Dwakra scheme | డ్వాక్రా పథకం
– గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులపై లింగ వివక్షను నిర్మూలించి, వారిని అభివృద్ధి చేయడానికి డ్వాక్రా(డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
– ఈ పథకాన్ని 1982లో అమల్లోకి తెచ్చారు. మొదటగా దీన్ని దేశవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా 50 జిల్లాల్లో ప్రారంభించారు. ఆ తర్వాత దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించారు.
– డ్వాక్రా పథకం ముఖ్యోద్దేశం మహిళల జీవన పరిస్థితులను మెరుగుపరచడం, తద్వారా పిల్లల ప్రాథమిక సామాజిక సేవలకు స్వయం ఉపాధి కల్పించడం.
– డ్వాక్రా గ్రూపు మహిళలకు సంబంధిత రంగాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించి రుణ సౌకర్యం ఏర్పర్చ డం ద్వారా వారికి జీవనోపాధి కల్పించడమే కాకుండా వారిలో మానసిక ైస్థెర్యాన్ని నింపడమే లక్ష్యంగా అమల్లోకి తెచ్చారు.
– గ్రూపులుగా ఏర్పర్చి సమూహంగా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా సంఘంలో వారి ప్రతిష్ట పెరగడమే కాకుండాగ్రామీణ మహిళల్లో పొదుపు పెరుగుతుంది. తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది.
– డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళల వ్యక్తిగత ఆదాయం పెరగడమే కాకుండా కుటుంబాల కనీస అవసరాలు తీరి సంఘంలో వారి స్థానం సుస్థిరమవుతుంది.
– ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి 1996-97 వరకు 1,87,918 డ్వాక్రా గ్రూపులు, 30,39,383 గ్రామీణ మహిళలకు రూ. 248.95 కోట్లు ఖర్చు చేశారు.
– 8వ ప్రణాళికలో భాగంగా డ్వాక్రా కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి అనేక చర్యలు చేపట్టారు. కార్యక్రమాన్ని దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించారు. మారుమూల ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న సమూహాలను ఏర్పాటు చేశారు. రివాల్వింగ్ ఫండ్‌ను రూ. 15,000 నుంచి రూ. 25,000 పెంచారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?