Errors that are common in words | మాటల్లో కామన్‌గా వచ్చే ఎర్రర్స్
స్పోకెన్ ఇంగ్లిష్ వర్క్‌షాప్‌లో గడిపిన ప్రతిరోజూ తన ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యానికి మెరుగులుదిద్దినదే. కాలం ఇట్టే గడిచిపోయింది సుమా! కారు ముందుకు వెళ్తూంటే శ్రావణి ఆలోచనలు తిరిగి గతంలోకి పరుగులు తీశాయి. కామన్ ఎర్రర్స్ మేడ్ బై ఇండియన్ స్పీకర్స్ అనే క్లాసులో తెలుసుకున్న విషయాలు తన జీవితంలో చాలా ఉపయోగపడుతున్నాయి.
One of my Friend
-One of my friend అనేస్తారు చాలామంది. ఇది తప్పు. One of తర్వాత ఎప్పటికీ బహువచనంలో ఉన్న Nouns రావాలి.
One of my friends (Correct)
One of the books (correct)
ఈ కింది వాక్యాలు చూడండి.
-One of my freinds are engineer ఈ వాక్యం తప్పు. ఎందుకంటే One of my Friends అంటే నా స్నేహితులతో ఒకరు అని అర్థం. కాబట్టి ఇక్కడ Helping verb is వాడాలి.
One of my Freinds is an engineer (correct)
One of my pens is lost (correct)
One of the ministers is speaking (correct)
One of the dogs has skin disease (correct)
Double Negatives
ఈ కింది వాక్యాలను గమనించండి.
-I dont know nothing about him (wrong)
-I dont know anything about him (correct)
-I know nothing about him (correct)
-I counld not find him nowhere (wrong)
-I could not find him anywhere (correct)
-He doesnot want none of that cake (wrong)
-He doesnot want any of that cake (correct)
Double past forms
ఈ కింది వాక్యాలను గమనిస్తే..
-I didnot went (wrong)
-I didnot go (Correct)
Wrong Usage of s / es With verb
ఈ కింది వాక్యాలను గమనించండి.
-They goes to movie every sunday (wrong)
-They go to a movie every sunday (correct)
-He sing songs nicely (wrong)
-He sings songs nicely (correct)
Wrong usage of doesnot or doesnt
ఈ కింది వాక్యాలను గమనించండి.
-He dont know anything (wrong)
-He doesnt know anything (correct)
-I doesnt sing songs (wrong)
-I dont sing songs (correct)
-Third person Singular (He, she, it లేదా ఒక పేరు)తో రెగ్యులర్/హాబిచ్యువల్ యాక్టివిటీస్ వ్యక్తపరిచేటప్పుడు లేదు అనే అర్థంలో Doesnot వాడాలి. మిగతా Subjects అంటే I, we, you and theyలతో do not వాడాలి.
I want to stand on my own feet
-నా కాళ్లపై నేను నిలబడాలనుకుంటున్నాను అనే అర్థంలో చాలామంది Standing on own feet అనే పద ప్రయోగం చేస్తుంటారు. ఇది తెలుగు భావాన్ని ఇంగ్లిష్‌లో సంకరం చేయడమవుతుంది. ఇండియన్స్‌కు తప్ప బయట ఎవరికీ అర్థం కాదు ఈ భావం.
కింది వాక్యం సరైనది ఈ అర్థంలో..
-I Want to be self reliant (correct)
Stage fear
-చాలామంది చాలా అలవోకగా వాడేస్తుంటారు. ఈ స్టేజ్ ఫియర్ అనే మాటను. ఇది తప్పు. ఏ ప్రామాణిక డిక్షనరీలో ఈ పదం కనిపించదు. ఇది అసలు ఇంగ్లిష్ భాషలో లేనే లేదు. సరైన ఎక్స్ప్రెషన్ Stage Fright.
-వేదికపై మాట్లాడటంలో భయం అనే అర్థంలో Stage Fright అనే పదప్రయోగం సరైనది. చాలామంది స్టేజ్ ఫియర్ అనే వాడుతుంటారు. ఇలా మనం నిత్య జీవితంలో తెలియకుండా చాలా పదాలు, వాక్యాలు తప్పుగా ఉపయోగిస్తుంటాం. ఇంగ్లిష్ భాష బాగా తెలిసిన వారి ముందు ఇలా తెలిసీ, తెలియని పద ప్రయోగాలు చేసి నవ్వుల పాలయిన అనుభవం అందరికీ ఉండే ఉంటుంది. ఇలాంటి అనుభవాలు మనలోని ఆత్మన్యూనతకు కారణమవుతాయి. ఇక ఏదైనా ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్లే నేర్చుకుందాం అంటే చాలా వరకు సంస్థలు డబ్బు సంపాదించటమే ధ్యేయంగా ఎంచుకొని నాణ్యత విషయంలో రాజీ అవుతుంటారు. చాలామంది స్పోకెన్ ఇంగ్లిష్ ట్రయినర్స్ కూడా పేర్కొన్న కామన్ ఎర్రర్స్ విషయంలో తప్పు చేస్తుంటారు. ఆ విషయంలో శ్రావణి అదృష్టవంతురాలు. తనతో పాటు చదివిన బ్యాచ్‌మెట్స్ కూడా తమ అదృష్టానికి మురిసిపోయేవారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?