Dalit movements in Telangana | తెలంగాణలో దళిత ఉద్యమాలు
Dalit movements
వారిలో భాగ్యరెడ్డివర్మ, అరిగె రామస్వామి, బీఎస్ వెంకట్రావు, బత్తుల శ్యాంసుందర్ ముఖ్యులు. దళితుల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు దేవదాసీ, జోగిని ఆచారాల నిర్మూలనకు విస్తృతంగా కృషిచేశారు. అంతేకాకుండా పలు ప్రజాహిత కార్యక్రమాలను కూడా చేపట్టారు.
మాదరి భాగ్యరెడ్డివర్మ (1888-1939)
-హైదరాబాద్ రాష్ట్రంలో అంటరానితనం, కులం వివక్షను వ్యతిరేకిస్తూ ఆదిహిందూ ఉద్యమాన్ని ప్రారంభించారు.
-1888 మే 22న హైదరాబాద్‌లో మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు జన్మించారు.
-చిన్న గొడవల కారణంగా చిన్నప్పుడు ఇల్లు వదిలి గోవాలో క్యాథలిక్ చర్చిలో టెన్నిస్‌బాల్ బాయ్‌గా చేరారు.
-1906లో హైదరాబాద్‌లో భాగ్యరెడ్డివర్మ తెలంగాణ మొదటి దళిత సంస్థ అయిన జగన్మిత్రమండలిని స్థాపించారు.
-1910లో దళితుల్లో ధార్మిక నైతిక ప్రబోధ కోసం వైదిక ధర్మప్రచారిణి సభను నెలకొల్పారు.
-1911లో మన్య సంఘంను ప్రారంభించారు. దీన్ని 1913లో ఆదిహిందూ సోషల్ సర్వీస్లీగ్గా మార్చారు.
-1913లో వైశాఖ పౌర్ణమి రోజున మొదటిసారిగా బుద్ధ జయంతి నిర్వహించారు.
-1913లో భాగ్యరెడ్డివర్మ సేవలకు గుర్తింపుగా ఆర్యసమాజ్ వర్మ అనే బిరుదును ప్రదానం చేసింది.
-1931లో లక్నో సదస్సులో వర్మ అనే పదం అగ్రకులాన్ని చూయిస్తుందని కొందరు తెలపగా, ఇకనుంచి వర్మ పదాన్ని తొలగిస్తున్నానని ఆ సదస్సులో పేర్కొన్నారు.
-హరిజనుల సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ పేరుతో తెలుగు వారపత్రికను నడిపారు.
-1921-24 వరకు ఆదిహిందూ మహాసభను నిర్వహించారు.
-మొదటి ఆదిహిందూ మహాసభ బెల్గాంకు చెందిన వ్యక్తి పాపన్న (హరిజనుడు) అధ్యక్షతన జరిగింది.
-ఆదిహిందూ వలంటీర్ దళం కూడా ఏర్పాటు చేశారు.
-1939 ఫిబ్రవరి 18న అనారోగ్యంతో మరణించారు.
అరిగె రామస్వామి (1885-1973)
-భాగ్యరెడ్డివర్మ సమకాలికుడు.
-హైదరాబాద్ రాష్ట్రంలో దళితుల్లో చైతన్యానికి, కులవివక్షకు వ్యతిరేకంగా పనిచేశారు.
-రంగారెడ్డి జిల్లా రామనకోలలో జన్మించారు.
-1922లో ఆదిహిందూ జాతీయోన్నతి సభను స్థాపించారు.
-1931లో అరుంధతీయ మహాసభను ప్రారంభించారు.
-సికింద్రాబాద్‌లోని కుమ్మరివాడ ప్రాంతంలో సునీత బాల సమాజంను ఏర్పాటు చేశారు.
-మద్యపాన నిషేధం, జోగిని వ్యవస్థ, బాల్య వివాహాలు, జంతుబలులను వ్యతిరేకించారు.
బీఎస్ వెంకట్రావు (1896-1953)
-1896 డిసెంబర్ 11న హైదరాబాద్‌లో జన్మించారు.
-ఇతని తండ్రి బాతుల సాయన్న.
-ఈయన అంబేద్కర్ అనుచరుల్లో ప్రముఖులు.
-హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధిగాంచారు.
-మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లిష్, ఉర్దూ, పర్షియన్, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.
-తెలంగాణ ప్రాంతంలో దళిత స్త్రీల్లో అనాదిగా ఆచరణలో ఉన్న దేవదాసీ, జోగిని దురాచారాల్ని నిర్మూలించే ఉద్దేశంతో 1922లో ఆదిద్రావిడ సంఘంను స్థాపించారు.
-1927లో ఆదిహిందూ మహాసభను స్థాపించి దళితుల్లో చైతన్యం తీసుకొచ్చారు.
-సికింద్రాబాద్ ఘాస్మండి ప్రాంతంలో దళితులకు నివాస గృహాలను ఏర్పాటు చేశారు. దీన్నే ప్రస్తుతం ఆదినగర్గా పిలుస్తున్నారు.
-అంబేద్కర్ యూత్‌లీగ్ పేరును హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్‌గా మార్చారు.
-1936లో అంబేద్కర్ ఆహ్వానం మేరకు బొంబాయి రాష్ట్ర మహర్ సమావేశానికి అధ్యక్షత వహించారు.
-నిజాం ఇతడిని 1937లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు, ఆ తర్వాత 1943లో నిజాం రక్షణ మండలికి నామినేట్ చేశారు.
-946లో హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
-1947లో మీర్ లాయక్ అలీ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
-1952లో రాష్ట్రశాసనసభ ద్వారా రాజ్యసభకు ఎన్నికయ్యారు.
-ఇతడిని రావు సాహెబ్ అని మిత్రులు, అనుచరులు పిలిచేవారు.
-1953 నవంబర్‌లో మరణించారు.
బత్తుల శ్యాంసుందర్
-1908 డిసెంబర్ 18న జన్మించారు.
-1925లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేశారు.
-1942 మే 30న మరఠ్వాడాలో జరిగిన డిప్రెస్ట్ కాస్ల్ మహాసభకు అధ్యక్షత వహించారు.
-దళిత జాతుల సమాఖ్య కార్యదర్శిగా పనిచేశారు.
-అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు.
-ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
-1945లో ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.
-1946లో హైదరాబాద్ విధానసభ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
-1952లో హైదరాబాద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు.
-1954లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు.
-1968లో భారతీయ భీమసేన స్థాపించారు.
-1968లో మరాఠా విశ్వవిద్యాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు.
మాదిరి ప్రశ్నలు
1. హైదరాబాద్ నగరంలో న్యాయ పంచాయితీల వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు?
1) మాదరి భాగ్యరెడ్డివర్మ 2) బీ శ్యాంసుందర్ 3) బీఎస్ వెంకట్రావు 4) అరిగె రామస్వామి
2. 1906లో జగన్ మిత్రమండలిని స్థాపించింది ఎవరు?
1) అరిగె రామస్వామి 2) భాగ్యరెడ్డివర్మ
3) వెంకట్రావు 4) శ్యాంసుందర్
3. 1910లో దళితుల్లో ధార్మిక నైతిక ప్రబోధ కోసం వైదిక ధర్మ ప్రచారిణి సభను స్థాపించింది ఎవరు?
1) రామస్వామి 2) భాగ్యరెడ్డివర్మ
3) వెంకట్రావు 4) శ్యాంసుందర్
4. హరిజనుల సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ పేరుతో తెలుగు వారపత్రికను నడిపిందెవరు?
1) అరిగె రామస్వామి 2) బీఎస్ వెంకట్రావు 3) శ్యాంసుందర్ 4) భాగ్యరెడ్డివర్మ
5. కింది వాటిలో సరైనది ఏది?
1) భాగ్యరెడ్డివర్మ ఆదిహిందూ వలంటీర్ దళం ఏర్పాటు చేశారు
2) భాగ్యరెడ్డివర్మ సమకాలికుడు అరిగె రామస్వామి
1) 1 2) 2 3) 1, 2 4) ఏదికాదు
6. కింది వారిలో రంగారెడ్డి జిల్లా రామనకోల గ్రామంలో జన్మించింది ఎవరు?
1) వెంకట్రావు 2) రామస్వామి
3) శ్యాంసుందర్ 4) ఎవరుకాదు
7. అరిగె రామస్వామి అరుంధతీయ మహాసభను ఎప్పుడు స్థాపించారు?
1) 1930 2) 1934 3) 1935 4) 1931
8. హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందినవారు?
1) అరిగె రామస్వామి 2) బి.శ్యాంసుందర్
3) బీఎస్ వెంకట్రావు 4) భాగ్యరెడ్డివర్మ
9. అంబేద్కర్ ఆహ్వానం మేరకు ఏ సంవత్సరంలో బొంబాయి రాష్ట్రంలో జరిగిన మహర్ సమావేశానికి వెంకట్రావు అధ్యక్షత వహించాడు?
1) 1936 2) 1938 3) 1940 4) 1945
10. రావు సాహెబ్‌గా పేరు పొందినది ఎవరు?
1) బీఎస్ వెంకట్రావు 2) అరిగె రామస్వామి 3) భాగ్యరెడ్డివర్మ 4) శ్యాంసుందర్
11. బత్తుల శ్యాంసుందర్ భారతీయ భీమసేనను ఎప్పుడు స్థాపించారు?
1) 1960 2) 1968 3) 1961 4) 1965
12. కిందివారిలో ఎవరు దళిత జాతుల సమాఖ్య కార్యదర్శిగా పనిచేశారు?
1) బత్తుల శ్యాంసుందర్ 2) బీఎస్ వెంకట్రావు 3) నారాయణగురు 4) ఎవరుకాదు
13. కింది వాటిని జతపర్చండి.
1) భాగ్యరెడ్డివర్మ ఎ) 1908
2) అరిగె రామస్వామి బి) 1896
3) బీఎస్ వెంకట్రావు సి) 1885
4) బత్తుల శ్యాంసుందర్ డి) 1888
ఇ) 1886
1) 1-డి, 2-సి, 3- బి,4-ఎ
2) 1-డి, 2-సి, 3- బి,4-ఇ
3) 1-డి, 2-బి, 3- సి,4-ఎ
4) 1-ఇ, 2-సి, 3- ఎ,4-బి
14. మనుషులందరికి ఒకే కులం, ఒకేమతం, ఒకే దేవుడు అని ప్రచారం చేసింది ఎవరు?
1) బీఆర్ అంబేద్కర్ 2) నారాయణగురు
3) పెరియార్ 4) భాగ్యరెడ్డివర్మ
15. ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించింది ఎవరు?
1) బీఆర్ అంబేద్కర్ 2) నారాయణగురు
3) బీఎస్ వెంకట్రావు 4) ఎవరుకాదు
సమాధానాలు :
1-1, 2-2, 3-2, 4-4, 5-3, 6-2, 7-4, 8-3, 9-1, 10-1, 11-2, 12-1, 13-1, 14-2, 15-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?