Economic reforms that changed the course of the country | దేశగతిని మార్చిన ఆర్థిక సంస్కరణలు

దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నపలంగా వచ్చే సానుకూలమైన మార్పులే సంస్కరణలు. ప్రపంచవ్యాప్తంగా కాలానుగుణంగా తమ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చేసుకొన్న అనేక దేశాలు ప్రస్తుతం అగ్రరాజ్యాలుగా, అభివృద్ధిచెందిన దేశాలుగా మనగలుగుతున్నాయి. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు 1991లో ప్రారంభమయ్యాయి. నాటి నుంచి ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తున్నాయి. ప్రజాజీవనంలో వస్తున్న మార్పులే అందుకు ఉదాహరణ. నిపుణ పాఠకుల కోసం భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపై ఈ వ్యాసం..
పన్నులు
– సంస్కరణలకు పూర్వం జీడీపీ ట్యాక్స్ రేషియో తక్కువగా ఉండేది. (జీడీపీలో 5 శాతంలోపు పన్ను ఆదాయం) అయితే రాజా చెల్లయ్య కమిటీ సూచనల మేరకు అభిలషణీయ పన్ను విధానాన్ని పాటించడంతో జీడీపీలో పన్ను ఆదాయం పెరిగి దాదాపు 10.78 శాతంగా నమోదైంది.
– సంస్కరణలకు ముందు కేంద్రంలో పరోక్ష పన్ను ఆదాయం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ప్రత్యక్ష పన్ను ఆదాయం పరోక్ష పన్ను ఆదాయాన్ని మించడంతో ఆరోగ్యకరమైన అభివృద్ధిగా చెప్పవచ్చు. కానీ యూకే పన్ను ఆదాయం జీడీపీలో దాదాపు 32 శాతంగా ఉన్నది.
– ఏఎం ఖుస్రో ప్రకారం పన్ను ఆదాయం జీడీపీలో కనీసం 17 శాతం ఉండాలని పేర్కొన్నాడు.
– రాష్ర్టాలు వ్యాట్ అమలుచేయడం వల్ల పన్ను ఆదాయం పెరిగింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు జరగాలని ఆశిస్తున్నారు.
– వస్తుసేవల పన్ను వల్ల వస్తువులు, సేవలపై పన్ను ఒకే విధంగా ఉంటుంది.
– రెండు పన్నుల మధ్య ఏకీకరణ సాధ్యమై బహుళ స్థాన పన్నులు (మల్టీ పాయింట్ ట్యాక్స్) రద్దవుతాయి.
– ఎగుమతి, దిగుమతి సుంకం 300 నుంచి 10 శాతానికి తగ్గించడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమైంది.
– పన్ను ఎగవేతను నియంత్రించి సమాంతర ఆర్థిక వ్యవస్థను రద్దు చేయాలి.
– 1991లో జీడీపీ ట్యాక్స్ రేషియో 9.82 శాతం ఉండగా, 2014-15లో 10.78 శాతానికి పెరగడం ఆరోగ్యకరమైన అభివృద్ధిగా పేర్కొనవచ్చు.
అవస్థాపన (Infrastrucutre)
– రోడ్లు, రైల్వేలు, టెలికాం, విమానయానం, నౌకాయానం, గిడ్డంగులు, నీటి సరఫరా, విద్యుత్ మొదలైనవి అవస్థాపనగా గుర్తిస్తారు.
– వీటి అభివృద్ధికి భారీగా ద్రవ్యం అవసరం కాబట్టి ఒక ప్రత్యేక నిధి అవసరమని భావించి 1997లో ఐడీఎఫ్సీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్)ని ప్రారంభించింది.
– 2006లో ఐఐఎఫ్‌సీఎల్ (ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్) ప్రారంభించారు.
– 2015లో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ఐఐఎఫ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ప్రాస్ట్రక్చర్ ఫండ్)ను రూ. 20,000 కోట్లతో ప్రారంభించారు.
– అవస్థాపనపై స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1950-67 మధ్యలో 4.4 శాతం ఖర్చు చేయగా, 12వ ప్రణాళికలో శక్తిపై ఖర్చు జీడీపీలో 9 శాతం లక్ష్యంగా పెట్టుకుంది.
– అవస్థాపనలో ఎఫ్‌డీఐకి అనేక రంగాల్లో అవకాశం ఇచ్చారు.
వ్యవసాయం
– దేశంలో ఆర్థిక సంస్కరణలు పెద్దగా వ్యవసాయ రంగానికి అందలేదని చెప్పవచ్చు.
– దేశంలో సగటు కమతం 1953-54లో 3.12 హెక్టార్లుండగా, 2013-14లో 1.17 హెక్టార్లకు తగ్గింది.
– 1990-91లో 1.57 హెక్టార్లు ఉండగా, 2013-14లో 1.17 హెక్టార్లకు తగ్గింది.
– వ్యవసాయరంగంలో 41 శాతం రైతులు ఇష్టం లేకుండా వ్యవసాయం చేస్తున్నారు. 50 శాతం రైతులు ఇంకా వర్షాలపైనే ఆధారపడుతున్నారు.
– 48 శాతం రైతులు రుణ ఊబిలో ఉన్నారు. అది తెలంగాణలో 80 శాతం ఉన్నది. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
– సంస్కరణల వల్ల చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందలేదని గమనించాలి. పంటల వృద్ధి రేటు 1950-51 నుంచి 1964-65 మధ్యకాలంలో 2.8 శాతం నమోదు కాగా, 1981-82 నుంచి 1991-92 మధ్యకాలంలో 2.6 శాతం ఉన్నది.
– 1992-93 నుంచి 2006-07 మధ్యకాలంలో 2.1 శాతానికి తగ్గిపోయింది.
– 2004 నుంచి వ్యవసాయంలో ప్రభుత్వం పెట్టుబడి పెరగడంతో 11వ ప్రణాళికలో వ్యవసాయ వృద్ధి 3.7 శాతంగా నమోదైంది. 12వ ప్రణాళికలో 4 శాతం లక్ష్యంగా ఉన్నది.
– వ్యవసాయరంగంలో పంజాబ్ తరహాలో స్థూల సాగుభూమి (జీఐఏ)ని పెంచాలి.
– వ్యవసాయ ఆదాయంలో పరిశోధనపై 2004-06లో 0.52 శాతం మాత్రమే ఖర్చు చేశారు. దీన్ని పెంచాలి.
– ప్రభుత్వం ఏటీఏంఏ, కేవీకే, ఆర్ఐడీఎఫ్, కేసీసీ, ఎఫ్‌సీపీ, ఏఐబీపీ వంటి పథకాలు, చర్యలు చేపట్టిన చిన్నకారు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.
– ఆహార పదార్థాల ఉత్పత్తి 176 మిలియన్ టన్నుల (1991) నుంచి 257 మిలియన్ (2014-15) టన్నులకు పెరగడం ఆశించిన ప్రగతిగా పేర్కొనవచ్చు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు
– వైట్ ఎలిఫెంట్‌గా పిలిచే ప్రభుత్వరంగ సంస్థలు సీపీఎస్‌యూ ఆర్థిక సంస్కరణల వల్ల లాభాల్లోకి వచ్చాయి.
– మొత్తం 290 సీపీఎస్‌యూల్లో 163 లాభాలు గడిస్తున్నాయి.
– 7 సీపీఎస్‌యూలు మహారత్న హోదా, 17 సీపీఎస్‌యూలు నవరత్న హోదా, 54 సీపీఎస్‌యూలు మినీరత్న-I, 18 సీపీఎస్‌యూ మినీరత్న-II హోదాను కలిగి ఉన్నాయి.
– అయితే దాదాపు 71 సీపీఎస్‌యూలు నష్టాల్లో ఉన్నాయి. ప్రధానంగా బీఎస్ఎన్ఎల్, హిందుస్థాన్, హిందుస్థాన్ ఫొటో ఫిలిమ్స్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ మొదలైనవి.
– సీపీఎస్‌యూల్లో ప్రవేశపెట్టిన వాలంటరీ రిటైర్మెంట్ పథకం, రత్న పథకాలతో మంచి ఫలితాలు వచ్చాయి.
– 2002 సీసీఐ (కాంపిటిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) వల్ల ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడింది.
ప్రైవేటీకరణ
– ఉత్పత్తి ప్రక్రియలో 1947-1991 మధ్యకాలంలో ప్రైవేటురంగంలో పూర్తిగా దూరం కావడంతో సప్లయ్ కొరత ఏర్పడి ద్రవ్యోల్బణానికి దారితీసింది.
– అయితే సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ప్రైవేటు రంగానికి ఉత్పత్తి ప్రక్రియలో వివిధ రూపాల్లో అవకాశం ఇవ్వడంతో జీడీపీలో దాదాపు 75 శాతం భాగస్వామ్యం కలిగి ఉన్నది.
– ప్రపంచంలోనే 7వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా జాతీయ ఆదాయంలో నిలిచింది.
– ముఖ్యంగా ప్రైవేటు రంగం కింది రూపాల్లో భారత ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తుంది.
ఎ) పెట్టుబడుల ఉపసంహరణ
బి) పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్
సి) ప్రైవేటీకరణ
డి) బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (బాట్)
ఇ) బిల్డ్-ఓన్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (బూట్)
ఎఫ్) బిల్డ్-ఆపరేట్-ఓన్ (బూ)
జీ) బిల్డ్-లీజ్-ట్రాన్స్ఫర్ (బీఎల్టీ)
హెచ్) డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్ (డీబీఎఫ్‌వో)
జీ) డిజైన్-కన్స్ట్రక్ట్-మేనేజ్-ఫైనాన్స్ (డీసీఎంఎఫ్)
విద్యుత్ అంశాలు
– దేశంలో విద్యుత్ ఉత్పత్తి 1947లో 1362 ఎండబ్ల్యూ ఉంటే 2015లో దాని ఉత్పత్తి 2,80,000 ఎండబ్ల్యూకు చేరుకుంది.
– అయినా డిమాండ్ సప్లయ్ భేదం దాదాపు 10-15 శాతం మధ్యలో ఉన్నది. విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు APDRP (Accelerated Power Development Reforms Project)ను ప్రారంభించారు. (2002-03)
– 2008లో R-APDRPని ప్రారంభించారు. అంటే Restructured APDRP ప్రారంభించడం వల్ల విద్యుత్ నష్టాలు తగ్గాయి.
– 12వ ప్రణాళికలో విద్యుత్ నష్టాలను 29 నుంచి 15 శాతానికి తగ్గించాలని 88,537 ఎండబ్ల్యూ ఉత్పత్తి అదనంగా సాధించాలని ఆశించారు.
– సామర్థ్యాన్ని అంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను 40 నుంచి 66 శాతానికి పెంచారు.
– 2022 నాటికి 1,00,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యంగా ఉంది.
– తొమ్మిదో ప్రణాళికలో 40,000 ఎండబ్ల్యూ ఉత్పత్తి ఉండగా, 2015 నాటికి 2,80,000 ఎండబ్ల్యూ ఉత్పత్తి సాధించాం. అది విద్యుత్ రంగంలో తీసుకున్న సంస్కరణల ఫలితం అని చెప్పవచ్చు.
– 2020కి 266 జీడబ్ల్యూ పునరుత్పత్తి విద్యుత్ ఉత్పత్తి సాధించాలనేది లక్ష్యం. ఇందులో గాలి శక్తి ద్వారా 80 జీడబ్ల్యూ, సోలార్ ద్వారా 100 జీడబ్ల్యూ లక్ష్యంగా కలిగి ఉన్నాం.
ప్ర. 2020లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం (సి)
ఎ) 100000 ఎండబ్ల్యూ బి) 100 జీడబ్ల్యూ
సి) ఎ, బి డి) 1000 జీడబ్ల్యూ
చిన్న తరహా పరిశ్రమలు
– ఆర్థిక సంస్కరణ వల్ల పెద్ద తరహా పరిశ్రమలు పొందిన లబ్ధితో పోలిస్తే ఎస్ఎస్ఐలు పొందినది తక్కువే అని చెప్పాలి.
– ముఖ్యంగా ఉపాధిలో రెండోస్థానంలోనూ, 8 శాతం జీడీపీ కలిగి ఉంది. 38 శాతం పారిశ్రామిక ఉత్పత్తి కలిగి ఉన్న చిన్న తరహా పరిశ్రమలు ఆర్థిక సంస్కరణల వల్ల పెద్దగా లబ్ధి పొందలేదు.
– ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమల్లో నిజ వేతనాలు తగ్గాయి.
– 1974-75 నుంచి 1981-82 ఏండ్ల మధ్యలో 10-99 మంది కార్మికులు పనిచేసే సంస్థల్లో నిజ వేతన వృద్ధి 3.59 శాతం ఉంటే 1981-82 నుంచి 1988-89 మధ్యకాలంలో నిజవేతన వృద్ధి 1.07 శాతానికి తగ్గింది.
– కానీ 100 మందికిపైగా పనిచేసే సంస్థల నిజవేతనం పెరిగింది.
– స్మాల్ ఈజ్ బ్యూటీఫుల్ అనే షుంపీటర్ మాటలు భారతదేశంలో నిజం కాలేదు.
– 1983-94 మధ్యకాలంలో ఉపాధి వృద్ధి 2.70 శాతం ఉంటే 1994-2000 మధ్యకాలంలో 1.07శాతం మాత్రమే నమోదైంది.
– 1977-78 నుంచి 1993-94 మధ్యకాలంలో నిరుద్యోగ తగ్గుదల 2.15 శాతం ఉంటే, 1993-94 నుంచి 2011-12 మధ్యకాలంలో 0.43 శాతం మాత్రమే నమోదైంది.
– అంటే సంస్కరణల అనంతరం ఆర్థిక వృద్ధి మాత్రమే పెరిగింది. కానీ ఉపాధి పెరగలేదు.
– అంటే భారతదేశంలో జాబ్‌లెస్ గ్రోత్ నమోదైంది. 1977-78లో నిరుద్యోగ రేటు 8.18 శాతం ఉండగా, 2011-12లో 5.6 శాతంగా ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.
– భారతదేశం ప్రపంచంలో జాతీయాదాయంలో ఏడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండి ఇంకా 5.6 శాతం నిరుద్యోగం ఉండటం విచారకరం.
– ఉపాధి వ్యాకోచిత వృద్ధి 1983-84 నుంచి 1993 మధ్యలో 0.52 నమోదైతే 1993-94 నుంచి 1999-2000లో 0.16గా మాత్రమే నమోదైంది.
– అత్యధిక శాతం ప్రజలు నివసించే గ్రామీణ ప్రాంతంలో ఉపాధి వృద్ధి పట్టణ ప్రాంతంలో కంటే తక్కువగా ఉండటం మరో విచారకర అంశం.
– ప్రభుత్వరంగంలో 1983-84 మధ్యలో ఉపాధి వృద్ధి 1.52 శాతం ఉంటే, 2004-09లో ఉపాధి వృద్ధి ప్రభుత్వ రంగంలో 0.56 శాతం రుణాత్మకంగా నమోదు కావడం ఒక చేదు నిజం.
– 1983-94లో సంఘటిత ఉపాధి వృద్ధి 1.20 అయితే 2004-09లో 0.82కు తగ్గడం మరొక ఛిద్రంగా (Leakage) గమనించాలి.
RELATED ARTICLES
-
What to do if you’re feeling sleepy while studying
-
Public life chariots are minerals | జనజీవన రథచక్రాలు ఖనిజాలు (గ్రూప్-1 ప్రత్యేకం)
-
The first stage of Telangana development | తెలంగాణ తొలి వికాస దశ ( గ్రూప్-1 మెయిన్స్)
-
An inscription describing the genealogy of Kakatiya | కాకతీయుల వంశవృక్షాన్ని వివరించిన శాసనం? ( పోటీపరీక్షల ప్రత్యేకం )
-
What title did Tanisha give to Madanna | మాదన్నకు తానీషా ఇచ్చిన బిరుదు? హిస్టరీ
-
An inscription by Annaladevi, the wife of Rudradeva | రుద్రదేవుని భార్య అన్నాలదేవి వేసిన శాసనం?
Latest Updates
గురుకులంలో బోధనకు దరఖాస్తులు ఆహ్వానం
స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం
ఓయూకు బెస్ట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అవార్డు
బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
4 నుంచి ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై విచారణ
10 వరకు పీజీఈసెట్ పరీక్ష ఫీజు చెల్లించొచ్చు
15లోపు పీఈ సెట్ దరఖాస్తుకు చాన్స్
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ప్రారంభం
టీశాట్‌లో గ్రూప్ 1 ఇంగ్లిష్ పాఠాలు
ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ