి 13) శివకవచం, 14) జ్ఞానసుధారసం, లింగోష్టోత్తర శతనమాబ్జమాలిక- రుషభయోగి 15) శంకరారాధ్య చరిత్ర, 16) కాంచీఖండము- మల్లంపల్లి వీరేశ్వర శర్మ 17) సాగరేశ్వర శతకం- ముదిగొండ సుబ్రహ్మణ్యశాస్త్రి 18) కుమార విజయం- ములుగు సుబ్రహ్మణ్యశాస్త్రి 19) స్త్రీల పాటలు- ముదిగొండ వీరేశలింగ శాస్త్రి 20) శివభజన (శ్లోకాలు)- శ్రీపతి పండితారాధ్యస్వామి 21) శ్రీకాశీవిశ్వేశ్వర భజన కీర్తనలు, నక్షత్రములు- పెండ్యాల బుచ్చికృష్ణదాసు (1948లో లింగైక్యము చెందారు).
భాగవతం సీతారామశర్మ
-ఈయన మెదక్వాసి. తండ్రి రామన్న. గోత్రం కౌండిన్య. తత్వబోధిని గ్రంథమాలను ప్రకటించి రచనలు చేశారు. 1) భక్త శిరోమణి ఉద్దవులు 2) స్మరణ భక్తి శబరి 3) దేవర్షి నారదుడు 4) గీతాశ్రీకృష్ణుడు 5) గీతాసాకారోపాసన 6) ప్రతిమార్చనము 7) అనసూయ (రజకాగ్ని) 8) శ్రీమహాశివరాత్రి (పద్యాలు) 9) సంగమేశ్వర తారావళీ పద్యాలు 10) వినాయక చతుర్థి 11) శ్రీమదాంధ్ర మహాభారత దర్పణం 12) వైద్యనిఘంటువు 13) దేవకీనందన శతకం 14) పశ్చాత్తాపము (నవల) 15) మేలుకొలుపు
దోర్బల విశ్వనాథశర్మ
-1933, జూన్ 7న రామాయంపేటలో జన్మించారు. అనంతలక్ష్మమ్మ, రత్నయ్యల పుత్రుడు. రచనలు 1) మూక పంచశతి 2) హరిమీడే, శివమీడే 3) శ్రీలాలిత్యం 4) మహిమ్న స్తోత్ర పంచకానువాదం 5) హలాయన శివస్తోత్రము 6) చండీ శతకం 7) శివకర్ణామృతస్తోత్రము 8) శివసప్తశతి (ఆంధ్రపద్యానువాదం) 9) ఆదిత్య హృదయం. ఈయన 20వ శతాబ్దంలో పేరెన్నికగన్న పండితుల్లో ప్రముఖులు.
మూలంపల్లి రాజశేఖర శాస్త్రి
-దుబ్బాక మండలం లచ్చపేట గ్రామ నివాసి. 1920లో చండిక, శివలింగారాధ్యులకు జన్మించారు. ఈయన గురువులు శివయోగి ముదిగొండ నాగలింగ శాస్త్రి, మోర్తాడ్ ప్రవీణ కృష్ణమాచార్యులు. రచనలు 1) హిందూ వర్ణప్రబోధం 2) జ్ఞానేశ్వరి (వ్యాఖ్యానం) 3) శివగీత (పద్యాలు) 4) విగ్రహారాధన మండనం 5) నీలకంఠ భాష్యం (అనువాదం) 6) శ్రీనాథ విజయం (పద్యకావ్యం). ఈయనకు సనాతన ధర్మ ప్రచార కేసరి, నీలకంఠ భాష్య ప్రవచన అనే బిరుదులు ఉన్నాయి.
విఠల చంద్రమౌలి శాస్త్రి
-ఈయన ఎంతటి మహాపండితుడో అంతటి ఆధ్యాత్మిక భావనా బలం కలవారు. సంస్కృతాంధ్ర పండితుడు. రచనలు 1) భక్తి విజ్ఞప్తి 2) మాతృప్రేమ 3) శ్రీదేవిగీత 4) రాజరాజేశ్వరి స్తవము 5) లలితాలాపము.
యామవరం రామశాస్త్రి
1818లో నరసాంబ, సీతారామయ్యలకు కుకునూరులో జన్మించారు. రచనలు 1) గురుస్తుతి 2) దత్తాత్రేయ చతుశ్శష్ట్యుపచార పూజ 3) గురుస్తవ రాజము 4) భవానీ శంకర యుక్తస్తవ రాజము 5) గణపతి చతుశ్శష్ట్యుపచారపూజ 6) రాజరాజేశ్వర తారావళి 7) బాలపూజ 8) కుమార సల్లాపము 9) సమయువక దేవీతారావళి 10) చుంచనకోట దేవీ అఖండమాల 11) దేవీయమక తారావళి 12) శ్రీరామ చతుశ్వష్ట్యుపరాచ పూజ 13) కుమార శతకం 14) విత్తచిత్తవివాదం 15) మాణిక దండకం 16) వృత్తిపరామర్శ 17) శుద్ధాంధ్ర ఉషానిరుద్ధము 18) భాగవత ఏకాదశ స్కందము 19) కపోత కథ. ఈయన రచించిన గురుస్తుతి యమఘోశ్లేష, యమకాలంకారాలతో కూడినది.
ఫీల్ఖానా లక్ష్మణదేశికులు (1846-1914)
ఈయన శివరామ దీక్షితీయ సంప్రదాయ అచలపరిపూర్ణ సిద్ధాంత గురుపరంలోనివాడు. 1846లో నరసింహరావు, రామమ్మ దంపతులకు జన్మించారు. రచనలు 1) సుబోధ రత్నమాల 2) అచలతత్వ శిరోమణి అఖండమాల 3) సుజ్ఞానావితీర్థ తత్వఖండమాల. వీరి తత్వాల్లో గురుసూచన తత్వం చూడరా ఈ బ్రహ్మమూ ఎడతెగకయున్నది-యేడజూచిన బ్రహ్మము అన్నది. సికింద్రాబాద్, హైదరాబాద్లో ప్రధాన శిష్యవర్గం 50 మందిలో సూర్యాపేట నివాసి కొమరగిరి లక్ష్మీనారాయణ ఒకరు. నేడు ఫీల్ఖానా ఆయన పేరుతో సీతాఫల్మండిలో గురుమందిరం కట్టించి అధ్యక్షులుగా ఉప్పలంచి కృష్ణమూర్తి ఉన్నారు.
గోపతి లింగకవి
ఇంటిపేరు తుమ్మవారు. లింగమ్మ, పాపయ్య తల్లిదండ్రులు. సంగారెడ్డిపేట నివాసి. రచనలు 1) చెన్నబసవ పురాణం 2) అఖండజ్ఞాన మనఃప్రబోధ వచనకావ్య బంధం ఈ రెండు తాళపత్రాలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయి. ఇంకా మంగళాష్టకములు, విఘ్నేశ్వర, వీరేశ్వర, మల్లేశ్వర, రామేశ్వరాష్టంకంబులు రాశారు. కానీ అవి అలభ్యం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?