ఏఐసీసీసీఆర్
– 1968 మే నెలలో సుశితాల్రాయ్ చౌదరి కన్వీనర్‌గా ఆలిండియా కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ (ఏఐసీసీసీఆర్) ఏర్పడింది.
– విప్లవ మార్గాన్ని అనుసరించే వారందరినీ ఏఐసీసీసీఆర్లో చేరవలసిందిగా ఆహ్వానించారు. అయితే ఇది ఏర్పడగానే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావోవాదులు అందులో చేరలేదు.
– పశ్చిమబెంగాల్‌కు చెందిన మావో వాదులు, ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు మావో వాదులతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోవడం ఆంధ్రప్రదేశ్‌లోని బలమైన మావో వర్గానికి నచ్చలేదు.
– పశ్చిమబెంగాల్ మావో వాదులకు దగ్గరైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావో వాదులు నక్సల్బరీ సాలిడరీ కమిటీ వైపు కేంద్రీకృతమయ్యారు. వీరే తర్వాతికాలంలో ఆంధ్రప్రదేశ్ మావో వాదుల్లో వచ్చిన చీలికల్లో తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుల నాయకత్వాన్ని వదిలి వెళ్లిపోయారు.
నక్సల్బరీ సాలిడరీ కమిటీ
– ఆంధ్రప్రదేశ్ మావో వాదుల్లో ఏపీసీసీసీఆర్ పట్ల అసంతృప్తి చెందినవారు నక్సల్బరీ సాలిడరీ కమిటీగా ఏర్పడ్డారు. దీన్ని ఏఐసీసీసీఆర్ గుర్తించింది.
సీపీఐ (ఎంఎల్)గా మారిన ఏఐసీసీసీఆర్
– ఏఐసీసీసీఆర్ 1969 మే 1న భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్-లెనినిస్ట్)గా అవతరించింది.
– పశ్చిమబెంగాల్ ఆంధ్రప్రదేశ్ మావోయిస్టుల్లో ఆచరించాల్సిన వ్యూహాత్మక విధానాల విషయంలో భేదాభిప్రాయాలు నెలకొన్నాయి.
-కొత్తగా ఏర్పాటైన సీపీఐ (ఎంఎల్)కు వ్యవసాయక విప్లవం విషయంలో ఎలాంటి నిర్దిష్ట విధానం లేకపోగా, కేవలం వర్గ శత్రు నిర్మూలన ద్వారా రాజ్యాధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా మారింది.
– ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లోని మావో వాదులు శ్రామిక, రైతు, మధ్యతరగతి, జాతీయ బూర్జువా శక్తుల ఐక్య సంఘటనతో సామ్రాజ్యవాదం, ఫ్యూడలిజం, దానికి సహకరించే శక్తులను కూలదోయాలన్నారు.
– సీపీఐ (ఎంఎల్) అవతరణను పెకింగ్ రేడియోలో ప్రకటించడం ద్వారా ఆ పార్టీని చైనా గుర్తించింది.
– తాము సాగిస్తున్న పోరాటాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్న విషయాన్ని మావోవాదులు ఏడాది కాలంలోనే గుర్తించారు.
– 1970లో జరిగిన పార్టీ రెండో కాంగ్రెస్‌లో సీపీఐ (ఎంఎల్)లోని వివిధ గ్రూపులు ప్రాధాన్యత కోసం పోటీపడ్డాయి.
– పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావోయిస్టుల్లో కేవలం అనుసరించదగ్గ వ్యూహాత్మక విషయాల్లోనే భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. అయితే కొత్తగా ఏర్పడ్డ సీపీఐ (ఎంఎల్)లో వ్యవసాయిక విప్లవం విషయంలో ఎలాంటి నిర్దిష్ట విధానం రూపొందక, కేవలం వర్గ శత్రు నిర్మూలన ద్వారా రాజ్యాధికారం చేపట్టాలన్నదే ధ్యేయంగా మారింది.
-వ్యక్తిగత హింసావాద చర్యలను ఆంధ్రప్రదేశ్ మావోవాదులు సమర్థించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావోయిస్టుల్లో విభేదాలు పెరిగి రెండు పార్టీలుగా చీలిపోయారు. అవి…
1. తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ కమిటీ (రెవల్యూషనరీ)
2. చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ
– 1971లో చారు మజుందార్, సత్యనారాయణ సింగ్‌ల నాయకత్వంలోని సీపీఐ (ఎంఎల్) పార్టీ చీలిపోయింది. సత్యనారాయణ సింగ్ వర్గం ప్రత్యేకంగా పనిచేయడం ప్రారంభించింది.
1974 చివర్లో ఆంధ్రప్రదేశ్‌లోని చండ్ర పుల్లారెడ్డి వర్గం సత్యనారాయణసింగ్తో కలిసి సీపీఐ (ఎంఎల్)గా ఏర్పడ్డారు.
– ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చారు మజుందార్ అనుచరులు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తిల నాయకత్వంలో పనిచేశారు.
– శ్రీకాకుళం గిరిజనోద్యమం సాగుతున్న సమయంలోనే ఏపీఆర్సీసీ నాయకత్వంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో మావోయిస్టు ఉద్యమం ఒక రూపాన్ని సంతరించుకుంది.
– ఈ ఉద్యమాన్ని సాగించిన తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులు ముగ్గురు కూడా సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర సెక్రటేరియట్లో, పార్టీ కేంద్ర కమిటీలో సభ్యులుగా ఉండేవారు. వీరు ముగ్గురు కలిసి 1968లో సీపీఐ (ఎంఎల్)లో కమ్యూనిస్టు విప్లవకారుల కో-ఆర్డినేషన్ కమిటీగా ఏర్పడ్డారు.
– బర్దాన్ ప్లీనరీ ముగిసిన తర్వాత ఏపీఆర్సీసీని స్వతంత్ర వ్యవస్థగా రూపొందించారు.
– 1970 మే నెలలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సీపీఐ (ఎంఎల్) రెండో అభిల భారత కాంగ్రెస్‌లో వివిధ వర్గాలు గెరిల్లా పోరాట పంథా పైనే ఆధారపడటాన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నించాయి. పార్టీ మొదలుపెట్టిన ఉద్యమాలు నత్తనడకన నడుస్తున్నప్పటికీ ఉద్యమనాయకుడైన చారు మజుందార్ ప్రభావం పార్టీలోని వర్గాలపై ఏ మాత్రం తగ్గలేదు.
– ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన వర్గాలు గెరిల్లా పోరాట పంథాను వ్యతిరేకించే వారి ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేశాయి. ఈ వర్గాలపై మజుందార్ ప్రభావం ఎక్కువగా ఉంది. వీరంతా మజుందార్ అజేయుడైన నాయకుడిగా ప్రకటించేందుకు ప్రయత్నం చేశారు.
– విప్లవ అధికారం లేకుండా విప్లవ పార్టీ మనుగడ సాధించలేదు కనుక అలాంటి విప్లవ అధికారం చారు మజుందార్ అని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
– ఉత్తరప్రదేశ్, బీహార్, కశ్మీర్‌కు చెందిన వర్గాలు పార్టీ పంథాలో సరళతను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాయి.
– 1972లో చారు మజుందార్ మరణించే నాటికే పార్టీలో వివిధ వర్గాలు ఏర్పడి బలపడ్డాయి. ఆయా వర్గాలు తమకు నచ్చిన రీతిలో చారు మజుందార్ పంథాలో మార్పులు చేశాయి. అలా విడిపోయిన గ్రూపులన్నింటిలోను లిన్‌పియావో వర్గం చారు మజుందార్ పంథాకు దగ్గరగా చేరింది. మిగతా వర్గాలైన సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ, సత్యనారాయణసింగ్ వర్గాలు మజుందార్ పంథాలో కొంత సరళత్వాన్ని ప్రవేశపెట్టాయి.
– పశ్చిమ బెంగాల్‌లోని మావోయిస్టుల వలే ఆంధ్రప్రదేశ్‌లోని మావోయిస్టులు కూడా శ్రీకాకుళపు గ్రామీణ ప్రాంతాలను వదిలి నగర ప్రాంతాలకు తమ పోరాటాన్ని విస్తరింపచేయలేదు. ఆ సమయంలో సర్కార్ జిల్లాల్లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది.
– ఈ ఉద్యమం పట్టణ ప్రాంతాల్లో తీవ్రంగా ఉండటంతో మావోయిస్టులు పల్లె ప్రాంతాల్లో చెదురుమదురుగా దాడులు చేస్తూ తమ ఉనికి చాటుకోసాగారు. కానీ పోలీసుల నిర్బంధం అధికమవడంతో మావోయిస్టులు ఎక్కువ కాలం ఉద్యమాన్ని కొనసాగించలేకపోయారు.
-1972లో పుచ్చలపల్లి సుందరయ్య తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకం 1973లో వీర తెలంగాణ విప్లవ పోరాటం-గుణపాఠాలు అనే పేరుతో తెలుగులో అనువదించబడింది.
– సీపీఐ (ఎంఎల్)లో చీలిక వచ్చినప్పుడు తెలంగాణ జిల్లాల్లో ఉన్న మావోయిస్టులంతా తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి గ్రూపుల్లో చేరిపోయారు.
– కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి మొదలైనవారు మజుందార్ వర్గానికి దగ్గరై తెలంగాణ ప్రాంతంలో దళాలను ఏర్పర్చుకొని వర్గశత్రు నిర్మూలనా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో కొన్ని చోట్ల దాడులు చేసిన అనంత రం ఉపన్యాసాలు గాని, నినాదాలు గానీ చేయలేదు.
– చారు మజుందార్ మరణంతో పార్టీలో చెలరేగుతున్న వాదవివాదాలు ఆగిపోయాయి. గ్రూపులుగా విడిపోయిన వారందరూ తాము మజుందార్ వారసులమని ప్రకటించుకున్నారు.
లిన్‌పియావో వర్గం
– మజుందార్ మరణానంతరం ఆయన పంథాను మార్పులు చేర్పులు లేకుండా లిన్‌పియావో వర్గం మాత్రమే అనుసరించింది. ఇది గెరిల్లా పోరాట పంథాపై ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించింది. ఈ వర్గానికి పశ్చిమబెంగాల్లో మహదేవ ముఖర్జీ, భవానీరాయ్ చౌదరీలు నాయకత్వం వహించారు.
– 1973లో సీపీఐ (ఎంఎల్) లిన్‌పియావో వర్గం బర్దాన్ జిల్లాలో పార్టీ రెండో వార్షికోత్సవం నిర్వహించింది. ఈ ఏడాదిలోనే మహదేవ ముఖర్జీ తెలంగాణ ప్రాంత నాయకుడైన కొండపల్లి సీతారామయ్యను మధ్యప్రదేశ్‌లో కలుసుకున్నాడు.
– తీవ్రవాద భావాలు ఉన్నప్పటికీ లిన్‌పియావో వర్గంలో చేరడానికి సీతారామయ్య నిరాకరించి, సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీతో సంబంధాలు ఏర్పర్చుకున్నాడు.
– తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో నాయకుడు రమణారెడ్డి, రవూఫ్‌లు మహదేవ ముఖర్జీని సమర్థించారు. వీరు ఆంధ్రప్రదేశ్‌లో లిన్‌పియావో వర్గంగా ఏర్పడ్డారు. అనేక చోట్ల దాడులు నిర్వహించారు. అయితే చాలా మంది కార్యకర్తలు ఎన్కౌంటర్లలో మరణించారు.
ఏపీసీసీసీఆర్ ఆవిర్భావం
-1968 జూన్‌లో బర్దాన్లో జరిగిన భారత కమ్యూనిస్టు (మార్క్సిస్ట్) పార్టీ ప్లీనరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావో వాదులు సైద్ధాంతిక చర్చలు జరగాలని పట్టుబట్టారు.
– పార్టీ ప్రతిపాదించిన అధికార డ్రాఫ్ట్‌కు ప్రత్యామ్నాయ డ్రాఫ్ట్‌ను ప్రతిపాదించారు. కానీ, దాన్ని ప్లీనరీ తిరస్కరించింది.
– పార్టీ అధికార డ్రాఫ్ట్‌కు మావోయిస్టులు ప్రతిపాదించిన సవరణలను ప్లీనరీ అంగీకరించింది.
-దీంతో తమ పట్ల పార్టీ కేంద్ర కమిటీ ధోరణి మారనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావోయిస్టులు గ్రహించారు.
– ఆంధ్రప్రదేశ్ కామ్రేడ్స్‌కు ఉత్తరం ద్వారా కేంద్ర కమిటీ మావోయిస్టుల భావాలు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)కి వ్యతిరేకమని వివరించింది.
– ఈ లేఖలకు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మావోయిస్టులు పార్టీలోని సభ్యులకు బహిరంగ లేఖలు రాశారు.
– ఆంక్షలకు గురై పార్టీ నుంచి బహిష్కరించబడటానికి సిద్ధంగా ఉన్న మావోయిస్టులంతా 1968 జూన్‌లో విజయవాడలో సమావేశమయ్యారు. ఇందులో మావోయిస్టులంతా భారత కమ్యూనిస్టు (మార్క్సిస్ట్) పార్టీ (సీపీఎం) నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ (ఏపీసీసీసీఆర్)గా ఏర్పడ్డారు.
– 1964-68 మధ్యకాలంలో వివిధ రాష్ర్టాల్లో సీపీఎం నుంచి మావో ఆలోచనా విధానాన్ని సమర్థించేవారు వేరవడం మొదలైంది. ఇలా మావో ఆలోచనలను సమర్థించేవారిలో ఆంధ్ర, పశ్చిమబెంగాల్ అనే రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఈ గ్రూపుల పోరాట వ్యూహాల గురించి సైద్ధాంతిక చర్చలు కొనసాగిస్తుండేవి.
– ఈ విభేదాలు ఉండటంవల్ల 1968లో ఏపీసీసీఆర్ ఏర్పడినప్పుడు పశ్చిమబెంగాల్ మావోవాద వర్గాలను సమర్థిస్తున్న ఆంధ్రప్రదేశ్ మావో వర్గాల నాయకులైన పంచాది కృష్ణమూర్తి, వెంపటాపు సత్యనారాయణ, కేజీ సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్యలు విజయవాడ సమావేశంలో పాల్గొనలేదు.